Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/విష్ణు సర్వాంగస్తోత్రంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-922-సీ.
ళ దరవింద సుంర పత్రరుచిరాక్షు-
లలిత శ్రీవత్సలితవక్షు
నీలనీరద నీలనీలోత్పలశ్యాము-
లికులాకుల మాలికాభిరాముఁ
గౌస్తుభకలిత ముక్తాహారయుతకంఠు-
యోగిమానస పంకజోపకంఠు
తప్రసన్నసస్మి వదనాంభోజు-
దినకరకోటి సందీప్తతేజు

తెభా-3-922.1-తే.
లలితానర్ఘ్య రత్న కుంల కిరీట
హా కంకణ కటక కేయూ ముద్రి
కాతులాకోటి భూషు భక్తప్రపోషుఁ
గింకిణీయుత మేఖలాకీర్ణజఘను.

టీక:- దళదరవిందసుందరపత్రరుచిరాక్షున్ = విష్ణుమూర్తిని {దళదరవిందసుందరపత్రరుచిరాక్షుడు - దళత్ (విచ్చుకొనుచున్న) అరవింద (పద్మముల) సుందర (అందమైన) పత్ర (రేకుల వంటి) రుచిర( ప్రకాశమైన) అక్షుడు (కన్నులు కలవాడు) , విష్ణువు}; సలలితశ్రీవత్సకలితవక్షున్ = విష్ణుమూర్తిని {సలలితశ్రీవత్సకలితవక్షుడు - సలలిత (అందమైన) శ్రీవత్స (శ్రీవత్సము అనెడి పుట్టుమచ్చ) కలిత (కలిగిన) వక్షున్ (వక్షస్థలము కలవాడు) , విష్ణువు}; నీలనీరదనీలనీలోత్పలశ్యామున్ = విష్ణుమూర్తిని {నీలనీరదనీలనీలోత్పలశ్యాముడు - నీల (నల్లని) నీరద (మబ్బు వలెను) నీల (నల్లని) నీలోత్పల (నల్లకలువ వలెను) శ్యాముడు (నల్లగా ఉన్నవాడు) , విష్ణువు}; అలికులాకులమాలికాభిరామున్ = విష్ణుమూర్తిని {అలికులాకులమాలికాభిరాముఁడు- అలి (తుమ్మెదల) కుల (సమూహము వంటి)అలక( ముంగురుల) మాలికా (గుంపులచే) అభిరాముడు (చక్కనైన వాడు), విష్ణువు}; కౌస్తుభకలితముక్తాహారయుతకంఠున్ = విష్ణుమూర్తిని {కౌస్తుభకలితముక్తాహారయుతకంఠుడు - కౌస్తుభ (కౌస్తుభము అను మణి) కలిత (కూడిన) ముక్త (ముత్యాల) హార (హారములుతో) యుత (కూడిన) కంఠుడు (కంఠము కలవాడు), విష్ణువు}; యోగిమానసపంకజోపకంఠున్ = విష్ణుమూర్తిని {యోగిమానసపంకజోపకంఠుడు - యోగి (యోగుల) మానస (మనసులు అనెడి) పంకజ (పద్మముల) ఉపకంఠుడు (సమీపమున ఉన్నవాడు), విష్ణువు}; సతతప్రసన్నస్మితవదనాంభోజున్ = విష్ణుమూర్తిని {సతతప్రసన్నస్మితవదనాంభోజుడు - సతత (ఎల్లప్పుడును) ప్రసన్న (ప్రసన్నమైన) స్మిత (చిరునవ్వుతో కూడిన) వదన (మోము అనెడి) అంభోజున్ (పద్మము కలవాడు), విష్ణువు}; దినకరకోటిసందీప్తతేజున్ = విష్ణుమూర్తిని {దినకరకోటిసందీప్తతేజుడు - దినకర (సూర్యులు) కోటి (కోటి మందితో సమానమైన) సందీప్తుడు (ప్రకాశము కలవాడు), విష్ణువు};
సలలితానర్ఘ్యరత్నకుండలకిరీటహారకంకణకటకకేయూరముద్రికాతులాకోటిభూషున్ = విష్ణుమూర్తిని {సలలితానర్ఘ్యరత్నకుండలకిరీటహారకంకణకటకకేయూరముద్రికాతులాకోటిభూషుడు - సలలితా (అంద మైన) అనర్ఘ్య (వేలకట్టలేని) రత్నములు తాపిన కుండలములు కిరీటములు హారములు కంకణములు కటక (కడియము)లు కేయూర (భుజకీర్తులు) ముద్రికా (ఉంగరములు) తులాకోటి (అందెలు) లతో భూషితుడు (అలంకరింపబడినవాడు), విష్ణువు}; భక్తప్రపోషున్ = విష్ణుమూర్తిని {భక్తప్రపోషుడు - భక్తులను చక్కగా పోషించువాడు, విష్ణువు}; కింకిణీయుతమేఖలాకీర్ణజఘనున్ = విష్ణుమూర్తిని {కింకిణీయుతమేఖలాకీర్ణజఘనుడు - కంకిణీ (గజ్జలు) యుత (కలిగిన) మేఖలా (వడ్డాణము) తో ఆకీర్ణ (కూడిన) జఘనుడు (నడుము కలవాడు)};
భావము:- అప్పుడే వికసిస్తున్న పద్మాలవంటి అందమైన కన్నులు కలవాడు, వక్షస్థలంపై అందమైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలవాడు, నల్లని మేఘంలా, నల్లకలువలా శ్యామలవర్ణం కలవాడు, తుమ్మెదలకు విందుచేసే వైజయంతీ మాలికతో విరాజిల్లేవాడు, కౌస్తుభమణితో శోభించే ముత్యాలహారం కంఠమందు ధరించినవాడు, యోగిజనుల హృదయకమలాలకు దగ్గరైనవాడు, ఎప్పుడును ప్రసన్నమైన చిరునవ్వు చిందులాడే ముఖపద్మం కలవాడు, కోటి సూర్యుల తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించేవాడు, విలువైన రమణీయ రత్నకుండలాలు, కిరీటం, హారాలు, కంకణాలు, కటకాలు, భుజకీర్తులు, అంగుళీయకాలు, అందెలు మొదలైన అలంకారాలతో విలసిల్లేవాడు, కటి ప్రదేశమందు ఘల్లు ఘల్లుమనే గజ్జెల మొలనూలు అలంకరించుకొన్నవాడు, భక్తులను లాలించి పాలించేవాడు అయిన శ్రీమన్నారాయణుని (ధ్యానం చేయాలి).

తెభా-3-923-వ.
మఱియు,
టీక:- మఱియు = ఇంకను.
భావము:- ఇంకా...

తెభా-3-924-సీ.
కంజాతకింజల్క పుంజరంజిత పీత-
కౌశేయవాసు జన్నివాసు
త్రుభీకర చక్ర శంఖ గదాపద్మ-
విహిత చతుర్భాహు విగతమోహు
నుతభక్తలోక మనోనేత్రవర్ధిష్ణు-
లాలిత సద్గుణాలంకరిష్ణు
రకుమారక వయఃరిపాకు సుశ్లోకు-
సుందరాకారు యశోవిహారు

తెభా-3-924.1-తే.
కలలోక నమస్కృతరణకమలు
క్తలోక పరిగ్రహప్రకటశీలు
ర్శనీయ మనోరథదాయిఁ గీర్త
నీయ తీర్థయశోమహనీయమూర్తి.

టీక:- సకలలోకనమస్కృతచరణకమలున్ = విష్ణుమూర్తిని {సకలలోకనమస్కృతచరణకమలు - సమస్తమైన లోకులచేతను నమస్కారింపబడిన పాదపద్మములు రలవాడు, విష్ణువు}; భక్తలోకపరిగ్రహప్రక కంజాతకింజల్కపుంజరంజితపీతకౌశేయవాసున్ = విష్ణుమూర్తిని {కంజాతకిజల్కపుంజరంజితపీతకౌశేయవాసుడు - కంజాత (పద్మముల)యొక్క కింజల్క (కేసరముల) పుంజ (సమూహము) వలె రంజిత (రంజిల్లుతున్న) పీత (పచ్చని) కౌశేయ (పట్టువస్త్రము)లను ధరించినవాడు, విష్ణువు}; జగన్నివాసున్ = విష్ణుమూర్తిని {జగన్నివాసుడు - జగత్ (విశ్వము)లకు వాసుడు (నివాసమైనవాడు), విష్ణువు}; శత్రుభీకరచక్రశంఖగదాపద్మవిహితచతుర్భాహున్ = విష్ణుమూర్తిని {శత్రుభీకరచక్రశంఖగదాపద్మవిహితచతుర్భాహుడు - శత్రువులకు భయంకరమైన చక్రము శంఖము గదా పద్మములు తో విహిత (కూడిన) చతుర్ (నాలుగు 4) బాహుడు (చేతులు కలవాడు) , విష్ణువు}; విగతమోహున్ = విష్ణుమూర్తిని {విగతమోహుడు - విగత (వదలిపెట్టేసిన) మోహము కలవాడు, విష్ణువు}; నుతభక్తలోకమనోనేత్రవర్ధిష్ణున్ = విష్ణుమూర్తిని {నుతభక్తిలోకమనోనేత్రవర్ధిష్ణుడు - నుత (కీర్తింపబడిన) భక్తలోకముల మనోనేత్రమును వర్ధిష్టుడు (పోషించువాడు), విష్ణువు}; లాలితసద్గుణాలంకరిష్ణున్ = విష్ణుమూర్తిని {లాలితసద్గుణాలంకరిష్ణుడు - లాలిత (మనోహరత కలిగిన) సద్గుణములచే అలంకరించబడినవాడు, విష్ణువు}; వరకుమారకవయఃపరిపాకున్ = విష్ణుమూర్తిని {వరకుమారకవయఃపరిపాకుడు - వర (ఉత్తమమైన) కుమారక వయస్సుతోడి పరువము కలవాడు, విష్ణువు}; సుశ్లోకున్ = విష్ణుమూర్తిని {సుశ్లోకు - చక్కగ కీర్తింపబడువాడు, విష్ణువు}; సుందరాకారున్ = విష్ణుమూర్తిని {సుందరాకారుడు - సుందరమైన ఆకారము కలవాడు , విష్ణువు}; యశోవిహారున్ = విష్ణుమూర్తిని {యశోవిహారుడు - యశస్ (కీర్తి)తో విహారుడు (విహరించువాడు), విష్ణువు};
టశీలున్ = విష్ణుమూర్తిని {భక్తలోకపరిగ్రహప్రకటశీలుడు - భక్తుల లోక (అందరను) పరిగ్రహ (అనుగ్రహించు) శీలము (వ్యక్తిత్వము, ప్రవర్తన) కలవాడు, విష్ణువు}; దర్శనీయమనోరథదాయిఁన్ = విష్ణుమూర్తిని {దర్శనీయమనోరథదాయుడు - దర్శనీయ (ఊహించు కొనగలిగిన) మనోరథ (కోరిక)లను దాయుడు (ఇచ్చువాడు), విష్ణువు}; కీర్తనీయతీర్థయశోమహనీయమూర్తిన్ = విష్ణుమూర్తిని {కీర్తనీయతీర్థయశోమహనీయమూర్తి - కీర్తనీయ (పొగడదగిన) తీర్థ (పుణ్యవంతమైన) యశస్సు కల మహనీయ మూర్తి (స్వరూపము కలవాడు), విష్ణువు};
భావము:- పద్మకేసరాల రంగుతో మిసమిసలాడే పసుపుపచ్చని పట్టువస్త్రం కట్టుకున్నవాడు, లోకాలను తనలో పెట్టుకున్నవాడు, శత్రుభయంకరాలైన శంఖ చక్ర గదా పద్మాలను చతుర్బాహువులలో ధరించేవాడు, మోహాన్ని హరించేవాడు, స్తోత్రం చేసే భక్తులకు జ్ఞాననేత్రాన్ని అనుగ్రహించేవాడు, సుగుణాలనే సురుచిర భూషణాలను పరిగ్రహించేవాడు, నిత్యయౌవనుడు, భువనపావనుడు, సౌందర్యశీలుడు, యశోవిశాలుడు, సమస్త లోకాలూ నమస్కరించే పాదపద్మాలు కలవాడు, భక్తజనులను ఆదరించే భావాలు కలవాడు, కోరిన కోరికలను ప్రసాదించేవాడు, మహనీయ కీర్తితో ప్రకాశించేవాడు అయిన శ్రీహరిని (ధ్యానించాలి).

తెభా-3-925-వ.
వెండియు.
టీక:- వెండియు = ఇంకను.
భావము:- ఇంకా.

తెభా-3-926-క.
నుపమగుణ సంపూర్ణుని
ఘుని సుస్థితుని గతుని నాసీను శయా
నుని భక్తహృద్గుహాశయ
నుని సర్వేశ్వరు ననంతు నుతసచ్చరితున్.

టీక:- అనుపమ = సాటిలేని; గుణ = సుగుణములతో; సంపూర్ణునిన్ = నిండైన వానిని; అనఘునిన్ = పాపము లేనివానిని; సుస్ఠితునిన్ = చక్కగ స్థిరము ఉన్నవానిని; గతునిన్ = గమనమున ఉన్నవానిని; ఆసీనునిన్ = కూర్చున్నవానిని; శయానునిన్ = పండుకొనిన వానిని; భక్త = భక్తుల యొక్క; హృద్ = హృదయము అనెడి; గుహా = గుహ యందు; శయనునిన్ = శయనించువానిని; సర్వ = సర్వులకును; ఈశ్వరున్ = ప్రభువు యైన వానిని; అనంతున్ = అంతములేని వానిని; నుత = కీర్తింబడు; సచ్చరితున్ = మంచి వర్తన కలవానిని.
భావము:- సాటిలేని మేటి సుగుణాలతో నిండియున్న వానిని, పాపాలను చెండాడే వానిని, స్థిరమైన వానిని, నడచివస్తున్న వానిని, వచ్చి కూర్చున్న వానిని, సుఖంగా పరుండిన వానిని, హృదయాంతరాలలో నివసించిన వానిని, సర్వేశ్వరుని, శాశ్వతమైన వానిని, సంస్తుతింపదగిన సచ్చరిత్ర కలవానిని (ధ్యానించాలి).

తెభా-3-927-మ.
విలంబై పరిశుద్దమై తగు మనోవిజ్ఞాన తత్త్వప్రబో
తిన్ నిల్పి తదీయమూర్తి విభవధ్యానంబు గావించి చి
త్తము సర్వాంగ విమర్శనక్రియలకుం దార్కొల్పి ప్రత్యంగమున్
సుహాధ్యానము సేయఁగావలయుఁబో శుద్ధాంతరంగంబునన్.

టీక:- విమలంబు = నిర్మలము; ఐ = అయ్యి; పరిశుద్దము = స్వచ్ఛము; ఐ = అయ్యి; తగు = తగిన; మనస్ = మనస్సు; విజ్ఞాన = విజ్ఞానము; తత్త్వ = తత్త్వమును; ప్రభోధ = చక్కగ తెలియుగలుగు; మతిన్ = విధముగ; నిల్పి = నిలుపుకొని; తదీయ = అతని; మూర్తి = స్వరూపము యొక్క; విభవ = వైభవమును; ధ్యానంబున్ = ధ్యానము; కావించి = చేసి; చిత్తమున్ = చిత్తమును; సర్వ = అన్ని; అంగ = అవయవముల; విమర్శన = పరిశీలించు; క్రియన్ = విధమున; తార్కొల్పి = తదాయత్తముచేసి; ప్రతి = ప్రతి ఒక్క; అంగమున్ = అవయవమును; సు = మంచి; మహా = గొప్ప; ధ్యానమున్ = ధ్యానమును; చేయంగావలయుబో = చేయవలసినది; శుద్ధ = పరిశుద్ధమైన; అంతరంగంబునన్ = హృదయము నందు.
భావము:- పరిశుభ్రము, పరిశుద్ధము అయిన మనస్సుతో, విజ్ఞాన తత్త్వ ప్రబోధకమైన సంకల్పంతో ఆ దివ్యమూర్తి రూపవైభవాన్ని ధ్యానించి అన్ని అవయవాలను విడమరచి చూచేటట్లు చిత్తాన్ని తదాయత్తం చేసి ఆ పరాత్పరుని ఒక్కొక్క శరీర భాగాన్నే పరిశుద్ధమైన అంతరంగంలో అనుసంధానం చేసికొని ధ్యానించాలి.

తెభా-3-928-వ.
అది యెట్టి దనిన.
టీక:- అది = అది; ఎట్టిది = ఎటువంటిది; అనిన = అనగా.
భావము:- అది ఎటువంటిదంటే...

తెభా-3-929-సీ.
ల కులిశాంకుశ లజధ్వజచ్ఛత్ర-
లాలిత లక్షణక్షితములు
లలిత నఖచంద్రచంద్రికా నిర్ధూత-
క్తమానస తమఃటలములును
సురుచిరాంగుష్ఠ నిష్ఠ్యూత గంగాతీర్థ-
మండిత హరజటామండలములు
సంచిత ధ్యానపారాయణజన భూరి-
లుష పర్వత దీపకులిశములును

తెభా-3-929.1-తే.
దాసలోక మనోరథదాయకములు
జారుయోగి మనఃపద్మ ట్పదములు
నగఁ దనరిన హరిచరణాబ్జములను
నిరుపమధ్యానమున మది నిలుపవలయు.

టీక:- హల = నాగలి; కులిశ = వజ్రము; అంకుశ = అంకుశము; జలజ = పద్మము; ధ్వజ = పతాకము; ఛత్ర = గొడుగు ల; లాలిత = మనోజ్ఞమైన; లక్షణ = గుర్తుల రేఖలతో; లక్షితములు = గుర్తింపబడినవియును; సలలిత = అందముతో కూడుకున్నవియును; నఖ = కాలి గోర్లు అనెడి; చంద్ర = చంద్రకళల; చంద్రికా = వెన్నెలతో; నిర్ధూత = ఎగరగొట్టబడిన; భక్త = భక్తులయొక్క; మానస = మనస్సులందలి; తమస్ = చీకట్ల; పటలమునున్ = తెరలుకలవియును; సు = మంచి; రుచిర = ప్రకాశిస్తున్న; అంగుష్ట = బొటకనవేలు నుండి; నిష్ఠ్యూత = ఉబుకుతున్న; గంగా = గంగయొక్క; తీర్థ = నీటిచే; మండిత = అలంకరింపబడిన; హర = శివుని; జటా = జటల; మండలున్ = చుట్టలు కలవియిను; సంచిత = సమకూర్చుకున్న; ధ్యాన = ధ్యానమును; పారాయణ = పారాయణముచేయు; జన = జనముల; భూరి = అతిమిక్కిలి; కలుష = పాపములనెడి; పర్వత = పర్వతములకు; దీప = ప్రకాశిస్తున్న; కులిశములునున్ = వజ్రాయుధములును;
దాస = సేవకులు; లోక = అందరకు; మనోరథ = కోరికలను; దాయకములును = తీర్చునవియును; చారు = అందమైన; యోగి = యోగుల; మనస్ = మనస్సులు అనెడి; పద్మ = పద్మములకు; షట్పదములున్ = తుమ్మెదలును; అనగన్ = అన్నట్లు; తనరిన = అతిశయించిన; హరి = విష్ణుమూర్తి యొక్క; చరణ = పాదములు అనెడి; అబ్జములునున్ = పద్మములును; నిరుపమ = సాటిలేని; ధ్యానమునన్ = ధ్యానముతో; మదిన్ = మనస్సులో; నిలుపవలయున్ = నిలుపుకొనవలెను.
భావము:- హలం, వజ్రం, అంకుశం, కమలం, ధ్వజం, ఛత్రం మొదలైన మంగళకరమైన రేఖలు కలవీ, చంద్రుని వెన్నెల వెలుగులవంటి గోళ్ళకాంతులతో భక్తుల మనస్సులలోని అజ్ఞానాంధకారాన్ని దూరం చేసేవీ, మనోజ్ఞమైన కాలి బొటనవ్రేలినుండి పుట్టిన గంగాతీర్థంచే శివుని జటాజూటాన్ని అలంకరించేవీ, భక్తితో ఆసక్తితో ధ్యానించే భక్తుల పాపాలనే పర్వతాలను వజ్రాయుధంలా పటాపంచలు చేసేవీ, దాసుల కోర్కెలు తీర్చేవీ, యోగుల హృదయాలనే పద్మాలలో విహరించే తుమ్మెదల వంటివీ అయిన హరి పాదపద్మాలను నిరంతరం హృదయాలలో స్మరిస్తూ ఉండాలి.

తెభా-3-930-చ.
లజు మాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై
లదళాభనేత్రములు ల్గి హృదీశ్వర భక్తి నొప్పు న
క్కల నిజాంకపీఠమునఁ గైకొని యొత్తు పరేశుజాను యు
గ్మము హృదయారవిందమున క్కువఁ జేర్చి భజింపగా దగున్.

టీక:- కమలజు = బ్రహ్మదేవుని {కమలజుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; మాత = తల్లి; ఐ = అయ్యి; సుర = దేవతల; నికాయ = సమూహములచే; సమంచిత = చక్కగ కూడి; సేవ్యమాన = సేవింపబడుచున్నది; ఐ = అయ్యి; కమల = కలువపూల; దళ = రేఖల; ఆభ = వంటి; నేత్రములు = కన్నులు; కల్గి = కలిగి ఉండి; హృదీశ్వర = భర్త (విష్ణువు) యందలి {హృదీశ్వరుడు - హృదయములకు ఈశ్వరుడు, విష్ణువు, భర్త}; భక్తిన్ = భక్తితో; ఒప్పున్ = చక్కగ ఉండెడి; ఆ = ఆ; కమల = లక్ష్మీదేవి; నిజ = తన; అంకపీఠమునన్ = ఒడిలో {అంకపీఠము - అంక (ఒడి, తొడ) అను పీఠము (ఆసనము, పీట)}; కైకొని = ఉంచుకొని; ఒత్తు = ఒత్తెడి; పరేశు = విష్ణుమూర్తి యొక్క {పరేశుడు - పర (అతీతమైన) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; జాను = మోకాళ్ళ; యుగ్మము = జంటను; హృదయ = హదయము అనెడి; అరవిందమునన్ = పద్మమున; మక్కువన్ = ఆపేక్షతో; చేర్చి = చేర్చుకొని; భజింపగాన్ = పూజించుట; తగున్ = చేయవలసినది.
భావము:- బ్రహ్మకు తల్లియై, దేవతలందరికీ ఆరాధ్యురాలై, కమల దళాలవంటి కన్నులుగల లక్ష్మీదేవి తన హృదయేశ్వరుడైన శ్రీహరి మోకాళ్ళను ఎంతో భక్తితో ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ ఉన్న మనోహర దృశ్యాన్ని మనస్సులో మననం చేసుకోవాలి.

తెభా-3-931-ఉ.
చారు విహంగవల్లభు భుజంబులమీఁద విరాజమానసు
శ్రీరుచినుల్లసిల్లి యతసీకుసుమద్యుతిఁ జాల నొప్పు పం
కేరుహనాభు నూరువుల కిల్బిషభక్తి భజించి మానసాం
భోరుహ మందు నిల్పఁదగుఁబో మునికోటికి నంగనామణీ!

టీక:- చారు = అందమైన; విహంగ = పక్షి; వల్లభు = రాజు యొక్క; భుజంబుల = భుజముల; మీదన్ = మీద; విరాజమానన్ = విరాజిల్లుతున్నవాని; సు = చక్కని; శ్రీ = సంపత్కర; రుచిన్ = ప్రకాశముతో; ఉల్లసిల్లి = ప్రకాశించి; అతసీ = నల్లఅవిశ; కుసుమ = పూల; ద్యుతిన్ = ప్రకాశముతో; చాలన్ = బాగా; ఒప్పు = చక్కగాఉండు; పంకేరుహనాభున్ = విష్ణుమూర్తి యొక్క {పంకేరుహ నాభుడు - పంకేరుహము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; ఊరువులన్ = తొడలను; అకిల్బిష = నిర్మలమైన; భక్తిన్ = భక్తితో; భజించి = సేవించి; మానస = మనస్సు అనెడి; అంభోరుహము = పద్మము {అంభోరుహము - నీటిలో పుట్టినది, పద్మము}; అందున్ = లో; నిల్పన్ = నిలుపుకొనుట; తగుబో = చేయవలసినది; ముని = మునులు; కోటి = అందరు; కిన్ = కిని; అంగనామణి = తల్లీ {అంగనామణి - అంగనలలో మణి వంటిది, స్త్రీ}.
భావము:- సొగసైన గరుత్మంతుని భుజాలమీద కాంతి సంపదలతో పెంపొందుతూ, విరిసిన దిరిసెనపువ్వు వన్నెలతో కన్నులవిందు చేసే పద్మనాభుని అందమైన ఊరుయుగ్మాన్ని అచంచలమైన భక్తితో భావిస్తూ మునులైనవారు తమ మనఃకమలాలలో నిల్పుకోవాలి.

తెభా-3-932-క.
రిలంబిత మృదుపీతాం
కాంచీగుణ నినాదరితం బగున
ప్పురుషోత్తముని నితంబముఁ
రుణీ! భజియింపవలయు ద్దయుఁ బ్రీతిన్

టీక:- పరి = చుట్టును; లంబిత = చుట్టబడిన; మృదు = మృదువైన; పీతాంబర = పట్టువస్త్రములు; కాంచీగుణ = మొలతాడు; నినాద = శబ్దములుతో; భరితంబు = కూడినది; అగు = అయిన; ఆ = ఆ; పురుషోత్తముని = విష్ణుమూర్తి యొక్క; నితంబమున్ = కటిప్రదేశమును; తరుణీ = తల్లీ {తరుణి - తరణ వయస్సున ఉన్నామె, స్త్రీ}; భజియింపన్ = కొలువ; వలయున్ = వలెను; దద్దయున్ = మిక్కిలి; ప్రీతిన్ = ఇష్టపూర్వకముగ.
భావము:- అమ్మా! ఒయ్యారంగా అంచులు వ్రేలాడుతూ ఉండే మెత్తని పట్టుపీతాంబరం కట్టుకొని మొలనూలు మువ్వల సవ్వడి నివ్వటిల్లే పురుషోత్తముని కటిప్రదేశాన్ని భక్తితో భజించాలి.

తెభా-3-933-క.
విను భువనాధారత్వం
బునఁదగి విధిజననహేతుభూతంబగున
వ్వజాతముచేఁగడుమిం
చి హరినాభీసరస్సుఁజింతింపఁదగున్

టీక:- విను = వినుము; భువన = లోకములకు; ఆధారత్వంబునన్ = ఆధారముగ నుండకలుగుటకు; తగి = చాలి ఉండు; విధి = బ్రహ్మదేవుని {విధి - పుట్టువులకు విధించు వాడు, బ్రహ్మదేవుడు}; జనన = పుట్టుకకు; హేతుభూతంబున్ = కారణాంశము; అగున్ = అయిన; ఆ = ఆ; వనజాతము = పద్మము {వనజాతము - వనము (నీరు) అందు పుట్టినది, పద్మము}; చేన్ = చేత; కడు = మిక్కిలి; మించిన = అతిశయించిన; హరి = విష్ణుమూర్తి యొక్క; నాభీ = బొడ్డు అనెడి; సరస్సున్ = సరస్సును; చింతింపన్ = స్మరించుట; తగున్ = చేయవలసినది.
భావము:- ఇంకా విను. అఖిల లోకాలకు ఆధారభూతమై, బ్రహ్మపుట్టుకకు హేతుభూతమైన పద్మంతో విరాజిల్లే సరోవరం వంటి విష్ణుమూర్తి నాభీమండలాన్ని సంస్మరించాలి.

తెభా-3-934-తే.
దివ్య మరకతరత్న సందీప్త లలిత
కుచములను మౌక్తికావళిరుచులఁ దనరి
యిందిరాదేవి సదనమై యెసక మెసఁగు
క్షమాత్మను దలపోయలయుఁ జుమ్ము.

టీక:- దివ్య = దివ్యమైన; మరకత = పచ్చలు; రత్న = రత్నముల; సందీప్త = కాంతులు కలిగిన; లలిత = చక్కటి; కుచములన్ = స్తనములను; మౌక్తిక = ముత్యాల; ఆవళిన్ = హారముల; రుచులన్ = కాంతులతో; తనరిన్ = అతిశయించి; ఇందిరాదేవి = లక్ష్మీదేవి; సదనము = నివాసము; ఐ = అయ్యి; ఎసకన్ = అతిశయిముతో; మెసగు = నిండైనట్టి; వక్షమున్ = వక్షస్థలమును; తలపోయ = సంస్మరించ; వలయును = వలెను; చుమ్మీ = సుమా.
భావము:- దివ్యమైన మరకతమాణిక్య దీప్తులు కలిగి, ముత్యాలహారాల కాంతులతో నిండిన కుచములు కలిగిన లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థ్సలాన్ని ఆత్మలో భావిస్తూ ఉండాలి.

తెభా-3-935-మ.
నితంబున్ భజియించు సజ్జన మనోనేత్రాభిరామైక సు
స్థి దివ్యప్రభ గల్గు కౌస్తుభరుచిశ్లిష్టంబునై యొప్పు నా
యోగీశ్వరవంద్యమానుఁ డగు సర్వస్వామి లక్ష్మీశు కం
మాత్మం గదియించి తద్గుణగణధ్యానంబుసేయం దగున్.

టీక:- నిరతంబున్ = ఎల్లప్పుడును; భజియించు = సేవించు; సత్ = మంచి; జన = జనముల; మనః = మనస్సు నందలి; నేత్ర = కంటికి; అభిరామ = ఒప్పిదమై; ఏక = అసహాయ; సుస్థిర = శాశ్వత; కౌస్తుభ = కౌస్తుభమణి; రుచిన్ = కాంతులు; శ్లిష్టంబున్ = పరచుకొన్నది; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; ఆ = ఆ; వర = ఉత్తమ; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠులచే; వంద్యమానుండు = నమస్కరింపబడువాడు; అగు = అయిన; సర్వస్వామి = విష్ణుమూర్తి యొక్క {సర్వస్వామి - అందరకును స్వామి (ప్రభువు), విష్ణువు}; లక్ష్మీశు = విష్ణుమూర్తి యొక్క {లక్ష్మీశుడు - లక్ష్మీదేవికి ఈశుడు (భర్త), విష్ణువు}; కంధరమున్ = మెడను; ఆత్మన్ = మనస్సులో; కదియించి = హత్తుకొని; తత్ = అతని; గుణ = గుణములను; ధ్యానంబున్ = ధ్యానము; చేయన్ = చేయుట; తగున్ = చేయవలసినది.
భావము:- యోగీశ్వరులచే నమస్కారాలు అందుకునేవాడూ, అందరికీ ప్రభువూ, లక్ష్మీపతీ అయిన ఆ మహావిష్ణువు యొక్క మెడ; నిత్యం కొలిచే సజ్జనుల మనోనేత్రాలకు ఆనందాలు పంచేటటువంటిదీ, అద్భుతమైన కౌస్తుభమణికాంతులలో తేలియాడేదీనూ. అట్టి ఆ విష్ణుమూర్తి మెడను మనసులో నిలుపుకుని దాని గుణాలను ధ్యానం చేయాలి.

తెభా-3-936-క.
మందరగిరి పరివ
ర్త నికషోజ్జ్వలిత కనకత్నాంగదముల్
రార లోకపాలకు
ను గలిగిన బాహు శాఖను దలఁపఁదగున్.

టీక:- ఘన = గొప్పదియైన; మందర = మందరము అనెడి; గిరి = పర్వతము; పరి = వద్ద; వర్తన = తిరుగుతుండుటచే; నికష = సానపెట్టబడి; ఉజ్జ్వలిత = మెరుస్తున్న; కనక = బంగారు; రత్న = రత్నములు పొదిగిన; అంగదముల్ = నగలతో; తనరారన్ = అతిశయిస్తున్నట్టి; లోకపాలకులనున్ = సకల లోకపాలకులను; కలిగిన = మోయుచున్న, కాపాడెడి; బాహు = చేతులు అనెడి; శాఖలను = కొమ్మలను; తలంపగన్ = సంస్మరించుట; తగున్ = చేయవలయును.
భావము:- సాగరమథన సమయంలో బరువైన మందర పర్వతం రాపిడిచే మెఱుగుపెట్టబడిన రత్నాల భుజకీర్తులు కలిగి లోకపాలకులకు అండదండలైన విష్ణుదేవుని బాహుదండాలను సంస్మరించాలి.

తెభా-3-937-వ.
మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదరకరసరోరుహం బందు రాజహంస రుచిరం బయిన పాంచజన్యంబును, నరాతిభటశోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారణి యగు కౌమోదకియును, బంధుర సుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకార నినద విరాజితం బైన వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వం బైన కౌస్తుభమణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు; వెండియు, భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్యమంగళవిగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయ మండిత ముకురోపమాన నిర్మల గండమండలంబును, సంతత శ్రీనివాస లోచనపంకజకలితంబును, లాలిత భ్రూలతాజుష్టంబును, మధుకర సమానరుచి చికురవిరాజితంబును నైన ముఖకమలంబు ధ్యానంబు గావింపవలయు; మఱియు, శరణాగతుల కభయప్రదంబు లగుచు నెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁపవలయు.
టీక:- మఱియున్ = ఇంకను; విమత = శత్రువులు యైన {విమతుడు - వ్యతిరేకమైన ఆలోచనా విధానములు కలవాడు, శత్రువు}; జనా = జనములకు; అసహ్యంబులున్ = సహింపరానివి; ఐన = అయిన; సహస్ర = వెయ్యి (1000); ఆరంబులు = అంచులు; కలుగు = ఉండెడి; సుదర్శనంబున్ = సుదర్శనచక్రమును; సరసిజోదర = విష్ణుమూర్తి యొక్క {సరసిజోదరుడు - సరసిజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; కర = చేయి అనెడు; సరోరుహంబున్ = పద్మము {సరోరుహము - సరస్సున పుట్టునది, పద్మము}; అందున్ = లో; రాజహంస = రాయంచ వంటి; రుచిరంబున్ = కాంతికలది; అయిన = అయినట్టి; పాంచజన్యంబునున్ = పాంచజన్యమును; ఆరాతి = శత్రు; భట = వీరుల; శోణిత = రక్తము అనెడి; కర్దమము = బురద; లిప్త = అంటిన; అంగంబున్ = దేహము కలది; ఐ = అయ్యి; భగవత్ = భగవంతునికి; ప్రీతిన్ = ఇష్టమును; కారిణి = కలిగించునది; అగు = అయిన; కౌమోదికయును = కౌమోదికము అను గదను; బంధుర = చక్కటి; సుగంధ = సుగంధము యొక్క; గంధ = వాసన; అనుబంధ = కూడిన; మంథర = మెల్లని; గంధవహా = వాయువుచే; ఆహూయమాన = ఆహ్వానించబడిన; పుష్పంధయ = తుమ్మెద; ఝంకార = ఝంకారము అను; నినద = నినాదములతో; విరాజితంబును = విరాజిల్లుతున్నదియును; ఐన = అయిన; వైజయింతికా = వైజయంతిక అను; వనమాలికయును = వనమాలికను {వనమాలిక - ఆకులు పూలుతో కట్టిన మాల}; జీవతత్త్వంబున్ = జీవతత్త్వము కలది; ఐన = అయిన; కౌస్తుభ = కౌస్తుభము అను; మణియును = మణిను; ప్రత్యేకంబ = ప్రత్యేకముగా; ధ్యానంబున్ = ధ్యానము; చేయన్ = చేయ; తగున్ = వలయును; వెండియున్ = మరియును; భక్త = భక్తులను; సంరక్షణ = చక్కగా రక్షించుట; అర్థంబున్ = కోసము; అంగీకరించు = స్వీకరించు; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; విగ్రహంబున్ = విగ్రహమున; కున్ = కు; అనురూపంబును = తగిన స్వరూపము కలిగిన; మకరకుండల = మకరకుండలముల; మణి = మణుల; నిచయ = సమూహములచే; మండిత = అలంకరింపబడిన; ముకుర = అద్దముతో; ఉపమాన = పోల్చదగిన; నిర్మల = స్వచ్ఛమైన; గండమండలంబును = చెక్కిళ్ళ ప్రదేశమును; సంతత = నిత్య; శ్రీ = లక్ష్మీ; నివాస = నివాసములైన; లోచన = కన్నులు అను; పంకజ = పద్మముల; కలితంబును = కలిగినదియును; లాలిత = మనోజ్ఞమైన; భ్రూ = కనుబొమలు అను; లతా = పూలతీగలతో; జుష్టంబును = ఇంపైనదియును; మధుకర = తుమ్మెదలతో; సమాన = సమానమైన; రుచి = కాంతివంతమైన; చికుర = ముంగురులచే; విరాజితంబున్ = విరాజిల్లుతున్నదియును; ఐన = అయినట్టి; ముఖ = ముఖము అనెడి; కమలంబున్ = కమలమును; ధ్యానంబున్ = ధ్యానము; కావింపన్ = చేయ; వలయున్ = వలయును; మఱియున్ = ఇంకను; శరణాగతుల్ = శరణుకోరువారి; కున్ = కి; అభయ = అభయమును; ప్రదంబులును = ఇచ్చునవి; అగుచున్ = అవుతూ; నెగడు = అతిశయించు; పాణి = హస్తములు అనెడి; పంకేరుహంబులు = పద్మములను {పంకేరుహములు - పంకము (నీరు) అందు ఈరుహము (పుట్టునది), పద్మము}; మనంబునన్ = మనస్సున; తలపన్ = స్మరించ; వలయున్ = వలెను.
భావము:- ఇంకా శత్రుసమూహాలకు సహింపరాని వేయి అంచుల సుదర్శన చక్రాన్ని, పద్మనాభుని కరపద్మంలో రాజహంసవలె విరాజిల్లే పాంచజన్య శంఖాన్ని, రాక్షసుల నెత్తురు చారికలతో కూడి దామోదరునికి ఆమోదదాయకమైన కౌమోదకి అనే గదను, గుప్పుమంటున్న కొంగ్రొత్త నెత్తావులు కమ్ముకున్న కమ్మ తెమ్మరల పిలుపు లందుకొని సంగీతాలు పాడే తుమ్మెదలతో కూడిన వైజయంతి అనే వనమాలికను, అఖిల లోకాలకు ఆత్మస్వరూపమైన కౌస్తుభమణిని వేరువేరుగా ధ్యానం చేయాలి. ఇంకా భక్తరక్షణ పరాయణత్వాన్ని స్వీకరించే దివ్యమంగళ రూపానికి తగినదై, మకరకుండలాల మణికాంతులు జాలువారే చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైన అందాల కందమ్ములతో వంపులు తిరిగిన సొంపైన కనుబొమలతో, తేటి కదుపుల వంటి నల్లని ముంగురులతో, ముద్దులు మూటగట్టే ముకుందుని ముఖకమలాన్ని ధ్యానం చేయాలి. ఆర్తులై శరణాగతులైన భక్తులకు అభయమిచ్చే కరపద్మాలను మనస్సులో ధ్యానించాలి.

తెభా-3-938-క.
గురు ఘోరరూపకంబై
రఁగెడు తాపత్రయం బుశమింపఁగ శ్రీ
రిచేత నిసృష్టము లగు
రుణాలోకములఁ దలఁపఁగాఁదగు బుద్ధిన్.

టీక:- గురు = అతి; ఘోర = భయంకరమైన; రూపకంబున్ = రూపములు కలిగినవి; ఐ = అయ్యి; పరగెడు = ప్రసిద్దమైన; తాపత్రయంబున్ = తాపత్రయమును {తాపత్రయము - 1ఆధిభౌతికము 2ఆధ్యాత్మికము 3ఆదిదైవికము అనెడి కారణములు కలిగిన మూడు (3) తాపములు (బాధలు)}; ఉపశమింపగన్ = తగ్గించుటకు; శ్రీహరి = శ్రీమన్నారాయణుని; చేతన్ = చేత; నిసృష్టములు = పరచబడునవి; అగు = అయిన; కరుణా = దయతో కూడిన; ఆలోకములన్ = చూపులను; తలపగన్ = ధ్యానించుట; తగున్ = చేయవలయును; బుద్ధిన్ = మనుస్సునందు.
భావము:- 1) ఆదిభౌతికము, 2) ఆధ్యాత్మికము, 3) ఆదిదైవికము అనెడి కారణములు కలిగిన మూడు బాధలు (తాపములు) తాపత్రయం అనబడతాయి, భయంకరాతి భయంకరములు అయిన ఆ తాపత్రయాలను ఉపశమింప చేయగలిగిన శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షవీక్షణాలను మనస్సునందు స్మరించుకోవాలి.

తెభా-3-939-క.
రుచిగల మందస్మిత
ము కనుగుణ మగు ప్రసాదమును జిత్తమునన్
మునుకొని ధ్యానముసేయం
ను యోగిజనాళి కెపుడు సౌజన్యనిధీ!

టీక:- ఘన = దట్టమైన; రుచి = కాంతి; కల = కలిగిన; మంద = మెల్లని; స్మితమున్ = చిరునవ్వున; కున్ = కు; అనుగుణము = కూడి ఉండునట్టిది; అగు = అయిన; ప్రసాదమును = అనుగ్రహమును; చిత్తమునన్ = మనస్సులో; మునుకొని = పూని; ధ్యానము = ధ్యానము; చేయంజను = చేయవలెను; యోగి = యోగులైన; జన = జనముల; ఆవళి = సమూహమున; కున్ = కు; ఎపుడన్ = ఎల్లప్పుడును; సౌజన్యనిధీ = తల్లీ {సౌజన్యనిధి - సౌజన్యము (మంచితనము) నకు నిధి వంటిది}.
భావము:- సౌజన్యానికి నిధి వంటి ఓ తల్లీ! భక్తియోగాన్ని అవలంబించినవారు కమనీయకాంతులు ప్రసరించే విష్ణువుయొక్క ముసిముసి నవ్వులలోని ప్రసన్నతను మలినం లేని మనస్సులో మాటిమాటికి మననం చేసుకోవాలి.

తెభా-3-940-తే.
పూని నతశిరులైనట్టి భూజనముల
శోకబాష్పాంబుజలధి సంశోషకంబు
త్యుదారతమము హరిహాస మెపుడుఁ
లఁపఁగావలె నాత్మలోఁ విలి వినుము.

టీక:- పూని = పూని; నత = వంచిన; శిరులు = శిరస్సులు కలవారు; ఐనట్టి = అయినట్టి; భూజనముల = మానవుల {భూజనములు - భూలోకమన ఉండు జనులు, మానవులు}; శోక = దుఃఖపు; బాష్పంబు = కన్నీటి; జలధిన్ = సముద్రమును; సంశోషకము = పూర్తిగా ఇంకించునదియును; అతి = మిక్కిలి; ఉదారతమము = ఔదార్యకలదియును అగు {ఉదారము - ఉదారతరము - ఉదారతమము}; హరి = విష్ణుమూర్తి యొక్క; హాసమున్ = చిరునవ్వును; తలపగాన్ = స్మరించుచు; వలెన్ = ఉండవలెను; ఆత్మన్ = మనస్సు; లోన్ = లోపల; తవిలి = లగ్నము చేసుకొని; వినుము = వినుము.
భావము:- తలలు వంచి నమస్కరించే దాసుల శోకబాష్ప సముద్రాలను ఎండించి కోరికలు పండించే హరియొక్క సుందర మందహాసాన్ని ఎడతెగకుండా భావించాలి.

తెభా-3-941-సీ.
మునులకు మకరకేనునకు మోహనం-
బైన స్వకీయ మాయావిలాస
మున రచితం బైన భ్రూమండలంబును-
ముని మనఃకుహర సమ్మోదమానుఁ
గు నీశ్వరుని మందహాసంబు నవపల్ల-
వాధర కాంతిచే రుణ మైన
మొల్లమొగ్గల కాంతి నుల్లసం బాడెడు;-
దంతపంక్తిని మదిఁ లఁపవలయు

తెభా-3-941.1-తే.
వెలయ నీరీతి నన్నియు వేఱువేఱ
సంచితధ్యాన నిర్మల స్థానములుగ
నములోఁ గను"మని చెప్పి ఱియుఁ బలికె
దేవహూతికిఁ గపిలుండు దేటపడఁగ.

టీక:- మునుల్ = మునుల; కున్ = కు; మకరకేతనున్ = మన్మథుని {మకరకేతనుడు - మకరము (మొసలి) కేతనము గుర్తుకల జండా కలవాడు, మన్మథుడు}; కున్ = కును; మోహనంబున్ = మోహము పుట్టించునది; ఐన = అయిన; స్వకీయ = స్వంత; మాయా = మాయ యొక్క; విలాసమున = విలాసముతో; రచితంబు = కల్పింపబడినది; ఐన = అయిన; భ్రూ = కనుబొమల; మండలంబునున్ = ప్రదేశమున; ముని = మునుల; మనస్ = మనస్సులను; కుహర = గుహలకు; సమ్మోదమానుడు = సంతోషమును కలిగించువాడు; అగు = అయిన; ఈశ్వరుని = భగవంతుని; మందహాసనంబునన్ = చిరునవ్వునందలి; నవ = లేత; పల్లవ = చిగురు వంటి; అధర = పెదవి యొక్క; కాంతిన్ = కాంతి; చేన్ = చేత; అరుణమైన = ఎఱ్ఱబడిన; మొల్ల = మల్లె; మొగ్గల = మొగ్గల యొక్క; కాంతిన్ = కాంతితో; ఉల్లసంబాడెడు = ఉల్లసిల్లు; దంత = పళ్ళ; పంక్తిన్ = వరుసను; మదిన్ = మనస్సున; తలంపన్ = స్మరింప; వలయు = వలెను;
వెలయన్ = ప్రసన్నతతో; ఈరీతిన్ = ఈ విధముగా; అన్నియున్ = అన్నిటిని; వేఱువేఱ = వేరువేరుగ; సంచిత = కూడిన; ధ్యాన = ధ్యానించుటకు; నిర్మల = స్వచ్ఛమైన; స్థానములుగ = సంగతులుగ; మనము = మనస్సు; లోన్ = లోపల; కనుము = చూడుము; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = మరల; పలికెన్ = పలికెను; దేవహూతి = దేవహూతి; కిన్ = కి; కపిలుండు = కపిలుడు; తేటపడగన్ = తేటతెల్లమగునట్లు.
భావము:- మహామునులకే కాకుండా మన్మథునకు సైతం మరులు రేకెత్తించే మాధవుని మాయావిభ్రమ విరచితమైన భ్రూమండలాన్ని, మునీంద్రుల మనస్సులకు ఆనందాన్ని అందించే మందహాసాన్ని, క్రొంగ్రొత్త చిగురు తొగరు పెదవులను, ఆ పెదవుల కాంతికి జాజువారిన మొల్ల మొగ్గల చెలువాన్ని పరిహసించే పలువరసను తలపోయాలి. ఈ విధంగా అన్ని అవయవాలను వేరువేరుగా మనస్సులో నిలిపి ధ్యానం చేసుకోవాలి” అని దేవహూతికి కపిలుడు తేటతెల్లంగా తెలిపి మళ్ళీ ఇలా అన్నాడు.