పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కంసు డక్రూరునితో మాట్లాడుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

(తెభా-10.1-1157-వ.)[మార్చు]

అని తనవారి నందఱ నయ్యైపనులకు నియమించి యదుశ్రేష్టుం డగు నక్రూరునిం బిలిపించి చెట్టపట్టుకొని యిట్లనియె.

(తెభా-10.1-1158-శా.)[మార్చు]

" క్రూరత్వముతోడ నీవు మనఁగా క్రూరనామంబు ని
ర్వ క్రత్వంబున జెల్లె మైత్రి సలుపన్ చ్చున్ నినుం జేరి నీ
క్రోధుండవు మందలోన బలకృష్ణాభీరు లస్మద్వినా
క్రీడారతులై చరింతురఁట యోజందెచ్చి యొప్పింపవే.

(తెభా-10.1-1159-ఆ.)[మార్చు]

నాకు వెఱచి సురలు నారాయణుని వేఁడి
కొనిన నతఁడు వచ్చి గోపకులము
నందు గృష్ణమూర్తి నానకదుందుభి
కుదితుఁ డయ్యె ననఁగ నొకటి వింటి.

(తెభా-10.1-1160-వ.)[మార్చు]

కావున నీవు గోపకులచేత నరులు గొని ధనుర్యాగంబు చూడరం డని వారలం దోడ్కొని రమ్ము, తెచ్చిన.

(తెభా-10.1-1161-శా.)[మార్చు]

కొం ల్గూలఁగఁ ద్రొబ్బు కొమ్ముల తుదిం గోపించి కోరాడుచో
దం డిన్ దండి నధఃకరించు నొకవేదండంబు నా యింట బ్ర
హ్మాం డంబైనఁ గదల్పనోపు బలకృష్ణాభీరులం బోరిలో
ఖం డింపం దడవెంత? దాని కదియుం గాదేని నక్రూరకా!

(తెభా-10.1-1162-శా.)[మార్చు]

చా ణూరుండును ముష్టికుండును సభాసంఖ్యాతమల్లుల్ జగ
త్ప్రా ణున్ మెచ్చరు సత్వసంపదల బాహాబాహి సంగ్రామపా
రీ ణుల్ వారలు రామకృష్ణుల బలోద్రేకంబు సైరింతురే?
క్షీ ప్రాణులఁ జేసి చూపుదురు సంసిద్ధంబు యుద్దంబునన్.

(తెభా-10.1-1163-సీ.)[మార్చు]

రామకేశవు లంతరించిన వసు;
దేవ ముఖ్యులఁ జంపి తెగువ మెఱసి
వృష్టి భోజ దశార్హ వీరులఁ దెగటార్చి;
ముదుకఁడు రాజ్యకాముకుఁడు ఖలుఁడు
గు నుగ్రసేను మా య్య గీటడగించి;
పినతండ్రి దేవకుఁ బిలుకుమార్చి
ఱియు వైరులనెల్ల ర్దించి నే జరా;
సంధ నరక బాణ శంబరాది

(తెభా-10.1-1163.1-ఆ.)[మార్చు]

ఖులతోడ భూమిక్ర మేలెదఁ బొమ్ము
తెమ్ము వేగమ వసుదేవసుతుల
ఖము పేరు చెప్పి మంత్రభేదము చేయ
లయుఁ బెంపఁ జనదు వైరి జనుల."

(తెభా-10.1-1164-వ.)[మార్చు]

అనిన నక్రూరుం డిట్లనియె.

(తెభా-10.1-1165-ఉ.)[మార్చు]

"పం పినఁ బోనివాఁడనె నృపాలక! మానవు లెన్న తమ్ము నూ
హిం రు దైవయోగముల నించుక గానరు తోఁచినట్లు ని
ష్కం గతిన్ చరింతు రది గాదన వచ్చునె? యీశ్వరేచ్ఛఁ ద
ప్పిం పఁగ రాదు నీ పగతు బిడ్డలఁ దెచ్చెదఁ బోయి వచ్చెదన్."

(తెభా-10.1-1166-వ.)[మార్చు]

అని పలికి రథంబెక్కి యక్రూరుండు చనిన సకలజనులను వీడుకొలిపి కంసుం డంతిపురంబునకుం జనియె; నంతఁ గంస ప్రేరితుండై.

21-05-2016: :
గణనాధ్యాయి 11:20, 11 డిసెంబరు 2016 (UTC)