Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/ప్రకృతి పురుష వివేకంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-904-సీ.
ననుత! సత్త్వరస్తమో గుణమయ-
మైన ప్రాకృతకార్య గు శరీర
తుఁ డయ్యుఁ బురుషుండు డఁగి ప్రాకృతములు-
గు సుఖ దుఃఖ మోముల వలనఁ
ర మనురక్తుండు గాఁడు వికారవి-
హీనుఁడు ద్రిగుణరహితుఁడు నగుచు
లసి నిర్మలజల ప్రతిబింబితుండైన-
దినకరుభంగి వర్తించు నట్టి

తెభా-3-904.1-తే.
యాత్మ ప్రకృతిగుణంబుల యందుఁ దగులు
డి యహంకారమూఢుఁడై దొరి యేను
డఁగి నిఖిలంబునకు నెల్లఁ ర్త నని ప్ర
సంగవశతను బ్రకృతి దోములఁ బొంది

టీక:- జననుత = జనులచే స్తుతింపబడుదాన; సత్త్వ = సత్త్వగుణము; రజస్ = రజోగుణము; తమస్ = తమోగుణముల; గుణ = గుణములతో; మయము = కూడినది; ఐన = అయిన; ప్రాకృత = ప్రకృతి యొక్క; కార్యము = పని; అగు = అగును; శరీర = దేహమునకు; గతుండు = కూడినవాడు; అయ్యున్ = అయినప్పటికిని; పురుషుండు = పురుషుడు; కడగి = పూని; ప్రాకృతములున్ = ప్రకృతికి చెందినవి; అగు = అయిన; సుఖ = సుఖము; దుఃఖ = దుఃఖము; మోహ = మోహముల; వలనన్ = వలన; కరమున్ = మిక్కిలిగ; అనురక్తుండు = అనురాగము కలవాడు; కాడు = కాడు; వికార = వికారములు; విహీనుడున్ = లేనివాడును; త్రిగుణ = త్రిగుణములు; రహితుండున్ = లేనివాడును; అగుచున్ = అవుతూ; బలసి = అతిశయించి; నిర్మల = స్వచ్ఛమైన; జల = నీట; ప్రతిబింబితుడు = ప్రతిఫలించినవాడు; ఐన = అయిన; దినకరుని = సూర్యుని; భంగిన్ = వలె; వర్తించున్ = ప్రవర్తించును; అట్టి = అటువంటి;
ఆత్మన్ = ఆత్మ; ప్రకృతి = ప్రకృతి యొక్క; గుణంబులన్ = గుణముల; అందున్ = అందు; తగులు = తగులు; పడి = కొని; అహంకార = అహంకారమతో; మూఢుడు = మోహమును చెందినవాడు; ఐ = అయ్యి; తొడరి = పూని; ఏను = నేను; కడగి = అవశ్యము; నిఖిలంబున్ = సమస్తమున; కున్ = కు; ఎల్లన్ = అంతటికిని; కర్తను = కర్తృత్వము కలవాడను; అని = అని; ప్ర = మిక్కిలి; సంగ = సంగమునకు; వశతన్ = లోనగుటచే; ప్రకృతిన్ = ప్రకృతి యొక్క; దోషమున్ = దోషములను; పొంది = పొంది;
భావము:- “జనులచే స్తుతింపబడేదానా! సత్త్వరజస్తమో గుణాలతో నిండి, ప్రకృతి వల్ల ఏర్పడిన శరీరాన్ని ఆశ్రయించి కూడ పురుషుడు ప్రకృతి సంబంధమైన సుఖదుఃఖ మోహాలకు లోనుగాడు. ఎటువంటి వికారాలు లేకుండా, త్రిగుణాలకు అతీతుడై, తేటనీటిలో ప్రతిబింబించిన సూర్యబింబాన్ని ఆ జలం అంటని విధంగా సత్త్వరజస్తమో గుణాలు పురుషుణ్ణి స్పృశింపలేవు. అలా కాకుండా జీవుడు ప్రాకృతిక గుణాలలో చిక్కుకున్నట్లయితే ఈ జరుగుతున్న అన్ని సన్నివేశాలకు నేనే కర్తనని అహంకారంతో వ్యామోహంతో ప్రవర్తిస్తాడు. అతిశయమైన సంగం వల్ల అతడు ప్రకృతి దోషాలు పొంది....

తెభా-3-905-క.
సు తిర్యఙ్మనుజస్థా
రూపము లగుచుఁ గర్మవాసనచేతం
పైన మిశ్రయోనులఁ
దిముగ జనియించి సంసృతిం గైకొని తాన్.

టీక:- సుర = దేవతా; తిర్యక్ = జంతు {తిర్యక్కులు - తమంతతాము తిరుగు సామర్థ్యము కలవి, జంతువులు, నం,విణ, అడ్డముగా పోవునది, }; మనుజ = మానవ; స్థావర = వృక్షాదులు {స్థావరములు - స్థిరముగ ఒకే స్థలమున ఉండునవి, 2.చురుకుదనము లేనివి, వృక్షములు మొదలైనవి, వ్యు. స్థా – స్థా(గతి నివృతో) + వరచ్, కృ,ప్ర.}; రూపముల్ = స్వరూపులను; అగుచున్ = చెందుతూ; కర్మ = కర్మముల; వాసన = సంస్కారముల; చేతన్ = వలన; పరపు = ప్రయోగింపడినవి; ఐన = అయిన; మిశ్రమ = వివిధములైన; యోనులన్ = గర్భము లందు; తిరముగన్ = అవశ్యము; జనియించి = పుట్టి; సంసృతిన్ = సంసారమును; కైకొని = చేపట్టి; తాన్ = అతను.
భావము:- సుర నర పశు పక్షి వృక్షాది నానావిధ యోనులందు జన్మించి కర్మవాసనలను విస్తరింపజేసికొని సంసార బంధాలలో చిక్కుపడి...

తెభా-3-906-క.
పూని చరించుచు విషయ
ధ్యానంబునఁజేసి స్వాప్నికార్థాగమ సం
ధాము రీతి నసత్పథ
మాసుఁ డగుచున్ భ్రమించు తిలోలుండై.

టీక:- పూని = పూని; చరించుచున్ = వర్తించుచు; విషయ = ఇంద్రియార్ఠములను; ధ్యానంబున్ = స్మరించుట; చేసి = వలన; స్వాప్నిక = కలలోని; అర్థ = ధనము; ఆగమ = లభించుట; సంధానమున్ = కలిగిన; రీతిన్ = వలె; అసత్ = సత్యము కాని, చెడు; పథ = మార్గముల పోవు; మానసుండు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; భ్రమించున్ = తిరుగును; మతి = మనసున; లోలుడు = చంచలత్వము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- చరిస్తూ, విషయసుఖాలను స్మరిస్తూ, కలలో కనిపించే ఐశ్వర్యాల వంటి సుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడు. అతని మనస్సు చెడుమార్గాలలో ప్రవర్తిసుంది. అతడు చంచలబుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు.

తెభా-3-907-వ.
అట్లు గావున.
టీక:- అట్లుగావున = అందుచేత.
భావము:- అందుచేత.

తెభా-3-908-తే.
పూని మోక్షార్థి యగు వాఁడు దీని దీవ్ర
క్తియోగంబుచేత విక్తిబొంది
నము వశముగఁజేసి యనియమాది
యోగమార్గక్రియాభ్యాస యుక్తిఁ జేసి.

టీక:- పూని = పూని; మోక్షా = మోక్షమును; అర్థి = కోరువాడు; అగు = అయిన; వాడు = వాడు; దీనిన్ = దీనిని; తీవ్ర = గట్టి; భక్తియోగంబు = భక్తియోగము; చేతన్ = వలన; విరక్తిన్ = వైరాగ్యమును; పొంది = చెంది; మనమున్ = మనసును; వశముగన్ = వశపరచుకొనుట; చేసి = వలన; యమ = యమము; నియమ = నియమము; ఆది = మొదలగు; యోగ = యోగము యొక్క; మార్గ = విధానములను; క్రియా = చేయుటను; అభ్యాస = అనుసరించు; యుక్తిన్ = ఉపాయము; చేసి = వలన.
భావము:- మోక్షంపై ఆసక్తి కలవాడు అఖండమైన భక్తియోగాన్ని అవలంబించాలి. విషయసుఖాలమీద విరక్తుడు కావాలి. యమం నియమం మొదలైన యోగమార్గాలను అభ్యసించి మనస్సును వశపరచుకొని...

తెభా-3-909-సీ.
శ్రద్ధాగరిష్ఠుఁడై త్య మైనట్టి మ-
ద్భావంబు మత్పాద సేనంబు
ర్ణిత మత్కథార్ణనంబును సర్వ-
భూ సమత్వమజావైర
మును బ్రహ్మచర్యంబు మౌనమాదిగా-
ల నిజ ధర్మసంతులఁ జేసి
సంతుష్టుఁడును మితానుఁడు నేకాంతియు-
ననశీలుఁడు వీత త్సరుండు

తెభా-3-909.1-తే.
గుచు మిత్రత్వమున గృపఁ గిలి యాత్మ
లిత విజ్ఞాని యై బంధకంబు లైన
న శరీర పరిగ్రహోత్కంఠ యందు
నాగ్రహము వాసి వర్తింప గును మఱియు.

టీక:- శ్రద్ధా = శ్రద్ధ కలిగి ఉండుటలో; గరిష్ఠుడు = గొప్పవాడు; ఐ = అయ్యి; సత్యము = నిజము; ఐనట్టి = అయినట్టి; మత్ = నా గురించిన; భావంబున్ = ఆలోచనలను; మత్ = నన్ను; సేవనంబున్ = కొలచుటయును; వర్ణిత = కీర్తింపబడిన; మత్ = నా యక్క; కథా = కథలను; ఆకర్ణనమున్ = వినుటయును; సర్వ = సమస్తమైన; భూత = జీవుల ఎడ; సమత్వమున్ = సమత్వమును; అజాత = పుట్టని; వైరమునున్ = శత్రుత్వమును; బ్రహ్మచర్యంబున్ = బ్రహ్మచర్యమును; ఘన = గొప్ప; మౌనమున్ = మౌనమును; ఆదిగాన్ = మొదలైనవిగా; కల = ఉన్నట్టి; నిజ = తన; ధర్మ = ధర్మమున; సంగతులు = కూడి ఉండుటలును; చేసి = వలన; సంతుష్టుండును = సంతోషముగ ఉండువాడును; మిత = మితముగ; అశనుండును = భుజించువాడును; ఏకాంతియున్ = ఏకాంతమున ఉండువాడును; మనన = మననము చేయికొను; శీలుండును = వర్తనకలవాడును; వీత = వీడిన; మత్సరుండును = మాత్సర్యము కలవాడును; అగుచున్ = అవుతూ;
మిత్రత్వమునన్ = మైత్రితో; కృపన్ = దయతో; తగిలి = కూడి; ఆత్మన్ = స్వయముగ; కలిత = పొందిన; విజ్ఞాని = మంచి జ్ఞానము కలవాడు; ఐ = అయ్యి; బంధకంబులు = బంధనములు; ఐన = అయిన; ఘన = మిక్కిలిదైన; శరీర = దేహమును; పరిగ్రహ = భార్యాదుల ఎడ; ఉత్కంఠ = ఆతృత; అందున్ = దానిలోను; ఆగ్రహమున్ = ఆసక్తియును; వాసి = విడిచిపెట్టి; వర్తింపన్ = ప్రవర్తించుట; అగును = చేయదగును; మఱియున్ = ఇంకను.
భావము:- చలించని శ్రద్ధాసక్తులతో నాయొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి. నా పాదాలు సేవించాలి. నా కథలను ఆకర్ణించాలి. సర్వజీవులయందు సమబుద్ధితో ప్రవర్తిందాలి. ఎవ్వరితోను వైరం లేకుండా ఉండాలి. బ్రహ్మచర్యం, మౌనం మొదలైన ఆత్మధర్మాలను అవలంబించాలి. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. మితంగా భుజించాలి. ఏకాంతంగా ఉండాలి. మననశీలుడై ఉండాలి. మాత్సర్యాన్ని దూరం చేసుకోవాలి. మైత్రి, కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానం అలవరచుకోవాలి. తన శరీరం మీద, ఆత్మీయులైనవారి మీద ఆసక్తి తగ్గించుకోవాలి. అవి బంధనానికి హేతువు లవుతాయి. ఇంకా...

తెభా-3-910-వ.
జీవేశ్వర తత్త్వజ్ఞానంబునం జేసి నివృత్తం బయిన బుద్ధి దదవస్థానంబునుం గలిగి దూరీభూతేతరదర్శనుండై జీవాత్మజ్ఞానంబునం జేసి చక్షురింద్రియంబున సూర్యుని దర్శించు చందంబున నాత్మ నాయకుం డయిన శ్రీమన్నారాయణుని దర్శించి నిరుపాధికంబై మిథ్యాభూతం బగు నహంకారంబున సద్రూపంబుచేఁ బ్రకాశమానం బగుచుఁ బ్రధాన కారణంబునకు నధిష్ఠానంబును గార్యంబునకుఁ జక్షువుం బోలెఁ బ్రకాశంబును సమస్త కార్యకారణానుస్యూతంబును బరిపూర్ణంబును సర్వవ్యాపకంబును నగు బ్రహ్మంబును బొందు"నని చెప్పి వెండియు నిట్లనియె.
టీక:- జీవ = జీవుని, ఆత్మ యొక్క; ఈశ్వర = ఈశ్వరుని, పరమాత్మ యొక్క; తత్త్వ = తత్త్వము అందలి; జ్ఞానంబునన్ = జ్ఞానము; చేసి = వలన; నివృత్తంబు = మరల్చబడిన, అంతర్ముఖమైన; అయిన = అయినట్టి; బుద్ధి = బుద్ధియును; తత్ = దాని; అవస్థానంబును = అవస్థానమును, సంకల్ప వికల్పముల క్రమము; కలిగి = తెలిసి; దూరీభూత = దూరమైపోయిన; ఇతర = (ఆత్మకు) ఇతరమైనవి; దర్శనుండును = చూచుట కలవాడును; జీవాత్మ = జీవాత్మ; జ్ఞానంబునన్ = జ్ఞానమున; చేసి = వలన; చక్షురింద్రియంబునన్ = కంటితో; సూర్యునిన్ = సూర్యుని; దర్శించు = చూడగలుగుట; చందంబునన్ = వలె; ఆత్మన్ = తనలోని; నాయకుండు = ప్రభువు; అయిన = అయిన; శ్రీమన్నారాయణుని = శ్రీమన్నారాయణుని; దర్శించి = దర్శించి; నిరుపాధికంబున్ = ఉపాధులులేనట్టిది; ఐ = అయ్యి; మిథ్యా = అసత్యమున; భూతంబగు = కూడినదైన; అహంకారంబునన్ = అహంకారమున; సత్ = సత్యము యొక్క; రూపము = రూపము; చేన్ = చేత; ప్రకాశమానంబున్ = ప్రకాశవంతముగ; అగుచున్ = అవుతూ; ప్రధానకారణంబున్ = మూలప్రకృతి; కున్ = కి; అధిష్ఠానమును = ఆధారమును; కార్యంబున్ = సృష్టి; కున్ = కిని; చక్షువున్ = దృష్టి; పోలెన్ = వలెను; ప్రకాశంబునున్ = ప్రకాశింప జేయునదియును; సమస్త = సమస్తమైన; కార్య = కార్యములును; కారణ = కారణములకును; స్యూతంబును = మూలభూతమును; పరిపూర్ణంబును = పరిపూర్ణమును; సర్వ = సర్వము నందును; వ్యాపకంబునున్ = అంతర్యామిత్వమును; అగు = కలిగిన; బ్రహ్మంబునున్ = పరబ్రహ్మమును; పొందును = చెందును; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- జీవేశ్వరుల యథార్థస్వరూపం (త్రిగుణాత్మకమైన ప్రకృతిలో చిక్కుకొన్నవాడు జీవుడనీ, త్రిగుణాలకు అతీతుడై వానిని నడిపించేవాడు ఈశ్వరుడనీ) తెలుసుకొనడంవల్ల బుద్ధి అంతర్ముఖ మౌతుంది. అందువల్ల బుద్ధియందలి సంకల్ప వికల్పాల క్రమం తెలుస్తుంది. అప్పుడు ఇతర పదార్థాలేవీ కన్పించవు. జీవాత్మజ్ఞానంతో కంటితో సూర్యుణ్ణి చూచినంత సూటిగా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శనం లభిస్తుంది. అప్పుడు అహంకారానికి తావుండదు. అది మిథ్యాభూతమై తొలగిపోతుంది. సత్యం ప్రకాశమాన మవుతుంది. అందువల్ల ప్రధానకారణమైన మూలప్రకృతికి ఆధారమూ, సమస్త సృష్టినీ దృష్టివలె ప్రకాశింప చేసేదీ, విశ్వంలోని సమస్త కార్యకారణాలకూ మూలభూతమూ, పరిపూర్ణమూ, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు” అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు.

తెభా-3-911-సీ.
"విను మాత్మవేత్తకు విష్ణుస్వరూపంబు-
నెఱుఁగంగఁ బడునది యెట్లటన్న
గనస్థుఁ డగు దినరు కిరణచ్ఛాయ-
లముల గృహకుడ్యజాలకముల
లన దోఁచిన ప్రతిలితంబుచేత నూ-
హింపగఁ బడిన యయ్యినుని పగిది
ర్థి మనోబుద్ధ్యహంకరణత్రయ-
నాడీప్రకాశమును నెఱుంగ

తెభా-3-911.1-తే.
చ్చు నాత్మస్వరూపంబు లఁతిగాఁగ
జిత్తమునఁ దోచు నంచితశ్రీఁ దనర్చి
మ్మహామూర్తి సర్వభూతాంతరాత్ముఁ
గుచు నాత్మజ్ఞులకుఁ గానగును మఱియు.

టీక:- వినుము = వినుము; ఆత్మ = ఆత్మ యొక్క; వేత్త = స్వరూపము తెలిసినవాని; కున్ = కి; విష్ణు = విష్ణుమూర్తి; స్వరూపంబున్ = స్వరూపము; ఎఱుగంగనబడును = తెలిసికొనబడును; అది = అది; ఎట్లు = ఏ విధముగ; అట = అటుల; అన్న = అనిన; గగనస్థుడు = ఆకాశమున ఉన్నవాడు; అగు = అయిన; దినకరు = సూర్యుని; కిరణ = వెలుగు; ఛాయన్ = నీడలను; జలములన్ = నీటియందు; గృహ = ఇంటి; కుడ్య = గోడల; జాతములన్ = సమూహములు; వలనన్ = వలన; తోచిన = తెలిసికొనబడిన; ప్రతిఫలితంబు = ప్రతిబింబము; చేతన్ = వలన; ఊహింపబగడిన = ఊహంచుకొన్న; ఆ = ఆ; ఇనుని = సూర్యుని; పగిదిన్ = వలె; అర్థిన్ = కోరి; మనస్ = మనసు; బుద్ధి = బుద్ధి; అహంకరణ = అహంకారముల; త్రయ = మూడు; నాడీ = నాడుల; ప్రకాశముననున్ = ప్రకాశమున; ఎఱుంగన్ = తెలియ;
వచ్చున్ = వచ్చును; ఆత్మ = ఆత్మ యొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; వలతి = సమర్థుడు; కాగ = అయ్యి; చిత్తమునన్ = మనసున; తోచున్ = తోచును; అంచిత = ప్రకాశించు; శ్రీన్ = శోభ వలన; తనర్చి = అతిశయించి; ఆ = ఆ; మహామూర్తి = గొప్పవాడు; సర్వ = సమస్తమైన; భూత = జీవులకును; అంతరాత్ముడు = అంతర్యామి; అగుచున్ = అవుతూ; కాననగును = చూడగలుగుతాడు; మఱియున్ = ఇంకను.
భావము:- “అమ్మా! విను. ఆత్మస్వరూపం తెలిసినవానికి పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. ఎలాగంటే ఆకాశంలోని సూర్యుని కిరణాలు నీళ్ళలోనూ, ఇంటిగోడలలోని కిటికీసందులలోను ప్రసరించటం వల్ల సూర్యుడున్నట్లు మనం తెలుసుకుంటాము. మనస్సు బుద్ధి అహంకారం అనే ఈ మూడింటిలో ప్రసారమయ్యే ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహామూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. ఇంకా...

తెభా-3-912-వ.
జీవుండు పరమాత్మానుషక్తుండై భూతాది తత్త్వంబులు లీనంబులై ప్రకృతి యందు వాసనామాత్రంబు గలిగి యకార్యకరణంబులై యున్న సుషుప్తి సమయంబునం దాను నిస్తంద్రుం డగుచు నితరంబుచేతఁ గప్పబడనివాఁ డై పరమాత్మానుభవంబు సేయుచుండు"నని చెప్పిన విని; దేవహూతి యిట్లనియె.
టీక:- జీవుండు = జీవుడు; పరమాత్మా = భగవంతుని; అనుషక్తుండు = విడువలేని అభిలాష పెంచుకొన్నవాడు; ఐ = అయ్యి; భూత = పంచ భూతములు; ఆది = మొదలగు; తత్త్వంబులు = తత్త్వములు; లీనంబులు = లీనము; ఐ = అయిపోయి; ప్రకృతి = ప్రకృతి; అందున్ = అందు; వాసనా = సంస్కారములుగా; మాత్రంబున్ = మాత్రమే; కలిగి = ఉండి; అకార్య = కార్యములు కానివానిని; కరణంబులు = చేసినవి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్న; సుషుప్తి = సుషుప్తి; సమయంబునన్ = సమయము; అందునున్ = లోకూడ; నిస్తంద్రుడు = మేల్కొని ఉన్నవాడు {నిస్తంద్రుడు - మత్తులేనివాడు, మేల్కొని ఉన్నవాడు}; ఇతరంబున్ = ఇతరమైన వాని; చేన్ = చేత; కప్పబడనివాడు = అవరోధము లేనివాడు; ఐ = అయ్యి; పరమాత్మా = పరమాత్మను; అనుభవంబున్ = చక్కగ భావము; చేయుచున్ = చేస్తూ; ఉండును = ఉండును; అని = అని; చెప్పిన = చెప్పిన; విని = విని; దేవహూతి = దేవహూతి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- జీవుడు సుషుప్తిలో భగవంతునితో ప్రగాఢమైన సంబంధం కలిగి ఉంటాడు. వానియందలి పంచభూతాలు మొదలైన తత్త్వాలు ప్రకృతిలో విలీనాలై సంస్కార మాత్రంగా ఉంటూ, తమ పనులను చేయలేని స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో సాధకుని ఆత్మ తానుమాత్రం మేల్కొని ఉండి ఎటువంటి అవరోధం లేనిదై పరమాత్మను భావన చేస్తూ ఉంటుంది” అని చెప్పగా విని దేవహూతి కపిలునితో ఇలా అన్నది.

తెభా-3-913-సీ.
"విమలాత్మ యీ పృథివికిని గంధమునకు-
లిలంబునకును రసంబునకును
న్యోన్య మగు నవినాభావసంబంధ-
మైన సంగతిఁ బ్రకృత్యాత్మలకును
తతంబు నన్యోన్య సంబంధమై యుండు-
ప్రకృతి దా నయ్యాత్మఁ బాయు టెట్లు
లపోయ నొకమాటు త్త్వబోధముచేత-
వభయంబుల నెల్లఁ బాయు టెట్లు

తెభా-3-913.1-తే.
చ్చి క్రమ్మఱఁ బుట్టని జాడ యేది
యిన్నియుఁ దెలియ నానతి యిచ్చి నన్నుఁ
రుణ రక్షింపవే దేవణసుసేవ్య!
క్తలోకానుగంతవ్య! రమపురుష!"

టీక:- విమలాత్మ = స్వచ్ఛమైన మనసు కకలవాడ; ఈ = ఈ; పృథివి = మన్ను; కిని = కిని; గంధమున్ = వాసన; కున్ = కు; సలిలంబున్ = జలమున; కును = కును; రసంబున్ = రుచి; కును = కిని; అన్యోన్య = ఒకదానికోటి; అగు = అయిన; అవినాభవ = విడదీయలేని; సంబంధము = సంబంధము; ఐన = ఉన్నట్టి; సంగతిన్ = విధముగనె; ప్రకృతి = ప్రకృతి; ఆత్మలన్ = ఆత్మల; కున్ = కు; సతతంబున్ = ఎల్లప్పుడు; అన్యోన్య = అన్యోన్య; సంబంధము = సంబంధము; ఐ = కలిగి; ఉండున్ = ఉండును; ప్రకృతి = ప్రకృతి; తాన్ = తను; అయ్యున్ = అయినప్పటికిని; ఆత్మన్ = ఆత్మను; పాయుటన్ = విడిచిపెట్టుట; ఎట్లు = ఎటుల అగును; తలపోయన్ = తరచిచూసిన; ఒకమాటు = ఒకసారి కలిగిన; తత్త్వబోధమున్ = తత్త్వజ్ఞానము; చేతన్ = వలన; భవభయంబుల్ = జన్మాది సంసార భయములు; ఎల్లన్ = అన్నిటిని; పాయుటన్ = తొలగిపోవుట; ఎట్లు = ఏలాగ అగును;
చచ్చి = మరణించి; క్రమ్మఱ = మరల; పుట్టని = పుట్టుక లేకుండ ఉండే; జాడ = మార్గము; ఏది = ఏది; ఇన్నియున్ = ఇవన్నీ; తెలియన్ = తెలియునట్లు; ఆనతిన్ = సెలవు; ఇచ్చి = ఇచ్చి; నన్నున్ = నన్ను; కరుణన్ = దయతో; రక్షింపవే = కాపాడుము; దేవ = దేవతా; గణ = సమూహముచే; సుసేవ్య = చక్కగ కొలువబడువాడ; భక్త = భక్తులైన; లోకన్ = జనులకు; అనుగంతవ్య = గమ్యమైన వాడ; పరమ = పరమమైన; పురుష = పురుషుడ.
భావము:- “పుణ్యాత్మా! పంచభూతాలలో పృథివికి, గంధానికి, జలానికి, రసానికి అన్యోన్యమైన అవినాభావ సంబంధం ఎలా ఉన్నదో అదే విధంగా ప్రకృతికి, ఆత్మకు ఎల్లప్పుడు పరస్పర సంబంధం ఉంది కదా! అటువంటప్పుడు ప్రకృతి ఆత్మను ఎలా విడిచి పెట్టగలుగుతుంది? ఒక్కసారి కలిగిన తత్త్వజ్ఞానంవల్ల సంసారభయాలు ఎలా తొలగిపోతాయి? చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గం ఏది? ఇవన్నీ నాకు బాగా తెలిసేటట్లు చెప్పు. దేవతలచే సేవింపబడేవాడా! భక్తజన శరణ్యా! పరమపురుషా! దయతో ఈ జ్ఞానం నాకు కటాక్షించు. నన్ను రక్షించు.”

తెభా-3-914-వ.
అనిన భగవంతుం డిట్లనియె "ననిమిత్తం బయిన స్వధర్మంబునను, నిర్మలాంతఃకరణంబునను, సునిశ్చితంబైన మద్భక్తియోగంబునను, సత్కథాశ్రవణసంపాదితంబైన వైరాగ్యంబునను, దృష్ట ప్రకృతిపురుష యాధ్యాత్మంబగు జ్ఞానంబునను, బలిష్ఠం బయి కామానభిష్వంగం బగు విరక్తివలనఁ దపోయుక్తం బయిన యోగంబునను, దీవ్రం బయిన చిత్తైకాగ్రతం జేసి పురుషుని దగు ప్రకృతి దందహ్యమానం బై తిరోధానంబును బొందు; నదియునుం గాక యరణిగతం బైన వహ్నిచే నరణి దహింపఁ బడు చందంబున జ్ఞానంబునను దత్త్వదర్శనంబుననుం జేసి నిరంతరంబు బలవంతంబును దృష్టదోషంబును నగు ప్రకృతి జీవునిచేత భుక్తభోగమై విడువంబడు"నని చెప్పి.
టీక:- అనినన్ = అనగా; భగవంతుండు = సర్వశక్తి సంపన్నుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అనిమిత్తంబున్ = ఫలితము ఆశించనిది; అయిన = అయినట్టి; స్వధర్మంబునన్ = తన మార్గమునందును; నిర్మల = స్వచ్ఛమైన; అంతఃకరణంబునను = మనసునందును; సునిశ్చితంబున్ = దృఢమైనది; ఐన = అయినట్టి; మత్ = నా యందలి; భక్తియోగంబుననున్ = భక్తియోగమువలనను; సత్కథా = మంచివారి కథలను; శ్రవణ = వినుటచే; సంపాదితము = సంపాదించుకొన్నది; ఐన = అయినట్టి; వైరాగ్యంబుననున్ = వైరాగ్యమునందును; దృష్ట = తెలిసికొన్న; ప్రకృతి = ప్రకృతి; పురుష = పురుషుడు; ఆది = మొదలైనవి; ఆత్మకంబున్ = తనలోనివే; అగు = అనెడి; జ్ఞానంబునను = జ్ఞానమువలనను; బలిష్ఠంబున్ = బలిష్ఠమైనది; అయి = అయిన; కామ = కామములందు; అనభిష్వంగంబు = అత్యంత అనాసక్తి; అగున్ = కలుగును; విరక్తి = విరక్తి; వలనన్ = వలనను; తపస్ = తపస్సుతో; యుక్తంబున్ = కూడినది; అయిన = అయినట్టి; యోగంబునను = యోగము యందును; తీవ్రంబున్ = తీవ్రము; అయిన = అయినట్టి; చిత్త = చిత్తము యొక్క; ఏకాగ్రతన్ = ఏకాగ్రత; చేసి = చేసికొనుట వలనను; పురుషునిన్ = పురుషుని అందు; అగు = ఉన్న; ప్రకృతిన్ = ప్రకృతి; దందహ్యమానంబున్ = కాలిపోయినది; ఐ = అయ్యి; తిరోధానంబున్ = అదృశ్యము; పొందును = అగును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; అరణి = అరణి {అరణి - ఘర్షణతో నిప్పును పుట్టిండుటకు వాడెడి కఱ్ఱ}; గతంబున్ = లోనున్నది; ఐన = అయినట్టి; వహ్ని = అగ్ని; చేన్ = చేత; అరణి = అరణి; దహింపబడు = కాల్చబడు; చందంబునన్ = విధముగనె; జ్ఞానంబుననున్ = జ్ఞానమందుట; తత్త్వదర్శనంబుననున్ = తత్త్వదర్శనముఅందుట; చేసి = వలన; నిరంతరంబున్ = ఎడతెగనిది; బలవంతంబును = బలిష్ఠమైనది; దృష్ట = దృష్టి; దోషంబునున్ = దోషభూయిష్టమును; అను = అయిన; ప్రకృతి = ప్రకృతి; జీవునిన్ = జీవుని; చేతన్ = చేత; భుక్తభోగమై = ఎంగిలి మెతుకులు వలె {భుక్తభోగము - భుక్త (భుజింపబడినట్టి) భోగము (పిండివంట) ఇక మిగిలినది, ఎంగిలి మెతుకులు}; విడువంబడు = విడిచివేయబడును; అని = అని; చెప్పి = చెప్పి.
భావము:- దేవహూతి ఇలా ప్రశ్నించగా భగవంతుడైన కపిలుడు ఇలా అన్నాడు. “సాధకుడైన పురుషుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ ఉండాలి. తన మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నాయందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. పుణ్యకథలను ఆసక్తితో వినాలి. ప్రకృతి పురుష సంబంధమైన యథార్థజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. కోరికలను దూరంగా పారద్రోలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. అఖండమైన ఏకాగ్రతను అవలంభించాలి. ఈ సాధనవల్ల పురుషుని అంటుకొని ఉన్న ప్రకృతి దందహ్యమానమై అదృశ్యమైపోతుంది. అరణినుంచి ఉదయించిన అగ్ని అరణిని కాల్చి వేసినట్లు జ్ఞానం వల్లనూ, తత్త్వదర్శనం వల్లనూ పటిష్ఠమూ బలిష్ఠమూ దోషభూయిష్ఠమూ అయిన ప్రకృతిని అనుభవిస్తున్న జీవుడు సగంలోనే మొగం మొత్తి పరిత్యాగం చేస్తాడు” అని చెప్పి (ఇంకా ఇలా అన్నాడు).

తెభా-3-915-క.
"విను ప్రకృతి నైజమహిమం
బునఁ దనలో నున్న యట్టి పురుషునకు మహే
శుకు నశుభవిస్ఫురణం
యముఁ గావింపజాల ది యెట్లనినన్.

టీక:- విను = వినుము; ప్రకృతిన్ = ప్రకృతి; నైజము = సహజమైన; మహిమంబునన్ = గొప్పదనముచేత; తన = తన; లోన్ = లోపల; ఉన్న = ఉన్నదైన; అట్టి = అటువంటి; పురుషున్ = పురుషుని; కున్ = కి; మహేశున్ = గొప్ప అధిపతి యైనవాని; కున్ = కి; అశుభ = అశుభము; విస్ఫురణంబున్ = కలుగునట్లు; అనయంబున్ = అవశ్యము; కావింపన్ = చేయ; చాలదు = లేదు; అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనగా.
భావము:- “అమ్మా! విను. ప్రకృతి తన సహజ ప్రభావం వల్ల తనకు అధీశ్వరుడై తనలో ప్రవర్తించే పురుషునకు అమంగళాన్నీ, అనర్థాన్నీ ఆచరించలేదు.

తెభా-3-916-చ.
పురుషుఁడు నిద్రవోఁ గలలఁ బొందు ననర్థకముల్ ప్రబోధమం
యగఁ మిథ్యలై పురుషు నందు ఘటింపని కైవడిం బరే
శ్వరునకు నాత్మనాథునకు ర్వశరీరికిఁ గర్మసాక్షికిం
రువడిఁ బొంద వెన్నఁటికిఁ బ్రాకృతదోషము లంగనామణీ!"

టీక:- పురుషుడు = పురుషుడు; నిద్ర = నిద్ర; పోన్ = పోయి; కలలన్ = కలలలో; అనర్థకముల్ = కీడులు; ప్రబోధము = మెలకువ వచ్చిన; అందు = అప్పుడు; అరయంగ = పరిశీలించగా; మిథ్యలు = అసత్యములు; ఐ = అయ్యి; పురుషున్ = పురుషుని; అందున్ = అందు; ఘటింపని = చెందని; కైవడిన్ = వలె; పర = అతీతుడైన; ఈశ్వరున్ = అధికారి; కున్ = కిని; ఆత్మ = తనపైతనే; నాథున్ = అధిపతి; కున్ = కిని; సర్వ = అన్ని; శరీరి = శరీరములును తానే అయినవాడు; కిన్ = కిని; కర్మ = కర్మములందు; సాక్షి = సాక్షీభూతుని; కిన్ = కిని; పరువడి = అవశ్యము; పొందవు = చెందవు; ఎన్నటికిని = ఎప్పటికి; ప్రాకృత = ప్రకృతికి సంబంధించిన; దోషముల్ = దోషములు; అంగనామణి = తల్లీ {అంగనామణి - చక్కటి అంగములు కలవారిలో మణివంటిది, స్త్రీ};
భావము:- ఓ ఉత్తమనారీ! మానవుడు నిద్రపోతున్నపుడు పీడకలలలో పొందే కష్టనష్టాలు మేలుకొనగానే అసత్యాలని తెలుసుకుంటాడు. అదే విధంగా ఆత్మనాథుడూ, కర్మసాక్షీ అయిన పరమేశ్వరునకు ప్రకృతికి సంబంధించిన దోషాలు ఎన్నటికీ అంటవు”

తెభా-3-917-వ.
అని వెండియు నిట్లనియె.
టీక:- అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-3-918-సీ.
"ధ్యాత్మ తత్పరుం గు వాఁడు పెక్కు జ-
న్మంబులఁ బెక్కు కాలంబు లందు
బ్రహ్మపదప్రాప్తి ర్యంతమును బుట్టు-
ర్వార్థవైరాగ్యశాలి యగుచుఁ
బూని నా భక్తులచే నుపదేశింపఁ-
డిన విజ్ఞానసంత్తిచేత
రఁగఁ బ్రబుద్ధుఁడై హువారములు భూరి-
త్ప్రసాదప్రాప్తితిఁ దనర్చు

తెభా-3-918.1-తే.
నిజపరిజ్ఞాన విచ్ఛిన్ననిఖిలసంశ
యుండు నిర్ముక్తలింగదేహుండు నగుచు
నఘ! యోగీంద్రహృద్గేయ గు మదీయ
దివ్యధామంబు నొందు సందీప్తుఁ డగుచు.

టీక:- అధి = అధిష్టించిన; ఆత్మ = ఆత్మకలిగి అందు; తత్తపరుండు = లగ్నమైన వాడు; అగు = అయిన; వాడు = వాడు; పెక్కు = అనేక; జన్మంబులన్ = జన్మములందు; పెక్కు = అనేక; కాలంబులు = సమయములు; అందున్ = లో; బ్రహ్మ = సృష్టికర్త; పద = పదవి; ప్రాప్తిన్ = పొందు; పర్యంతమునున్ = వరకును; పుట్టున్ = పుడుతుండును; సర్వ = సమస్తమైన; అర్థ = ప్రయోజనముల ఎడల; వైరాగ్య = విరక్తి; శాలి = కలవాడు; అగుచున్ = అవుతూ; పూని = పూని; నా = నా యొక్క; భక్తుల్ = భక్తులు; చేన్ = చేత; ఉపదేశింపబడిన = ఉపదేశింపబడినట్టి; విజ్ఞాన = విజ్ఞానము అనెడి; సంపత్తి = సంపద; చేన్ = చేత; పరగన్ = ప్రయుక్తముచే; ప్రబుద్ధుడు = మేలుకొన్నవాడు; ఐ = అయ్యి; బహు = అనేక; వారములున్ = మార్లు; భూరి = అత్యథికమైన; మత్ = నా యొక్క; ప్రసాద = అనుగ్రహమును; ప్రాప్తిన్ = పొందు; మతిన్ = సంకల్పముతో; తనర్చు = అతిశయించును;
నిజ = తనచే; పరిజ్ఞాన = సంపాదించిన చక్కటి జ్ఞానము వలన; విచ్చిన్న = తెగిపోయిన; నిఖిల = సమస్తమైన; సంశయుండు = సంశయములు కలవాడును; నిర్ముక్త = తొలగిన; లింగదేహుండున్ = లింగదేహము కలవాడు {లింగదేహము - తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము}; అగుచున్ = అవుతూ; అనఘ = పుణ్యురాల; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; హృత్ = హృదయమున; గేయము = కీర్తింపబడునది; అగు = అయిన; మదీయ = నా యొక్క; దివ్య = దివ్యమైన; ధామంబున్ = ధామమును; ఒందు = పొందు; సందీప్తుడు = చక్కగ ప్రకాశమును పొందినవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- "పుణ్యాత్మురాలా! ఆత్మజ్ఞాన సంపన్నుడైనవాడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటాడు. వాని వైరాగ్యం చెక్కు చెదరదు. నా భక్తులు ఉపదేశించిన విజ్ఞాన సంపదవల్ల ప్రబోధం పొందినవాడై ఎన్నో మారులు నా అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటాడు. తాను పొందిన ఆత్మజ్ఞానంతో తన సందేహా లన్నింటినీ పోగొట్టుకుంటాడు. లింగదేహాన్ని విడిచిపెట్టి యోగిపుంగవుల అంతరంగాలకు సంభావ్యమైన నా దివ్యధామాన్ని తేజస్వియై చేరుకొంటాడు.

తెభా-3-919-వ.
మఱియు; నణిమాద్యష్టైశ్వర్యంబులు మోక్షంబున కంతరాయంబులు గావున వాని యందు విగతసంగుండును మదీయ చరణసరోజస్థిత లలితాంతరంగుండును నగు వాడు మృత్యుదేవత నపహసించి మోక్షంబు నొందు"నని చెప్పి; వెండియు "యోగలక్షణప్రకారంబు వినిపింతు విను"మని భగవంతుం డైన కపిలుండు నృపాత్మజ కిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; అణిమాది = అణిమ మొదలైన; అష్టైశ్వర్యములున్ = అష్టైశ్వర్యములును {అష్టైశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8నశిత్వము}; మోక్షమున్ = మోక్షమున; కున్ = కు; అంతరాయంబులు = అడ్డంకులు; కావునన్ = కనుక; వాని = వాని; అందున్ = అందు; విగత = తొలగిన; సంగుండునున్ = తగులములేనివాడును; మదీయ = నా యొక్క; చరణ = పాదములు అనెడి; సరోజన్ = పద్మములందు; స్థిత = నిలచిన; లలిత = సుకుమారమైన; అంతరంగుండును = మనస్సు కలవాడును; అగు = అయిన; వాడు = వాడు; మృత్యదేవతన్ = మృత్యుదేవతను; అపహసించి = ఎగతాళిచేసి; మోక్షంబున్ = మోక్షమును; పొందున్ = పొందును; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకను; యోగ = యోగసాధన; లక్షణ = లక్షణములును; ప్రకారంబున్ = విధానమును; వినిపింతున్ = వినిపించెదను; వినుము = వినుము; అని = అని; భగవంతుండు = మహిమాన్వితుండు; ఐన = అయినట్టి; కపిలుండు = కపిలుడు; నృపాత్మజ = దేవహూతి {నృపాత్మజ - నృప (రాజైనమనువు) యొక్క ఆత్మజ (కూతురు), దేవహూతి}; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- ఇంకా అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు మోక్షానికి విఘ్నాన్ని కలిగిస్తాయి. అందువల్ల వాటిమీద మమకారాన్ని వదలిపెట్టి నా పాదపద్మాలను హృదయంలో పదిలపరచుకున్నవాడు మృత్యువును తిరస్కరించి మోక్షాన్ని పొందుతాడు” అని చెప్పి “ఇక యోగలక్షణాల విధానాలను వివరిస్తాను. విను’” అని భగవంతుడైన కపిలుడు దేవహూతితో ఇలా అన్నాడు.

తెభా-3-920-క.
"ధీనిధులై యే యోగవి
ధానంబునఁ జేసి మనము గ విమలంబై
మానిత మగు మత్పదముం
బూనుదు రా యోగధర్మముల నెఱిఁగింతున్.

టీక:- ధీనిధులు = జ్ఞానులు {ధీనిధులు - ధీ (బుద్ధి, జ్ఞానము) నకు నిధులు (స్థానము) అయినవారు, జ్ఞానులు}; అయ్యున్ = అయినప్పటికిని; ఏ = ఏ; యోగ = యోగ; విధానంబునన్ = విధానము అభ్యాసము; చేసి = వలన; మనము = మనస్సు; తగ = చక్కగ; విమలంబున్ = స్వచ్ఛమైనది; ఐ = అయ్యి; మానితము = మన్నింపదగినది; అగు = అయిన; మత్ = నా యొక్క; పదమున్ = పదమును; పూనుదురు = పొందుదురో; ఆ = ఆ; యోగ = యోగము యొక్క; ధర్మములన్ = ధర్మములను; ఎఱింగింతున్ = తెలిపెదను;
భావము:- “బుద్ధిమంతులై ఏ యోగమార్గంవల్ల తమ మనస్సును మరింత పరిశుద్ధం చేసికొని మాననీయమైన నా సన్నిధిని చేరుకుంటారో ఆ యోగధర్మాలను చెప్తాను విను.

తెభా-3-921-వ.
అది యెట్లనిన, శక్తికొలఁది స్వధర్మాచరణంబును; శాస్త్ర వినిషిద్ధ ధర్మకర్మంబులు మానుటయు; దైవికంబై వచ్చిన యర్థంబువలన సంతోషించుటయు; మహాభాగవత శ్రీపాదారవిందార్చనంబును; గ్రామ్యధర్మ నివృత్తియు; మోక్షధర్మంబుల యందు రతియు; మితం బై శుద్ధం బయిన యాహార సేవయు; విజనం బయి నిర్బాధకం బయిన స్థానంబున నుండుటయు; హింసా రాహిత్యంబును; సత్యంబును; నస్తేయంబును; దన కెంత యర్థం బుపయోగించు నంత యర్థంబ స్వీకరించుటయు; బ్రహ్మచర్యంబును; తపశ్శౌచంబులును; స్వాధ్యాయ పఠనంబును; బరమ పురుషుం డైన సర్వేశ్వరుని యర్చనంబును; మౌనంబును; నాసన జయంబును; దానం జేసి స్థైర్యంబును; బ్రాణవాయు స్వవశీకరణంబును; నింద్రియ నిగ్రహరూపం బైన ప్రత్యాహారంబును; మనంబుచే నింద్రియంబుల విషయంబులవలన మరలించి హృదయ మందు నిలుపటయు; దేహగతం బైన మూలాధారాది స్థానంబులలో నొక్క స్థానంబు నందు హృదయ గతం బయిన మనస్సుతోడంగూడఁ బ్రాణ ధారణంబును; వైకుంఠుం డైన సర్వేశ్వరుండు ప్రవర్తించిన దివ్య లీలాచరిత్ర ధ్యానంబును; మానసైకాగ్రీకరణంబును; బరమాత్మ యగు పద్మనాభుని సమానాకారతయును; నిదియునుం గాక తక్కిన వ్రతదానాదులం జేసి మనోదుష్టం బయిన యసన్మార్గంబును బరిహరించి జితప్రాణుం డై, మెల్లన యోజించి శుచి యైన దేశంబునం బ్రతిష్టించి విజితాసనుం డై, యభ్యస్త కుశాజిన చేలోత్తరాసనం బైన యాసనంబు సేసి, ఋజుకాయుం డై ప్రాణమార్గంబును గుంభక రేచక పూరకంబులం గోశశోధనంబు సేసి, కుంభక పూరకంబుల చేతం బ్రతికూలంబు గావించి, చంచలం బయిన చిత్తంబు సుస్థిరంబు గావించి, తీవ్రం బయిన యమంబునం బ్రతప్తం బయి విగత సమస్త దోషం బగు చామీకరంబు కరణి విరజంబు సేసి, జిత మారుతుం డగు యోగి గ్రమ్మఱం బ్రాణాయామం బను పావకుని చేత వాత పిత్త శ్లేష్మంబులను దోషంబుల భస్మీకరణంబు సేసి, ధారణంబు చేతఁ గిల్బిషంబులను బ్రత్యాహారంబు చేత సంసర్గంబులను దహనంబు సేసి ధ్యానంబుచేత రాగంబుల సత్త్వాదిగుణంబులను నివారించి స్వ నాసాగ్రావలోకనంబు సేయుచు.
టీక:- అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనగా; శక్తి = తమ శక్తి; కొలది = కొద్దీ; స్వ = తన యొక్క; ధర్మ = ధర్మమును; ఆచరణంబునున్ = ఆచరించుటయును; శాస్త్ర = శాస్త్రము లందు; వినిషిద్ధ = నిషేధింపబడిన; అధర్మ = చెడు; కర్మంబులు = కర్మములు; మానుటయున్ = చేయకపోవుటయు; దైవికంబున్ = దైవికము, సహజము; ఐ = అయ్యి; వచ్చిన = కలిగిన; అర్థంబున్ = సంపద; వలన = తోటి; సంతోషించుటయున్ = సంతోషించుటయును; మహా = గొప్ప; భాగవత = భక్తుల {భాగవతుడు - భగవంతునికి చెందినవాడు, భక్తుడు}; శ్రీ = శుభ; పాద = పాదములు అను; అరవింద = పద్మములను; అర్చనంబును = పూజించుటయును; గ్రామ్య = మోటు యైన, ఎడ్డెతనము కల; ధర్మ = స్వభావముల; నివృత్తియున్ = తొలగించుకొనుటయును; మోక్ష = మోక్షము యొక్క; ధర్మంబుల = ధర్మముల; అందున్ = అందు; రతియున్ = మిక్కిలి అభిలాషయును; మితంబు = తగినంతది; ఐ = అయ్యి; శుద్ధంబున్ = పరిశుద్ధమైనది; అయిన = అయిన; ఆహార = ఆహారమును; సేవయున్ = తీసుకొనుటయును; విజనంబున్ = జనులు లేనిది; అయి = అయ్యి; నిర్బాధకంబున్ = బాధను కలిగించనిది; అయిన = అయినట్టి; స్థానంబునన్ = ప్రదేశములో; ఉండుటయున్ = ఉండుటయును; హింసా = హింస; రాహిత్యంబునున్ = లేకుండుటయును; సత్యంబునున్ = సత్యమును; అస్తేయంబునున్ = దొంగబుద్ధి లేకుండుటయును; తన = తన; కున్ = కు; ఎంత = ఎంత; అర్థంబున్ = ధనము, సంపద; ఉపయోగించున్ = ఉపయోగించునో; అంతన్ = అంతే; అర్థంబ = ధనమునే; స్వీకరించుటయున్ = తీసుకొనుటయును; బ్రహ్మచర్యంబునున్ = బ్రహ్మచర్యమును; తపస్ = తపస్సును; శౌచంబులున్ = శుచిత్వములును; స్వా = స్వంతముగ; అధ్యయన = అధ్యయనము చేయుచు; పఠనంబునున్ = చదువుకొనుటయును; పరమపురుషుండు = భగవంతుడు; ఐన = అయిన; సర్వేశ్వరుని = విష్ణుమూర్తిని {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు}; అర్చనంబునున్ = పూజించుటయును; మౌనంబునున్ = మౌనమును; ఆసనజయంబునున్ = యోగాసనముల సిద్ధియును; దానన్ = దాని; చేసి = వలన; స్థైర్యంబునున్ = మనస్థైర్యము, నిశ్చలత్వమును; ప్రాణవాయు = ప్రాణవాయువులను; స్వ = తన; వశీకరణంబును = వశము నందు ఉంచుకొనుటయును; ఇంద్రియ = ఇంద్రియములను; నిగ్రహ = నిగ్రహించుకొను; రూపంబున్ = రూపము కలది; ఐన = అయిన; ప్రత్యాహారంబును = ప్రత్యాహారమును; మనంబు = మనస్సు; చేన్ = చేత; ఇంద్రియంబుల = ఇంద్రియముల; విషయంబు = అర్థముల; వలనన్ = నుండి; మరలించి = మరల్చుకొని; హృదయమున్ = హృదయము; అందున్ = లో; నిలుపుటయున్ = నిలుపుకొనుటయును; దేహ = శరీరము; గతంబున్ = లోపల ఉండునవి; ఐన = అయినట్టి; మూలధార = మూలాధార చక్రము; ఆది = మొదలగు; స్థానంబులన్ = చక్రముల; లోన్ = లో; ఒక = ఒక; స్థానంబున్ = చక్రము; అందున్ = అందు; హృదయ = హృదయము; గతంబున్ = లోనుండినది; అయిన = అయినట్టి; మనస్సు = మనస్సు; తోడన్ = తోటి; కూడన్ = కూడిన; ప్రాణధారణంబునున్ = ప్రాణాయామమును; వైకుంఠుడు = శ్రీమన్నారాయణుడు {వైకుంఠుడు - వైకుంఠమున వసించువాడు, శ్రీమన్నారాయణుడు}; ఐన = అయినట్టి; సర్వేశ్వరుండు = భగవంతుని {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు}; ప్రవర్తించిన = నడపిన; దివ్యలీలా = దివ్యలీలల; చరిత్ర = చరిత్ర లందు; ధ్యానంబును = దృష్టియును; మానస = మనస్సును; ఏకాగ్రీకరణంబునున్ = కేంద్రీకరించుటయును; పరమాత్మ = పరమాత్మ; అగు = అయిన; పద్మనాభుని = విష్ణుమూర్తితో {పద్మనాభుడు - పద్మము నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; సమాన = సమానమైన; ఆకారతయునున్ = ఆకారము కలిగి ఉండుటయును; ఇదియునున్ = ఇంతే; కాక = కాకుండగ; తక్కిన = మిగిలిన; వ్రత = వ్రతములు; దాన = దానములు; ఆదులన్ = మొదలగునవి; చేసి = చేసి; మనస్ = మనస్సు నందలి; దుష్టంబున్ = చెడ్డవి యైన; అయిన = అయిన; అసత్ = చెడ్డదైన; మార్గంబున్ = దారిని; పరిహరించి = తొలగించి; జిత = జయించిన; ప్రాణుండు = ప్రాణములు కలవాడు; ఐ = అయ్యి; మెల్లన = మెల్లగ; యోజించి = మనసు సిద్ధపరచుకొని; శుచి = శుభ్రము; యైన = అయినట్టి; దేశంబునన్ = ప్రదేశములో; ప్రతిష్ఠించి = స్థిరపడి; విజిత = సిద్ధించిన; ఆసనుండు = యోగాసనమున ఉన్నవాడు; ఐ = అయ్యి; అభ్యస్త = అలవాటుపడిన; కుశ = దర్భలచాప; అజిన = జింకచర్మము; చేల = వస్త్రము; ఉత్తర = ఉత్తరదిక్కునకు; ఆసనంబు = కూర్చుండునది; ఐన = అయిన; ఆసనంబున్ = పీఠము పై ఆసనుడగుట; సేసి = చేసి; ఋజు = సూటియైన; కాయుండు = దేహము కలవాడు; ఐ = అయ్యి; ప్రాణమార్గంబునన్ = ప్రాణాయామమున; కుంభక = కుంభకములను {కుంభకము - ప్రాణవాయువు ముక్కుద్వారా లోనికి తీసుకొనుట}; రేచక = రేచకములను {రేచకము - ప్రాణవాయువు ముక్కుద్వారా బయటకు పంపుట}; పూరకంబులన్ = పూరకముల వలన {పూరకము - ప్రాణవాయువు అంతర్గతముగ నిలుపుట}; కోశ = కోశములను {పంచకోశములు - 1అన్నమయకోశము 2ప్రాణమయకోశము 3మనోమయకోశము 4 విజ్ఞానమయకోశము 5ఆనందమయకోశము}; శోధనంబున్ = శుద్ధిపరచుట; చేసి = చేసి; కుంభక = కుంభకములను; పూరకంబులన్ = పూరకముల వలన; ప్రతికూలంబున్ = ప్రతికూలము; కావించి = చేసి; చంచలంబున్ = చంచలము; అయిన = అయినట్టి; చిత్తంబున్ = మనస్సును; సుస్థిరంబున్ = చక్కగ స్థిరపరచుకొని; తీవ్రంబు = తీవ్రము; అయిన = అయిన; యమంబునన్ = యమము అను యోగసాధనతో; ప్రతప్తంబున్ = బాగుగ కాల్చబడినది; అయి = అయ్యి; విగత = తొలగిన; సమస్త = సమస్తమైన; దోషంబున్ = దోషములును; అగు = అగునట్లు; చామీకరణంబు = బంగారము శుద్ధిచేయుట; కరణిన్ = వలె; విరజంబున్ = రజోగుణము లేనిదిగ; చేసి = చేసి; జిత = వశపరచుకొన్న; మారుతుండు = ప్రాణవాయువులు కలవాడు; అగు = అయిన; యోగి = యోగి; క్రమ్మఱ = మరల; ప్రాణాయామంబున్ = ప్రాణాయామము; అను = అనెడి; పావకుని = అగ్నిహోత్రుని; చేత = చేత; వాత = వాతములు; పిత్త = పిత్తములు; శ్లేష్మంబులు = శ్లేష్మమములు; అను = అనెడి; దోషంబులన్ = దోషములను; భస్మీకరణంబున్ = భస్మము చేయుట; చేసి = చేసి; ధారణంబున్ = ధారణల; చేతన్ = చేత; కిల్బిషంబులన్ = పాపములను; ప్రత్యాహారంబున్ = ప్రత్యాహారము; చేతన్ = చేత; సంసర్గంబులను = సంస్కారములు అను పూర్వవాసనములను; దహనంబు = కాల్చివేయుట; సేసి = చేసి; ధ్యానంబున్ = ధ్యానము; చేతన్ = చేత; రాగంబులన్ = రాగద్వేషములను; సత్వాదిగుణంబులను = త్రిగుణములను; నివారించి = నిరోధించి; స్వ = తన యొక్క; నాస = ముక్కు; అగ్ర = అగ్రభాగమును; అవలోకనంబు = చూచూట; చేయుచు = చేస్తూ.
భావము:- అది ఎలాగంటే తన శక్తి వంచన లేకుండా తన ధర్మాలను తాను ఆచరించడం, శాస్త్రాలలో నిషేధింపబడిన కర్మలను మానడం, దైవికంగా అనగా తన ప్రయత్నం లేకనే లభించిన ధనంతో సంతోషించడం, మహాత్ములైన భగవద్భక్తుల దివ్యపాదపద్మాలను సేవించడం, ఇతరులకు ఏవగింపు కలిగించే పనులను మానుకొనడం, మోక్షధర్మాలైన శాంతి అహింస మొదలైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధమైన ఆహారాన్ని మితంగా తినడం, ప్రశాంతమై ఇబ్బందిలేని ఏకాంతప్రదేశంలో నివాసం చేయడం, హింస చేయకుండా ఉండడం, సత్యమార్గాన్ని తప్పక పోవడం, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం, తనకు ఎంత అవసరమో అంతవరకే ధనం గ్రహించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, తపశ్శౌచాలు కలిగి ఉండడం, సద్గ్రంధాలు చదవడం, సర్వేశ్వరుణ్ణి పూజించడం, మౌనంగా ఉండడం, ఎక్కువకాలం అనుకూలమైన పద్ధతిలో భగవంతుని ధ్యానిస్తూ కూర్చోవడం, ఈ ఆసనవిజయం వల్ల స్థిరత్వం సంపాదించడం, ప్రాణవాయువును స్వాధీనం చేసుకోవడం, ఇంద్రియాలను విషయాలనుండి నిగ్రహించడం, ఇంద్రియాల నుండి మరలిన మనస్సునందు హృదయాన్ని నిల్పడం, దేహమందున్న మూలాధారం మొదలైన స్థానాలలో ఏదో ఒక స్థానమందు హృదయంలో కల మనస్సుతో కూడా ప్రాణధారణ చేయడం, శ్రీమన్నారాయణుని దివ్య చరిత్రలోని లీలలను ధ్యానించడం, మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవడం, పరమాత్మ అయిన పద్మనాభుడు అంతటా నిండి ఉన్నాడని విశ్వసించడం ఇత్యాదులు యోగధర్మాలు. ఇవే కాకుండా ఇతర వ్రతాలను, దానాలను ఆచరించాలి. మనోమాలిన్యంతో కూడిన చెడుమార్గాలను విడిచిపెట్టాలి. ప్రాణాయామపరుడై చక్కగా ఆలోచించి శుచియైన ప్రదేశంలో ఎటువంటి ఆటంకం లేకుండా దర్భాసనంపై ఒక జింకచర్మాన్ని, దానిపైన వస్త్రాన్ని పరచి సుఖాసనంపై కూర్చోవాలి. శరీరాన్ని నిటారుగా నిలుపుకొని కుంభక పూరక రేచక రూపమైన ప్రాణాయామంతో అన్నమయ ప్రాణమయాది కోశాలను శుద్ధి చేసుకొని చంచలమైన చిత్రాన్ని సుస్థిరం చేసుకొని, తీవ్రమైన సాధనతో బాగా కాచి కరిగించి మాలిన్యం పోగొట్టిన బంగారాన్ని వలె మనస్సును స్వచ్ఛం చేసుకోవాలి. ఈ విధంగా వాయువును వశం చేసుకొన్న యోగికి ప్రాణాయామం అనే అగ్ని చేత వాతపిత్తశ్లేష్మాలనే దోషాలు నశిస్తాయి. ఏకాగ్రత వల్ల పాపాలు రూపుమాసిపోతాయి. మనోనిగ్రహం వల్ల చెడు సంసర్గాలు విడిపోతాయి. అటువంటి యోగి ధ్యానంవల్ల రాగద్వేషాలకు, త్రిగుణాలకు అతీతుడై తన ముక్కు చివరి భాగాన దృష్టిని కేంద్రీకరించాలి.