Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/జరాసంధునితో పోర వెడలుట

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1539-క.
రులై దృఢకవచ ధను
శ్శరులై యధిగత రథానురులై మదవ
త్కరులై ఘన హరులై బల
రు లయ్యెడ నాజి కేగి తిభీకరులై.

టీక:- ఖరులు = తీక్ష్ణ స్వభావులు; ఐ = అయ్యి; దృఢ = గట్టి; కవచ = కవచములను; ధనుః = ధనుస్సులు; శరులు = శరములు ధరించినవారు; ఐ = అయ్యి; అధిగత = పొందబడిన; రథ = రథములు; అనుచరులు = అనుచరులు; ఐ = కలవారై; మదవత్ = మదించిన; కరులు = ఏనుగులు కలవారు; ఐ = అయ్యి; ఘన = గొప్ప; హరులు = గుఱ్ఱములు కలవారు; ఐ = అయ్యి; బల = బలరామ; హరులు = కృష్ణులు; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; ఆజి = యుద్ధమున; కున్ = కు; ఏగిరి = వెళ్ళిరి; అతి = మిక్కిలి; భీకరులు = భయంకరులు; ఐ = అయ్యి.
భావము:- తీక్షణస్వభావం గలవారు; గట్టి కవచములు; ధనుర్భాణములు కలవారు; మదగజములు గొప్పఅశ్వములు కలవారు వారు; అతిభయంకరులు; అయి బలరామ కృష్ణులు అనుచరులతో యుద్ధభూమికి వెళ్ళారు.
గమనిక – ఈ అందమైన పద్యం వైచిత్రి చూడండి. “ర” కార ప్రాసను యుద్ధానికి వెళ్తున్నారు కనుక రజోగుణ సూచకంగా వాడారు; రౌద్రానికి, అగ్నిబీజానికి, తేజోమయానికి సంకేతంగా వాడారు; బలరామ, కృష్ణులను “ఘన హరులై బలహరులు” అని శత్రువు బలము హరించువారు అన్న అర్థము స్పురింప జేస్తున్నారు.

తెభా-10.1-1540-వ.
ఇట్లు సమరసన్నాహంబునం బురంబు వెడలి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సమర = యుద్ధము; సన్నాహంబునన్ = సిద్ధపడుట యందు; పురంబున్ = పట్టణము; వెడలి = వెలువడి.
భావము:- ఈలాగున సమరసన్నాహం వహించి బలరామ కృష్ణులు నగరం నుంచి వెలువడి. . .

తెభా-10.1-1541-ఉ.
న్యులు తల్లడిల్ల దనుజాంతకుఁ డొత్తె గభీరఘోష కా
ఠిన్య మహాప్రభావ వికటీకృత పద్మభవాండ జంతు చై
న్యము ధన్యమున్ దివిజ తాపస మాన్యముఁ బ్రీత భక్త రా
న్యము భీత దుశ్చరిత శాత్రవసైన్యముఁ బాంచజన్యమున్.

టీక:- అన్యులు = శత్రువులు; తల్లడిల్లన్ = కలత చెందునట్లుగా; దనుజాంతకుడు = కృష్ణుడు {దను జాంతకుడు - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; ఒత్తెన్ = పూరించెను; గభీర = గంభీరమైన; ఘోష = ధ్వనితో; కాఠిన్య = కఠినమైన; మహా = గొప్ప; ప్రభావ = ప్రభావము కలది; వికటీకృత = కలత నొందించబడిన; పద్మభవాండ = బ్రహ్మాండము నందలి {పద్మభవాండము - పద్మభవ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; జంతు = జీవుల; చైతన్యమున్ = చేతనత్వము కలది; ధన్యమున్ = కృతార్థత్వము కలది; దివిజ = దేవతలచేత; తాపస = మునులచేత; మాన్యమున్ = గౌరవింపబడునది; ప్రీత = సంతోషింప జేయబడిన; భక్త = భక్తులలో; రాజన్యమున్ = శ్రేష్ఠులు కలది; భీత = భయపెట్టబడిన; దుశ్చరిత = చెడ్డ నడవడిక కల; శాత్రవ = శత్రువుల; సైన్యమున్ = సైన్యము కలది; పాంచజన్యమున్ = పాంచజన్యము అను శంఖము {పాంచజన్యము - పంచజనుని దేహమునుండి పుట్టిన శంఖము, కృష్ణుని శంఖము}.
భావము:- శత్రువులు చలించిపోయేలా, దైత్యవిధ్వంసి ఐన శ్రీకృష్ణుడు గంభీరము, కర్కశము అయిన తన నినాద మహా మహిమచే బ్రహ్మాండములోని జీవరాసుల చైతన్యాన్ని వికటీకరించేది; దేవతలచేత మునులచేత మన్నింపబడేది; భక్తులైన రాజులను సంతోషపెట్టేది; చెడునడతగల వైరి సైన్యములకు భయము కల్గించేది; ధన్యమైనది అయిన పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు.

తెభా-10.1-1542-క.
సింధుర భంజనపూరిత
బంధురతర శంఖనినద భారమున జరా
సంధునికిం గల సైన్యము
లంములై సంచలించె నాహవభూమిన్.

టీక:- సింధుర = ఏనుగులను; భంజన = భంగపెట్టునదిగా; పూరిత = ఊదబడిన; బంధురతర = మిక్కిలి గంభీరమైన {బంధురము - బంధురతరము - బంధురతమము}; శంఖ = శంఖము యొక్క; నినద = ధ్వని యొక్క; భారమునన్ = అతిశయము వలన; జరాసంధుని = జరాసంధుని; కిన్ = కి; కల = ఉన్న; సైన్యములు = సేనాబలగములు; అంధములు = గుడ్డివి; ఐ = అయ్యి; సంచలించెన్ = కలతచెందినవి; ఆహవ = యుద్ధ; భూమున్ = క్షేత్రమున.
భావము:- ఏనుగులను భంగపరుస్తూ శ్రీకృష్ణుడు పూరించిన గంభీరతరమైన పాంచజన్య నినాదభారంతో జరాసంధుడికి ఉన్న సేనలన్నీ యుద్ధభూమిలో కన్నులు కానరాక కలత చెందాయి.