పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కంసుని మంత్రాలోచన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

(తెభా-10.1-1151-వ.)[మార్చు]

మఱియు నలుక దీఱక కంసుండు దేవకీవసుదేవుల లోహపాశ బద్దులంజేసి కేశియనువానిం బిలిచి రామకేశవులం జంపుమని పంపి మంత్రి భట గజారోహక చాణూర ముష్టిక సాల్వ కోసల ప్రముఖుల రావించి యిట్లనియె.

(తెభా-10.1-1152-శా.)[మార్చు]

"ఎం దున్ నన్నెదిరించి పోరుటకు దేవేంద్రాదులుం జాల రీ
'బృం దారణ్యము మంద నిప్పుడు మదాభీరార్భకుల్ రామ గో
'విం దుల్ వర్ధిలుచున్న వారఁట రణోర్విం గంసుని ద్రుంతు మం
'చుం ర్పంబులు పల్కుచుందు రఁట యీ చోద్యంబులన్ వింటిరే?

(తెభా-10.1-1153-క.)[మార్చు]

ట్టణజనములు చూతురు
' ట్టంబుగ మల్లరంగల పార్శ్వములం
బె ట్టింపుఁడు తమగంబులు
'పు ట్టింపుఁడు వీట మల్లుపో రను మాటన్.

(తెభా-10.1-1154-శా.)[మార్చు]

'వి న్నాణంబులఁ బోరనేర్తురు మహావీర్యప్రతాపాది సం
' న్నుల్ మీరలు మేటి మల్లుగములం బ్రఖ్యాతులై పెంపుతో
' న్నా రా బలకృష్ణులం బెనఁకువన్ ర్దించి మత్ప్రీతి కా
' న్నుల్ గండు పురీజనుల్ పొగడ నో! చాణూర! యో! ముష్టికా!

(తెభా-10.1-1155-శా.)[మార్చు]

'రా రా హస్తిపకేంద్ర! గండమదధారాగంధలోభాంధ గం
'భీ రాళివ్రజమైన మత్కువలయాపీడద్విపేంద్రంబు మ
'ద్వా రోదంచిత దేహళీపరిసరస్తంభంబు డాయంగ నా
'భీ రుల్ రా నదలించి డీకొలుపుమీ బీరంబు తోరంబుగన్.

(తెభా-10.1-1156-క.)[మార్చు]

శువిశసనములు చేయుఁడు
' శుపతికిం బ్రియముగాఁగ భావించి చతు
ర్ద శినాడు ధనుర్యాగము
'వి దంబుగఁ జేయవలయు విజయముకొఱకున్."

21-05-2016: :
గణనాధ్యాయి 11:19, 11 డిసెంబరు 2016 (UTC)