Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కృష్ణుడు ఆత్మీయు డగుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-590-క.
"కని మనిచి యెత్తి పెంచిన
నుజన్ములకంటె నందనయుం డా ఘో
నివాసులకు మనోరం
నుఁ డెట్లయ్యెను? బుధేంద్ర! ను నెఱిఁగింపన్."

టీక:- కని = ప్రసవించి; మనిచి = పోషించి; ఎత్తి = ఎత్తుకొని; పెంచిన = పెద్దచేసిన; తనుజన్ముల = స్వంతపిల్లల; కంటెన్ = కంటెను; నంద = నందుని; తనయుండు = పుత్రుడు; ఆ = ఆ యొక్క; ఘోష = గొల్లపల్లె; నివాసుల్ = ప్రజల; కున్ = కు; మనోరంజనుడు = ఇష్టుడు {మనోరంజనుడు - మనసును రంజింప చేయువాడు, ఇష్టుడు}; బుధ = జ్ఞానులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; చనున్ = తగును; ఎఱిగింపన్ = తెలియజేయ.
భావము:- “ఓ శుక మునీంద్రా! గోకులం లోని వారికి తాము కని పెంచిన తమ బిడ్డల కన్నా కృష్ణుడు ప్రేమపాత్రుడు ఎలా అయ్యాడు? నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు ఇది వివరించడం నీకే సాధ్యపడుతుంది.”

తెభా-10.1-591-వ.
అనిన శుకుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా అడిగిన పరీక్షన్మహారాజునకు శుకమహర్షి ఇలా చెప్పసాగాడు.

తెభా-10.1-592-సీ.
ఖిల జంతువులకు నాత్మవల్లభమైన-
భంగి బిడ్డలు నిండ్లుఁ సిఁడి మొదలు
స్తువు లెవ్వియు ల్లభంబులు గావు-
కలాత్మకుండైన లజనేత్రు
ఖిల జంతువులకు నాత్మ గావున ఘోష-
వాసుల కెల్లను ల్లభత్వ
మున మిక్కిలొప్పెను మూడులోకములకు-
హితము చేయఁగ జలజేక్షణుండు

తెభా-10.1-592.1-ఆ.
మాయతోడ మూర్తిమంతుడై యొప్పారు;
లఁ డతండు నిఖిల ణము లందు
వతిధాతు వెట్లు భావార్థమై సర్వ
ధాతు గణమునందుఁ నరు నట్లు.

టీక:- అఖిల = సమస్తమైన; జంతువుల = ప్రాణుల; కున్ = కు; ఆత్మ = ఆత్మ; వల్లభము = అతిప్రియమైనది; ఐన = అయినట్టి; భంగిన్ = విధముగా; బిడ్డలున్ = పిల్లలు; ఇండ్లు = నివాసములు; పసిడి = బంగారము; మొదలు = మొదలగు; వస్తువులు = వస్తువులు; ఎవ్వియున్ = ఏవికూడ; వల్లభంబులు = ప్రియతరములు; కావు = కావు; సకల = సమస్తమును; ఆత్మకుండు = తనరూపముగకలవాడు; ఐన = అయినట్టి; జలజనేత్రుడు = కృష్ణుడు {జలజనేత్రుడు - జలజము (పద్మము)ల వంటి నేత్రుడు (కళ్ళు కల వాడు), విష్ణువు};
I7077
మాయ = ప్రకృతి; తోడన్ = తోకూడి; మూర్తిమంతుడు = దేహధారి; ఐ = అయ్యి; ఒప్పారు = అతిశయించును; కలడు = ఉన్నాడు; అతండు = అతను; నిఖిల = ఎల్ల; గణములు = జీవజాలము; అందున్ = లోను; భవతిధాతువు = భూధాతువు (సంస్కృతమున); ఎట్లు = ఎలా ఐతే; భావ = క్రియావాచ్యమైన; అర్థము = అర్థముకలది; ఐ = అయ్యి; సర్వ = సమస్తమైన {ధాతుగణము - భ్వాది, అదాది, జుహోత్యాది దివాది సునోత్యాది తుదాది రుధాది తనోత్యాది క్రాది చురాది}; ధాతు = ధాతువుల; గణమున్ = సమూహమున; అందున్ = కును; తనరు = అతిశయించును; అట్లు = ఆ విధముగనే.
భావము:- జీవరాసులు అన్నింటికి “తనకు తాను ఇష్టమైనంత” బిడ్డలు గాని, ఇండ్లు గాని, బంగారం మొదలైన వస్తువులు గాని ప్రియమైనవి కావు. అన్నిటి యందు ఆత్మగా ఉన్న విష్ణువు అన్ని జీవరాసులలో “ఆత్మస్వరూపుడుగా” ఉన్నాడు. కనుకనే గోకుల నివాసులకు అందరికి ప్రియుడై చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పద్మముల వంటి కన్నులు ఉన్న విష్ణుమూర్తి మాయతో కూడిన రూపం ధరించి ప్రకాశిస్తున్నాడు. ఇదంతా మూడు లోకాలకూ మేలు చేయడానికే. క్రియలను తెలిపే అన్ని ధాతువులకూ “భవతి” అనే ధాతువు భావంగా అంతర్లీనమై ఉంటుంది. అలాగే చరాచర సృష్టి లోని అన్నిటి యందూ విష్ణువు ఉన్నాడు.

తెభా-10.1-593-క.
శ్రీతి పదమను నావను
బ్రాపించి భవాబ్ధి వత్సదముగ ధీరుల్
రూపించి దాఁటి చేరుదు
రాత్పద రహితు లగుచు మృతపదంబున్.

టీక:- శ్రీపతి = శ్రీవిష్ణుమూర్తి యొక్క; పదము = పాదాశ్రయము; అను = అనెడి; నావను = పడవను; ప్రాపించి =పొంది; భవ = సంసార, జన్మాది; అబ్ధి = సాగరమును; వత్స = దూడ యొక్క; పదము = గిట్టల ముద్ర; కన్ = ఐనట్లు; ధీరుల్ = ఆత్మజ్ఞాన సంపన్నులు; రూపించి = రూఢి చేసుకుని, నిశ్చయించుకొని; దాటి = తరించి; చేరుదురు = చెందెదరు; ఆపత్ = సకల దుఃఖములకు; పద = స్థానమైన అజ్ఞానము; రహితులు = విడువబడినవారు; అగుచున్ = అగుచు; అమృత = మరణములేని, ముక్తి; పదంబున్ = స్థానమును.
భావము:- బుద్ధిమంతు లైనవారు శ్రీహరి పాదము అనే నావను ఆధారంగా చేసుకుని సంసారం అనే సముద్రాన్ని, ఒక లేగదూడ అడుగును అంగవేసి దాటినంత తేలికగా దాటి ఆపద అనే స్థితిని పొందకుండా, అమృత స్థితిని చేరుకుంటారు.

తెభా-10.1-594-ఆ.
ఘునిఁ జంపి కృష్ణుఁ డాప్తులు దానును
ల్ది గుడిచి జలజసంభవునకుఁ
జిద్విలాసమైన చెలువుఁ జూపిన కథఁ
దువ వినినఁ గోర్కి సంభవించు.

టీక:- అఘుని = అఘాసురుని; చంపి = సంహరించి; కృష్ణుడు = శ్రీకృష్ణుడు; ఆప్తులున్ = తనకు కావలసినవారు; తానునున్ = అతను; చల్ది = చద్దన్నములు; కుడిచి = తిని; జలజసంభవున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; చిత్ = ప్రజ్ఞాస్వరూపమైన తన; విలాసము = లీలావిలాసము; ఐన = అయినట్టి; చెలువున్ = చక్కదనమును; చూపిన = చూపినట్టి; కథన్ = వృత్తాంతమును; చదువన్ = చదువుటవలన; వినినన్ = వినుట వలన; కోర్కి = వారి యొక్క కోరిక; సంభవించు = తీరును.
భావము:- శ్రీ కృష్ణుడు అఘాసురుని సంహరించడం ఆప్తులైన గోపబాలుర తోకూడి చల్దిఅన్నం ఆరగించడం బ్రహ్మకు తానే అన్నిటి యందూ అన్ని రూపాలలో ఉండటం అనే తన లీలలు చూపడం మొదలుగా గల ఈ కధను ఎవరు చదివినా ఎవరు విన్నా వారు కోరిన కోరిక తీరుతుంది.”

తెభా-10.1-595-వ.
అని చెప్పి మఱియు వ్యాసనందనుం డిట్లనియె
టీక:- అని = అని; చెప్పి = తెలిపి; మఱియున్ = ఇంకను; వ్యాసనందనుండు = శుకుడు {వ్యాసనందనుడు - వ్యాసుని యొక్క కొడుకు, శుకమహర్షి}.
భావము:- ఇలా చెప్పి వ్యాసుని కుమారుడైన శుకయోగి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-10.1-596-క.
రాగంబున బలకృష్ణులు
పౌగండవయస్కు లగుచుఁ శుపాలకతా
యోగంబున బృందావన
భాగంబునఁ గాఁచి రంతఁ శువుల నధిపా!

టీక:- రాగంబునన్ = ఆత్మీయతతో; బల = బలరాముడు; కృష్ణులు = కృష్ణులు; పౌగండవయస్కులు = పౌగండావస్థ చేరువారు; అగుచున్ = ఔతూ; పశుపాలకతా = పశువులను పాలించుట అనెడి; యోగంబునన్ = యోగవృత్తితో; బృందావన = బృందావనము యొక్క; భాగంబునన్ = వాటిక యందు; కాచిరి = మేపిరి; అంతన్ = అప్పుడు; పశువులన్ = గోవులను; అధిపా = రాజా.
భావము:- “బలరామకృష్ణులు ఈవిధంగా పౌగండ వయస్సు గల వారై అనురక్తితో పశువులను మేపుతూ గోపబాలురుతో కలసి బృందావనంలో విహరించారు.