పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/కథా ప్రారంభము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-34-సీ. )[మార్చు]

విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని;
లన నేర్పడు ననుర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై;
తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె;
నెవ్వఁడు బుధులు మోహింతురెవ్వ
నికి నెండమావుల నీటఁ గాచాదుల;
న్యోన్యబుద్ధి దా డరునట్లు

(తెభా-1-34.1-ఆ. )[మార్చు]

త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద,
నఘు సత్యుఁ బరుని నుదినంబు.

(తెభా-1-35-వ. )[మార్చు]

ఇట్లు "సత్యంపరంధీమహి" యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామబ్రహ్మ స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి, యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు.

(తెభా-1-36-సీ. )[మార్చు]

శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన;
భాగవతంబు సద్భక్తితోడ
వినఁ గోరువారల విమలచిత్తంబులఁ;
జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక
యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే;
మంచివారలకు నిర్మత్సరులకుఁ
పట నిర్ముక్తులై కాంక్ష సేయకయును;
గిలి యుండుట మహాత్త్వబుద్ధిఁ

(తెభా-1-36.1-తే. )[మార్చు]

రఁగ నాధ్యాత్మికాది తాత్రయంబు
డఁచి పరమార్థభూతమై ధిక సుఖద
మై సమస్తంబుఁ గాకయు య్యు నుండు
స్తు వెఱుఁగంగఁ దగు భాగతమునందు.

(తెభా-1-37-ఆ. )[మార్చు]

వేదకల్పవృక్షవిగళితమై శుక
ముఖసుధాద్రవమున మొనసి యున్న
భాగవతపురాణలరసాస్వాదన
దవిఁ గనుఁడు రసికభావవిదులు.