పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/బ్రహ్మణ ప్రశంస

వికీసోర్స్ నుండి


తెభా-3-554-వ.
"ఈ యిరువురు జయవిజయాభిధానంబులు గల మదీయ ద్వారపాలకులు వీరు మిమ్ముం గైకొనక మదీయాజ్ఞాతిక్రమణు లయి చేసిన యపరాధంబునకుఁ దగిన దండంబు గావించితిరి; అది నాకు నభిమతం బయ్యె; అదియునుం గాక భృత్యు వర్గంబు సేయు నపరాధంబు స్వామిదియ; కాన యీ తప్పునకు మాననీయుండ నైన నన్ను మన్నించి ప్రసన్ను లగుదురు గాక"యని వెండియు నిట్లనియె.
టీక:- ఇరువురు = ఇద్దరు; జయ = జయుడు; విజయ = విజయుడు అను; అభిధానంబులు = పేర్లు; కల = కలిగిన; మదీయ = నా యొక్క; ద్వారపాలకులు = గుమ్మాల దగ్గరి కాపాలాదారులు; వీరు = వీరు; మిమ్మున్ = మిమ్ములను; కైకొనక = లక్ష్య పెట్టక; మదీయ = నా యొక్క; ఆజ్ఞా = ఆజ్ఞను; అతిక్రమణులు = దాటినవారు; అయి = అయ్యి; చేసిన = చేసినట్టి; అపరాధంబునన్ = తప్పు; కున్ = కి; తగిన = తగినట్టి; దండంబున్ = శిక్షను; కావించితిరి = వేసితిరి; అది = అది; నాకు = నాకు; అభిమతంబు = అంగీకారము; అయ్యె = అయినది; అదియునున్ = అంతే; కాక = కాకుండ; భృత్యు = పరిచారకుల; వర్గంబు = సమూహము; చేయు = చేయునట్టి; అపరాధంబున్ = తప్పుకూడ; స్వామిదియ = స్వామిదే; కాన = కనుక; ఈ = ఈ; తప్పునన్ = తప్పు; కున్ = కు; మాననీయుండను = మన్నించదగినవాడను; ఐన = అయినట్టి; నన్ను = నన్ను; మన్నించి = మన్నించి; ప్రసన్నులు = దయగలవారు; అగుదురుగాక = కావలసినది; అని = అని; వెండియ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- “ఈ ఇద్దరు జయుడు, విజయుడు అనే పేర్లు కల నా ద్వారపాలకులు. వీరు మిమ్మల్ని లెక్కచేయక, నా ఆజ్ఞను అతిక్రమించి చేసిన నేరానికి మీరు తగిన శిక్షే విధించారు. అది నాకు ఇష్టమే. అంతేకాక సేవకులు చేసే అపరాధం యజమానిదే అవుతుంది. కాని ఈ తప్పుకు మాననీయుడినైన నన్ను మన్నించి దయచూపండి. అంతేకాక...” అంటూ శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-3-555-చ.
"నువునఁబుట్టినట్టి బెడిదంబగు కుష్టుమహాగదంబుచే
రి తదీయచర్మము విర్ణతనొందినరీతి భృత్యులొ
ప్పనిపనిసేసినన్ విభులు బంధురచారుయశంబుఁబేరుఁబెం
పునుజెడిపోయి దుర్యశముబొందుచునుందురు విష్టపంబులన్

టీక:- తనువునన్ = శరీరమున; పుట్టిన = పుట్టిన; అట్టి = అటువంటి; బెడిదంబున్ = భయంకరమైనది; అగు = అయిన; కుష్టు = కుష్టు అను; మహా = పెద్ద; గదంబు = వ్యాధి; చేన్ = చేత; వనరి = బాధింపడి; తదీయ = వాని; చర్మము = చర్మము; వివర్ణత = రంగువెలసిపోవుటను; ఒందిన = పొందిన; రీతి = విధముగ; భృత్యులు = సేవకులు; ఒప్పని = కూడని; పని = పని; చేసినన్ = చేసినచో; విభులు = యజమానులు; బంధుర = శ్రేష్ఠహెచ్చైన; చారు = చక్కటి; యశంబున్ = కీర్తియు; పేరున్ = పేరు; పెంపున్ = ప్రతిష్టలును; చెడిపోయి = పాడైపోయి; దుర్యశమున్ = అపకీర్తిని; పొందుచున్ = పొందుచు; ఉందురు = ఉంటారు; విష్టపంబులన్ = లోకములందు.
భావము:- “శరీరంలో పుట్టిన భయంకరమైన కుష్ఠరోగంచేత చర్మం చెడిపోయి రంగు మారే విధంగా సేవకులు చేసే చెడ్డ పనులు యజమానుల గొప్ప కీర్తిని, పేరుప్రతిష్ఠలను పోగొడతాయి. వారికి లోకంలో చెడ్డపేరు వస్తుంది.

తెభా-3-556-చ.
వడ నాకు మీవలన బ్బిన తీర్థ సుకీర్తనీయ స
ల్లలిత వినిర్మలామృత విలాస యశో విభవాభిరామమై
వెయు వికుంఠనామ మపవిత్ర మనశ్శ్వపచాధమాది లో
కు చెవి సోఁకఁ దత్క్షణమ కోరి పవిత్రులఁ జేయు వారలన్.

టీక:- అలవడ = సిద్ధముగ; నాకు = నాకు; మీ = మీ; వలన = వలన; అబ్బిన = లభించిన; తీర్థ = పావనమైన; సుకీర్తనీయ = మంచిగ స్తుతింపదగిన; సత్ = మంచి; లలిత = అందమైన; వినిర్మల = బాగా స్వచ్ఛమైన; అమృత = అమృతము వంటి; విలాస = శోభ కలిగిన; యశో = కీర్తియు; విభవ = వైభవములతో; అభిరామము = ఒప్పారుచున్నది; ఐ = అయ్యి; వెలయు = విలసిల్లు; వికుంఠ = వికుంఠుడు అను; నామము = పేరు; అపవిత్ర = అపవిత్రమైన; మనస్ = మనసు కలవారు; శ్వపచ = అపరిశుభ్రులు {శ్వపచ - కుక్క మాంసము తినువారు, అపరిశుభ్రులు}; అధమ = నీచులు; ఆది = మొదలగు; లోకుల = జనుల యొక్క; చెవి = చెవి; సోకన్ = తగిలిన; తత్క్షణమ = వెంటనే; కోరి = ఇచ్చించి; పవిత్రులన్ = పవిత్రమైనవారినిగా; చేయు = చేయును; వారలన్ = వారిని.
భావము:- మీవల్ల నాకు లభించిన పుణ్యక్షేత్రం ఈ వైకుంఠం. ఇది ఎంతో పవిత్రమై, పొగడదగినదై, సుందరమై, అమృతమయమై, కీర్తివైభవంతో శోభిస్తూ అలరారుతున్నది. ఇది తన పేరు విన్నవారిని ఎటువంటి అపవిత్రులనైనా, కుక్క మాంసం తినే శ్వపచులనైనా పవిత్రులను చేస్తుంది.

తెభా-3-557-తే.
ట్టి నేను దలంప మీ ట్టి సాధు
నుల కపకార మర్థిఁ జేసి మదీయ
బాహుసము లైనఁ ద్రుంతు నుత్సాహలీల
న్న నితరుల మీ మ్రోల నెన్న నేల?

టీక:- అట్టి = అటువంటి; నేను = నేను; తలంప = పరిశీలించిన; మీ = మీ; అట్టి = లాంటి; సాధు = సాధుస్వభావులైన; జనుల్ = జనుల; కున్ = కు; అపకారము = కీడు; అర్థిన్ = కోరి; చేసిన = చేసినట్టి; మదీయ = నా యొక్క; బాహు = చేతులకు; సముల్ = సమానమైనవారు; ఐనన్ = అయినప్పటికి; త్రుంతును = ఖండింతును; ఉత్సాహ = వీరత్వపు; లీలన్ = విధముగ; అన్నన్ = అంటే; ఇతరులన్ = మిగతావారి గురించి; మీ = మీ; మ్రోలన్ = ముందర; ఎన్నన్ = ఎంచి చూచుట; ఏలన్ = ఎందులకు.
భావము:- అటువంటి నేను మీవంటి సాధుజనులకు అపకారం చేసినవారు నాకు బాహువులవంటి వారైనా ఖండించడానికి వెనుకాడను. ఇంక ఇతరులను మీముందు లెక్కచేయడ మెక్కడిది?

తెభా-3-558-క.
ణిసురోత్తమసేవా
రిలబ్ధం బయిన యట్టి పాతక నాశం
నిఖిలభువన పూత
స్ఫురితాంఘ్రిసరోజ తోయములు గల నన్నున్.

టీక:- ధరణీసుర = బ్రహ్మణులలో {ధరణీసురులు – భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; ఉత్తమ = ఉత్తముల; సేవా = సేవించుటవలన; పరి = చక్కగా; లబ్ధ = లభించినది; అయిన = అయిన; అట్టి = అటువంటి; పాతక = పాపములను; నాశంకర = నాశనము చేయునట్టి; నిఖిల = సమస్తమైన; భువన = లోకములను; పూత = పవిత్రముచేయునట్టి; స్ఫురితన్ = ఉద్భవించినట్టి; అంఘ్రి = పాదములు అనెడి; సరోజ = పద్మముల {సరోజము - సరసున జము (పుట్టినది), పద్మము}; తోయము = గంగ; కల = ఉన్నట్టి; నన్నున్ = నన్ను.
భావము:- సకల పాపములను శమింపజేయ గలది, సమస్త లోకాలను పవిత్రం జేయగలదీ అయిన గంగకు జన్మస్థానమైనట్టివి మఱియు బ్రాహ్మణశ్రేష్ఠులను సేవించుట వలన లభించెడివి అయిన నా పాదపద్మ యుగము కలిగిన నన్ను. . .

తెభా-3-559-క.
ఘుమతి విరక్తునిఁగాఁ
లఁపక నిజ శుభ కటాక్ష దామక కలితా
ఖి సంపద్విభవశ్రీ
నారత్నం బురస్థలంబును జెందెన్.

టీక:- అలఘు = గొప్ప; మతిన్ = మనసుతో; విరక్తునిన్ = వైరాగ్యము కలవాని; కాన్ = అగునట్లు; తలపక = అనుకోకుండా; నిజ = తన; శుభ = శుభకరమైన; కటాక్ష = కటాక్షము అను; దామక = పుష్పమాలల; కలిత = కలిగి; అఖిల = సమస్తమైన; సంపత్ = సంపదలతోను; విభవ = వైభవములతోను కూడిన; శ్రీ = లక్ష్మీదేవి అను; లలనా = స్త్రీలలో; రత్నంబున్ = రత్నమువంటిది; ఉరః = వక్ష; స్థలంబునున్ = స్థలమును; చెందెన్ = చేరినది.
భావము:- విరక్తునిగా తేలికగా భావింపక, శుభకరాలైన తన కటాక్షాలనే పూలదండలతో సకల సంపదల వైభవం కలిగిన లక్ష్మి నా వక్షస్థలాన్ని అలంకరించింది.

తెభా-3-560-చ.
క్రతువులు సేయుచో శిఖిముఖంబున వేలుచు నట్టి తద్ఘృత
ప్లు చరుభక్షణన్ ముదముఁ బొందదు నిస్పృహధర్మమార్గ సం
తుఁడగు భూసురోత్తము ముఖంబున వేడ్క భుజించు నయ్యవి
స్త్రృకబళంబునన్ మనము తృప్తి వహించినరీతి నిచ్చలున్

టీక:- క్రతులు = యజ్ఞములు; చేయుచోన్ = చేయుటవలన; శిఖి = అగ్ని యొక్క; ముఖంబునన్ = నోటి యందు; వేలుచున్ = హోమము చేయబడే; అట్టి = అటువంటి; తత్ = ఆ; ఘృత = నేతులలో; ప్లుత = తేలుచున్న; చరు = హవ్యమును; భక్షణన్ = తినుట యందు; ముదమున్ = సంతోషమును; పొందదు = కలుగదు; నిస్పృహ = ప్రయత్న రహితముగ; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గ = మార్గమును; సంగతుడు = కూడి ఉండువాడు; అగు = అయిన; భూసుర = బ్రాహ్మణులలో {భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; ఉత్తమ = ఉత్తమమైన వారి; ముఖమునన్ = నోటి యందు; వేడ్కన్ = వేడుకగా; భుజించు = తినుచున్న; ఆ = ఆ; అవిస్త్రృత = చిన్న {అవిస్త్రృతము - విస్త్రృతము (పెద్దది) కానిది, చిన్నది}; కబళంబునన్ = ముద్దచేత; మనము = (నా)మనసు; తృప్తిన్ = సంతృప్తి; వహించిన = పడిన; రీతిన్ = విధముగ; నిచ్చలున్ = ఎప్పటికిని.
భావము:- ఆశలు లేనివాడై ధర్మమార్గంలో సంచరించే బ్రాహ్మణోత్తముడు తినే చిన్న అన్నంముద్ద వల్ల నా మనస్సుకు కలిగే సంతృప్తి యజ్ఞయాగాలలో నేతిలో ముంచి అగ్నిముఖంగా వ్రేల్చబడే హవిస్సును అందుకొని ఆరగించేటప్పుడు కూడా కలుగదు.

తెభా-3-561-సీ.
తతంబు నప్రతిత యోగమాయా వి-
భూతిచేఁబ్రఖ్యాతిఁ బొందు నేను
నే మహీసురుల సమిద్ధ నిర్మలపాద-
లిన రజోవితాములు భక్తి
హాకనవరత్నకోటీరమునఁ దాల్తు-
ట్టి నా చరణాంబుజాంబువులను
విలి ధరించి సద్యఃపవిత్రాత్ము లై-
ర్థిఁ జంద్రావతం సాది దేవ

తెభా-3-561.1-తే.
యము లెవ్వాఁడు బ్రాహ్మణనులు దమకు
పకృతుల్ సేసిరేని మాలుగఁ డతఁడు
విప్రులను నన్నుఁగాఁగ భావించు నతఁడు
ర్మపద్ధతి నా ప్రియముఁడు వాఁడు.

టీక:- సతతంబున్ = ఎల్లప్పుడును; అప్రతిహత = తిరుగులేని; యోగమాయా = యోగమాయ యొక్క; విభూతి = వైభవము; చేన్ = చేత; ప్రఖ్యాతిన్ = గొప్పకీర్తిని; పొందు = పొందే; నేనున్ = నేను; ఏ = ఏ; మహీసురుల = బ్రాహ్మణుల యొక్క; సమిద్ధ = పరిశుద్ధమైన; నిర్మల = నిర్మలమైన; పాద = పాదముల వలన; నలి = నలిగిన; రజస్ = ధూళి; వితానములు = సమూహములను; భక్తిన్ = భక్తితో; హాటక = బంగారమున; నవరత్న = నవరత్నములు తాపిన; కోటీరమున = కిరీటమున; తాల్తున్ = ధరింతును; అట్టి = అటువంటి; ఆ = ఆ యొక్క; చరణ = పాదములు అనెడి; అంబుజ = పద్మముల యందలి; అంబువులను = జలములను; తవిలి = ఆసక్తితో; ధరించి = ధరించి; సద్యః = అప్పుడు; పవిత్రాత్ములు = పవిత్రమైనవారు; ఐరి = అయ్యిరి; చంద్రావతంస = శువుడు {చంద్రావతంసుడు – చంద్రుని సిగబంతిగా కలవాడు, శివుడు.}; ఆది = మున్నగు; దేవ = దేవతల; చయములన్ = సమూహములో; ఎవ్వాడు = ఎవరైతే;
బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; జనులు = జనులు; తమ = తమ; కున్ = కి; అపకృతుల్ = అపకారములు; సేసిరేని = చేసినట్లయితే; మాఱు = తిరిగు; అలుగడు = కోపింపరో; అతడు = అతడు; విప్రులను = బ్రాహ్మణులను; నన్నున్ = నేనే; కాన్ = అగునట్లు; భావించున్ = అనుకొనునో; అతడు = అతడు; ధర్మ = ధర్మమైన; పద్ధతిన్ = విధానములో; నా = నా యొక్క; ప్రియతముడు = అత్యంత ఇష్టుడు {ప్రియుడు - ప్రియతరుడు - ప్రియతముడు}; వాడు = వాడు.
భావము:- ఎదురులేని యోగమాయావైభవంతో ఎల్లప్పుడూ ప్రసిద్ధుడనైన నేను బ్రాహ్మణుల పవిత్రమైన పాదపద్మ పరాగాలను భక్తితో నా నవరత్న ఖచిత సువర్ణ కిరీటంపై ధరిస్తాను. అటువంటి నా పాదపద్మాలలో జన్మించిన గంగాజలాన్ని తలపై ధరించి శివుడు మొదలైన దేవతలు వెంటనే పవిత్రు లవుతున్నార ఎవడైతే బ్రాహ్మణులు తనకు అపకారం చేసినా తిరిగి కోపగించడో, ఎవడైతే బ్రాహ్మణులను నన్నుగా భావిస్తాడో అటువంటివాడు ధర్మానుసారంగా నాకు మిక్కిలి ఇష్టమైనవాడు.

తెభా-3-562-ఉ.
గోవితతిన్ ధరాదివిజకోటిని నన్నును దీనవర్గమున్
వావిరి భేదబుద్ధిఁ గనువార లధోగతిఁ బొంద నందు నా
శీవిషరోషవిస్ఫురణజెంది కృతాంత భటుల్ మహోగ్ర గృ
ధ్రాలివోలెఁ జంచువుల నంగము లుద్ధతిఁ జింతు రెప్పుడున్.

టీక:- గో = ఆవుల; వితతిన్ = మందను; ధరాదివిజ = బ్రాహ్మణుల {ధరాదివిజులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; కోటిని = సమూహమును; నన్నునున్ = నన్నూ; దీన = దీనుల; వర్గమున్ = సమూహమును; వావిరి = అధికముగ; భేద = వేరైన; బుధ్ధిన్ = బుద్ధితో; కను = చూచు; వారలు = వారు; అధోగతిన్ = నాశమును; పొందన్ = పొందగ; అందు = అంత; ఆశీవిష = కోఱలలో విషము ఉండే పాముల; రోష = క్రోధము; విస్ఫురణన్ = వెలిబుచ్చుటను; చెంది = కలిగి; కృతాంతభటుల్ = యమభటులు; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; గృధ్రా = గద్దల; ఆవలి = గుంపు; పోలెన్ = వలె; చంచువులన్ = ముక్కులతో; అంగములున్ = దేహావయవములను; ఉద్ధతిన్ = ఉధృతముగ; చింతురు = చించివేయురు; ఎప్పుడును = సతతమూ;
భావము:- ఎవరైతే గోవులను, బ్రాహ్మణులను, నన్ను, దీనజనులను భేదభావంతో చూస్తారో వారు అధోగతి పాలవుతారు. వారిని యమభటులు త్రాచుపాములవలె, భయంకరమైన గ్రద్దలవలె రోషంతో ముక్కులతో చీల్చుతారు.

తెభా-3-563-చ.
ణిసురోత్తముల్ బహువిధంబులఁ దమ్ముఁ బరాభవించినన్
హసితాస్యులై యతి ముదంబున నిచ్చలుఁ బూజసేయుచున్
స వచోవిలాసముల న్నుతిసేయుచుఁ దండ్రి నాత్మజుల్
మనురక్తిఁ బిల్చుగతిఁ గైకొని పిల్చిన వారు నా సముల్.

టీక:- ధరణీసురోత్తముల్ = బ్రాహ్మణులు {ధరణీ సురోత్తములు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; బహు = అనేక; విధంబులన్ = రకములుగా; తమ్మున్ = తమను; పరాభవించినన్ = అవమానించినను; దరహసిత = చిరునవ్వు కల; ఆస్యులు = మోము కలవారు; ఐ = అయ్యి; అతి = మిక్కిలి; ముదంబునన్ = సంతోషముతో; నిచ్చలున్ = నిత్యము; పూజ = పూజ; చేయుచున్ = చేస్తూ; సరస = సరసమైన; వచో = మాటల; విలాసములన్ = విలాసములతో; సన్నుతిన్ = స్తుతులు; చేయుచున్ = చేస్తూ; తండ్రిన్ = తండ్రిని; ఆత్మజుల్ = పిల్లలు; కరము = మిక్కిలి; అనురక్తిన్ = ప్రేమతో; పిల్చు = పిలిచే; గతిన్ = విధమును; కైకొని = స్వీకరించి; పిల్చినన్ = పిలువగా; వారు = వారు; నా = నాకు; సముల్ = సమానులు.
భావము:- బ్రాహ్మణోత్తములు ఎన్ని విధాలుగా తమను అవమానించినా చిరునవ్వుతోను సంతోషంతోను నిత్యం వారిని పూజిస్తూ, తండ్రిని కన్నకొడుకులు అనురాగపూర్వకంగా పిలిచే విధంగా మంచిమాటలతో వారిని గౌరవిస్తూ పిలిచేవారు నాతో సమానులౌతారు.

తెభా-3-564-క.
వినుఁ డయ్యనఘచరిత్రుల
యముఁ బ్రియతముఁడ నగుచు మ్ముడువోదున్
మును నన్ను భృగువు దన్నినఁ
లక పరితోషవృత్తి గైకొంటిఁ గదే.

టీక:- వినుడు = వినండి; ఆ = ఆ; అనఘ = పుణ్య; చరితుల = వర్తనుల; కున్ = కు; అనయమున్ = ఎల్లప్పుడును; ప్రియతముడన్ = మిక్కిలి ప్రీతి పాత్రుడను {ప్రియుడు - ప్రియతరుడు - ప్రియతముడు}; అగుచున్ = అవుతూ; అమ్ముడువోదున్ = స్వంతమై పోవుదును; మును = పూర్వము; నన్ను = నన్ను; భృగువు = భృగుమహర్షి; తన్నినన్ = (కాలితో) తన్నినప్పటికిని; కనలకన్ = కోపగింపక; పరితోష = సంతోష పూర్వక; వృత్తిన్ = విధానమున; కైకొంటిన్ = తీసుకొంటిని; కదే = కదా.
భావము:- వినండి. అటువంటి పుణ్యాత్ములకు నేను ఎప్పుడూ ప్రియతముడనై అమ్ముడుపోతూ ఉంటాను. పూర్వం భృగుమహర్షి నన్ను తన్నినా కోపించకుండా మిక్కిలి సంతోషంతో ఆదరించాను కదా!

తెభా-3-565-సీ.
పొలుచు నా మానసాంభోజాత భావంబు-
దెలియంగలేక యుద్వృత్తు లగుచుఁ
డఁగి నా యానతిఁ డచినఁ దద్దోష-
లము వీరలకు సంప్రాప్త మయ్యె
మునులార! నా చిత్తమున నున్న నీతియు-
నిట్టిద భూమిపైఁ బుట్టి వీర
చిరకాలమున నా యంతికంబున కోలి-
రుదెంచునట్లుగా నుమతింప

తెభా-3-565.1-తే.
లయు"నని యమ్ముకుందుడు లుకుటయును
విని మనంబున సనకాది మునివరేణ్యు
మ్మహాత్ముని మృదుల భాషామృతంబుఁ
విలి క్రోలియు రోష సంష్టు లగుచు.

టీక:- పొలుచు = ప్రకాశించు; నా = నా యొక్క; మానస = మానసము అను; అంభోజాత = పద్మమునందలి {అంభోజాతము -నీటిలో జాతము (పుట్టినది), పద్మము}; భావంబు = అభిప్రాయమును; తెలియంగ = తెలిసికొన; లేక = లేకపోవుటచే; ఉత్ = మిడిసిపడు; వృత్తులు = వర్తనలు కలవారు; అగుచున్ = అవుతూ; కడగి = చివరకు; నా = నా యొక్క; ఆనతిన్ = ఆజ్ఞను; కడచినన్ = దాటినట్టి; తత్ = ఆ; దోష = తప్పు యొక్క; ఫలమున్ = ఫలితము; వీరల = వీరి; కున్ = కి; సంప్రాప్తము = చక్కగ కలిగినది; అయ్యెన్ = అయినది; మునులార = మునులూ; నా = నా యొక్క; చిత్తమునన్ = మనసులో; ఉన్న = ఉన్నట్టి; నీతియున్ = న్యాయము కూడ; ఇట్టిద = ఇటువంటిదే; భూమి = భూమి; పైన్ = మీద; పుట్టి = పుట్టి; వీరలు = వీరు; అచిర = కొద్ది {అచిర - ఎక్కువ కానిది, కొద్ది}; కాలమునన్ = కాలములోనే; నా = నా యొక్క; అంతికంబునన్ = సమీపమున; కున్ = కి; ఓలిన్ = సురక్షితముగ; అరుగుదెంచున్ = తిరిగివచ్చు; అట్లుగా = విధముగా; అనుమతింపన్ = అంగీకరింప; వలయున్ = వలసినది; అని = అని;
ఆ = ఆ; ముకుందుడు = విష్ణుమూర్తి; పలుకుటయును = చెప్పుటను; విని = విని; మనంబునన్ = మనసులో; సనక = సనకుడు; ఆది = మొదలగు; ముని = మునులలో; వరేణ్యుల్ = శ్రేష్ఠులు; ఆ = ఆ; మహాత్మునిన్ = మహాత్ముడిని; మృదుల = మృదువైన; భాషా = పలుకులు అను; అమృతంబున్ = అమృతమును; తవిలి = ఆసక్తిగా; క్రోలియున్ = తాగినప్పటికిని; రోషన్ = రోషముచేత; సందష్టులు = బాగాకాటువేయబడినవారు; అగుచున్ = అవుతూ.
భావము:- మునులారా! నా హృదయకమలంలోని అభిప్రాయాన్ని వీళ్ళు తెలిసికొనలేక మీ ఆజ్ఞను మీరిన దోషానికి తగిలఫలాన్ని పొందారు. నా సంకల్పం కూడా ఇదే. వీళ్ళు భూమిపై పుట్టి కొద్దికాలంలోనే తిరిగి నా సమీపానికి వచ్చేటట్లు అనుమతించండి.” అని ఆ ముకుందుడు చెప్పగా విని సనకాది మునులు అతని సుకుమార వచనామృతాన్ని రుచిచూచి కూడా కోపాన్ని విడువలేనివారై...

తెభా-3-566-సీ.
మునివరుల్ తమచిత్తములఁ దృప్తిఁబొందక-
పంకజాతాక్షుఁడు లికినట్టి
రిమిత గంభీర హుళార్థ దురవగా-
ములను విస్ఫుర మృతతుల్య
మాధుర్య సుగుణ సన్వితమ్ములు విని-
ర్గత శబ్దదోష నికాయములును
నైన వాక్యములకు నాత్మలఁ బరితోష-
మంది యుల్లముల నెయ్యమున మనిచె

తెభా-3-566.1-తే.
నొడయఁ డిప్పుడు నందించియో తలంప
ర్థి నిందించియో మత్కృతైకదండ
ముకు సంకోచ మొందియో నుచు సంశ
యాత్ము లగుచు వివేకించి యంతలోన.

టీక:- ముని = మునులలో; వరుల్ = శ్రేష్ఠులు; తమ = తమ యొక్క; చిత్తములన్ = మనసులలో; తృప్తిన్ = తృప్తిని; పొందకన్ = పొందకుండగ; పంకజాతాక్షుడు = నారాయణుడు {పంకజాతాక్షుడు - పంకజాతము (పద్మము) వంటి కన్నులు ఉన్న వాడు, విష్ణువు}; పలికినన్ = పలికిన; అట్టి = అటువంటి; పరిమిత = చక్కగ మితమైనదియును; గంభీర = లోతైన; బహుళ = అనేక; అర్థ = అర్థములు కలిగి; దురవగాహములను = బోధపరచుకొనుటకు మిక్కిలి కష్టమైనవానినియును; విస్పురత్ = విశిష్టముగ స్పురించు; అమృత = అమృతముతో; తుల్య = సమానమగు; మాధుర్య = మధురమైనవియును; సుగుణ = సుగుణములు; సమన్వితములు = కలిగినవియును; వినిర్గత = వదలిపోయిన; శబ్ద = శబ్ద; దోష = దోషముల; నికాయమునున్ = సమూహముకలదియును; ఐన = అయినట్టి; వాక్యముల్ = మాటల; కున్ = కు; ఆత్మన్ = మనసులో; పరితోషము = సంతోషము; అంది = పొంది; ఉల్లములన్ = మనసులలో; నెయ్యమునన్ = స్నేహముతో; మనిచెన్ = మన్నించెను; ఒడయుడు = ప్రభువు; ఇప్పుడు = ఇప్పుడు;
నందించియో = సంతోషించియో; తలంపన్ = అలోచించిన; అర్థిన్ = కోరి; నిందించియో = తప్పుపట్టియో; మత్ = మాచే; కృత = చేసిన; ఏక = సమస్త; దండమున్ = దండనమున; కున్ = కు; సంకోచమున్ = సంకోచమును; ఒందియో = పొందియో; అనుచున్ = అనుకొనుచూ; సంశయ = సందేహపడు; ఆత్ములు = మనసుకలవారు; అగుచున్ = అవుతూ; వివేకించి = పరిశీలించి; అంతలోనన్ = ఇంతలోపల.
భావము:- సనకాది మునిశ్రేష్ఠుల మనస్సులు తృప్తిచెందలేదు. పరిమితంగా, గంభీరంగా, వివిధార్థాలతో అవగాహన కందక అమృతంతో సమానమై మాధుర్యగుణంతో కూడి, దోషరహితమైన ఆ మహావిష్ణువు మాటలకు మనస్సులో సంతోషించి “మన ప్రభువు ఇప్పుడు స్నేహంతో మనలను అభినందిస్తున్నాడో లేక నిందిస్తున్నాడో లేక మనము విధించిన శిక్షకు సంకోచిస్తున్నాడో తెలియదు” అనుకొంటూ వితర్కించుకొని అంతలోనే... హరి తమపై దయ కలిగి ఉన్నాడని అర్థం చేసికొని, కుతూహలంతో పులకించిన శరీరాలు కలవారై ఉత్కంఠతో సంతోషించి నుదుట చేతులు జోడించి....

తెభా-3-567-క.
లినాక్షుఁడు దమదెసఁ గృప
లిగిన భావంబుఁ దెలిసి కౌతుకమొలయం
బుకాంకితాంగులై యు
త్కలికన్ హర్షించి నిటలటితాంజలులై.

టీక:- నలినాక్షుడు = నారాయణుడు {నలినాక్షుడు - నలినము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు , విష్ణువు}; తమ = తమ; దెసన్ = వైపు; కృపన్ = దయ; కలిగిన = కలిగినట్టి; భావంబున్ = అభిప్రాయమును; తెలిసి = అర్థము చేసుకొని; కౌతుకమున్ = కుతూహలము; ఒలయన్ = పుట్టగా; పులకాకింత = పులకరించిన; అంగులు = దేహములు కలవారు; ఐన = అయ్యి; ఉత్కలికన్ = ఉత్కంఠముతో; హర్షించి = సంతోషించి; నిటల = నుదుట; ఘటిత = ఉంచిన; అంజలులు = చేమోడ్పులు కలవారు; ఐ = అయ్యి.
భావము:- హరి తమపై దయ కలిగి ఉన్నాడని అర్థం చేసికొని, కుతూహలంతో పులకించిన శరీరాలు కలవారై ఉత్కంఠతో సంతోషించి నుదుట చేతులు జోడించి....

తెభా-3-568-క.
రిత నిజ యోగమాయా
స్ఫుణం దనరారు నతివిభూతియు బలముం
మోత్కర్షముఁ గల యీ
శ్వరునకు నిట్లనిరి మునులు ద్వినయమునన్.

టీక:- భరిత = నిండైన; నిజ = తన; యోగమాయా = యోగమాయ యొక్క; స్ఫురణన్ = ప్రకటత్వముతో; తనరారు = విలసిల్లు; అతి = మహా; విభూతి = వైభవము; బలమున్ = బలమును; పరమ = అత్యధికమైన; ఉత్కర్షమున్ = శ్రైష్ఠ్యమును; కల = కలిగినట్టి; ఈశ్వరున్ = నారాయణున; కున్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి; మునులు = మునులు; సత్ = మంచి; వినయమునన్ = వినయముతో.
భావము:- స్వయంగా కల్పించుకున్న యోగామాయాప్రభావం వల్ల విలసిల్లే ఐశ్వర్యంతో పరాక్రమంతో సర్వోత్కృష్టుడైన విష్ణువుతో ఆ మునులు వినయంతో ఇట్లా అన్నారు.

తెభా-3-569-తే.
"పొలుపు దీపింప నిత్యవిభూతి నాయ
కుడవు భగవంతుడవు ననఘుడవు నీవు
త్కృతంబిప్డు నీకభిత మటంటి
వీశ భవదీయ చారిత్ర మెఱుఁగఁ దరమె.

టీక:- పొలుపున్ = చక్కగ; దీపింపన్ = ప్రకాశించు; నిత్య = శాశ్వత; విభూతి = ఐశ్వర్యము కల; నాయకుడవు = నడిపించువాడవు; భగవంతుడవు = మహిమాన్వితుడవు; అనఘుడవు = దోషము లేనివాడవు; నీవు = నీవు; మత్ = మాచేత; కృతంబు = చేయబడినది; ఇప్డు = ఇప్పుడు; నీకున్ = నీకు; అభిమతంబున్ = అంగీకారము; అటన్ = అని; అంటివి = అన్నావు; ఈశ = నారాయణ {ఈశ - ఈశ్వరుడు, విష్ణువు}; భవదీయ = నీ; చారిత్రమున్ = వర్తనలను; ఎఱుగన్ = తెలిసికొనుట; తరమే = సాధ్యమా ఏమి.
భావము:- “దేవా! తేజోవంతమైన నిత్యైశ్వర్యం కల నాయకుడవు, భగవంతుడవు, పుణ్యమూర్తివి. మేము చేసిన పని నీకు సమ్మతమే అన్నావు. నీ లీలలు తెలిసికొనడం ఎవరికి సాధ్యం?

తెభా-3-570-ఉ.
దేగణాళి కెల్లఁ పరదేవతలై తనరారు నట్టి వి
ప్రాలి కాత్మనాయకుఁడవై పెనుపొందిన నీకు నీ ధరా
దేత లెల్ల నెన్న నధిదేవత లైరఁట యెట్టి చోద్యమో?
దే! సమస్తపావన! సుధీజనతావన! విశ్వభావనా!

టీక:- దేవ = దేవతల; గణాళి = సమూహముల; కిన్ = కి; ఎల్లన్ = సమస్తమునకు; పర = ఉత్తమమైన; దేవతలు = దేవతలు; ఐ = అయ్యి; తనరారున్ = విజృంభించు; అట్టి = అటువంటి; విప్ర = బ్రాహ్మణుల; ఆవలి = సమూహముల; కిన్ = కి; ఆత్మ = స్వంత, మానసిక; నాయకుడవు = నాయకుడవు; ఐ = అయ్యి; పెనుపొందిన = అతిశయించిన; నీకున్ = నీకు; ఈ = ఈ; ధరాదేవతలు = బ్రాహ్మణులు {ధరాదేవతలు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; ఎల్లన్ = అందరును; ఎన్నన్ = ఎంచిచూసిన; అధిదేవతలు = పరదేవతలు; ఐరట = అయినారట; యెట్టి = ఏమి; చోద్యమో = విచిత్రమో కదా; దేవ = నారాయణ; సమస్తపావన = నారాయణ {సమస్త పావనుడు - సమస్తమును పావనము చేయువాడు, విష్ణువు}; సుధీజనతావన = నారాయణ {సుధీజనతావనుడు - సుధీ (మంచి)జనతా (జనుల యొక్క) అవనుడు (రక్షకుడు), విష్ణువు}; విశ్వభావనా = నారాయణ {విశ్వ భావనుడు - విశ్వము అను భావము తానైనవాడు, విష్ణువు}.
భావము:- దేవా! నీవు పరమపావనుడవు, సాధుజన రక్షకుడవు, సర్వజ్ఞుడవు. దేవతలందరికీ పరదేవతలైన బ్రాహ్మణుల ఆత్మలకు అధినాయడవైన నీకు ఆ బ్రాహ్మణులే అధిదేవత లైనారట. ఎంత చోద్యం!

తెభా-3-571-చ.
లదళాక్ష! నీవలన ల్గిన ధర్మము దావకావతా
ముల సురక్షితం బగుఁ దిరం బగు నీశ్వర! నిర్వికారత
త్వమునఁ దనర్చు నిన్నరయఁ త్ఫలరూపముఁ దత్ప్రధానగో
ప్యము నని పల్కుచుందురు కృపామయలోచన! పాపమోచనా!

టీక:- కమలదళాక్షా = నారాయణ {కమల దళాక్షుడు - కమలముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; నీ = నీ; వలన = వలన; కల్గిన = కలిగిన; ధర్మము = ధర్మము; తావక = నీ యొక్క; అవతారముల = అవతారముల వలన; సురక్షితంబున్ = బాగుగా రక్షింపబడినది; అగున్ = అగును; తిరంబు = స్థిరమైనది; అగు = అగును; ఈశ్వర = నారాయణుని {ఈశ్వరుడు - ప్రభుత్వము కలవాడు, విష్ణువు}; నిర్వికార = వికారరహితమైన {నిర్వికారము - వికారము (మార్పు) లేనిది}; తత్వమునన్ = లక్షణములతో; తనర్చు = ఉన్నతమైన; నిన్ను = నిన్ను; అరయన్ = పరిశీలించిచూడగా; తత్ = దాని; ఫల = ఫలితము యొక్క; రూపమున్ = స్వరూపమును; తత్ = దాని; ప్రధాన = ముఖ్య; గోప్యమున్ = రహస్యము; అని = అని; పల్కుచున్ = అనుచూ; ఉందురు = ఉందురు; కృపామయలోచన = నారాయణ {కృపా మయ లోచనుడు - కృప (దయ) మయ (తో) కూడిన లోచనుడు (కన్నులు కలవాడు, విష్ణువు}; పాపమోచన = నారాయణ {పాప మోచనుడు - పాపమునుండి మోచనుడు (ముక్తిని ప్రసాదించువాడు), విష్ణువు}.
భావము:- కమలనయనా! నీవలన ఉద్భవించిన ధర్మం నీ అవతారాల వల్ల కాపాడబడి సుస్థిరంగా ఉంటున్నది. దేవా! దయామయా! పాపవిమోచనా! మార్పు పొందని సత్యస్వరూపంతో ఉన్న నిన్ను గమనించిన పెద్దలు నీవే ఆ ధర్మానికి ఫలస్వరూపమనీ, ఆ ధర్మంలోని ప్రధాన రహస్యమనీ చెప్తూ ఉంటారు.

తెభా-3-572-చ.
హిఁ దలపోయ నెవ్వని సగ్ర పరిగ్రహమున్ లభింప ని
స్పృమతులై మునీశ్వరులు మృత్యు భయంబునఁ బాతు రట్టి స
న్మహిత వివేకశాలి! గుణమండన! నీ కిల నన్య సత్పరి
గ్ర మది యెట్టి చోద్యము జత్పరిపాలన! నిత్యఖేలనా!

టీక:- మహిన్ = భూమిన్; తలపోయన్ = పరిశీలించిన; ఎవ్వని = ఎవరి; సమగ్ర = సంపూర్ణమైన; పరిగ్రహమున్ = అనుగ్రహమును; లభింపంన్ = పొందగా; నిస్పృహ = విరక్తి కల, వైరాగ్యము కల; మతులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ముని = మునులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; మృత్యు = మరణ; భయంబునన్ = భయము నుండి; పాతురు = తొలగుదురో; అట్టి = అటువంటి; సన్మహితవివేకశాలి = నారాయణ {సన్మహిత వివేకశాలి - మంచి మరియు గొప్ప వివేకము కలవాడు, విష్ణువు}; గుణమండన = నారాయణ {గుణ మండనుడు - సుగుణములు అలంకారముగా కలవాడు, విష్ణువు}; నీకున్ = నీకు; ఇలన్ = భూమిమీద; అన్య = ఇతరుల; సత్పరిగ్రహము = అనుగ్రహమా; అది = అది; ఎట్టి = ఎలాంటి; చోద్యము = విచిత్రము; జగత్పరిపాలన = నారాయణ {జగ త్పరిపాలనుడు - జగత్ (విశ్వము)ను పరిపాలించువాడు, విష్ణువు}; నిత్యఖేలనా = నారాయణ {నిత్య ఖేలనుడు - నిత్య (శాశ్వతమైన) ఖేలన (వర్తన) కలవాడు, విష్ణువు}.
భావము:- దేవా! మంచి వివేకం కలవాడా! గుణభూషణా! లోకపాలకా! నిత్యవినోదీ! ఎవని సంపూర్ణ అనుగ్రహం పొంది మునీశ్వరులు కోరికలు లేనివారై మృత్యుభయాన్ని పోగొట్టుకుంటారో అటువంటి నీకు ఈ లోకంలో మరొకరి అనుగ్రహమా? ఎంత వింత!

తెభా-3-573-సీ.
తతంబు నర్థార్థిన శిరోలంకార-
దరేణువులు గల ద్మ నేడు
లజ కింజల్క నిష్యంద మరందలో-
భాగత భ్రమరనాకుని పగిది
న్యజనార్పితోదంచిత తులసికా-
దామంబునకు నిజధామ మగుచు
భాసిల్లు భవదీయ పాదారవిందముల్-
విలసితభక్తి సేవించు చుండి

తెభా-3-573.1-తే.
మలనయన! కృపావలోనము లొలయ
ర్థిఁ బొడసూపు భాగవతానురక్తిఁ
జేసి భవదీయ మహిమంబు చిత్ర మరయ
చిరశుభాకార! యిందిరాచిత్తచోర!

టీక:- సతతంబున్ = ఎల్లప్పుడును; అర్థ = కోరికలు; అర్థి = కోరునట్టి; జన = జనుల యొక్క; శిరస్ = శిరములకు; అలంకార = అలంకారములు అయిన; పద = పాదముల; రేణువులు = భూళి; కల = కలిగిన; పద్మ = లక్ష్మీదేవి; నేడు = ఈ దినము; జలజ = పద్మము {జలజము - జలమున పుట్టునది, పద్మము}; కింజల్క = కేసరములందు; నిష్యందమాన = చిందుతున్న; మరంద = తేనెలకై; లోభా = ఆశపడి; ఆగత = వచ్చిన; భ్రమర = తుమ్మెదల; నాయకుని = పురుషుని; పగిది = వలె; ధన్య = జన్మసార్థక్యతనుపొందిన; జన = జనులచే; అర్పిత = సమర్పింపబడి; ఉదంచిత = చక్కగా గౌరవింపబడిన; తులసికా = తులసీ; దామంబున్ = దండ; కున్ = కు; నిజ = స్వంత; ధామము = నివాసము; అగుచున్ = అవుతూ; భాసిల్లు = విరాజిల్లు; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడు; అరవిందముల్ = పద్మములు; విలసిత = ప్రకాశించు; భక్తి = భక్తితో; సేవించుచున్ = సేవిస్తూ; ఉండి = ఉండి;
కమలనయన = హరి {కమలనయనుడు - కమలముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; కృపా = దయ కల; అవలోకనములన్ = చూపులు; ఒలయన్ = చేరుటవలన, పడుటవలన; అర్థిన్ = కోరి; పొడసూపు = ఉదయించు; భాగవత = భగవత్భక్తుల ఎడ; అనురక్తిన్ = ప్రీతి; చేసి = వలన; భవదీయ = నీ యొక్క; మహిమంబు = గొప్పదనము; చిత్రము = విచిత్రము; అరయన్ = చూచుటకు; చిరశుభాకార = హరి {చిరశుభాకారుడు - చిర (మిక్కిలి) శుభమైన ఆకారము కలవాడు, విష్ణువు}; ఇందిరాచిత్తచోర = హరి {ఇందిరాచిత్తచోరుడు - ఇందిర (లక్ష్మీదేవి) చిత్తము (మనసును) చోరుడు (దోచుకొన్నవాడు), విష్ణువు}.
భావము:- లక్ష్మీదేవి పాదపద్మాలు ఎల్లప్పుడు సంపదలను కోరుకునే భక్తుల శిరస్సులకు అలంకారాలు. పద్మకేసరాలనుండి స్రవించే మకరందం మీది ఆశతో వచ్చే తుమ్మెదవలె ఆ లక్ష్మీదేవి భక్తజనులు అర్పించిన తులసిమాలలు కల నీ పాదపద్మాలను భక్తితో సేవిస్తూ ఉండగా....కృపాకటాక్షములు పొంగిపొరలగా పొడచూపే భాగవతులమీద అనురక్తి యొక్క నీ మహిమ గమనించుటకు బహు విచిత్రమైనది. కమలాక్షా! నిత్యశుభాకారా! లక్ష్మీమనోహరా! నీ మహిమ చిత్రమైనది.

తెభా-3-574-మ.
చిభాగ్యోదయ! దేవదేవ! లలితశ్రీవత్సలక్ష్మాంగ! యీ
విప్రానుపదైక పుణ్యరజ మే ర్ణింప నీ మేని కా
ణం బంటివి సర్వలోకులకు విప్రశ్రేణి మాహత్య మీ
వెఱుగం జెప్పుటకై ధరించితి గదా యెన్నం బవిత్రాకృతిన్.

టీక:- చిరభాగ్యోదయ = నారాయణ {చిర భాగ్యోదయ - చిర (మిక్కిలి) భాగ్య (భాగ్యములను) ఉదయ (కలిగించువాడు), విష్ణువు}; దేవదేవ = నారాయణ {దేవదేవుడు - దేవతలకే దేవుడు, విష్ణువు}; లలితశ్రీవత్సలక్ష్మాంగ = నారాయణ {లలిత శ్రీవత్స లక్ష్మాంగుడు - లలిత (సుందరమైన) శ్రీవత్సము అనెడి లక్ష్యము (పుట్టుమచ్చ కల) దేహము కలవాడు, విష్ణువు}; ఈ = ఈ; వర = శ్రేష్ఠమైన; విప్ర = బ్రాహ్మణుల; అనుపద = పాదములను అనసరించుట; ఏక = వలన; పుణ్య = పవిత్రమైన; రజమే = ధూళి మాత్రమే; వర్ణింపన్ = పరిశీలించిన; నీ = నీ యొక్క; మేని = శరీరమున; కిన్ = కి; ఆభరణంబున్ = అలంకారములు; అంటివి = అన్నావు; సర్వ = సమస్తమైన; లోకుల్ = జనుల; కున్ = కు; విప్ర = బ్రాహ్మణ; శ్రేణి = జాతి; మహత్యమున్ = గొప్పదనమును; ఈవున్ = నీవు; ఎఱుగన్ = తెలియునట్లు; చెప్పుట = చెప్పుట; కై = కొరకు; ధరించితి = ధరించినావు; కదా = కదా; ఎన్నన్ = ఎంచిచూసిన; పవిత్ర = పవిత్రమైన; ఆకృతిన్ = రూపమును.
భావము:- దేవదేవా! నీవు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడవు. అందమైన శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అలరారేవాడవు. “ఈ శ్రేష్ఠులైన బ్రాహ్మణుల పాదాలకు అంటిన పుణ్యపరాగమే నా శరీరానికి ఆభరణం” అన్నావు. సమస్తలోకులకు బ్రాహ్మణుల గొప్పతనాన్ని తెలియజేయడానికే గదా పవిత్రమైన ఆ రూపు ధరించావు.

తెభా-3-575-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక...

తెభా-3-576-సీ.
ర్మమూర్తివి జగత్కర్తవు నగు నీవు-
ప్రోవంగఁ దగువారిఁ బ్రోవవేని
విరళ వేదోక్త గు ధర్మమార్గమ-
న్మార్గ మగుఁ గాన త్త్త్వగుణ వి
శిష్టుండ వగుచు నీ జీవసంఘముసేమ-
రసి రక్షింతు నీ దైన శక్తి
చేను ధర్మవిఘాతుల దండించు-
నీకు సంచిత మైన నిగమధర్మ

తెభా-3-576.1-తే.
మార్గ నాశక విధములు దికి నింపు
గావు విప్రుల యందు సత్కరుణ మెఱసి
నతఁ బలికిన వినయవాక్యములు నీకు
యుక్త మగు చుండు సతతంబు క్తవరద!

టీక:- ధర్మ = ధర్మము; మూర్తివి = రూపము ధరించినవాడవు; జగత్ = విశ్వమును; కర్తవు = నిర్మించినవాడవు; అగు = అయిన; నీవు = నీవు; ప్రోవంగన్ = కాపాడబడుటకు; తగు = తగిన; వారిన్ = వారిని; ప్రోవవు = కాపాడకపోయిన; ఏనిన్ = ఎడల; అవిరళ = దట్టమైన; వేద = వేదములందు; ఉక్తము = చెప్పబడినది; అగు = అయిన; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గము = జీవన విధానము; అసత్ = చెడు; మార్గము = జీవన విధానము; అగున్ = అయిపోవును; కాన = కనుక; సత్త్వగుణ = సత్త్వగుణములుకల; విశిష్టుండవు = గొప్పవాడవు; అగుచున్ = అవుతూ; ఈ = ఈ; జీవ = జీవుల; సంఘము = సమూహము యొక్క; క్షేమమున్ = శుభమును; అరసి = కోరి, కనిపెట్టి; రక్షించు = కాపాడెదవు; నీది = నీది; ఐన = అయిన; శక్తి = శక్తి; చేతను = వలన; ధర్మ = ధర్మమునకు; ఘాతులన్ = హానిచేయువారిని; దండించు = శిక్షిస్తుండే; నీకున్ = నీకు; సంచితము = కూడబెట్టినది; ఐన = అయినట్టి; నిగమ = వేదముల; ధర్మ = ధర్మ; మార్గ = మార్గమునకు; నాశక = నాశనకరములైన; విధములు = విధానములు;
మదిన్ = మనసున; కిన్ = కి; ఇంపు = ఇష్టము; కావు = కావు; విప్రుల = బ్రాహ్మణుల; అందున్ = ఎడల; సత్ = మంచి; కరుణ = దయ; మెఱసి = ఉద్భవించి; ఘనతన్ = గొప్పగా; పలికిన = పలికినట్టి; వినయ = వినయ పూర్వక; వాక్యములున్ = మాటలు; నీకున్ = నీకు; యుక్తము = తగినవి; అగుచున్ = అయ్యి; ఉండున్ = అండును; సతతంబున్ = ఎల్లప్పుడును; భక్తవరద = విష్ణుమూర్తి {భక్తవరదుడు - భక్తులకు వరములను ప్రసాదించువాడు, భగవంతుడు}.
భావము:- నీవు ధర్మమూర్తివి, సమస్త విశ్వానికి కర్తవు. అటువంటి నీవు రక్షింపదగినవారిని రక్షించకపోతే వేదాలలో చెప్పిన ధర్మమార్గం అధర్మమార్గం అవుతుంది. కనుక సత్త్వగుణాన్ని స్వీకరించినవాడవై ఈ ప్రాణుల క్షేమాన్ని తెలుసుకొని రక్షిస్తావు. ధర్మద్రోహులను నీ దైవశక్తిచేత దండించే నీకు వేదధర్మ... మార్గాన్ని నాశనం చేసే పద్ధతులు ప్రియంకావు. బ్రాహ్మణులపై దయ కలిగి వినయంతో పల్మిన ఈ మాటలు భక్తవరుదుడవైన నీకు యుక్తమై ఉన్నాయి.

తెభా-3-577-వ.
అట్లయినఁ బరుల యెడ వినయంబులు వలికిన బ్రాభవహాని యగు నని తలంచితివేని.
టీక:- అట్లు = ఆవిధముగ; అయినన్ = అయితే; పరుల = ఇతరుల; ఎడ = విషయములో; వినయంబులున్ = వినయ పూర్వక వచనములు; పలికిన = పలికితే; ప్రాభవ = గొప్పదనమునకు; హాని = నష్టము; అగును = వాటిల్లును; అని = అని; తలంచితివి = అనుకొంటివి; ఏనిన్ = అయినప్పటికిని.
భావము:- ఆ విధంగా ఇతరులపట్ల వినయంతో మాట్లాడితే గౌరవానికి హాని అవుతుందని నీవు భావించినట్లైతే...

తెభా-3-578-తే.
విశ్వమున కెల్లఁ గర్తవు విశ్వనిధివి
విశ్వసంరక్షకుండ వై వెలయు నీకుఁ
డగిఁ బ్రాభవహాని యెక్కడిది దలఁప
వినయములు నీకు లీలలై వెలయుఁ గాన.

టీక:- విశ్వమున్ = లోకముల; కున్ = కి; ఎల్లన్ = సమస్తమునకు; కర్తవు = సృష్టించినవాడవు; విశ్వ = విశ్వమునకు; నిధివిన్ = నివాసమైనవాడవు; విశ్వ = విశ్వమునకు; సంరక్షకుడవు = చక్కగా కాపాడేవాడవు; ఐ = అయ్యి; వెలయు = విలసిల్లు; నీకున్ = నీకు; కడగి = ప్రయత్నించి; ప్రాభవ = గొప్పదనమునకు; హాని = నష్టము; ఎక్కడిది = ఎక్కడుంది; తలంపన్ = తరచిచూసిన; వినయములు = వినయపూర్వక విధానములు; నీకున్ = నీకు; లీలలు = లీలలు; ఐ = అయ్యి; వెలయున్ = విలసిల్లును; కాన = కాని.
భావము:- విశ్వానికి కర్తవూ, విశ్వమూర్తివీ, విశ్వరక్షకుడవూ అయి విరాజిల్లే నీకు గౌరవహాని ఎక్కడిది? ఈ వినయాలు నీ లీలావిలాసాలు కదా!

తెభా-3-579-తే.
మునుల మగు మమ్ము నతి మోదమునను నీవు
త్కరించుట లెల్ల సజ్జన పరిగ్ర
హార్థమై యుండుఁ గాదె మహాత్మ! యొకటి
విన్నవించెద మీ జయవిజయులకును.

టీక:- మునలము = మునులు అయినవారము; అగు = అయిన; మమ్మున్ = మమ్ములను; అతి = మిక్కిలి; మోదముననున్ = సంతోషకరముగ; నీవు = నీవు; సత్కరించుట = గౌరవించుట; ఎల్లన్ = అంతయు; సజ్జన = మంచివారిని; పరిగ్రహమున్ = అనుగ్రహించు; అర్థము = కొరకు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; కాదే = కదా; మహాత్మా = మహాత్ముడా, హరి {మహాత్ముడు - గొప్ప ఆత్మ కలవాడు, విష్ణువు}; ఒకటి = ఒక విషయము; విన్నవించెదము = మనవిచేసెదము; ఈ = ఈ; జయవిజయుల్ = జయవిజయులు {జయవిజయులు - వైకుంఠధాముని ద్వారపాలకులు}; కున్ = కి.
భావము:- మహానుభావా! మునులమైన మమ్ములను మిక్కిలి సంతోషంతో గౌరవించడం సజ్జనులను ఆదరించే నీ స్వభావం తప్ప మరొకటి కాదు. ఒక విన్నపం. ఈ జయ విజయులపై....

తెభా-3-580-తే.
లిగి యేము శపించితి మంతకంటె
బెడిద మగు నాజ్ఞసేయ నభీష్టమేని
జేయు మదికాక సమధికశ్రీ దనర్పఁ
జేసి రక్షించెదేని రక్షింపు మీశ!

టీక:- అలిగి = కోపించి; ఏము = మేము; శపించితిమి = శాపము ఇచ్చితిమి; అంతకంటె = అంతకుమించి; బెడిదము = కఠినము; అగు = అయిన; ఆజ్ఞన్ = దండనమును; చేయన్ = చేయవలెనని; అభీష్టము = అభిప్రాయము; ఏనిన్ = కలిగిన; చేయుము = (అటులనే) చేయుము; అది = అది; కాక = కానిచో; సమధిక = మిక్కిలి; శ్రీన్ = సంపదను; తనర్పన్ = అతిశయించునట్లు; చేసి = చేసి; రక్షించెద = కాపాడెదవు; ఏనిన్ = అయినచో; రక్షింపుము = కాపాడుము; ఈశ = భగవంతుడా {ఈశ - ఈశ్వరుడు, విష్ణువు}.
భావము:- మేము వీరిని శపించాము. దేవా! అంతకంటె కఠినంగా శిక్షించాలనుకుంటే నీ ఇష్టం. అలాకాక అధిక సంపదలిచ్చి రక్షించాలనుకుంటే రక్షించు.

తెభా-3-581-వ.
అట్లయిన మాకుం బ్రియం బగుం గావున ననపరాధులు నతి నిర్మలాంతఃకరణులు నైన వీరలకు ననృతంబులు పలికితి మేని మమ్మయినం జిత్తంబు కొలది నాజ్ఞాపింపు"మని కరకమలంబులు మొగిచి కృతాంజలులై యున్న మునులం గరుణార్ద్ర దృష్టిం గనుంగొని.
టీక:- అట్లు = ఆవిధముగ; అయినన్ = అయినా; మాకున్ = మాకు; ప్రియంబున్ = ఇష్టమే; అగున్ = అవును; కావున = అందుచేత; అనపరాధులన్ = తప్పుచేయనివారిని; అతి = మిక్కిలి; నిర్మల = స్వచ్ఛమైన; అంతఃకరణులు = మనసులు కలవారు; ఐనన్ = అయిన; వీరల = వీరి; కున్ = కి; అనృతంబులున్ = అసత్యములు; పలికితిమి = పలికినట్టి వారము; ఏనిన్ = అయినచో; మమ్మున్ = మమ్మలను; అయినన్ = అయినాసరే; చిత్తంబు = తోచిన; కొలది = అంత; ఆజ్ఞాపింపుము = దండించుము; అని = అని; కర = చేతులు అను; కమలంబులున్ = పద్మములను; మొగిచి = జోడించి; కృత = చేసిన; అంజలులు = అంజలిఘటించినవారు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; మునులన్ = మునులను; కరుణా = దయచేత; ఆర్థ్ర = తడియైన; దృష్టిన్ = చూపులతో; కనుంగొని = చూసి.
భావము:- నీవు ఎలా చేసినా మాకు ఇష్టమే కనుక నిర్దోషులూ, నిష్కల్మష హృదయులూ ఐన ఈ జయవిజయులను మేము అనరాని మాటలు అని ఉంటే మమ్మల్నయినా నీ ఇష్టం వచ్చినట్లు శిక్షించు” అని చేతులు జోడించి నమస్కరించిన సనకాది మునులను దయతో చూచి...

తెభా-3-582-క.
ఘుఁడు భగవంతుం డి
ట్లనియెన్ "మునులార! వీర లరన్ భువికిం
ని యచట నసురయోనిన్
నియింతురు లోభ మోహ సంగతు లగుచున్.

టీక:- అనఘుడు = పుణ్యుడు {అనఘుడు - పాపములు లేనివాడు, విష్ణువు}; భగవంతుడు = హరి {భగవంతుడు - మహిమ కలవాడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; మునులార = ఓ మునులు అయినవారా; వీరలు = వీరు; అలరన్ = తగినట్లు; భువికిన్ = భూలోకమునకు; చని = వెళ్ళి; అచటన్ = అక్కడ; అసుర = రాక్షస; యోనిన్ = గర్భమున; జనియింతురు = పుట్టెదరు; లోభ = లోభము; మోహ = మోహములతో; సంగతులు = కూడినవారు; అగుచున్ = అవుతూ.
భావము:- పుణ్యాత్ముడైన భగవంతుడు ఇలా అన్నాడు “మునులారా! ఈ జయవిజయులు భూలోకానికి వెళ్ళి అక్కడ లోభమోహాలు కలవారై రాక్షసులై జన్మిస్తారు.

తెభా-3-583-క.
దేజనావళి కుపహతిఁ
గావించుచు నిఖిల భువనకంటక వృత్తిన్
జీవించుచు నా యెడ సం
భావిత వైరానుబంధ భావులు నగుచున్.

టీక:- దేవ = దేవతా; జన = జనులకు; ఆవళి = సమూహమున; కున్ = కు; ఉపహతి = ఆపదలు; కావించుచున్ = కలుగజేస్తూ; నిఖిల = సమస్తమైన; భువన = లోకములకును; కంటక = ముల్లులా బాధపెట్టు; వృత్తిన్ = విధముగ; జీవించుచున్ = జీవిస్తూ; నా = నా; ఎడన్ = అందు; సంభావిత = పెంచుకొన్న; వైర = శత్రుత్వమను; అనుబంధ = అనబంధముతో కూడిన; భావులు = భావములు కలవారు; అగుచున్ = అవుతూ;
భావము:- దేవతలకు అపకారం చేస్తూ సర్వలోక కంటకులై జీవిస్తూ నాపట్ల వైరభావం కలవారై....

తెభా-3-584-క.
వముఖమున నను నతి
సాసమున నెదిరి పోరి క్రనిశితధా
రాతిఁ దెగి వచ్చెదరు
త్సా మెలర్పంగ నాదు న్నిధి కంతన్.

టీక:- ఆహవము = యుద్ధ; ముఖమునన్ = భూమిఅందు; ననున్ = నన్ను; అతి = మిక్కిలి; సాహసమునన్ = సాహసముతో; ఎదిరి = ఎదిరించి; పోరి = యుద్ధముచేసి; చక్ర = చక్రముయొక్క; నిశిత = వాడియైన; ధారా = అంచుచేత; హతిన్ = దెబ్బతిని; తెగి = మరణించి; వచ్చెదరు = తిరిగివచ్చెదరు; ఉత్సాహము = సంతోషము; ఎలర్పన్ = అతిశయిస్తుండగా; నాదు = నా యొక్క; సన్నిధిన్ = సామీప్యమున; కిన్ = కి; అంతన్ = అంతట.
భావము:- ఎంతో సాహసంతో నన్నెదిరించి నాతో యుద్ధం చేసి నా సుదర్శన చక్రం చేత మరణించి తిరిగి సంతోషంతో నా సన్నిధికి చేరుతారు.

తెభా-3-585-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతే కాక...

తెభా-3-586-క.
ను వైరంబున నైనను
మునఁ దలఁచుటను నా సక్షమున మదా
మీక్షించుచు నీల్గుట
ఘాత్మకులై వసింతు స్మత్పదవిన్.

టీక:- ననున్ = నన్ను; వైరంబునన్ = శత్రుత్వముతో; ఐనను = అయినప్పటికిని; మనమునన్ = మనసులో; తలచుటను = భావించుటవలననూ; నా = నా యొక్క; సమక్షమునన్ = కంటికెదురుగా; మత్ = నా యొక్క; ఆననమున్ = మోమును; ఈక్షించుచున్ = చూస్తూ; నీల్గుటన్ = మరణించుటచేతను; అనఘాత్ములు = పుణ్యాత్ములు; ఐ = అయ్యి; వసింతురు = ఉండెదరు; అస్మత్ = నా యొక్క; పదవిన్ = స్థితియందు (సాయుజ్యమున ఉందురు).
భావము:- నన్ను విరోధంచేతనైనా తమ మనస్సులలో భావించడంవల్లనూ, నా సమక్షంలో నా ముఖాన్ని చూస్తూ మరణించడం వల్లనూ వీళ్ళు పుణ్యాత్ములై నా ఆస్థానంలో నివస్తిస్తారు.

తెభా-3-587-క.
వినుఁ డిలమీదఁ ని కెన్నఁటి
కిని బుట్టువు లేదు వీరికిని మీరలు ప
ల్కియట్ల నాదు చిత్తము
ను దలఁతుం గాన మీ మనంబుల నింకన్

టీక:- వినుడు = వినండి; ఇల = భూలోకము; మీదన్ = అందు; ఇకన్ = ఇంక; ఎన్నటికిని = ఎప్పటికిని; పుట్టువు = పుట్టుట; లేదు = ఉండదు; వీరి = వీరి; కిని = కి; మీరలు = మీరు; పల్కిన = పలికిన; అట్ల = విధముగ; నాదు = నా యొక్క; చిత్తమునను = మనసులో; తలంతున్ = భావించెదను; కానన్ = కావున; మీ = మీ యొక్క; మనంబులన్ = మనసులో; ఇంకన్ = ఇంక.
భావము:- ఓ మునులారా! వినండి. ఆ తరువాత ఎన్నటికీ వీళ్ళు భూమిమీద జన్మించరు. మీరు చెప్పినట్లే నేను ఆలోచించాను. కనుక ఇక మీ మనస్సులలో....

తెభా-3-588-ఉ.
దీనికిఁ జింతఁ దక్కుఁడు సుధీజనపుంగవు!"లన్నఁ బ్రీతులై
యా లినాసనాత్మజు లనంతుని భావము దా మెఱింగి పెం
పూనిన వేడ్కఁ దేలి తెలివొందిన చిత్తములన్ నుతించి రం
భోనిధిశాయి! నార్తజనపోషణ భూషణుఁ! బాపశోషణున్

టీక:- దీని = దీని; కిన్ = కి; చింత = దుఃఖమును; తక్కుడు = వదలుడు; సు = మంచి; ధీ = మనసుకల; జన = జనులలో; పుంగవులు = శ్రేష్ఠులు; అన్నన్ = అనగా; ప్రీతులు = సంతోషించినవారు; ఐ = అయ్యి; ఆ = ఆ; నలినాసన = బ్రహ్మదేవుని {నలి నాసనుడు - నలినము (పద్మము)న ఆసీనుడు (ఉండువాడు), బ్రహ్మదేవుడు}; ఆత్మజులు = పుత్రులు; అనంతుని = హరి యొక్క {అనంతుడు - అంతము లేని వాడు, విష్ణువు}; భావమున్ = ఉద్దేశ్యమును; తాము = తాము; ఎఱింగి = తెలుసుకొని; పెంపు = అతిశయమును; పూనిన = పొందిన; వేడ్కన్ = ఉత్సాహమున; తేలి = పరవశించి; తెలివి = గ్రహింపు; పొందిన = పొందినట్టి; చిత్తములన్ = మనసులతో; నుతించిరి = స్తుతించిరి; అంభోనిధిశాయిన్ = హరిని {అంభోనిధి శాయి - అంభోనిధి (సముద్రము)న శయనించువాడు, విష్ణువు}; ఆర్తజనపోషణున్ = హరిని {ఆర్తజన పోషణుడు - ఆర్తి కల జనులను పోషించు (కాపాడు) వాడు, విష్ణువు}; పాపశోషణున్ = హరిని {పాప శోషణుడు - పాపములను శోషణము (ఆవిరి చేయు) వాడు, విష్ణువు};
భావము:- దీనికోసం చింతించకండి.” అని విష్ణువు చెప్పగా బ్రహ్మపుత్రులైన ఆ సనక సనందాదులు అనంతుడైన శ్రీహరి భావాన్ని తెలుసుకొని అధికమైన ఆనందంలో తేలి ప్రసన్న హృదయాలతో క్షీరసాగర శయనుడూ, ఆర్తజనులను రక్షించడమే అలంకారంగా గలవాడూ, పాపాలను రూపు మాపేవాడూ అయిన శ్రీహరిని స్తుతించారు.

తెభా-3-589-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకనూ.
భావము:- ఇంకా...

తెభా-3-590-ఉ.
నకాదు లంతఁ బులకాంకురముల్ ననలొత్త బాష్పధా
రా సుభగాక్షులై మునిశణ్యవరేణ్యు నగణ్యు దేవతా
గ్రేరు దివ్యమంగళశరీరముఁ జారు తదీయ ధామమున్
భాసుర లీలఁ జూచి నవద్మదళాక్షునకున్ వినమ్రులై.

టీక:- ఆ = ఆ; సనక = సనకుడు; ఆదులు = మొదలగువారు; అంతన్ = అంతట; పులకాంకురముల్ = పులకింతలు; ననలొత్త = చిగురించగా; బాష్ప = కన్నీటి; ధారా = ధారలతో; సుభగ = సౌభాగ్యముచెందిన; అక్షులు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; మునిశరణ్యవరేణ్యున్ = హరిని {ముని శరణ్య వరేణ్యుడు - మునులకు రక్షణ ఒసగు శ్రేష్ఠుడు, విష్ణువు}; అగణ్యున్ = హరిని {అగణ్యుడు - ఇంతవాడని గణించుటకు అందని వాడు, విష్ణువు}; దేవతాగ్రేసరున్ = హరియొక్క {దేవ తాగ్రేసరుడు - దేవతలలో గొప్పవాడు, విష్ణువు}; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; శరీరమున్ = దేహమును, విగ్రహమును; చారు = మనోహరమైన; తదీయ = అతని; ధామమున్ = నివాసమును (వైకుంఠమును); భాసుర = చక్కటి; లీలన్ = విధముగ; చూచి = చూసి; నవపద్మదళాక్షున్ = భగవంతుని {నవ పద్మద ళాక్షుడు - నవ (లేత) పద్మముల వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; కున్ = కి; వినమ్రులు = మిక్కిలి వినయము కలవారు; ఐ = అయ్యి.
భావము:- అప్పుడా సనకాదులు పులకింత మొలకెత్తగా, ఆనందబాష్ప ధారలు కనులవెంట ప్రవహించగా మునులు శరణు కోరే ఉత్తముడూ, ఇంతవాడని అంతవాడని లెక్కింపరానివాడూ, దేవతలలో శ్రేష్ఠుడూ అయిన విష్ణువుయొక్క దివ్యమంగళ శరీరాన్ని, అతని వైకుంఠ మందిరాన్ని సందర్శించి క్రొంగ్రొత్త తామర రేకులవంటి కన్నులు గల అతనికి నమస్కరించి...

తెభా-3-591-క.
పలికిన భాషణములు
లోదరు భాషణములుగా దలఁచుచు నె
య్యమునన్ వైష్ణవలక్ష్మిం
బ్రదంబునఁ బ్రస్తుతించి రమేశ్వరుచేన్.

టీక:- తమ = తాము; పలికిన = పలికినట్టి; భాషణములు = మాటలు; కమలోదరు = నారాయణుని {కమలోదరుడు - కమలము ఉదరము (పొట్ట)న కలవాడు, విష్ణువు}; భాషణములు = మాటలు; కాన్ = అగుటను; తలచుచు = అనుకొనుచు; నెయ్యమునన్ = స్నేహపూర్వకముగ; వైష్ణవ = విష్ణుదేవుని; లక్ష్మిన్ = ఐశ్వర్యమును; ప్రమదంబునన్ = సంతోషముతో; ప్రస్తుతించి = చక్కగా కీర్తించి; పరమేశ్వరు = భగవంతుని {పరమేశ్వరుడు - పరమ (అత్యుత్తమ) ఈశ్వరుడు (ఫ్రభువు), విష్ణువు}; చేన్ = చేత.
భావము:- తాము మాట్లాడిన మాటలను విష్ణువు మాటలుగా భావిస్తూ స్నేహభావంతో విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని స్తుంతించి, ఆ శ్రీహరిచేత....

తెభా-3-592-క.
మంత్రితులై తగ నిజ
ధాములకుఁ జనిరి వారు డయక లక్ష్మీ
కాముడు జయవిజయుల నభి
రామంబుగఁ జూచి పలికె య మొప్పారన్.

టీక:- ఆమంత్రితులు = అనుజ్ఞ పొందినవారు; ఐ = అయ్యి; తగన్ = చక్కగా; నిజ = తమ; ధామముల్ = నివాసములు; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; వారు = వారు; తడయక = ఆలస్యము చేయకుండగ; లక్ష్మీకాముడు = విష్ణుమూర్తి {లక్ష్మీ కాముడు - లక్ష్మీదేవిచే కాముడు (కోరబడువాడు), విష్ణువు}; జయవిజయులన్ = జయవిజయులని; అభిరామంబుగ = అభిమానముగా; చూచి = చూసి; పలికెన్ = పలికెను; రయము = వేగము; ఒప్పారన్ = ఒప్పునట్లు.
భావము:- అనుజ్ఞ పొందినవారై ఆ సనకాదులు తమ నివాసాలకు వెళ్ళారు. శ్రీనాథుడు జయవిజయులను దయతో చూసి వెంటనే ఇలా అన్నాడు.

తెభా-3-593-క.
"మీ సురయోని యం దని
వారితులై జనన మందలసెను నే దు
ర్వా బలాఢ్యుడ నయ్యును
వారింపగనోప విప్రచనము లెందున్.

టీక:- మీరు = మీరు; అసుర = రాక్షసుల; యోనిన్ = గర్భము; అందు = అందు; అనివారితులు = వారింపరానివారు; ఐ = అయ్యి; జననము = పుట్టుక; అంద = పొంద; వలసెను = వలసినదే; నేన్ = నేను; దుర్వార = నివారింపరాని; బల = బలము కలవారిలో; ఆఢ్యుడను = అధికుడను; అయ్యున్ = అయినప్పటికిని; వారింపగన్ = వారించుటకు; ఓపన్ = సమర్థుడను కాను; విప్ర = బ్రాహ్మణుల; వచనములు = మాటలను; ఎందున్ = ఎందులోనైనసరే.
భావము:- “మీరు తప్పనిసరిగా రాక్షసజాతిలో పుట్టవలసి వచ్చింది. నేను అడ్డులేని శక్తిసామర్థ్యాలు ఉన్నవాడనైనా బ్రాహ్మణుల శాపాన్ని నివారించలేను.

తెభా-3-594-క.
దిగాన దనుజయోనిం
పడి జనియించి మద్విక్షులరై మీ
ది నెపుడు నన్నె తలఁచుచు
లక నా చేతఁ జచ్చి చ్చెద రిటకున్.

టీక:- అదిగాన = అందుచేత; దనుజ = రాక్షస; యోనిన్ = గర్భమున; పదపడి = వెంటనే; జనియించి = పుట్టి; మత్ = నా యొక్క; విపక్షులరు = శత్రుపక్షమువారు; ఐ = అయ్యి; మీ = మీ యొక్క; మదిన్ = మనసులో; ఎప్పుడు = ఎల్లప్పుడు; నన్నె = నన్ను మాత్రమే; తలంచుచు = తలచుకొనుచు; వదలక = తప్పక; నా = నా యొక్క; చేతన్ = చేతులలో; చచ్చి = మరణించి; వచ్చెదరు = తిరిగి వచ్చెదరు; ఇటకున్ = ఇక్కడకు.
భావము:- అందువల్ల మీరు వెంటనే రాక్షసులై జన్మించి నాకు శత్రువులై మీ మనస్సులలో ఎల్లప్పుడు నన్నే స్మరిస్తూ నాచేత మరణించి ఇక్కడికి వస్తారు.

తెభా-3-595-ఉ.
పొం"ని యానతిచ్చి హరి ఫుల్లసరోరుహపత్రనేత్రుఁ డా
ఖంలముఖ్య దిగ్వరనికాయకిరీట లసన్మణిప్రభా
మండిత పాదపీఠుఁడు రమారమణీమణితోడ నేగుదే
నిండిన వేడ్క నేఁగె నిజనిర్మలపుణ్యనివాసభూమికిన్.

టీక:- పొండు = వెళ్ళండి; అని = అని; ఆనతి = అనుజ్ఞ; ఇచ్చి = ఇచ్చి; హరి = నారాయణుడు; ఫుల్లసరోరుహపత్రనేత్రుఁడు = నారాయణుడు {ఫుల్ల సరోరుహపత్ర నేత్రుఁడు - ఫుల్లన్ (వికసించిన) సరోరుహ పత్రము (పద్మము రేకు)లవంటి నేత్రుడు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు}; ఆఖండలముఖ్యదిగ్వరనికాయకిరీటలసన్మణిప్రభామండితపాదపీఠుఁడు = నారాయణుడు {ఆఖండల ముఖ్య దిగ్వర నికాయ కిరీటల సన్మణి ప్రభా మండిత పాదపీఠుఁడు - ఆఖండల (ఇంద్రుడు) ముఖ్య (మొదలగు) దిక్ (దిక్కులకి) గర్వ (పాలితుల) నికాయ (సమూహము) యొక్క కిరీటములందు లసత్ (ప్రకాశించుచున్న) మణుల యొక్క ప్రభా (వెలుగు) లతో మండితుడు (అలంకరింపబడిన) పాదపీఠము కలవాడు, విష్ణువు}; రమారమణీమణి = లక్ష్మీదేవి {రమారమణీమణి - రమ (లక్ష్మీ) అను రమణీ (స్త్రీలలో) మణి (ఉత్తమురాలు), లక్ష్మీదేవి}; తోడన్ = కూడా; ఏగుదేన్ = రాగా; నిండిన = సంపూర్తి; వేడ్కన్ = విలాసముతో; ఏగెన్ = వెళ్ళెను; నిజ = తన; నిర్మల = స్వచ్ఛమైన; పుణ్య = పుణ్యవంతమైన; నివాస = నివసించు; భూమి = ప్రదేశమున; కిన్ = కు.
భావము:- “వెళ్ళండి” అని ఆజ్ఞాపించి వికసించిన పద్మపత్రాలవంటి కన్నులు కలవాడూ, ఇంద్రాది దిక్పాలకుల కిరీటాలలోని మణులచేత ప్రకాశించే పాదపీఠం కలవాడూ అయిన హరి లక్ష్మీదేవి వెంటరాగా సంతోషంతో తన నిర్మల పుణ్య మందిరానికి వెళ్ళాడు.

తెభా-3-596-వ.
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- అప్పుడు...

తెభా-3-597-క.
ని తేజో హానిగ జయ
వియులు ధరఁ గూలి రపుడు విహ్వలు లగుచుం
ద్రిగముల సురవిమాన
వ్రముల హాహారవంబు గ్రందుగఁ జెలగన్.

టీక:- నిజ = తమ; తేజస్ = తేజస్సునకు; హానిగన్ = నష్టము కాగా; జయవిజయులు = జయవిజయులు; ధరన్ = భూమిపైన; కూలిరి = పడిరి; అప్పుడు = అప్పుడు; విహ్వలులు = మిక్కిలి భయము కలవారు; అగుచున్ = అవుతూ; త్రి = మూడు; జగముల = లోకములలోని; సుర = దేవతల; విమాన = విమానము లందలి; వ్రజముల = సమూహములలోను; హాహా = హాహా అనెడి; రవంబున్ = స్వరములు; క్రందుగ = గట్టిగా; చెలగన్ = చెలరేగగా.
భావము:- జయవిజయులు తమ తేజస్సును కోల్పోయి నిశ్చేష్టులై నేల కూలారు. ముల్లోకాలలోను, దేవతా విమానాలలోను హాహాకారాలు చెలరేగాయి.

తెభా-3-598-క.
వాలె యా దితిగర్భా
గారంబున నున్నవారు డగి తదీయో
దా ఘన తేజ మిపు డని
వాణ మీ తేజ మెల్ల మ్ముగఁ జేసెన్.

టీక:- వారలె = వారె; ఆ = ఆ; దితి = దితి యొక్క; గర్భా = గర్భము యొక్క; ఆగారంబునన్ = గృహములో; ఉన్నవారు = ఉన్నట్టివారు; కడగి = పూని; తదీయ = వారి; ఉదార = మిక్కిలి; ఘన = గొప్ప; తేజము = తేజస్సు; ఇపుడు = ఇప్పుడు; అనివారణన్ = నివారింపరానిదై; మీ = మీ యొక్క; తేజము = తేజస్సులు; ఎల్లన్ = సమస్తమును; వమ్ముగన్ = వ్యర్థ మగు నట్లు; చేసెన్ = చేసెను.
భావము:- ఆ జయవిజయులే ఇప్పుడు దితి గర్భంలో ఉన్నారు. వారి సాటిలేని మేటి తేజస్సే మీ తేజస్సు లన్నిటినీ వమ్ము చేసింది.

తెభా-3-599-ఉ.
ఇంకు మూల మా హరి రమేశ్వరుఁ డర్థి నొనర్చు కార్యముల్
వింలె సర్వభూత భవ వృద్ధి వినాశన హేతుభూతుఁ డా
ద్యం వికార శూన్యుఁడు దయానిధి మీ యెడ మేలుసేయు నీ
చిం దొఱంగి వేచనుఁడు చేకుఱు మీకు మనోరథార్థముల్."

టీక:- ఇంతకున్ = దీనికంతకు; మూలము = మూలకారణము; ఆ = ఆ; హరి = విష్ణుమూర్తి; రమేశ్వరుడు = విష్ణుమూర్తి {రమేశ్వరుడు - రమ (లక్ష్మీదేవి) యొక్క ఈశ్వరుడు (భర్త), విష్ణువు}; అర్థిన్ = కోరి; ఒనర్చు = చేయు; కార్యముల్ = పనులు; వింతలె = వింతలా ఏమి; సర్వభూతభవవృద్ధివినాశనహేతుభూతుఁడు = విష్ణుమూర్తి {సర్వ భూత భవ వృద్ధి వినాశన హేతుభూతుఁడు - సర్వమైన భూతముల యొక్క భవ (సృష్టి) వృద్ధి ( స్థితి) నాశన (లయము) లకు మూలకారణమైనవాడు, విష్ణువు}; ఆద్యంతవికారశూన్యుఁడు = విష్ణుమూర్తి {ఆద్యంత వికార శూన్యుఁడు - అది (మొదలు) కాని అంతము (నాశనము) కాని వికార (మార్పులు) కాని శూన్యుడు (లేనివాడు), విష్ణువు}; దయానిధి = విష్ణుమూర్తి {దయానిధి - కృపకు సముద్రము వంటివాడు, విష్ణువు}; మీ = మీ; ఎడన్ = అందు; మేలు = మంచి; చేయున్ = చేయును; ఈ = ఈ; చింత = దుఃఖమును; తొఱంగి = విడిచి; వేచనుడు = వేగముగా వెళ్లండి; చేకూఱు = సమకూరును; మీకు = మీకు; మనో = మనసున; రథ = తిరుగుతున్న; అర్థముల్ = కోరికలు.
భావము:- దీని కంతా ప్రధానకారణం ఆ హరి. ఆ శ్రీనాథుని లీలలు వింతగా ఉంటాయి. సమస్త జీవరాసుల వృద్ధిక్షయాలకు కారణమైనవాడూ, ఆది అంతం అనే వికారాలు లేనివాడూ, దయకు నిలయమైనవాడూ అయిన విష్ణువు మీకు మేలు చేస్తాడు. ఈ విచారం వదలిపెట్టి వెళ్ళండి. మీ కోరికలు తీరుతాయి.”

తెభా-3-600-క.
ని వనజాసనుఁ డాడిన
విని తద్వృత్తాంత మెఱిఁగి విబుధులు నాకం
బు కేఁగిరి దితి నిజనా
థుని మాటలు దలఁచి యపరితోషముతోడన్.

టీక:- అని = అని; వనజాసనుడు = బ్రహ్మదేవుడు {వనజాసనుడు - వనజము (పద్మము) న ఆసనుడు (ఆసీనుడై ఉన్నవాడు), బ్రహ్మదేవుడు}; ఆడిన = పలుకగా; విని = విన్నవారై; తత్ = ఆ; వృత్తాంతము = విషయము; ఎఱిగి = తెలిసి; విబుధుల్ = దేవతలు; నాకంబున్ = స్వర్గమున; కున్ = కు; ఏగిరి = వెళ్లిరి; దితి = దితి; నిజ = తన; నాధుని = భర్త యొక్క; మాటలు = మాటలు; తలచి = తలచుకొని; అపరితోషము = అసంతుష్టి; తోడన్ = తోటి.
భావము:- అని బ్రహ్మదేవుడు చెప్పగా విని దేవతలు ఆ వృత్తాంతాన్ని అర్థం చేసుకొని స్వర్గలోకానికి వెళ్ళి పోయారు. దితి తన భర్త మాటలను తలచుకొని అసంతృప్తి చెందింది.