Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/యయాతి శాపము

వికీసోర్స్ నుండి

యయాతి శాపము

తెభా-9-541-ఉ.
వరాలిఁ జూచి మన మాఁపగ లేక మనోభవార్తుఁడై
యా నభర్త మున్ను కవి యాడిన మాట దలంచి యైనఁ జే
తోసుఖంబులం దనిపెఁ ద్రోవఁగవచ్చునె దైవయోగముల్
రాజఁట సద్రహస్యమఁట రాజకుమారిని మాన నేర్చునే?

టీక:- ఆ = ఆ; జవరాలిన్ = యౌవనవతిని; చూచి = చూసి; మనమున్ = మనసు; ఆపగలేక = పట్టలేక; మనోభవ = మన్మథునిచే {మనోభవుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; ఆర్తుడు = బాధింపబడినవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; జనభర్త = రాజు {జనభర్త – జనుల ప్రభువు, రాజు}; మున్ను = ఇంతకు ముందు; కవి = శుక్రాచార్యుడు; ఆడిన = చెప్పిన; మాటన్ = హెచ్చరికను; తలంచి = గుర్తుంచుకొని; ఐనన్ = కూడా; చేతోసుఖంబులన్ = రతిసౌఖ్యములతో; తనిపెన్ = తృప్తిపరచెను; త్రోవగన్ = తప్పించుకొనుటకు; వచ్చునే = సాధ్యమా, కాదు; దైవయోగంబుల్ = దైవఘటన; రాజు = అతను రాజు; అటన్ = అట; సత్ = మిక్కిలి; రహస్యము = గుట్టు వ్యవహారము; అటన్ = అట; రాజకుమారిని = రాకుమారిని; మానన్ = వదల; నేర్చునే = కలడా.
భావము:- ఆ యౌవనవతి అందచందాలు చూసి మనసు పట్టలేక, ఇంతకు ముందు శుక్రాచార్యుడు చెప్పిన హెచ్చరిక గుర్తుండి కూడ, యయాతి శర్మిష్ఠతో క్రీడించాడు. దైవఘటన తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా. అతను రాజు కదా. వ్యవహారం మిక్కిలి గుట్టుగా సాగడం సుళువే కదా. మరి వచ్చింది రాకుమారి ఎందుకు వదుల్తాడు.

తెభా-9-542-వ.
ఇట్లు యయాతివలన శర్మిష్ఠ గర్భంబై క్రమంబున ద్రుహ్మ్యుండు, ననువుఁ, బూరువు నన మువ్వురు తనయులం గాంచె; నంత దేవ యాని తద్వృత్తాంతంబంతయు నెఱింగి, కోపించి, శుక్రుకడకుం జని క్రోధమూర్ఛిత యై యున్న సమయంబున యయాతి వెంట జని, యిట్లనియె.
టీక:- ఇట్లు = ఇట్లు; యయాతి = యయాతి; వలన = వలన; శర్మిష్ఠ = శర్మిష్ఠ; గర్భంబు = గర్భము ధరించినామె; ఐ = అయ్యి; క్రమంబున్ = వరుసగా; ద్రుహ్యుండున్ = ద్రుహ్యుడు; అనువున్ = అనువు; పూరువున్ = పూరువు; అనన్ = అనెడి; మువ్వురు = ముగ్గురు (3); తనయులన్ = కొడుకులను; కాంచెన్ = కనెను; అంతన్ = అంతట; దేవయాని = దేవయాని; తత్ = ఆ; వృత్తాంతంబు = సంగతి; అంతయున్ = అంతా; ఎఱింగి = తెలిసి; కోపించి = కోపగించి; శుక్రున్ = శుక్రుని; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్లి; క్రోధ = కోపముతో; మూర్ఛిత = వివశురాలు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయము నందు; యయాతి = యయాతి; వెంటన్ = కూడ; చని = వెళ్లి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా యయాతి వలన శర్మిష్ఠ వరుసగా ద్రుహ్యుడు, అనువు, పూరువు అని ముగ్గురు కొడుకులను కన్నది. అంతట దేవయాని ఆ సంగతి అంతా తెలిసి కోపగించి తండ్రికి చెబ్దామని శుక్రుని వద్దకు వెళ్లింది. కోపంతో వివశురాలు అయ్యి ఉన్న ఆమె వెంట యయాతి కూడ వెళ్లి ఈ విధంగా బతిమాలాడాడు.

తెభా-9-543-ఆ.
"మామకేల చెప్ప మాను సరోజాక్షి
నుజతనయఁ బొంది ప్పుపడితిఁ
గామినయిన నన్నుఁ రుణింపు పతిమాట
తండ్రిమాటకంటెఁ గును సతికి."

టీక:- మామ = మామయ్య; కిన్ = కి; ఏలన్ = ఎందుకు; చెప్పన్ = చెప్పుట; మాను = వదలిపెట్టు; సరోజాక్షి = పద్మనయన; దనుజతనయన్ = శర్మిష్ఠతో; పొంది = కవయుట జేసి; తప్పుపడితిన్ = తప్పు చేసితిని; కామిని = అనురక్తి కలవాడను; అయిన = ఐన; నన్నున్ = నన్ను; కరుణింపు = కనికరించుము; పతి = భర్త యొక్క; మాటన్ = మాట; తండ్రి = తండ్రి యొక్క; మాటన్ = మాట; కంటెన్ = కంటె; తగున్ = మన్నింపదగినది; సతి = ఇల్లాలి; కిన్ = కి.
భావము:- “పద్మాక్షి! మామయ్యకి ఎందుకు చెప్పడం. ఈ సారికి వదలివెయ్యి, శర్మిష్ఠతో కలిసి తప్పు చేసాను నిజమే. మన్నించి నన్ను కనికరించు. ఇల్లాలికి భర్త మాట, తండ్రి మాట కంటె మన్నింపదగినది."

తెభా-9-544-వ.
అని పలికి పాదంబుల కెఱిఁగిన నయ్యింతి యొడంబడక యుండె; నంత నది యెఱింగి శుక్రుం డిట్లనియె.
టీక:- అని = అని; పలికి = చెప్పి; పాదంబుల్ = కాళ్ళ; కున్ = మీద; ఎఱిగినన్ = పడినను; ఒడంబడక = ఒప్పుకొనక; ఉండెన్ = ఉండెను; అంతన్ = అంతట; అది = ఆ సంగతి; ఎఱింగి = తెలిసి; శుక్రుండు = శుక్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .
భావము:- అని చెప్పి కాళ్ళ మీద పడినా దేవయాని ఒప్పుకోలేదు. అంతట ఆ సంగతి తెలిసి శుక్రుడు ఈ విధంగా అన్నాడు.

తెభా-9-545-క.
"నామాటఁ ద్రోచి దానవ
భాను బొందితివి ధరణిపాలక! తగవే?
యేమాట యేది రూపము
కాముకులకు లోలుపులకుఁ లవే నిజముల్."

టీక:- నా = నా యొక్క; మాటన్ = హెచ్చరికను; త్రోచి = కాదని; దానవభామనున్ = శర్మష్ఠను; పొందితివి = కూడితివి; ధరణిపాలక = రాజ; తగవే = సరియైనదా, కాదు; ఏమాట = చెప్పినది ఏమిటి; ఏది = ఏమిటి; రూపము = ఫలితము; కాముకుల్ = కాముకులైనవారి; కున్ = కి; లోలుపుల్ = చంచల చిత్తులైనవారి; కున్ = కి; కలవే = ఉండునా, ఉండవు; నిజముల్ = సత్యనిష్ఠ.
భావము:- “రాజా! నా హెచ్చరికను కాదని శర్మష్ఠను కూడావు. ఇది సరైన పని కాదు. నేను చెప్పింది ఏమిటి? నీవు చేసింది ఏమిటి? అవునులే కాముకులకు చంచల చిత్తులకు సత్యనిష్ఠ ఉంటుందా?"

తెభా-9-546-వ.
అని పలికి “నిన్ను వనితాజనహేయంబయిన ముదిమి పొందెడు” మని శపియించిన యయాతి యిట్లనియె.
టీక:- అని = అని; పలికి = చెప్పి; నిన్నున్ = నిన్ను; వనితా = స్రీ; జన = సమూహములకు; హేయంబు = అసహ్యించుకొనెడి; ముదిమి = ముసలితనము; పొందెడుము = పొందుగాక; అని = అని; శపియించిన = శాపమిచ్చిన; యయాతి = యయాతి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .
భావము:- అని చెప్పి, “నీవు స్రీలు అసహ్యించుకొనె ముసలితనం పొందు గాక” అని శుక్రుడు శాపమిచ్చాడు. అప్పుడు, యయాతి ఇలా అన్నాడు.

తెభా-9-547-క.
"మామా నా పైఁ గోపము
మామా నీ పుత్రియందు మానవు నాకుం
గామోపభోగవాంఛలు
ప్రేమన్ రమియించి ముదిమిఁ బిదపం దాల్తున్"

టీక:- మామా = మామయ్యా; నా = నా; పైన్ = మీద; కోపమున్ = కోపమును; మా మా = వద్దు వద్దు; నీ = నీ యొక్క; పుత్రి = కుమార్తె; అందున్ = ఎడల; మానవు = వదలలేదు; నా = నా; కున్ = కు; కామోపభోగవాంఛలు = పొందెడి కోరికలు; ప్రేమన్ = ప్రీతిగా; రమియించి = పొంది; ముదిమిన్ = ముసలితనమును; పిదపన్ = తరువాత; తాల్తున్ = ధరించెదను.
భావము:- “మామయ్యా! వద్దు వద్దు నా మీద కోపం వద్దు. నీ కుమార్తెను ఎడల కోరికలు నాకు ఇంకా పోలేదు. మరికొంత కాలం తృప్తిగా ఆమెను ప్రీతిగా పొంది, పిమ్మట ముసలితనం ధరిస్తాను.”

తెభా-9-548-వ.
అని పలికి యనుజ్ఞగొని, దేవయానిందోడ్కొని పురంబునకుం జని, పెద్దకొడుకగు యదువుం బిలిచి యయాతి యిట్లనియె.
టీక:- అని = అని; పలికి = అడిగి; అనుజ్ఞ = అంగీకారము; కొని = తీసుకొని; దేవయానిన్ = దేవయానిని; తోడ్కొని = తీసుకొని; పురంబున్ = తన నగరమున; కున్ = కు; చని = వెళ్ళి; పెద్దకొడుకు = ప్రథమపుత్రుడు; అగు = ఐన; యదువున్ = యదువును; పిలిచి = పిలిచి; యయాతి = యయాతి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- అని అడిగి ఆయన అనుజ్ఞ పొంది, దేవయానిని తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. ప్రథమ పుత్రుడు యదువును పిలిచి, యయాతి ఈ విధంగా అడిగాడు.

తెభా-9-549-శా.
"నీ ల్లిం గనినట్టి శుక్రువలనన్ నేఁడీ జరంబొందితిన్;
నా తండ్రీ యదునామధేయ! తనయా! నా వృద్ధతం దాల్పవే;
నీ తారుణ్యము నాకు నీవె; తనివో నిండార గొన్నాళ్ళు నేఁ
జేతోజాతసుఖంబులం దిరిగెదన్ శృంగారినై పుత్రకా! "

టీక:- నీ = నీ యొక్క; తల్లిన్ = తల్లిని; కనినట్టి = పుట్టించిన; శుక్రుని = శుక్రుని; వలనన్ = మూలముగ; నేడు = ఇవాళ; ఈ = ఈ; జరన్ = ముసలితనమును; పొందితిని = వచ్చినది; నా = నా యొక్క; తండ్రీ = తండ్రీ; యదు = యదువు అనెడి; నామధాయ = పేరు కలవాడ; తనయా = కుమారా; నా = నా యొక్క; వృద్దతన్ = ముసలితనమును; తాల్పవే = ధరించుము; నీ = నీ యొక్క; తారుణ్యమున్ = యౌవనమును; నా = నా; కున్ = కు; ఈవె = ఇమ్ము; తనివోన్ = తనివితీరునట్లు; నిండార = పూర్తిగా; కొన్ని = కొద్ది; నాళ్ళు = రోజులు; నేన్ = నేను; చేతోజాత = మన్మథ {చేతోజాతుడు - చిత్ (మనసున) జాత (పుట్టువాడు), మన్మథుడు}; సుఖంబులన్ = సొఖ్యములందు; తిరిగెదన్ = తిరుగుతాను; శృంగారిని = రతిలో మునిగితేలు వానిని; ఐ = అయ్యి; పుత్రకా = కొడుకా.
భావము:- “నా తండ్రీ యదు కుమారా! నీ తల్లిని కన్నతండ్రి శుక్రుని మూలంగా ఇవాళ నాకు ఈ ముసలితనం వచ్చింది. నా ముసలితనం తీసుకుని కొన్నాళ్ళు నీ యౌవనం నాకు ఇమ్ము. తనివితీరా నేను ఆమెతో సుఖిస్తాను”

తెభా-9-550-వ.
అనిన విని తండ్రికి యదుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; తండ్రి = తండ్రి; కిన్ = కి; యదుండు = యదుడు; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను .
భావము:- అనగా విని తండ్రికి యదువుతో ఇలా అన్నాడు.

తెభా-9-551-శా.
"కాంతాహేయము దుర్వికారము దురాకండూతి మిశ్రంబు హృ
చ్చింతామూలము పీనసాన్వితము ప్రస్వేదవ్రణాకంపన
శ్రాంతిస్ఫోటకయుక్త మీ ముదిమి వాంఛం దాల్చి నానాసుఖో
పాంతంబైన వయోనిధానమిది యయ్యా! తేర యీ వచ్చునే?"

టీక:- కాంతా = స్త్రీలకు; హేయము = అసహ్యించుకొనేది; దుర్ = చెడ్డ; వికారము = వికారమైనది; దురా = చెడ్డది ఐన; కండూతి = కీర్తికాంక్షతో; మిశ్రంబు = కూడినది; హృత్ = మనసున; చింతా = చికాకుపడుటకు; మూలమున్ = మూలమైనది; పీనసా = పడిశము, రొంప; ఆన్వితము = పట్టునది; ప్ర = మిక్కిలి; స్వేదా = చెమట; వ్రణ = కురుపులు; ఆకంపన = వణుకు; శ్రాంతి = అలసట; స్పోటక = బొబ్బరోగములతో; యుక్తము = కూడినది; ఈ = ఈ; ముదిమిన్ = ముసలితనము; వాంఛన్ = కోరి; తాల్చి = తెచ్చుకొని; నానా = అనేక; సుఖ = సౌఖ్యములకు; ఉపాతంబున్ = అనుకూలమైనది; ఐన = అయినట్టి; వయో = వయస్సునకు; నిధానము = ఆటపట్టైనది; ఇది = ఇది; అయ్యా = నాయనా; తేర = వ్యర్థముగా; ఈవచ్చునే = ఇవ్వచ్చునా, కూడదు కదా.
భావము:- “తండ్రీ! స్త్రీలు అసహ్యించుకొనేది, వికారమైనది, కీర్తికాంక్షతో కూడినది. మనోవ్యథలకు మూలమైనది, పడిశం (రొంప), చెమట కురుపులు, వణుకు, అలసట, బొబ్బ మున్నగు రోగాలతో కూడినది ఐన ఈ ముసలితనాన్ని కోరి తెచ్చుకొని సౌఖ్యాలకు అలవాలమైన అయినట్టి యౌవనాన్ని తీరికూచుని ఇవ్వచ్చునా?”