పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/దేవయాని యయాతి వరించుట

వికీసోర్స్ నుండి

దేవయాని యయాతివరించుట

తెభా-9-526-వ.
కనుంగొని
టీక:- కనుంగొని = చూసి .
భావము:- అలా నూతిలో ఉన్న దేవయానిని చూసి యయాతి జాలిపడి.

తెభా-9-527-శా.
ప్తాంభోనిధిమేఖలావృతమహార్వంసహాకన్యకా
ప్రాప్తోద్యద్వరదక్షదక్షిణకరప్రాలంబముం జేసి ప్రో
త్క్షిప్తం జేసె యయాతి గట్టుకొనఁ బై చేలంబు మున్నిచ్చి ప
ర్యాప్తస్వేదజలాంగి నాళిసముదాస్వర్గవిన్ భార్గవిన్.

టీక:- సప్త = ఏడు; అంభోనిధి = సముద్రములనెడి; మేఖలా = వడ్డాణము; ఆవృత = కట్టుకొన్న; మహా = గొప్ప; సర్వంసహాకన్యకా = భూదేవిని; ప్రాప్త = పొంది; ఉద్యత్ = పరిపాలించెడి; వర = శ్రేష్ఠమైన; దక్ష = సమర్థమైన; దక్షిణ = కుడి; కర = చెయ్యి; ప్రాలంబమున్ = ఆలంబనగ నిచ్చుట; చేసి = చేసి; ప్రోత్క్షిప్తన్ = కాపాడబడినామెను; చేసెన్ = చేసెను; యయాతి = యయాతి; కట్టుకొనన్ = కట్టుకొనుటకు; పైచేలంబున్ = పైబట్టను; మున్ను = ముందుగ; ఇచ్చి = ఇచ్చి; పర్యాప్త = మిక్కిలిగా తడిసిన; స్వేదజల = చెమటనీరు కల; అంగిన్ = దేహము కలామెను; ఆళి = చెలికత్తెల; సముదాయ = సమూహమునకు; స్వర్గవిన్ = స్వర్గమువంటి ఆమె; భార్గవిన్ = దేవయానిని {భార్గవి - భృగువంశస్థురాలు, దేవయాని}.
భావము:- చెమటతో తడిసి ముద్దైన చెలికత్తెల పాలిటి కామధేనువు వంటి ఆ భృగువంశపు దేవయానికి కట్టుకొనుటకు పైబట్టను ముందుగ ఇచ్చాడు. ఏడు సముద్రాలు వడ్డాణంలా పరివృతంగా కల రాజ్యాన్ని పరిపాలించె బహు సమర్థమైన తన కుడి చెయ్యి ఆలంబనగా ఇచ్చి నూతిలోంచి బయటకు తీసి దేవయానిని కాపాడాడు.

తెభా-9-528-వ.
ఇట్లు నూయి వెడలించిన రాజునకు రాజవదన యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; నూయిన్ = నూతిలోంచి; వెడలించినన్ = బయటకుతీయగా; రాజున్ = రాజు; కున్ = కి; రాజవదన = పద్మముఖి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .
భావము:- ఈ విధంగా నూతి లోంచి బయటకు తీసి రక్షించిన రాజుతో సుందరాంగి దేవయాని ఇలా అంది.

తెభా-9-529-మ.
"నుఁ బాణిగ్రహణం బొనర్చితికదా నా భర్తవున్ నీవ దై
నియోగం బిది తప్పదప్పురుషతా వాక్యంబు సిద్ధంబు సౌ
ఖ్యనివాసున్ నిను మాని యొండువరునిం గాంక్షింప నే నేర్తునే?
జం బానెడి తేఁటి యన్యకుసుమావాసం బపేక్షించునే?

టీక:- ననున్ = నన్ను; పాణిగ్రహణంబున్ = చెయ్యిపట్టుకొనుట; ఒనర్చితి = చేసితివి; కదా = కదా; నా = నా యొక్క; భర్తవున్ = భర్తవి; నీవ = నీవే; దైవ = దేవుని; నియోగంబున్ = నిర్ణయము; ఇది = ఇది; తప్పదు = తప్పదు; ఆ = ఆ; పురుషతా = పురుషుని యొక్క, కచుని యొక్క; వాక్యంబు = పలుకు; సిద్ధంబు = పొల్లుపోదు; సౌఖ్య = సౌఖ్యములకు; నివాసున్ = నివాసమైన; నినున్ = నిన్ను; మాని = వదలిపెట్టి; ఒండు = మరియొక; వరునిన్ = భర్తను; కాంక్షింపన్ = వరించుట; నేన్ = నేన్; నేర్తునే = చేయగలనా, లేను; వనజంబు = పద్మములపై; ఆనెడి = వాలెడి; తేటి = మధుపము; అన్య = ఇతర; కుసుమ = పూలమీద; ఆవాసంబున్ = ఉండుటను; అపేక్షించునే = కోరునా.
భావము:- నా చెయ్యి పట్టుకున్నావు కనుక పాణిగ్రహణం జరిగినట్లే అందుచేత నీవే నా భర్తవి. ఇది దైవ నిర్ణయం తప్పదు. ఆ కచుడి శాపం పొల్లుపోదు. పద్మాలపై వాలె మధుపము ఇతర పూలపై వాలుతుందా. సౌఖ్యాలకు నివాసమైన నిన్ను వదలిపెట్టి మరియొకరిని భర్తగా వరించలేను.

తెభా-9-530-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ .
భావము:- అంతే కాకుండగ.

తెభా-9-531-సీ.
సుగుణాఢ్య! విను నేను శుక్రుని కూఁతుర-
దేవయానిని దొల్లి దేవమంత్రి
నయుండు కచుఁడు మా తండ్రిచేత మృతసం-
జీవినిఁ దా నభ్యసించువేళ
తనిఁ గామించిన త డొల్ల ననవుడు-
తఁడు నేర్చిన విద్య డఁగి పోవ
తని శపించిన తఁడు నా భర్త బ్రా-
హ్మణుఁడు గాకుండెడు ని శపించె

తెభా-9-531.1-తే.
ది నిమిత్తంబు నాకు బ్రాహ్మణుఁడు గాఁడు
ప్రాణనాథుఁడ వీ" వని డఁతి పలుకఁ
నదు హృదయంబు నెలఁతపైఁ గులుపడినఁ
మక మొక యింతయును లేక లఁచి చూచి.

టీక:- సు = మంచి; గుణ = గుణములను; ఆఢ్య = సంపద కలవాడ; విను = వినుము; నేను = నేను; శుక్రుని = శుక్రుని యొక్క; కూతురన్ = పుత్రికను; దేవయానినిన్ = దేవయానిని; తొల్లి = ఇంతకు పూర్వము; దేవమంత్రి = బృహస్పతి; తనయుండు = కొడుకు; కచుడు = కచుడు; మా = మా; తండ్రి = తండ్రి; చేతన్ = వలన; మృతసంజీవనిన్ = మృతసంజీవనీ విద్య {మృతసంజీవని - మృత (మరణించినవారిని) సంజీవని (బతికించెడిది)}; తాన్ = అతను; అభ్యసించు = నేర్చుకొనెడి; వేళన్ = సమయమునందు; అతనిన్ = అతనిని; కామించినన్ = కోరగా; అతడున్ = అతను; ఒల్లన్ = ఒప్పుకొనను; అనవుడు = అనుటతో; అతడున్ = అతను; నేర్చిన = నేర్చుకొన్నట్టి; విద్య = జ్ఞానము {చతుర్విద్యలు - 1ఆన్వీక్షకి (ఇందు విజ్ఞానము తెలుప బడును) 2త్రయి (ఇందు ధర్మాధర్మములు తెలుపబడును) 3వార్త (ఇందు అర్థానర్థములు తెలుపబడును) 4దండనీతి (ఇందు నయానయములు తెలుపబడును)}; అడగిపోవన్ = అశక్తముగునట్లు; అతనిన్ = అతనిని; శపించినన్ = శపించగా; అతడున్ = అతను; నా = నా యొక్క; భర్త = మొగుడు; బ్రాహ్మణుడు = విప్రుడు; కాకుండుము = కాకపోవుగాక; అని = అని; శపించెన్ = శాపము నిచ్చెను; అది = ఆ.
నిమిత్తంబున్ = కారణముచేత; నా = నా; కున్ = కు; బ్రాహ్మణుడు = బ్రాహ్మణుడు; కాడు = భర్తగా రాడు; ప్రాణనాథుడవు = భర్తవు; ఈవ = నీవే; అని = అని; పడతి = ఇంతి; పలుకన్ = చెప్పగా; తనదు = తన యొక్క; హృదయంబున్ = మనసు; నెలత = యువతి; పైన్ = మీద; తగులుపడిన = తగుల్కొన్నను; తమకము = తొందరపాటు; ఒకయింతయున్ = ఏమాత్రము; లేక = లేకుండగ; తలచి = ఆలోచించి; చూచి = చూసి.
భావము:- ఓ సుగుణవంతుడా! విను. నేను శుక్రుని పుత్రిక దేవయానిని. ఇంతకు పూర్వం బృహస్పతి కొడుకు కచుడు మా తండ్రి వలన మృతసంజీవనీవిద్య నేర్చుకొనే సమయంలో అతనిని కోరగా అతను ఒప్పుకోలేదు. నేను అతను నేర్చుకొన్న విద్యలు పనికిరాకపోవు గాక అని శపించాను. అతను నా భర్త విప్రుడు కాకపోవు గాక అని శపించాడు. ఆ కారణంచేత నాకు బ్రాహ్మణ భర్త రాడు. నీవే నా భర్తవు.” అని ఇంతి చెప్పగా, యయాతి యువతిపై మనసు పడ్డా, ఏమాత్రం తొందరపాటు పడకుండా ఇలా ఆలోచించాడు..

తెభా-9-532-మత్త.
దైయోగముగాక విప్రసుతన్ వరించునె నా మనం
బే విధంబున నీశ్వరాజ్ఞయు నిట్టి దంచు వరించె ధా
త్రీరుండును దేవయానిని ధీరబుద్ధులకున్ మనో
భా మొక్కటియే ప్రమాణ మభావ్యభావ్య పరీక్షకున్.

టీక:- దైవయోగమున్ = దైవఘటనవలన; కాక = తప్పించి; విప్ర = బ్రాహ్మణుని; సుతన్ = పుత్రికను; వరించునె = కోరునే, కోరదు; నా = నా యొక్క; మనంబున్ = మనసు; ఏవిధంబునన్ = ఎలా చూసిన; ఈశ్వర = భగవంతుని; ఆజ్ఞ = నిర్ణయము; ఇట్టిది = ఇలా ఉంది; అంచున్ = అనుచు; వరించెన్ = వరించెను; ధాత్రీవరుండు = రాజు; దేవయానిని = దేవయానిని; ధీరబుద్ధుల్ = ధీరుల; కున్ = కు; మనః = మనసు నందలి; భావము = తలపు; ఒక్కటియే = మాత్రమే; ప్రమాణము = సత్యమైనది; భావ్య = సరియైనది; అభావ్య = సరికానిది; పరీక్ష = పరీక్షించుట; కున్ = కు.
భావము:- దైవఘటన తప్పించి బ్రాహ్మణకన్యను నా మనసు కోరదు, ఎలా చూసినా భగవంతుని నిర్ణయము ఇలా ఉంది అనుకుని రాజు దేవయానిని వరించాడు. ధీరులకు సరియైంది అవునో కాదో పరీక్షించుటకు మనస్సాక్షే సత్యమైనది.

తెభా-9-533-వ.
ఇట్లు వరించి, యయాతి చనిన వెనుక దేవయాని శుక్రునికడకుం జని, శర్మిష్ఠ చేసిన వృత్తాంతం బంతయు జెప్పి కన్నీరుమున్నీరుగా వగచిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వరించి = ప్రేమించి; యయాతి = యయాతి; చనిన = వెళ్లిన; వెనుకన్ = తరువాత; దేవయాని = దేవయాని; శుక్రుని = శుక్రుని; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; శర్మిష్ఠ = శర్మిష్ఠ; చేసిన = చేసినట్టి; వృత్తాంతంబు = సంగతి; అంతయున్ = అంతటిని; చెప్పి = చెప్పి; కన్నీరు = కన్నీళ్ళు; మున్నీరు = కాలువలుకట్టినట్లు; కాన్ = కాగా; వగచినన్ = దుఃఖించగా .
భావము:- ఈ విధంగా యయాతి వరించి వెళ్లాకా దేవయాని శుక్రుని వద్దకు వెళ్ళి శర్మిష్ఠ చేసిన పనంతా చెప్పి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖించింది.

తెభా-9-534-క.
"క్రూరాత్ముల మందిరములఁ
బౌరోహిత్యంబు కంటె పాపం బీ సం
సాముకంటె శిలల్ దిని
యూక కాపోతవృత్తి నుండుట యొప్పున్."

టీక:- క్రూరాత్ముల = కఠినుల; మందిరములన్ = ఇళ్ళలో; పౌరోహిత్యంబు = పురోహితునిగా చేయుట; కంటెన్ = కంటెను; పాపంబు = పాపపు పని; ఈ = ఈ; సంసారము = సంసారము; కంటెన్ = ఇంతకంటె; శిలల్ = రాలినవి ఏరుకుని; తిని = తిని; ఊరకన్ = ఉరికే; కాపోత = పావురాల; వృత్తిన్ = లాగ; ఉండుటన్ = నివసించుట; ఒప్పున్ = తగినపని.
భావము:- అప్పుడు శుక్రుడు ఇలా అనుకున్నాడు. “కఠినాత్ముల ఇళ్ళలో పురోహితుడిగా చేయుట కంటె పాపపు పని లేదు. ఈ సంసారాన్ని సాగించడం కన్నా రాలినవి ఏరుకుని తిని ఉరక ఉండడం మంచిది.

తెభా-9-535-వ.
అని వృషపర్వుకడ నుండుట నిందించుచు శుక్రుం డా కూఁతుం దోడ్కొని పురంబు వెడలి చన; నయ్యసురవల్లభుం డెఱింగి శుక్రుని వలనం దేవతల గెలువఁదలంచి తెరువున కడ్డంబువచ్చి, పాదంబులపైఁ బడి, ప్రార్థించి ప్రసన్నుం జేసిన, నా కోపంబు మాని శుక్రుండు శిష్యున కిట్లనియె.
టీక:- అని = అని; వృషపర్వుని = వృషపర్వుని; కడన్ = దగ్గర; ఉండుటన్ = ఉండుటను; నిందించుచున్ = అయిష్టపడుచు; శుక్రుండు = శుక్రుడు; ఆ = ఆ; కూతున్ = కుమార్తెను; తోడ్కొని = వెంటబెట్టుకెని; పురంబున్ = నగరమును; వెడలి = వదలిపెట్టి; చనన్ = వెళ్ళిపోగా; ఆ = ఆ; అసుర = రాక్షస; వల్లభుండు = రాజు; ఎఱింగి = తెలిసి; శుక్రునిన్ = శుక్రుని; వలనన్ = ద్వారా; దేవతలన్ = దేవతలను; గెలువన్ = జయించవలెనని; తలంచి = భావించి; తెరువునన్ = దారికి; అడ్డంబు = అడ్డమై; వచ్చి = వచ్చి; పాదంబులన్ = పాదాల; పైన్ = మీద; పడి = పడి; ప్రార్థించి = అర్థించి; ప్రసన్నున్ = శాంతించినవాని; చేసినన్ = చేయగా; ఆ = అంత; కోపంబున్ = కోపమును; మాని = వదలిపెట్టి; శుక్రుండు = శుక్రుడు; శిష్యున్ = శిష్యుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.
భావము:- ఇలా అనుకుని వృషపర్వుని దగ్గర ఉండుటకు యిష్టపడక శుక్రుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని నగరం విడిచి వెళ్ళిపోసాగాడు. ఆ రాక్షస రాజు తెలిసి శుక్రుని ద్వారా దేవతలను జయించాలని భావించి వచ్చి పాదాల మీద పడి అర్థించి శాంతింప చేసాడు. అంత కోపమును వదలిపెట్టి శుక్రుడు శిష్యునికి ఈ విధంగా చెప్పాడు.

తెభా-9-536-త.
"చెలులు వేవురుఁ దాను నీ సుత చేటికైవడి నా సుతం
గొలుచు చుండినఁ దీఱుఁ గోపము గొల్వఁ బెట్టెదవేని నీ
వెలఁదిఁ దోడ్కొని వత్తు"నావుడు వేగ రమ్మని భార్గవిం
గొలువఁ బెట్టె సురారివర్యుఁడు గూఁతు నెచ్చలిపిండుతోన్.

టీక:- చెలులు = సేవకురాళ్ళు; వేవురు = వెయ్యిమంది; తానున్ = ఆమె; నీ = నీ యొక్క; సుత = కూతురు; చేటి = దాసి; కైవడిన్ = వలె; నా = నా యొక్క; సుతన్ = పుత్రికను; కొలుచుచుండినన్ = సేవించుతుంటే; తీఱున్ = తగ్గును; గోపము = గోపము; కొల్వన్ = సేవించుటకు; పెట్టెదవు = నియమించెదవు; ఏని = అయినచో; ఈ = ఈ; వెలదిన్ = యువతిని; తోడ్కొని = కూడ తీసుకొని; వత్తును = వచ్చెదను; వేగన్ = శీఘ్రమే; రమ్ము = రా; అని = అని; భార్గవిన్ = దేవయానిని; కొలువన్ = సేవించుటకు; పెట్టెన్ = పంపించెను; సురారివర్యుడున్ = రాక్షసరాజు; కూతున్ = పుత్రికను; నెచ్చలి = చెలుల; పిండు = సమూహము; తోన్ = తోటి.
భావము:- “నీ కూతురు శర్మిష్ఠ తన వెయ్యిమంది సేవకురాళ్ళతో దాసి వలె నా కుమార్తె దేవయానిని సేవిస్తుంటే నా కోపం తగ్గుతుంది. అలా నియమిస్తావా చెప్పు అలా అయితే ఈమెను కూడ తీసుకొని వచ్చేస్తాను” అంత రాక్షసరాజు పుత్రికను చెలులతో సహా దేవయానిని సేవించేలా చేసాడు.

తెభా-9-537-మ.
మింకేలని తన్నుఁ దండ్రి పనుపన్ ర్మిష్ఠ సన్నిష్ఠతో
జాతాస్యలు సద్వయస్యలు సహస్రంబున్నజస్రంబుఁ ద
న్నమన్ దాసి సుదాసి యయ్యెఁ బగవాయన్ భూరికోపానలా
లితగ్లానికి దేవయానికి మహార్వోద్యమస్థానికిన్.

టీక:- చలము = పంతము; ఇంక = ఇంకా; ఏలన్ = ఎందుకు; అని = అని; తన్ను = తనను; తండ్రి = తండ్రి; పనుపన్ = పంపించగా; శర్మిష్ఠ = శర్మిష్ఠ; సత్ = మంచి; నిష్ఠ = నియము; తోన్ = తోటి; జలజాతాస్యలు = పద్మముఖిలు; సత్ = మంచి; వయస్యలున్ = వయసులో నున్నవారు; సహస్రంబున్ = వెయ్యిమంది; అజస్రంబున్ = అనవరతము; తన్ను = తనను; అలమన్ = చుట్టు చేరి ఉండన్; దాసి = సేవకురాలు; సుదాసి = అరణము దాసి {అరణము - పెండ్లి యందు అల్లునికి ఆడబడచునకు యిచ్చు ధనము}; అయ్యెన్ = అయినది; పగ = పగను; వాయన్ = చల్లార్చుటకు; భూరి = అతిమిక్కిలి; కోప = కోపము అనెడి; అనల = అగ్ని వలన; కలిత = కలిగిన; గ్లాని = బడలినామె; కిన్ = కి; దేవయాని = దేవయాని; కిన్ = కి; మహా = గొప్ప; గర్వ = గర్వము; ఉద్యమ = ఉద్రేకమునకు; స్థాని = ఆటపట్టు ఐనామె; కిన్ = కి.
భావము:- ఇంకా పంతం పెడితే కాదని, తనను తండ్రి పంపించగా శర్మిష్ఠ కోపాన్ని దిగమ్రింగి తన వెయ్యిమంది చెలులతో పగ చల్లార్చడానికి అరణం దాసిగా కోపాగ్నితో బడలినామె, గర్వోద్రేకానికి ఆటపట్టైనామె అయిన దేవయాని వెంట వెళ్ళింది.

తెభా-9-538-వ.
అంత.
టీక:- అంత = అంతట .
భావము:- అలా శర్మిష్ఠ తన చెలికత్తెలతో పాటు దేవయాని దాసిగా వచ్చిన పిమ్మట.

తెభా-9-539-ఉ.
తమైన వేడ్క దనుజాధిపమంత్రి సురారినందనో
పేతఁ దనూభవం బిలిచి పెండ్లి యొనర్చె మహావిభూతికిం
బ్రీతి మహోగ్రజాతికి నభీతికి సాధువినీతికిన్ సిత
ఖ్యాతికి భిన్నదుఃఖబహుకార్యభియాతికి నయ్యయాతికిన్.

టీక:- ఆతతము = అధికము; ఐన = అయినట్టి; వేడ్కన్ = ఉత్సాహముచేత; దనుజాధిపమంత్రి = శుక్రుడు {దనుజాధిపమంత్రి - రాక్షసరాజు యొక్క పురోహితుడు, శుక్రుడు}; సురారి = వృషపర్వుని {సురారి - దేవతల శత్రువు, వృషపర్వుడు}; నందన = పుత్రికచే; ఉపేత = సేవింపబడుచున్న; తనూభవన్ = కూతురును; పిలిచి = పిలిచి; పెండ్లి = వివాహము; ఒనర్చెన్ = చేసెను; మహా = గొప్ప; విభూతి = సంపదలు కలవాని; కిన్ = కి; ప్రీతిన్ = ఇష్టముగా; మహోగ్రజాతి = క్షత్రియకులము వాని; కిన్ = కి; అభీతి = భయము లేనివాని; కిన్ = కి; సాధు = సాధువులపట్ల; వినీతి = వినయము కలవాని; కిన్ = కి; సిత = స్వచ్ఛమైన; ఖ్యాతి = కీర్తి కలవాని; కిన్ = కి; భిన్న = అనేకమైన; దుఃఖ = దుఃఖములతో; బహుకార్యా = ఊడ్చిపెట్టబడిన; అభియాతి = శత్రువులు కలవాని; కిన్ = కి; ఆ = ఆ; యయాతి = యయాతి; కిన్ = కి.
భావము:- మిక్కిలి ఉత్సాహంతో శుక్రుడు వృషపర్వుని పుత్రిక శర్మిష్ఠచే సేవలు అందుకుంటున్న కూతురు దేవయానిని అభినందించాడు. మహాసంపన్నుడు, నిర్భయుడు, సాధువినీతుడు, నిర్మలఖ్యాతి, శత్రు వినిర్మూలుడు, క్షత్రియుడు అయిన యయాతిని పిలిచి దేవయానిని ఇచ్చి ప్రీతిగా వివాహం చేసాడు.

తెభా-9-540-వ.
ఇట్లు యయాతికి దేవయాని నిచ్చి శుక్రుండు శర్మిష్ఠాసంగమంబు చేయకు మని యతని నియమించి పనిచె; పిదప దేవయానియు న య్యయాతివలన యదు తుర్వసులను కుమారులం గనియెను; ఒక్క రేయి చెఱంగుమాసి, దేవయాని వెలుపలనున్నయెడ శర్మిష్ఠ యెడరు వేచి యేకాంతంబున యయాతి కడకుం జని, చెఱకువింటి జోదు పువ్వుటంపఱ కోహటించి తన తలంపు జెప్పిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; యయాతి = యయాతి; కిన్ = కి; దేవయానినిన్ = దేవయానిని; ఇచ్చి = భార్యగా నిచ్చి; శుక్రుండు = శుక్రుడు; శర్మిష్ఠా = శర్మిష్ఠ యొక్క; సంగమంబున్ = కవయుట; చేయకుము = చేయవద్దు; అని = అని; అతని = అతనిని; నియమించి = హెచ్చరించి; పనిచెన్ = పంపించెను; పిదపన్ = తరువాత; దేవయానియున్ = దేవయాని; ఆ = ఆ; యయాతి = యయాతి; వలన = కి; యదు = యదువు; తుర్వసులు = తుర్వసుడులు; అను = అనెడి; కుమారులన్ = పుత్రులను; కనియెను = పుట్టించెను; ఒక్క = ఒకానొక; రేయి = రాత్రి; చెఱంగుమాసి = ఋతుమతియై; దేవయాని = దేవయాని; వెలుపలనున్న = బయటున్న; ఎడన్ = సమయము నందు; శర్మిష్ఠ = శర్మిష్ఠ; ఎడరు = అవకాశమునకై; వేచి = ఎదురు చూసి; ఏకాంతంబునన్ = ఒంటరిగా; యయాతి = యయాతి; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; చెఱకువింటిజోదు = మన్మథుని {చెఱకువింటిజోదు - చెరుకుగడ విల్లుగా కలవాడు, మన్మథుడు}; పువ్వు = పూల; అంపఱన్ = బాణముల; కిన్ = కు; ఓహటించి = జంకి; తన = తన యొక్క; తలంపు = కోరిక; చెప్పినన్ = చెప్పగా.
భావము:- ఈ విధంగా శుక్రుడు యయాతికి దేవయానిని భార్యగా ఇచ్చి శర్మిష్ఠను కవయవద్దు అని హెచ్చరించి పంపించాడు. తరువాత దేవయాని యందు యయాతికి యదువు, తుర్వసుడు అనె పుత్రులు పుట్టారు. అవకాశంకోసం ఎదురు చూస్తున్న శర్మిష్ఠ, ఒక రాత్రి ఋతుమతియై దేవయాని బయట ఉన్న సమయం చూసి, ఒంటరిగా యయాతి వద్దకు వెళ్ళి తన కోరిక చెప్పింది.