పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వసుదేవదేవకీల ప్రయాణం

వికీసోర్స్ నుండి

తెభా-10.1-20-సీ.
శూరసేనున కాత్మజుం డగు వసు-
దేవుఁ డా పురి నొక్క దినమునందు
దేవకిఁ బెండ్లియై, దేవకియును దానుఁ-
డు వేడ్క రథమెక్కి దలువేళ,
నుగ్రసేనుని పుత్రుఁ డుల్లాసి, కంసుండు-
చెల్లెలు మఱఁదియు నుల్లసిల్ల,
రుల పగ్గములఁ జేనంది, రొప్పఁ దొడంగె-
ముందట భేరులు మురజములును

తెభా-10.1-20.1-ఆ.
శంఖ పటహములును డిగొని మ్రోయంగఁ
గూఁతుతోఁడి వేడ్క కొనలుసాఁగ,
దేవకుండు సుతకు దేవకీదేవికి
రణ మీఁ దలంచి, యాదరించి.

టీక:- ఆ = ఆ; శూరసేనున్ = శూరసేనమహారాజు; కున్ = కు; ఆత్మజుండు = పుత్రుడు; అగు = ఐన; వసుదేవుడు = వసుదేవుడు; ఆ = ఆ; పురిన్ = నగరమునందు; ఒక్క = ఒకానొక; దినమున్ = శుభదినము; అందున్ = నాడు; దేవకిన్ = దేవకీదేవిని; పెండ్లి = వివాహముచేసుకొన్నవాడు; ఐ = అయ్యి; దేవకియునున్ = దేవకీదేవి; తానున్ = అతను; కడు = మిక్కిలి; వేడ్కన్ = ఉల్లాసముతో; రథము = రథమును; ఎక్కి = అధిరోహించి; కదలు = బయలుదేరెడి; వేళన్ = సమయమునందు; ఉగ్రసేనుని = ఉగ్రసేనమహారాజు యొక్క; పుత్రుడు = కుమారుడు; ఉల్లాసి = ఉత్సాహముగలవాడు; కంసుండు = కంసుడు; చెల్లెలు = చెల్లెలు; మఱదియునున్ = చెల్లెలు భర్త; ఉల్లసిల్లన్ = సంతోషించునట్లుగ; హరులన్ = గుఱ్ఱముల; పగ్గములన్ = పగ్గములను {పగ్గములు - గుఱ్ఱము మున్నగువాని కళ్ళెమునకు తగిలించెడి తోలుటకైన తాళ్ళు}; చేనంది = చేపట్టి; రొప్పదొడంగెన్ = తోలసాగెను; ముందటన్ = ముందుభాగమునందు; భేరులున్ = పెద్దనగారాలు; మురజములును = మద్దెలలు.
శంఖ = శంఖములు; పటహములును = తప్పెటలు; జడిగొని = ఎడతెగకుండా; మ్రోయంగన్ = మోగుచుండగా; కూతు = పుత్రిక; తోడి = ఎడలి; వేడ్కన్ = వేడుకలు; కొనలుసాగన్ = చిగురించగా; దేవకుండు = దేవకుడు; సుత = పుత్రిక; కున్ = కు; దేవకీదేవి = దేవకీదేవి; కిన్ = కి; అరణమున్ = వివాహకాలమున ఇచ్చు కానుకలు; ఈన్ = ఇద్దామని; తలంచి = భావించి; ఆదరించి = ఆదరముచేసి.
భావము:- శూరసేనుడి కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెండ్లి చేసుకుని ఒకనాడు తన భార్యతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు. ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు చెల్లెలు మీద ప్రేమతో తానే స్వయంగా గుఱ్ఱాల పగ్గాలుపట్టి రథం తోలసాగాడు. అది చూసి దేవకీవసుదేవులు చాలా సంతోషించారు. రథం ముందు భేరీలూ మృదంగాలు శంఖాలు డప్పులు రాజలాంఛనాలుగా మ్రోగుతూ ఉన్నాయి. దేవకికి తండ్రి అయిన దేవకుడు కుమార్తెపై ప్రేమతో ఆమెకు అరణం ఇవ్వాలని అనుకొని. . . .

తెభా-10.1-21-వ.
సార్థంబు లయిన రథంబుల వేయునెనమన్నూటిని, గనకదామ సముత్తుంగంబు లయిన మాతంగంబుల నన్నూటిని, బదివేల తురంగంబులను, విలాసవతు లయిన దాసీజనంబుల నిన్నూటి నిచ్చి, యనిచినం గదలి, వరవధూయుగళంబుఁ దెరువునం జను సమయంబున.
టీక:- సార్థంబులు = పరికరములు కలవి; అయిన = ఐనట్టి; రథంబులన్ = రథములను; వేయునెనమన్నూటిని = పద్దెనిమిదివందల; కనక = బంగారపు; దామ = హారములు కలిగి; సమ = మిక్కిలి; ఉత్తంగంబులు = ఎత్తైనవి; అయిన = ఐన; మాతంగంబులన్ = ఏనుగులను; నన్నూటిన్ = నాలుగువందలు; పదివేల = పదివేలు; తురంగంబులును = గుఱ్ఱములు; విలాసవతులు = ఒయ్యారము గలవారు; అయిన = ఐన; దాసీ = సేవకురాళ్ళైన; జనంబులన్ = వారిని; ఇన్నూటిని = రెండువందలమందిని; ఇచ్చి = ఇచ్చి; అనిచినన్ = పంపించగా; కదలి = బయలుదేరి; వర = పెండ్లికొడుకు; వధూ = పెండ్లికూతురుల; యుగళంబున్ = జంట; తెరువునన్ = దారివెంట; చను = పోవుచున్న; సమయంబునన్ = సమయము నందు.
భావము:- సకల పరికరాలతో కూడిన పద్దెనిమిదివందల రథాలను; బంగారు గొలుసులతో అలంకరించిన నాలుగువందల ఎత్తైన ఏనుగులను; పదివేల గుఱ్ఱాలనూ; రెండువందలమంది విలాసవతులైన పరిచారికలను ఆమెకు అరణంగా ఇచ్చాడు. క్రొత్త దంపతులైన దేవకీవసుదేవులు రథంలో కూర్చుండి రాచబాటలో బయలుదేరారు. ఆ సమయంలో. . .

తెభా-10.1-22-క.
గ్గములు వదలి వేగిర
గ్గలముగ రథముఁ గడపు నా కంసుడు, లో
బెగ్గిలి, యెగ్గని తలఁపగ,
దిగ్గన నశరీరవాణి దివి నిట్లనియెన్.

టీక:- పగ్గములున్ = పగ్గములను; వదలి = వేగముగా పోవుటకై వదలి; వేగిరము = వడి; అగ్గలము = అధికము; కన్ = అగునట్లుగ; రథమున్ = రథమును; గడపు = నడపెడి; ఆ = ఆ; కంసుడు = కంసుడు; లోన్ = మనసు నందు; బెగ్గలి = కలవరపడి; ఎగ్గు = కీడు; అని = అని; తలపగన్ = భావించుచుండగ; దిగ్గనన్ = తటాలున; అశరీరవాణి = ఆకాశవాణి; దివిన్ = ఆకాశమునుండి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- కంసుడు గుఱ్ఱాల పగ్గాలు సడల్చి రథం వేగంగా నడపసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు అదిరేటట్లు అశరీరవాణి ఆకాశంలో నుండి ఇలా పలికింది.

తెభా-10.1-23-క.
"తుష్ట యగు భగిని మెచ్చఁగ
నిష్టుఁడ వై రథము గడపె; దెఱుగవు మీఁదన్
శిష్ట యగు నీతలోదరి
ష్టమగర్భంబు నిన్ను రియించుఁ జుమీ!"

టీక:- తుష్ట = సంతోషించుచున్న ఆమె; అగు = అయిన; భగిని = తోడబుట్టిన ఆమె; మెచ్చగన్ = బాగు బాగు అనుచుండగ; ఇష్టుడవు = ప్రీతి కలవాడవు; ఐ = అయ్యి; రథమున్ = రథమును; గడపెదు = నడుపుచున్నాడవు; ఎఱుగవు = తెలియనివాడవు; మీదన్ = భవిష్యత్తులో; శిష్ట = యోగ్యురాలైమె; అగు = ఐన; ఈ = ఈ యొక్క; తలోదరి = వనిత {తలోదరి - తలమైన (పల్చని) ఉదరి (ఉదరము కలామె), సుందరి}; అష్టమ = ఎనిమిదవ (8); గర్భంబు = చూలు, సంతానము; నిన్నున్ = నిన్ను; హరియించున్ = సంహరించును; చుమీ = సుమా.
భావము:- “సంతుష్టురాలైన చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం ఎంతో ప్రేమతో రథం నడుపుతున్నావు. కానీ, ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు. ఉత్తమురాలైన ఈ యువతి అష్టమగర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా!”