పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/సనకాదుల హరి స్తుతి

వికీసోర్స్ నుండి


తెభా-3-544-వ.
మఱియుం; జక్షురింద్రియగ్రాహ్యం బగు దివ్యమంగళవిగ్రహంబు ధరియించి యున్న పురుషోత్తము నుదాత్తతేజోనిధిం జూచి సనకాదు లిట్లని స్తుతియించిరి.
టీక:- మఱియు = ఇంకను; చక్షుః = చూచు; ఇంద్రియ = ఇంద్రియమునకు; గ్రాహ్యంబు = గ్రహించగలది; అగు = అయిన; దివ్య = దివ్యమైన; మంగళ = శుభప్రదమైన; విగ్రహంబు = స్వరూపము; ధరియించి = ధరించి; ఉన్న = ఉన్నట్టి; పురుషోత్తమున్ = నారాయణుని {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; ఉదాత్తతేజోనిధిన్ = నారాయణుని {ఉదాత్త తేజోనిధి - గొప్పతేజస్సునకు నిధివంటివాడు, విష్ణువు}; చూచి = చూసి; సనక = సనకుడు; ఆదులు = మొదలగువారు; ఇట్లని = ఈ విధముగ; స్తుతియించిరి = స్తోత్రము చేసిరి.
భావము:- కన్నులకు విందు కావించే దివ్యమంగళ స్వరూపాన్ని ధరించిన ఆ మహానుభావుడు, పురుషోత్తముడు, అనంత తేజోనిధి అయిన విష్ణువును సనకసనందనాదులు ఇలా సంస్తుతించారు.

తెభా-3-545-చ.
"జదళాక్ష! భక్తజనత్సల! దేవ! భవత్సుతుండు మ
జ్జకుఁడు నైన పంకరుహజాతుడు మాకు రహస్య మొప్పఁ జె
ప్పి భవదీయ మంగళగభీరపరిగ్రహ విగ్రహంబు మే
యముఁ జూడఁ గంటిమి కృతార్థులమై తగ మంటి మీశ్వరా!

టీక:- వనజదళాక్ష = నారాయణ {వనజ దళాక్షుడు - వనజ (పద్మము) యొక్క దళ (రేకు) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; భక్తవత్సల = నారాయణ {భక్త వత్సలుడు - భక్తుల ఎడ వాత్సల్యముకలవాడు, విష్ణువు}; దేవ = నారాయణ {దేవుడు - భగవంతుడు, విష్ణువు}; భవత్ = మీకు; సుతుండు = పుత్రుడు; మత్ = మాకు; జనకుడున్ = తండ్రియు; ఐన = అయిన; పంకరుహజాతుడు = బ్రహ్మదేవుడు {పంకరుహ జాతుడు - పంకరుహము (పద్మము)నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; మాకు = మాకు; రహస్యము = దాచుకొనుటకు; ఒప్పన్ = ఒప్పియుండునట్లుగా; చెప్పిన = చెప్పినట్టి; భవదీయ = నీ యొక్క; మంగళ = శుభకరమైన; గభీర = గంభీరమైన; పరిగ్రహ = స్వీకరించిన; విగ్రహంబున్ = స్వరూపమును; మేము = మేము; అనయంబు = తప్పక; చూడగంటిమి = చూడగలిగితిమి; కృతార్థులము = ధన్యులము; ఐ = అయ్యి; తగ = చక్కగా; మంటిమి = బతికితిమి; ఈశ్వరా = నారాయణుడా {ఈశ్వరుడు - ఫ్రభువు, విష్ణువు}.
భావము:- “పద్మదళాల వంటి నేత్రాలు కలిగినవాడా! భక్తజనులపై వాత్సల్యాన్ని చూపే దేవా! నీ కుమారుడూ, మాకు జనకుడూ అయిన బ్రహ్మదేవుడు మాకు ఉపదేశించిన ఉపాయంతో నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలిగాము. ప్రభూ! కృతార్థులమైన మా జన్మ సార్థకమయింది.

తెభా-3-546-సీ.
దే! దుర్జనులకు భావింప హృదయ సం-
తుఁడవై యుండియుఁ గానఁబడవు
డఁగి నీ దివ్యమంళవిగ్రహంబున-
జేసి సమంచితాశ్రితుల నెల్లఁ
జేఁకొని సంప్రీతచిత్తులఁగాఁజేయు-
తిశయ కారుణ్యతిఁ దనర్చి
మలాక్ష! సర్వలోప్రజాధిప! భవ-
త్సందర్శనాభిలాషానులాప

తెభా-3-546.1-తే.
విదిత దృఢభక్తియోగ ప్రవీణు లగుచు
ర్థిమై వీతరాగు లైట్టి యోగి
నమనః పంకజాత నిణ్ణమూర్తి
ని యెఱుంగుదురయ్య! నిన్నాత్మ విదులు.

టీక:- దేవ = నారాయణ {దేవుడు - భగవంతుడు, విష్ణువు}; దుర్జనుల్ = చెడ్డవారి; కున్ = కి; భావింపన్ = పరిశీలించిన; హృదయ = హృదయము; సంగతుడవు = లోపల ఉండువాడవు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉండినప్పటికిని; కానఁబడవు = కనబడవు; కడగి = పూని; నీ = నీ; దివ్య = దివ్యమైన; మంగళ = శుభప్రధమైన; విగ్రహంబున్ = స్వరూపము; చేసి = వలన; సమంచిత = చక్కటి పూజనీయులైన; ఆశ్రితులన్ = ఆశ్రితులను; ఎల్లన్ = అందరను; చేకొని = చేపట్టి; సంప్రీతి = సంతృప్త; చిత్తులన్ = మనసుకలవారిని; కాన్ = అగునట్లు; చేయుదు = చేసెదవు; అతిశయ = అత్యధికమైన; కారుణ్య = దయగల; మతిన్ = మనసుతో; తనర్చి = విజృంభించి; కమలాక్ష = నారాయణ {కమలాక్షుడు - కమలముల వంటి కన్నులున్నవాడు, విష్ణువు}; సర్వలోకప్రజాధిప = నారాయణ {సర్వలోకప్రజాధిపుడు - సమస్తమైన లోకముల ప్రజలకును ప్రభువు, విష్ణువు}; భవత్ = నిన్ను; అనుసరణ = అనువర్తించు; అభిలాష = కోరిక; అనులాప = మననము వలని;
విదిత = స్పష్టమైన; దృఢ = గట్టి; భక్తియోగ = భక్తియోగమున; ప్రవీణులు = మిక్కిలినేర్పుకలవారు; అగుచున్ = అవుతూ; అర్థిమై = కోరి; వీతరాగులము = వైరాగ్యముకలవారము; ఐనట్టి = అయినటువంటి; యోగి = యోగులైన; జన = జనుల యొక్క; మనస్ = మనసు అను; పంకజాతన్ = పద్మమున; నిషణ్ణమూర్తివి = నివసించువాడవు; అని = అని; యెఱుగుదురు = తెలియుదురు; అయ్య = తండ్రి; నిన్ను = నిన్ను; ఆత్మవిదులు = ఆధ్యాత్మికవేత్తలు {ఆత్మవిదులు - పరమాత్మ విద్య తెలిసినవారు, ఆధ్యాత్మికవేత్తలు}.
భావము:- దేవా! నీవు దుష్టుల హృదయాలలో ఉండికూడ వారికి కనిపించవు. పట్టుదలతో నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఆశ్రయించి ఆరాధించేవారిని అంతులేని దయతో చేరదీసి వారి మనస్సులను తృప్తి పరుస్తావు. పద్మనయనా! సర్వలోకాధిపతీ! నిన్ను చూడాలనే కోరిక కలగడం వల్లా, నీ గురించి చెప్పుకొనడం వల్ల, సుస్థిరమైన భక్తియోగంలో నిష్ణాతులైన ఆత్మవిదులైనవారు రాగద్వేషాలు తొలగించుకున్నట్టి యోగిజనుల మనస్సులనబడే పద్మాలలో నీవు కూర్చుని ఉంటావని తెలుసుకుంటారు.

తెభా-3-547-క.
యుక్తిం దలఁప భవద్వ్యతి
రిక్తము లైనట్టి యితర దృఢకర్మంబుల్
ముక్తిదము లయిన నీ పద
క్తులు తత్కర్మములను బాటింప రిలన్.

టీక:- యుక్తిన్ = తగినట్లుగా; తలంప = పరిశీలించి చూసిన; భవత్ = నీకంటెను; వ్యతిరిక్తములు = వేరైనవి; ఐనట్టి = అయినటువంటి; ఇతర = ఇతరమైన; దృఢ = గట్టి; కర్మంబులు = కర్మమములు; ముక్తిదములు = ముక్తిని చేకూర్చునవి; అయిన = అయినట్టి; నీ = నీయొక్క; పద = పాదముల; భక్తులు = భక్తులు; తత్ = ఆ; కర్మములను = కర్మములను; పాటింపరు = చేయరు; ఇలన్ = ఈ భూమిపైన.
భావము:- నీ పాదాలపై మనస్సు లగ్నం చేసిన భక్తులు నీ భక్తికి వ్యతిరేకాలైన ఇతర ముఖ్యమైన కార్యాలు ముక్తి నిచ్చేవైనా వాటిని పాటింపరు.

తెభా-3-548-ఉ.
కావున గీర్తనీయ గతల్మష మంగళ తీర్థ కీర్తి సు
శ్రీవిభవప్రశస్త సుచరిత్రుఁడ వైన భవత్పదాబ్జ సే
వా విమలాంతరంగ బుధర్గ మనర్గళభంగి నన్యమున్
భామునం దలంచునె కృపాగుణభూషణ! పాపశోషణా!

టీక:- కావున = అందుచేత; కీర్తనీయ = స్తుతించదగ్గ; గత = పోగొట్టబడిన; కల్మష = పాపములు; మంగళ = శుభకరమైన; తీర్థ = పావనకరమైన; కీర్తి = యశస్సు; సుశ్రీ = మంచిసౌభాగ్యము; విభవ = వైభవములతో; ప్రశస్త = గొప్ప; సుచరిత్రుడవు = మంచి చరిత్ర గలవాడవు; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అబ్జ = పద్మముల {అబ్జము - నీటపుట్టినది, పద్మము}; సేవా = సేవించు; విమల = నిర్మలమైన; అంతరంగ = మనసులు కల; బుధ = జ్ఞానుల; వర్గము = సముదాయము; అనర్గళ = ఎడతెగని; భంగిన్ = విధముగ; అన్యమున్ = ఇతరమైన; భావమునన్ = మనసులో; తలంచునె = తలుస్తారా ఏమి; కృపాగుణభూషణ = నారాయణ {కృపా గుణ భూషణుడు - దయాగుణమే అలంకారముగ కలవాడు, విష్ణువు}; పాపశోషణా = పాపములను పోగొట్టువాడు.
భావము:- దయాగుణమే అలంకారంగా గలవాడా! పాపాలను తొలగించేవాడా! పొగడ దగినదీ, దోషాలు లేనిదీ, శుభగుణాలకు కాణాచియైనదీ, గొప్ప కీర్తిచేత విరాజిల్లేదీ అయిన పవిత్రమైన చరిత్ర కలవాడవు. నీ పాదపద్మాల సేవచేత నిర్మలమైన మనస్సు కల మహానుభావులు ఇతర విషయాలను భావించరు.

తెభా-3-549-చ.
మతపో విధూత భవపాపులమై చరియించు మాకు నేఁ
య భవత్పదాశ్రితుల ల్గి శపించిన భూరి దుష్కృత
స్ఫుణ నసత్పథైక పరిభూతులమై నిజధర్మహానిగా
నియము నొందఁగావలసె నేరము వెట్టక మమ్ముఁ గావవే.

టీక:- పరమ = ఉత్తమమైన; తపస్ = తపస్సువలన; విధూత = పోగొట్టబడిన; భవ = సాంసారిక; పాపులము = పాపములు కలవారము; ఐ = అయ్యి; చరియించు = వర్తించుచుండు; మాకున్ = మాకు; నేడు = ఈరోజు; అరయ = చూడగా; భవత్ = నిన్ను; ఆశ్రితులన్ = ఆశ్రయించిన వారిని; అల్గి = కోపించి; శపించిన = శాపము పెట్టిన; భూరి = అతిమిక్కిలి; దుష్కృత = చెడ్డపనిగా; స్ఫురణన్ = వ్యక్తమగుచున్న; అసత్ = చెడు; పథ = మార్గములలో; ఏక = ప్రముఖమైనదానిని; పరిభూతులము = పట్టినవారము; ఐ = అయ్యి; నిజ = స్వీయ; ధర్మ = ధర్మమునకు; హానిగా = కలిగినభంగమువలన; నిరయమున్ = నరకమును; ఒందన్ = పొంద; వలసె = వలసి వచ్చినది; నేరము = తప్పు; పెట్టక = పట్టక; మమ్మున్ = మమ్ములను; కావవే = కాపాడుము.
భావము:- అంతులేని తపస్సు చేసి సాంసారిక పాపాలను పోగొట్టుకొని తిరిగే మేము ఈరోజు నీ పాదదాసులపై కోపించి శపించాము. మహాపాపాన్ని కల్గించే చెడుమార్గంలో అడుగుపెట్టి ధర్మహాని చేసి నరకానికి పాత్రుల మయ్యాము. మా తప్పు మన్నించి మమ్మల్ని రక్షించు.

తెభా-3-550-చ.
మనురక్తి షట్పదము మ్రసుగంధమరందవాంఛచేఁ
మిడి శాతకంటకవృస్ఫుటనవ్యతరప్రసూనమం
రులను డాయు పోల్కిని భృశంబగు విఘ్నములన్ జయించునీ
ణసరోజముల్గొలువ మ్మతి వచ్చితిమయ్య కేశవా!

టీక:- కరము = మిక్కిలి; అనురక్తిన్ = ఆపేక్షతో; షట్పదము = తుమ్మెద; కమ్ర = కమ్మని; సుగంధ = సువాసన కల; మరంద = మకరందముపై; వాంఛన్ = కోరికతో; తరమిడి = మధించబడి; శాత = వాడియైన; కంటక = ముండ్లతో; వృత = ఆవరింపబడిన; స్ఫుటత్ = విరబూస్తున్న; నవ్యతర = బాగా తాజా {నవ్యము - నవ్యతరము - నవ్యతమము}; ప్రసూన = పూల; మంజరులను = గుత్తులను; డాయున్ = చేరు; పోల్కిన్ = విధముగ; భృశంబు = అధికము; అగు = అయిన; విఘ్నములన్ = విఘ్నములను; జయించు = జయించునటువంటి; నీ = నీ యొక్క; చరణ = పాదములు అనెడి; సరోజముల్ = పద్మములు {సరోజములు - సరసున జ(పుట్టునవి) ములు}; కొలువన్ = సేవించుటకు; సమ్మతిన్ = ఇష్టపూర్వకముగా; వచ్చితిమి = వచ్చాము; అయ్య = తండ్రి; కేశవ = నారాయణ {కేశవ - కేవలము శుభమైనవాడ, విష్ణువు}.
భావము:- కేశవా! తుమ్మెద కుతూహలంతో కమ్మని మకరందం కోసం వాడిముళ్ళతో కూడిన కొంగ్రొత్త పూలగుత్తులను సమీపించే విధంగా మిక్కిలి ఆటంకాలను అధిగమించి నీ పాదపద్మాలను ఆరాధించడానికి వచ్చాము.

తెభా-3-551-చ.
రు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ
తుసి పవిత్రమైనగతిఁ దోయజనాభ! భవత్కథాసుధా
లితములైన వాక్కుల నల్మషయుక్తిని విన్నఁ గర్ణముల్
విసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా!

టీక:- అలరు = శోభ యుక్తమైన; భవత్ = నీ యొక్క; పద = పాదములు అనెడి; అంబుజ = పద్మముల; యుగ = జంటకు; అర్పితము = అర్పింపబడినవి; ఐ = అయ్యి; పొలుపొందున్ = ఒప్పారే; అట్టి = అటువంటి; తులసి = తులసి; పవిత్రము = పవిత్రము; ఐన = అయిన; గతిన్ = విధముగ; తోయజనాభ = నారాయణ {తోయజ నాభుడు - తోయజము (నీటిలో పుట్టునది, పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; భవత్ = నీ యొక్క; కథా = కథలు అను; సుధా = అమృతముతో; కలితములు = కూడినవి; ఐన = అయినట్టి; వాక్కులన్ = పలుకులను; అకల్మష = దోషరహితమైన; యుక్తిన్ = విధముగ; విన్నన్ = విన్నచో; కర్ణముల్ = చెవులు; విలసిత = విలాసవంతమైన; లీలమై = లీలవలె; భువిన్ = భూమిపైన; పవిత్రముల్ = పవిత్రమైనవి; ఐ = అయ్యి; విలసిల్లు = విరాజిల్లును; మాధవా = నారాయణ.
భావము:- పద్మనాభా! మాధవా! నీ పాదపద్మాలపై సమర్పింపబడి అందాలు చిందే ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన మాటలను ఎటువంటి కల్మషం లేకుండా విన్నట్టి మా చెవులు పవిత్రాలై విలసిల్లుతాయి.

తెభా-3-552-చ.
హిత యశోవిలాసగుణమండన! సర్వశరణ్య! యింద్రియ
స్పృహులకుఁ గానరాక యతసీ కుసుమద్యుతిఁ నొప్పుచున్న నీ
జ శరీర మిప్పుడు భృశంబుగఁ జూచి మదీయ దృక్కు లిం
హ కృతార్థతం బొరసె చ్యుత! మ్రొక్కెద మాదరింపవే."

టీక:- మహితయశోవిలాసగుణమండన = నారాయణ {మహిత యశో విలాస గుణ మండనుడు - గొప్ప కీర్తితో విరాజిల్లు గుణములతో ప్రసిద్ధమైనవాడు, విష్ణువు)}; సర్వశరణ్య = నారాయణ {సర్వశరణ్యుడు - సర్వలకును శరణ్యమైనవాడు, విష్ణువు}; ఇంద్రియ = ఇంద్రియము లందు; స్పృహులు = ఆసక్తి కలవారి; కున్ = కి; కానరాక = కనిపించక; అతసీ = నల్ల అవిసె; కుసుమ = పుష్పము; ద్యుతిన్ = కాంతితో; ఒప్పుచున్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; సహజ = సహజసిద్ధమైన; శరీరమున్ = శరీరమును; ఇప్పుడు = ఇప్పుడు; భృశంబుగన్ = బాగుగా; చూచి = చూసి; మదీయ = మా యొక్క; దృక్కులు = చూపులు; ఇందు = దీనిలో; అహహ = ఓహో; కృతార్థతన్ = సార్థక్యమును; పొరసెన్ = పొందినవి; అచ్యుత = నారాయణ {అచ్యుత - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; మ్రొక్కెదము = నమస్కరించెదము; ఆదరింపవే = ఆదరింపుము.
భావము:- మహనీయమైన కీర్తియొక్క విలాసంచేత ప్రకాశించే సుగుణాలు కలవాడా! అందరికీ ఆశ్రయింప దగినవాడా! అచ్యుతా! పంచేంద్రియాలకు లొంగినవారికి కనిపించక నల్ల అవిసె పూవుల కాంతితో ఒప్పే నీ సహజ స్వరూపాన్ని ఇప్పుడు మేము సంతృప్తిగా చూసి మా కన్నులు ధన్యతను పొందాయి. నీకు మ్రొక్కిన మమ్మల్ని ఆదరించు.

తెభా-3-553-క.
ని సనకాదులు దత్పద
జములకు మ్రొక్కి భక్తిశమానసులై
వినిపించిన గోవిందుఁడు
మునివరులం జూచి పలికె ముదితాత్ముండై.

టీక:- అని = అని; సనక = సనకుడు; ఆదులు = మొదలగువారు; తత్ = ఆతని; పద = పాదములు అనెడి; వనజముల్ = పద్మముల {వనజము - వనము (నీటి)లో జము(పుట్టునవి), పద్మము}; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; భక్తి = భక్తికి; వశమానసులు = వశమైన మనసు కలవారు; ఐ = అయ్యి; వినిపించిన = పలికిన; గోవిందుడు = నారాయణ {గోవిందుడు - గో( జీవుల)కు ఒడయుడు, విష్ణువు}; ముని = మునులలో; వరులన్ = శ్రేష్ఠులను; చూచి = చూసి; పలికె = పలికెను; ముదిత = సంతోషించిన; ఆత్ముడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; ఈ = ఈ.
భావము:- అని ఈ విధంగా సనక సనందనాదులు శ్రీహరి పాదపద్మాలకు మ్రొక్కి భక్తితో పరవశమైన మనస్సు కలవారై విన్నవించారు. గోవిందుడు సంతోషించి ఆ మునీశ్వరులను చూసి ఇలా అన్నాడు.