పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/భక్తియోగంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-951-క.
"నలినాయతాక్షి! విను జన
ము ఫలసంకల్పభేదమునఁ జేసి మదిం
భక్తియోగమహిమం
వడఁగ ననేకవిధము నఁదగు నవియున్.

టీక:- నలినాయతాక్షి = తల్లీ {నలి నాయ తాక్షి - నలిన (పద్మముల వంటి) ఆయత (పెద్ద) అక్షి (కన్నులు ఉన్నామె), స్త్రీ}; విను = వినుము; జనముల = జనుల యొక్క; ఫల = ప్రయోజనములు; సంకల్ప = సంకల్పములు యొక్క; భేదంబునన్ = తేడాలను; జేసి = పట్టి; మదిన్ = మనస్సున; కల = కలుగు; భక్తియోగ = భక్తయోగము యొక్క; మహిమంబున్ = సాధనలు; అలవడగన్ = అభ్యాసముల లో; అనేక = అనేకమైన; విధములు = విధములు; అనన్ = అనుట; తగున్ = తగును; అవియున్ = వాటిని;
భావము:- “పద్మాలవంటి విశాలమైన కన్నులుగల తల్లీ! విను. ప్రజల సంకల్పాలను బట్టి ఆశయాలను బట్టి భక్తియోగం సిద్ధిస్తుంది. అదికూడ అనేకవిధాలుగా ఉంటుంది.

తెభా-3-952-వ.
వివరించెదఁ దామస రాజస సాత్త్వికాది భేదంబులం ద్రివిధం బై యుండు; నందుఁ దామసభక్తి ప్రకారం బెట్టిదనిన.
టీక:- వివరించెదన్ = వివరించి చెప్పెదను; తామస = తామస భక్తి; రాజస = రాజస భక్తి; సాత్త్విక = సాత్విక భక్తి; ఆది = మొదలగు; భేదంబులన్ = తేడాలతో; త్రి = మూడు (3); విధంబున్ = విధములు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అందున్ = వానిలో; తామస = తామస; భక్తి = భక్తి; ప్రకారంబున్ = విధము; ఎట్టిది = ఎటువంటిది; అనిన = అంటే.
భావము:- వానిని వివరిస్తాను. భక్తి తామసం, రాజసం, సాత్త్వికం అని మూడు విధాలు. వానిలో తామసభక్తి ఎలాంటిదంటే…

తెభా-3-953-తే.
తతహింసాతిదంభ మాత్సర్యరోష
మములను జేయుచును భేదర్శి యగుచుఁ
రఁగ నా యందుఁ గావించు క్తి దలఁప
దామసం బనఁదగు వాఁడు తామసుండు.

టీక:- సతత = నిత్యము; హింస = హింస; అతి = మిక్కిలి; దంభ = గర్వము; మాత్సర్య = మాత్సర్యము; రోష = క్రోధము; తమములనున్ = అజ్ఞానములతో; చేయుచున్ = చేస్తూ; భేదదర్శి = భేదభావములను కలిగినది; అగుచున్ = అవుతూ; పరగన్ = ప్రసిద్దముగ; నా = నా; అందున్ = ఎడల చేయు; భక్తి = భక్తి; తలపన్ = పరిశీలించినచో; తామసంబున్ = తామస భక్తి; అనన్ = అనుటకు; తగున్ = తగినది; వాడు = అలా ఆచరించు వాడు; తామసుండు = తామసుడు.
భావము:- ఇతరులను హింసిస్తూ ఆడంబరం, అసూయ, రోషం, అజ్ఞానం, భేదబుద్ధి కలిగి నన్ను భజించేవాడు తామసుడు. అట్టి వానిది తామసభక్తి.

తెభా-3-954-క.
విషయప్రావీణ్యము
ను సుమహైశ్వర్య యశమును బూజాద్య
ర్హుని నను నర్థి భజించుట
ను రాజసయోగ మనఁగ సౌజన్యనిధీ!

టీక:- ఘన = అధికమైన; విషయ = ఇంద్రియార్థములందు; ప్రావీణ్యములను = నేర్పరి తనములు; సు = మంచి; మహా = గొప్ప; ఐశ్వర్య = ఐశ్వర్యములు; యశములనున్ = కీర్తులతో; పూజింపన్ = పూజించుట; ఆది = మొదలగువానికి; అర్హునిన్ = తగినవానిగా; ననున్ = నన్ను; అర్థిన్ = కోరి; భజించుట = సేవించుట; చనున్ = చెల్లును; రాజసయోగము = రాజస భక్తి; అనగన్ = అనుటకు; సౌజన్యనిధీ = తల్లీ {సౌజన్యనిధి - సుజనుల లక్షణములకు నిధి వంటిది, స్త్రీ}.
భావము:- సౌజన్యఖనీ! ఆడంబరంతో కూడిన పూజాద్రవ్యాలతో అష్టైశ్వర్యాలకోసం, పేరుప్రతిష్ఠలకోసం పూజనీయుడనైన నన్ను పూజించడం రాజసభక్తి అవుతుంది.

తెభా-3-955-చ.
నుపమ పాపకర్మపరిహారము కై భజనీయుఁ డైన శో
చరితుం డితం డనుచు భావమునం దలపోసి భక్తిచే
నితర యోగ్యతన్ భగవర్పణబుద్ధి నొనర్చి కర్మముల్
హితకారి యై నెగడ సాత్వికయోగమనంగఁ జొప్పడున్.

టీక:- అనుపమ = సాటిలేని; పాప = పాపపు; కర్మ = కర్మములను; పరిహారము = తొలగించుకొనుట; కై = కొరకు; భజనీయుడు = కొలువ తగినవాడు; ఐన = అయిన; శోభన = శుభకరమైన; చరితుండు = వర్తనము కలవాడు; ఇతండు = ఇతడు; అనుచున్ = అంటూ; భావమున్ = మనసున; తలపోసి = నమ్మి; భక్తిన్ = భక్తి; చేన్ = వలన; అనితర = సమస్తమైన; యోగ్యతన్ = తగిన వాటి నన్నిటిని; భగవత్ = భగవంతునికి; అర్పణ = సమర్పించు; బుద్ధిన్ = ఉద్దేశములతో; కర్మముల్ = కర్మములు; జన = జనములకు; హితకారి = మంచికోరువాడు; ఐ = అయ్యి; నెగడన్ = ప్రసిద్దికెక్కినచో; సాత్త్వికయోగము = సాత్విక భక్తి; అనంగన్ = అనుటకు; చొప్పడున్ = చెల్లును.
భావము:- సాటిలేని పాపాలను పరిహారం చేసేది భగవద్భక్తి ఒక్కటే అనే విశ్వాసంతో, భజింపదగిన పవిత్ర చరిత్రుడు భగవంతుడే అని మనస్సులో భావిస్తూ, సమస్త కార్యాలను భగవదంకితంగా ఆచరిస్తూ, లోకులకు మేలు చేకూర్చే పనులు చేస్తూ ఉండటం సాత్త్వికభక్తి.

తెభా-3-956-చ.
నుసుత! మద్గుణశ్రవణమాత్ర లభించిన యట్టి భక్తిచే
ఘుఁడ సర్వశోభనగుణాశ్రయుఁడన్ పరమేశ్వరుండ నై
రిన నన్నుఁ జెందిన యుదాత్త మనోగతులవ్యయంబులై
నిధిగామి యైన సురవాహినిఁబోలె ఫలించు నిమ్ములన్.

టీక:- మనుసుత = తల్లీ {మనుసుత - (స్వాయంభువ) మనువు యొక్క సుత (పుత్రిక), దేవహూతి}; మత్ = నాయొక్క; గుణ = గుణములను; శ్రవణ = వినుట; మాత్ర = మాత్రముచే; లభించిన = దొరకిన; అట్టి = అటువంటి; భక్తి = భక్తి; చేన్ = చేత; అనఘుడన్ = పుణ్యుడను; సర్వ = సమస్తమైన; శోభన = శుభకరమైన; గుణ = గుణములకు; ఆశ్రయుండను = ఆశ్రయము అయినవానిని; పరమేశ్వరుండన్ = భగవంతుడిని {పరమేశ్వరుడు - పరమ (సమస్తమునకు అతీతమైన) ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు}; ఐ = అయ్యి; తనరిన = అతిశయించిన; నన్నున్ = నన్ను; చెందిన = ఆశ్రయించినట్టి; ఉదాత్తమ = మిక్కిలి ఉత్తమమైన; మనస్ = మనస్సు యొక్క; గతులున్ = పోకడలు; అవ్యయంబులున్ = తరగనివి; ఐ = అయ్యి; వననిధిన్ = సముద్రము వైపునకు; గామిన్ = పోవుచున్నది; ఐన = అయిన; సురవాహిని = గంగానదిని; పోలెన్ = వలె; ఫలించున్ = సఫలము లగును; ఇమ్ములన్ = చక్కగా.
భావము:- మనుపుత్రికవైన ఓ తల్లీ! నా గుణాలను ఆలకించిన మాత్రాన ప్రాప్తమైన భక్తితో ఉదాత్తచిత్తులైన కొందరు పాపరహితుడనూ, అనంత కళ్యాణగుణ సహితుడనూ, పరమేశ్వరుడనూ అయిన నన్ను ఆశ్రయిస్తారు. అటువంటి ఉత్తముల మనోభావాలు సముద్రాన్ని సంగమించిన గంగానది మాదిరిగా చక్కగా సఫల మౌతాయి.

తెభా-3-957-క.
హేగుణరహితుఁ డనఁగల
నా యందుల భక్తిలక్షముఁ దెలిపితి నన్
బాక నిర్హేతుకముగఁ
జేయు మదీయవ్రతైక చిరతరభక్తిన్.

టీక:- హేయ = విడువదగిన; గుణ = గుణములు; రహితుండను = లేనివాడను; అనన్ = అనుటకు; కల = తగిన; నా = నా; అందుల = ఎడల చేయు; భక్తి = భక్తి యొక్క; లక్షణమున్ = లక్షణములను; తెలిపితిన్ = తెలియజేసితిని; నన్ = నన్ను; పాయకన్ = విడువక; నిర్హేతుకముగన్ = కారణరహితముగ; చేయున్ = చేసేడి; మదీయ = నాయందలి; వ్రత = నిష్ఠయే; ఏక = ముఖ్యమైన; చిరతర = చాలాఎక్కువ కాల ముండెడి {చిరము- చిరతరము - చిరతమము}; భక్తిన్ = భక్తితో.
భావము:- నిందనీయాలైన గుణాలు లేనివాడనైన నాయందు నిలుపవలసిన భక్తి లక్షణాలను తెలిపాను. నన్ను వదలకుండా, హేతువులు వెదకకుండా చేసే వ్రతమే అచంచలమైన భక్తి అని భావించు.

తెభా-3-958-వ.
నిష్కాము లయిన మదీయ భక్తులకు నట్టి భక్తియోగంబు సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్య సాయుజ్యంబులకు సాధనంబు; గావున, మహాత్ము లగు వారు నిజమనోరథఫలదాయకంబు లయిన మదీయ సేవావిరహితం బులయిన యితర కర్మంబు లాచరింప నొల్లరు; దీని నాత్యంతిక భక్తియోగం బని చెప్పుదురు; సత్త్వ రజస్తమోగుణ విహీనుం డయిన జనుండు మత్సమానాకారంబుఁ బొందు"నని చెప్పి మఱియు నిట్లనియె.
టీక:- నిష్కాములు = కోరికలు లేనట్టివారు; అయిన = అయినట్టి; మదీయ = నా యొక్క; భక్తుల్ = భక్తుల; కున్ = కు; అట్టి = అటువంటి; భక్తియోగంబున్ = భక్తియోగము; సాలోక్య = సమానమైన లోకమున ఉండుట; సార్ష్టి = సమానమైన ఇష్టులు, అష్టైశ్వర్యములు కలిగి ఉండుట {అష్టైశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8నశిత్వము}; సామీప్య = సమీపమున ఉండుట; సారూప్య = సమానమైన స్వరూపమున ఉండుట; సాయుజ్యంబుల్ = ఐక్యైమై పోయి ఉండుటల; కున్ = కు; సాధనంబులున్ = సాధించు టకుపయోగించునవి; కావునన్ = అగుటచేత; మహాత్ములు = మహాత్ములు; అగువారు = అయినవారు; నిజ = తమ; మనోరథ = కోరికలు; ఫలదాయకంబులు = సాఫల్యమును ఇచ్చునట్టివి; అయిన = అయినట్టి; మదీయ = నా యొక్క; సేవా = సేవలు; విరహితంబులు = లేనట్టివి; అయిన = అయినట్టి; ఇతర = ఇతరమైన; కర్మంబులన్ = కర్మములను; ఆచరింపన్ = చేయుటకు; ఒల్లరు = ఒప్పుకొనరు; దీనిన్ = దీనిని; ఆత్యంతిక = ఆత్యంతిక; భక్తియోగంబున్ = భక్తియోగము; అని = అని; చెప్పుదురు = చెప్పుదురు; సత్త్వరజస్తమోగుణ = త్రిగుణములు; విహీనుండు = లేనివాడు; అయిన = అయినట్టి; జనుండు = మనిషి; మత్ = నాతో; సమాన = సమానమైన; ఆకారంబున్ = ఆకారమును; పొందున్ = పొందును; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- కోరికలు లేకుండా నన్ను భజించే నా భక్తులకు పైన చెప్పిన భక్తియోగం సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనే ముక్తులకు సాధనమౌతుంది. అందువల్ల మహాత్ములైనవారు తమ కోర్కెలు తీర్చేవే అయినా నా ఆరాధనకు దూరమైన ఏ సాధనలనూ చేయరు. దీనినే ఆత్యంతిక భక్తియోగం అని అంటారు. సత్త్వరజస్తమోగుణాలకు అతీతమైన ప్రవర్తనగల మానవుడు నాతో సమానమైన రూపాన్ని పొందుతాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-959-సీ.
"నిత్యనైమిత్తిక నిజధర్మమున గురు-
శ్రద్ధాగరిష్ఠతఁ తుర పాంచ
రాత్రోక్త హరిసమారాధన క్రియలను-
నిష్కామనంబున నెఱి మదీయ
విగ్రహదర్శన వినుతి పూజా వంద-
ధ్యానసంశ్రవములఁ గర్మ
సంగి గాకుండుట జ్జనప్రకరాభి-
మానంబు నొందుట హీను లందు

తెభా-3-959.1-తే.
జాల ననుకంపసేయుట ముల యందు
మైత్రి నెఱపుట యమనియక్రియాది
యైన యోగంబుచేత నాధ్యాత్మికాధి
భౌతికాదులఁ దెలియుట లుకుటయును.

టీక:- నిత్యనైమిత్తిక = నిత్యనైమిత్తికములైన {నిత్యనైమిత్తికములు - నిత్యమును చేయునవి మరియు నిమిత్తము (అవసరము) అనుసరించి చేయవలసినవి అగు పూజాదికములు}; నిజధర్మమునన్ = స్వధర్మము లందు; గురు = మిక్కిలి; శ్రద్ధా = శ్రద్ధ; గరిష్టతన్ = ఎక్కువుండుటతో కూడిన; చతుర = చాతుర్యముకల; పాంచరాత్ర = పాంచరాత్రాగమము న; ఉక్త = చెప్పబడిన; హరి = విష్ణుదేవుని; సమారాధన = పూజ; క్రియలను = కార్యక్రమములను; నిష్కామంబునన్ = కోరికలులేకుండగ; నెఱిన్ = నిండైన; మదీయ = నా యొక్క; విగ్రహ = విగ్రహమును; దర్శన = దర్శించుట; వినుతి = స్తుతించుట; పూజ = పూజించుట; వందన = నమస్కరించుట; ధ్యాన = ధ్యానించుట; సంశ్రవణములన్ = చక్కగ వినుట (నా కథలను); కర్మ = కర్మములందు; సంగి = సంగము కలవాడు; కాకుండుట = కాకుండగ ఉండుట; సత్ = మంచి; జన = జనముల; ప్రకర = సమూహము యొక్క; అభిమానంబున్ = అభిమానమును; పొందుటన్ = పొందుటయును; హీనులు = తక్కువ వారి; అందున్ = ఎడల; చాలన్ = అధికముగ; అనుకంప = కృప; చేయుట = చేయుటయును;
సములు = సమానమైన వారి; అందున్ = ఎడల; మైత్రి = స్నేహము; నెఱపుట = చూపుట; యమ = యమము; నియమ = నియమము; క్రియ = యోగక్రియలు; ఆది = మొదలగునవి; ఐన = అయినట్టి; యోగంబున్ = యోగము; చేతన్ = వలన; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికములు; అధిభౌతిక = అధిభౌతికములు; ఆదులన్ = మొదలైనవి; తెలియుట = తెలిసికొనుట; పలుకుటయును = చెప్పుటయును.
భావము:- “స్నాన సంధ్యాది నిత్యకర్మలందు, జగత్కళ్యాణార్థం చేసే యజ్ఞయాగాది నైమిత్తిక కర్మలందు అత్యంత శ్రద్ధాసక్తులు కలిగి ఉండడం, గురువులను పెద్దలను గౌరవించడం, పాంచరాత్రాగమంలో చెప్పబడిన ప్రకారం శ్రీహరిని నిష్కామ బుద్ధితో ఆరాధించడం, ఉత్సాహంతో నా రూపాన్ని దర్శించడం, కీర్తించడం, పూజించడం, నమస్కరించడం, స్మరించడం, నా చరిత్రలు వినడం, కర్మలలో చిక్కుకోకుండా ఉండడం, గొప్పవారిపైన ఆదర గౌరవాలు, తనకన్న తక్కువ వారిపైన దయాదాక్షిణ్యాలు, తనతో సమానులపైన స్నేహానురాగాలు కలిగి ఉండడం, యమ నియమాలను పాటించడం మొదలైన సుగుణాలను అలవరచుకోవాలి. యోగాభ్యాసం చేయాలి. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలను తాను తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తూ ఉండడం... (చేయాలి).

తెభా-3-960-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా...

తెభా-3-961-క.
రి గుణ మంగళ కీర్తన
రుఁడై తగ నార్జవమున గవత్పరులం
మనురక్తి భజించుట
నిహంకారమున నుంట నిశ్చలుఁ డగుటన్.

టీక:- హరి = విష్ణుదేవుని; గుణ = గుణములను; మంగళ = శుభకరమైన; కీర్తన = స్తోత్రములందు; పరుడు = నిమగ్నమైన వాడు; ఐ = అయ్యి; తగన్ = అవశ్యమున్; ఆర్జవమునన్ = సూటియైన ప్రవర్తనలతో(ఋజుమార్గమున); భగవత్ = భగవంతుని; పరులన్ = భక్తులను; కరము = మిక్కిలి; అనురక్తిన్ = ఇష్టముతో; భజించుట = కొలచుట; నిరహంకారమునన్ = అహంకారము లేకుండగ; ఉంటన్ = ఉండుట; నిశ్చలుండు = నిశ్చలముగ ఉండువాడుగ; అగుటన్ = అగుట.
భావము:- విష్ణువు యొక్క కళ్యాణ గుణాలను కీర్తించేవాడై, చిత్తశుద్ధితో అనురక్తితో భగవద్భక్తులను సేవించడం, అహంకారం లేకుండా నిశ్చల హృదయంతో జీవించడం... (చేయాలి).

తెభా-3-962-క.
వి మొదలుగాఁగ గలుగు భ
దుద్దేశస్వధర్మలితుం డై వీ
నిలనఁ బరిశుద్ధగతిం
విలిన మది గలుగు పుణ్యముఁ డెయ్యెడలన్.

టీక:- ఇవి = వీటితో; మొదలగు = మొదలైనవి; కాగ = అయి; కలుగు = ఉండెడి; భగవత్ = భగవంతుని; ఉద్దేశ = అర్పించిన; ధర్మ = ధర్మములుతో; కలితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; వీని = వీటి; వలనన్ = వలన; పరిశుద్ధ = స్వచ్ఛమైన; గతిన్ = విధముగ; తవిలిన = లగ్నమైన; మది = మనస్సు; కలుగు = కలిగి ఉండును; పుణ్యతముడు = అత్యంతపుణ్యవంతుడు {పుణ్యుడు - పుణ్యతరుడు - పుణ్యతముడు}.
భావము:- ఈ మొదలైన సుగుణాలతో భగవంతుని ఉద్దేశించి చెప్పిన ఇటువంటి ధర్మాలతో కూడి పవిత్రమైన మార్గంలో ఆసక్తమైన మనస్సు కలవాడైన పుణ్యాత్ముడు ఎల్లప్పుడు...

తెభా-3-963-తే.
గురుతరానేక కళ్యాణగుణవిశిష్ఠుఁ
నఁగ నొప్పిన ననుఁ బొందు నండగొనక
వనవశమునఁ బువ్వుల రిమళంబు
ఘ్రాణమున నావరించినరణి మెఱసి.

టీక:- గురుతర = మిక్కిలి గొప్పవి యైన; అనేక = అనేకమైన; కల్యాణ = శుభకరమైన; గుణ = గుణములు కల; విశిష్టుడు = ప్రత్యేకతలు కలవాడు, శ్రేష్ఠుడు; అనగన్ = అనుటకు; ఒప్పి = తగి ఉండి; ననున్ = నన్ను; పొందున్ = చెందును; అండగొనక = ఆలస్యము చేయకుండగా; పవన = గాలి; వశమునన్ = వలన; పువ్వుల = పువ్వుల యొక్క; పరిమళంబున్ = సువాసన; ఘ్రాణమునన్ = ముక్కుకు; ఆవరించిన = తగులు; కరణి = విధముగ; మెఱసి = ప్రకాశించి.
భావము:- (ఆ పుణ్యాత్ముడు) అనంత కళ్యాణగుణ సంపన్నుడనైన నన్ను పొందుతాడు. గాలి ద్వారా పువ్వుల సుగంధం ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించిన విధంగా ఇతరమైన ఎటువంటి అండదండలు లేకుండానే అనాయాసంగా నన్ను చేరుకుంటాడు.

తెభా-3-964-చ.
నిశము సర్వభూతహృదయాంబుజవర్తి యనం దనర్చు నీ
శు ను నవజ్ఞసేసి మనుజుం డొగి మత్ప్రతిమార్చనా విడం
మున మూఢుఁడై యుచితక్తిని నన్ను భజింపఁడేని న
మ్మనుజుఁడు భస్మకుండమున మానక వేల్చిన యట్టివాఁ డగున్.

టీక:- అనిశమున్ = నిత్యమును; సర్వ = సమస్తమైన; భూత = జీవుల; హృదయ = హృదయములను; అంబుజ = పద్మములందు; వర్తి = తిరిగెడువాడు; అనన్ = అనగా; తనర్చు = అతిశయించు; ఈశున్ = భగవంతుని; ననున్ = నన్ను; అవజ్ఞ = అవమానము; చేసి = చేసి; మనుజుండు = మానవుడు; ఒగిన్ = ఆడంబరముగ; మత్ = నా; ప్రతిమ = బొమ్మలను; అర్చనా = పూజించెడి; విడంబనమున = మోసము అనుకరించి; మూఢుడు = మూర్ఖుడు; ఐ = అయ్యి; ఉచిత = తగిన; భక్తిన్ = భక్తితో; నన్నున్ = నన్ను; భజింపడు = కొలువని వాడు; ఏని = అయినట్లైతే; ఆ = ఆ; మనుజుండు = మానవుడు; భస్మ = బూడిద; కుండమునన్ = గుంటలో; మానక = విడువక; వేల్చిన = హోమము చేసిన; అట్టి = అటువంటి; వాడు = వాడు; అగున్ = అగును.
భావము:- ఎల్లప్పుడు అఖిల జీవుల హృదయ కమలాలలో అంతర్యామినై ఉండే నన్ను అలక్ష్యం చేసి కేవలం నా విగ్రహాలను మాత్రమే ఆడంబరంగా పూజిస్తూ లోకాన్ని మోసగించేవాడు మూర్ఖుడు. అచంచలమైన భక్తితో నన్ను ఆరాధింపని వాని పూజలు బూడిదలో పోసిన హోమద్రవ్యాలవలె నిరర్థకాలు.

తెభా-3-965-సీ.
బ్జాక్షి! నిఖిలభూతాంతరాత్ముఁడ నైన-
నా యందు భూతగణంబు నందు
తిభేదదృష్టి మాయావులై సతతంబుఁ-
బాయక వైరానుబంధ నిరతు
గువారి మనములఁ గులదు శాంతి యె-
న్నఁటికైన నేను నా కుటిలజనుల
మానక యెపుడు సామాన్యాధికద్రవ్య-
మితిచే మత్పదార్చన మొనర్ప

తెభా-3-965.1-తే.
ర్థి నాచిత్తమున ముదం బందకుందు"
నుచు నెఱిఁగించి మఱియు నిట్లనియెఁ గరుణఁ
లిత సద్గుణ జటిలుఁ డక్కపిలుఁ డెలమిఁ
ల్లితోడ గుణవతీమల్లితోడ.

టీక:- అబ్జాక్షి = తల్లీ {అబ్జాక్షి - అంబుజము (పద్మము)ల వంటి కన్నులు కలామె, స్త్రీ}; నిఖిల = సమస్తమైన; భూత = జీవుల; అంతరాత్ముడను = లోపల ఆత్మగ ఉండువాడను; ఐన = అయినట్టి; నా = నా; అందున్ = అందును; భూత = జీవ; గణంబున్ = జాలము; అందున్ = అందును; అతి = మిక్కిలి; భేద = భేదము కల; దృష్టిన్ = చూపు కలిగి; మాయావులు = మాయకలవారు; ఐ = అయ్యి; సతతంబున్ = నిత్యమును; పాయక = విడువక; వైర = శత్రుత్వమును; అనుబంధ = అనుసరించుట యందు; నిరతులు = మిక్కిలి ఆసక్తి కలవారు; అగు = అయిన; వారిన్ = వారి యొక్క; మనములన్ = మనస్సులను; తగులదు = చెందదు; శాంతి = శాంతి; ఎన్నటికిని = ఎప్పటికి; ఐనన్ = అయినను; నేనున్ = నేనుకూడ; ఆ = ఆ; కుటిల = వంకర; జనులన్ = వారిని; మానకన్ = విడువక; ఎపుడున్ = ఎప్పుడును; సామాన్య = సామాన్యము కంటెను; అధిక = గొప్పవైన; ద్రవ్య = వస్తు; సమితి = సముదాయము; చేన్ = చేత; మత్ = నా యొక్క; పద = పాదములను; అర్చనమున్ = పూజలు; ఒనర్పన్ = చేసినను; అర్థిన్ = కోరి;
నా = నా యొక్క; చిత్తమునన్ = మనస్సులో; ముదంబున్ = సంతోషమును; అందకన్ = చెందకుండగ; ఉందున్ = ఉందును; అనుచున్ = అంటూ; ఎఱిగించి = తెలిపి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; కరుణ = దయతో; కలిత = కూడిన; సత్ = మంచి; గుణ = గుణములు కల; జటిలుడు = మిక్కిలి నేర్పు కలవాడు, జటలుగల సన్యాసి; తల్లి = తల్లి; తోడన్ = తోటి; గుణవతీమతల్లి = సుగుణురాళ్ళలో ఉత్తమురాలు; తోడన్ = తోడన్.
భావము:- కమలాలవంటి కన్నులు గల తల్లీ! నేను సమస్త జీవులలో అంతర్యామినై ఉన్నాను. అటువంటి నాయందు, మిగిలిన జీవరాసుల యందు భేదదృష్టి కలిగి మాయావులై విరోధభావంతో మెలిగేవారికి మనశ్శాంతి దొరకదు. అటువంటి కుటిలాత్ములు ఎంతో ద్రవ్యం వెచ్చించి అట్టహాసంగా, ఆడంబరంగా నాకు పాదపూజలు చేసినా నేను తృప్తిపడను. సంతోషించను” అని చెప్పి సతీమతల్లియైన తల్లితో ఉత్తమగుణధుర్యుడైన కపిలుడు ఇలా అన్నాడు.

తెభా-3-966-సీ.
"రళాక్షి! విను మచేన దేహములకంటెఁ-
జేతన దేహముల్ శ్రేష్ట మందుఁ
బ్రాణవంతంబులై స్పర్శనజ్ఞానంబు-
లుగు చైతన్యవృక్షములకంటె
నరసజ్ఞానసంలితచేతను లుత్త-
ములు రసజ్ఞానంబు లుగు వాని
కంటె గంధజ్ఞానలితబృందంబులు-
డు శ్రేష్ఠములు వానికంటె శబ్ద

తెభా-3-966.1-తే.
వేదు లగుదురు శ్రేష్ఠమై వెలయు శబ్ద
విదులకంటెను సద్రూపవేదు లైన
వాయసాదులు శ్రేష్ఠముల్ వానికంటె
రుస బహుపాదు లుత్తముల్ వానికంటె

టీక:- తరళాక్షి = తల్లి {తరళాక్షి - చలించునట్టి కన్నులు కలామె, స్త్రీ}; వినుము = వినుము; అచేతన = చేతనము లేని, ప్రాణము లేని; దేహముల్ = దేహములు; కంటెన్ = కంటెను; చేతన = చేతనము కలిగిన, ప్రాణములు కల; దేహముల్ = దేహములు; శ్రేష్ఠము = ఉత్తమము; అందున్ = వానిలో; ప్రాణవంతంబులు = ప్రాణములు కలిగినవి; ఐ = అయ్యి; స్పర్శన = స్పర్శను తెలియు; జ్ఞానంబున్ = జ్ఞానము; కలుగు = కలిగి ఉండు; చైతన్య = ప్రాణములు కలిగిన; వృక్షముల్ = చెట్ల; కంటెన్ = కంటెను; ఘన = గొప్పదైన; రస = రుచి తెలియు; జ్ఞాన = జ్ఞానముతో; సంకలిత = కూడిన; చేతనులు = ప్రాణులు; ఉత్తములు = ఉత్తమములు; రస = రుచి తెలియు; జ్ఞానంబున్ = జ్ఞానము; కలుగు = ఉన్న; వాని = వాని; కంటెన్ = కంటెను; గంధ = వాసన తెలియు; జ్ఞాన = జ్ఞానముతో; కలిత = కూడిన; బృందంబులున్ = సమూహములు; కడు = మిక్కిలి; శ్రేష్ఠములు = ఉత్తమములు; వాని = వాటి; కంటెన్ = కంటెను; శబ్ద = ధ్వని; వేదులు = తెలిసినవారు; అగుదురు = అవుతారు;
శ్రేష్ఠము = ఉత్తమము; ఐ = అయ్యి; వెలయు = ప్రసిద్ధులైన; శబ్ద = ధ్వని; విదులు = తెలిసినవారి; కంటెను = కంటెను; సత్ = మంచి; రూప = రూపమును; వేదులు = తెలిసినవారు; ఐనన్ = అయినట్టి; వాయస = కాకులు; ఆదులు = మొదలైనవి; శ్రేష్ఠముల్ = ఉత్తమములు; వాని = వాని; కంటెన్ = కంటెను; వరుసన్ = క్రమముగ; బహుపాదులు = అనేకమైన పాదములు కలవి; ఉత్తముల్ = ఉత్తమములు; వాని = వాని; కంటెన్ = కంటెను.
భావము:- “తల్లీ! విను. చైతన్యం లేని రాళ్ళురప్పలకంటే చైతన్యంగల చెట్లుచేమలు శ్రేష్ఠమైనవి. స్పర్శజ్ఞానంగల చెట్లకంటె రసజ్ఞానం (రుచిచూచే శక్తి) గల క్రిమికీటకాలు శ్రేష్ఠమైనవి. వీనికంటె గంధజ్ఞానం (వాసన చూసే శక్తి) కలవి మరీ శ్రేష్ఠం. వీనికంటె శబ్దజ్ఞానం (వినగల శక్తి) కలవి గొప్పవి. ఇలాంటి శబ్దజ్ఞానం కలవాని కంటె కూడా రూపజ్ఞానం (చూడగల శక్తి) కల కాకులు మొదలైనవి ఎంతో శ్రేష్ఠమైనవి. వానికంటే కూడా అనేక పాదాలు కల జెఱ్ఱులు మొదలైనవి శ్రేష్ఠం. వానికంటె...

తెభా-3-967-క.
లఁపఁ జతుష్పదు లధికులు
కొని మఱి వానికంటెఁ బాదద్వయముం
మనుజు లలఘుతము లి
మ్ము వారల యందు వర్ణములు నాల్గరయన్

టీక:- తలపన్ = తరచిచూసిన; చతుష్పాదులు = నాలుక్కాళ్ళ జంతువులు; అధికులు = ఉత్తమములు; బలకొని = సామర్థ్యములు కలిగి; మఱి = మరి; వాని = వాని; కంటెన్ = కంటెను; పాద = పాదముల; ద్వయము = జంట; కల = కలిగిన; మనుజులు = మానవులు; అలఘుతములు = అత్యుత్తములు {అలఘులు - అలఘుతరులు - అలఘుతములు}; ఇమ్ములన్ = ప్రసిద్దముగా; వారలు = వారి; అందున్ = అందు; వర్ణములున్ = వర్ణములు; నాల్గు = నాలుగు (4); అరయన్ = తెలసి చూసినచో.
భావము:- (బహుపాదుల కంటె) చతుష్పాత్తులు (నాలుగు పాదాలు కల ఆవులు మొదలైనవి) గొప్ప. వీనికంటె రెండుపాదాలు గల మానవులు గొప్ప. వీరిలో నాలుగు తెగలున్నాయి.

తెభా-3-968-వ.
అందు.
టీక:- అందున్ = అందులోను.
భావము:- ఆ తెగలలో...

తెభా-3-969-సీ.
తలఁప బ్రాహ్మణు లుత్తములు వారికంటెను-
వేదవేత్తలు, వేదవిదులకంటె
విలసితవేదార్థవిదులు, వారలకంటె-
మధిక శాస్త్రసంయము మాన్పు
మీమాంసకులు, మఱి మీమాంసకులకంటె-
నిజధర్మవిజ్ఞాననిపుణు లరయ
వారికంటెను సంగర్జితచిత్తులు-
గ వారికంటె సద్ధర్మపరులు

తెభా-3-969.1-తే.
ధార్మికులకంటె నుత్తమోత్తములు వినుము
త్సమర్పిత సకలధర్మస్వభావ
హిమములు గల్గి యితర ధర్మములు విడిచి
మత వర్తించు నప్పుణ్యముఁడు ఘనుఁడు.

టీక:- తలపన్ = తరచిచూసిన; బ్రాహ్మణులు = బ్రాహ్మణులు; ఉత్తములు = ఉత్తములు; వారి = వారి; కంటెనున్ = కంటెను; వేదవేత్తులు = వేదము తెలిసిన వారు; వేదవిదుల = వేదములు తెలిసిన వారి; కంటెన్ = కంటెను; విలసిత = విలసిల్లు; వేదార్థవిదులు = వేదముల అర్థము తెలిసినవారు; వారల = వారి; కంటెన్ = కంటెను; సమధిక = మిక్కిలి ఎక్కువగా; శాస్త్ర = శాస్త్రములందలి; సంశయమున్ = సందేహములను; మాన్పు = పోగొట్టు; మీమాంసకులు = మీమాంసకులు; మఱి = మరి; మీమాంసకులు = మీమాంసకులు; కంటెన్ = కంటెను; నిజధర్మ = స్వంతధర్మమునందు; విజ్ఞాన = మంచి జ్ఞానము కలిగిన; నిపుణులు = నైపుణ్యముకలిగినవారు; అరయన్ = తరచిచూసిన; వారి = వారి; కంటెను = కంటెను; సంగ = తగులములు; వర్జిత = వదలిన; చిత్తులు = మనస్సులు కలవారు; తగన్ = అవశ్యము; వారి = వారి; కంటెన్ = కంటెను; సద్ధర్మపరులు = మంచి దార్మికులు;
ధార్మికుల = ధార్మికుల; కంటెన్ = కంటెను; ఉత్తమోత్తములు = అత్యుత్తములు; వినుము = వినుము; మత్ = నాకు; సమర్పిత = సమర్పింపబడిన; సకల = సమస్తమైన; ధర్మ = ధర్మములు; స్వభావ = స్వభావములు; మహిమములున్ = మహిమలును; కల్గి = కలిగి; ఇతర = ఇతరమైన; ధర్మములు = ధర్మములు; విడిచి = వదలిన; సమతన్ = సమత్వమున; వర్తించు = నడవడిక కలవాడగు; ఆ = ఆ; పుణ్యతముడు = అత్యంతపుణ్యవంతుడు {పుణ్యుడు - పుణ్యతరుడు - పుణ్యతముడు}; ఘనుడు = గొప్పవాడు.
భావము:- (ఆ నాల్గు తెగలలో) బ్రాహ్మణులు ఉత్తములు. వీరికంటే వేదవేత్తలు శ్రేష్ఠులు. వీరికంటె వేదార్థం తెలిసినవాళ్ళు గొప్పవారు. వీరికంటె శాస్త్ర సంబంధమైన సందేహాలను చక్కగా తీర్చగల మీమాంసకులు అధికులు. వీరికంటె స్వధర్మపరాయణులు ఉత్తములు. వీరికంటే దేనిపైనా ఆసక్తిలేని నిస్సంగులు గొప్పవారు. వీరికంటె సద్ధర్మం ఆచరించేవారు అధికులు. అటువంటి ధర్మికులకంటే సర్వధర్మాలనూ, సర్వసంపదలనూ, సర్వబాధ్యతలనూ నాకే అర్పించి, అనన్యభావంతో సర్వత్ర సమవర్తనుడై జీవితం గడిపే పుణ్యాత్ముడు ఎంతో గొప్పవాడు.

తెభా-3-970-వ.
అట్టివాని.
టీక:- అట్టివానిన్ = అటువంటివానిని.
భావము:- అటువంటివానిని...

తెభా-3-971-క.
ని సకలభూతగణములు
మున నానందజలధిగ్నము లగుచున్
బహుమాన పురస్సర
యముఁ బాటిల్ల వినుతు ర్థిం జేయున్.

టీక:- కని = చూసి; సకల = సమస్తమైన; భూత = జీవ; గణములున్ = రాసులును; మనమునన్ = మనసులో; ఆనంద = ఆనందము అనెడి; జలధిన్ = సముద్రమున; మగ్నములు = మునిగినవి; అగుచున్ = అవుతూ; ఘన = గొప్ప; బహుమాన = సమ్మానములు; పురస్సరమున్ = పురోగమనములు; అనయమున్ = ఎల్లప్పుడు; పాటిల్లన్ = కలుగునట్లు; వినుతులు = స్తోత్రములు; అర్థిన్ = కోరి; చేయున్ = చేయును.
భావము:- (అటువంటి పుణ్యాత్ముని) సమస్త ప్రాణికోటి ఎంతో గౌరవభావంతో చూచి, ఎప్పుడూ అభినందిస్తూ సంతోష సముద్రంలో మునిగి తేలుతుంటారు.

తెభా-3-972-వ.
అంత; నీశ్వరుండు జీవస్వరూపానుప్రవిష్టుండై యుండు నట్టి భగ వంతుం జూచి భక్తియోగంబుననేని యోగంబుననేనిఁ బురుషుండు పరమాత్మఁ బొందు ప్రకృతిపురుషాత్మకంబును దద్వ్యతిరిక్తంబును నైన దైవంబు నై కర్మవిచేష్టితం బగుచు నుండు; అదియ భగవద్రూపంబు; ఇట్టి భగవద్రూపంబు భేదాస్పదం బగుచు నద్భుత ప్రభావంబు గల కాలం బనియుఁ జెప్పంబడు; అట్టి కాలంబు మహదాదిత త్త్వంబులకును మహత్తత్త్వాభిమాను లగు జీవులకును భయాహం బగుటంజేసి సకల భూతములకు నాశ్రయం బగుచు నంతర్గతంబై భూతంబులచేత భూతంబుల గ్రసించుచు యజ్ఞఫలప్రదాత గావున వశీకృతభూతుండై ప్రభుత్వంబు భజియించి విష్ణుండు ప్రకాశించుచుండు; అతనికి మిత్రుండును శత్రుండును బంధుండును లేఁడు; అట్టి విష్ణుండు సకలజనంబుల యందావేశించి యప్రమత్తుఁడై ప్రమత్తు లయిన జనంబులకు సంహారకుండై యుండు; అతని వలని భయంబునంజేసి వాయువు వీచు సూర్యుం డుదయించు, నింద్రుండు వర్షించు, నక్షత్ర గణంబు వెలుంగుఁ, జంద్రుండు ప్రకాశించు, దత్తత్కాలంబుల వృక్ష లతాదులోషధుల తోడంగూడి పుష్ప ఫలభరితము లగు, సరిత్తులు ప్రవహించు, సముద్రంబులు మేరలు దప్పక యుండు; నగ్ని ప్రజ్వలించు, భూమి గిరులతోఁ గూడ బరువునఁ గ్రుంగ వెఱచు, ఆకాశంబు సకల జనంబులకు నవకాశం బిచ్చు, మహత్తత్త్వంబు జగత్తునకు నంకుర స్వరూపంబు గావున సప్తావరణావృతం బగు లోకం బను స్వదేహంబు విస్తరింపఁ జేయు; గుణాభిమాను లగు బ్రహ్మాదులు సర్వేశ్వరునిచేత జగత్సర్గంబు నందు నియోగింపఁబడి ప్రతిదినంబు నయ్యయి సర్గంబుసేయ నప్రమత్తులై యుండుదురు; పిత్రాదులు పుత్రోత్పత్తిఁ జేయుదురు; కాలుండు మృత్యుసహాయుండై మారకుండై యుండు"అని చెప్పి కపిలుండు వెండియు నిట్లనియె.
టీక:- అంతన్ = అంతట; ఈశ్వరుండు = భగవంతుడు; జీవ = జీవుల యొక్కయు; స్వరూప = స్వరూపము లందు; అనుప్రవిష్టుడు = చక్కగా ప్రవేశించిన వాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; భగవంతునిన్ = భగవంతుడిని; చూచి = చూసి; భక్తియోగంబునన్ = భక్తియోగము మార్గముతో; ఏనిన్ = కాని; యోగంబునన్ = యోగమార్గముతో; ఏనిన్ = కాని; పరమాత్మన్ = పరమాత్మను; పొందున్ = పొందును; ప్రకృతి = పకృతి; పురుష = పురుషుని; ఆత్మకంబును = కూడినవాడును; తత్ = దానికి; వ్యతిరిక్తంబునున్ = వ్యతిరేకమైనదియును; ఐన = అయిన; దైవంబునున్ = దైవమును; ఐ = అయ్యి; కర్మ = కర్మముల యందు; విచేష్టితంబున్ = ప్రవర్తించువి ప్రవర్తింపనివి; అగుచున్ = అగుతూ; ఉండున్ = ఉండును; అదియ = అదే; భగవత్ = భగవంతుని; రూపంబున్ = స్వరూపము; ఇట్టి = ఇటువంటి; భగవత్ = భగవంతుని; రూపంబున్ = రూపము; భేద = భేదములకు; ఆస్పదంబున్ = నివాసము; అగుచున్ = అవుతూ; అద్భుత = అద్భుతమైన; ప్రభావము = ప్రభావము; కల = కలిగిన; కాలంబున్ = కాలము; అనియున్ = అనికూడ; చెప్పంబడున్ = చెప్పబడును; అట్టి = అటువంటి; కాలంబున్ = కాలము; మహత్ = మహత్తు; ఆది = మొదలగు; తత్త్వంబుల్ = తత్త్వముల; కునున్ = కును; మహత్తత్త్వ = మహత్తత్త్త్వ నందు; అభిమానులు = అభిమానము కలవి; అగు = అయిన; జీవుల్ = జీవుల; కునున్ = కును; భయా = భయమును; ఆవహంబున్ = కలుగజేయునది; అగుటన్ = అగుట; చేసి = వలన; సకల = సమస్తమైన; భూతముల్ = భూతములు; కున్ = కి; ఆశ్రయంబున్ = ఆశ్రయము; అగుచున్ = అవుతూ; అంతర్గతంబున్ = లోపల ఉండునది; ఐ = అయ్యి; భూతంబుల్ = జీవుల; చేతన్ = చేత; భూతంబులన్ = జీవులను; గ్రసించుచున్ = మ్రింగుచు; యజ్ఞ = యజ్ఞము యొక్క; ఫల = ఫలితములను; ప్రధాత = ఇచ్చువాడు; కావునన్ = కనుక; వశీకృత = వశముచేసుకొనబడ్డ; భూతుండు = జీవులు కలవాడు; ఐ = అయ్యి; ప్రభుత్వంబున్ = ప్రభుత్వమును; భజియించి = వశపరచుకొని; విష్ణుండు = విష్ణువు; ప్రకాశించుచున్ = ప్రకాశిస్తూ; ఉండున్ = ఉండును; అతనికి = అతనికి; మిత్రుండును = మిత్రుడును; శత్రుండును = శత్రువును; బంధుండును = బంధువును; లేడు = లేడు; అట్టి = అటువంటి; విష్ణుండు = విష్ణుమూర్తి; సకల = సమస్తమైన; జనంబుల = జనుల; అందున్ = అందును; ఆవేశించి = ప్రవేశించినవాడై; అప్రమత్తుడు = ఏమరుపాటు లేనివాడు; ఐ = అయ్యి; ప్రమత్తులు = మిక్కిలి మాయామోహితులు; అయిన = అయినట్టి; జనంబులకున్ = జనులను; సంహారకుండు = సంహరించువాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అతని = అతని; వలని = అందలి; భయంబునన్ = భయము; చేసి = వలన; వాయువు = గాలి; వీచున్ = వీచును; సూర్యుండు = సూర్యుడు; దపియించున్ = వేడిని పుట్టించును; ఇంద్రుడు = ఇంద్రుడు; వర్షించున్ = వర్షములను కురుపించును; నక్షత్ర = నక్షత్ర; గణంబున్ = సమూహములు; వెలుంగున్ = వెలుగును; చంద్రుండు = చంద్రుడు; ప్రకాశించుచున్ = ప్రకాశించును; తత్తత్ = ఆయా; కాలంబులన్ = కాలములలో; వృక్ష = చెట్లు; లత = తీగలు; అదులు = మొదలైనవి; ఓషధులన్ = మొక్కలు; తోడంగూడి = తోపాటు; పుష్ప = పూలు; ఫల = పండ్లు తో; భరితములు = నిండైనవి; అగున్ = అగును; సరిత్తులు = నదులు; ప్రవహించున్ = ప్రవహించును; సముద్రంబులున్ = సముద్రములు; మేరలు = గట్లు; తప్పక = దాటకుండగ; ఉండున్ = ఉండును; అగ్ని = అగ్ని; ప్రజ్వలించు = చక్కగా మండును; భూమి = భూమి; గిరుల = పర్వతముల; తోన్ = తో; కూడన్ = కూడ; బరువునన్ = బరువు వలన; క్రుంగన్ = కుంగిపోవుటకు; వెఱచున్ = భయపడును; ఆకాశంబున్ = ఆకాశము; సకల = సమస్తమైన; జనంబుల్ = వాని; కున్ = కిని; అవకాశంబున్ = ఖాళీ స్థలమును; ఇచ్చు = ఇచ్చును; మహత్తత్త్వంబున్ = మహత్తత్త్వము; జగత్తున్ = విశ్వమున; కున్ = కు; అంకుర = విత్తనము వంటి; స్వరూపంబున్ = రూపము కలది; కావునన్ = అందుచేత; సప్తావరణ = సప్తావరణలచే {సప్తావరణలు - 1మహత్తు 2అహంకారము 3పంచభూతములు ఐదు అనెడి ఈ ఏడు (7) ఆవరణలు}; ఆవృతంబున్ = ఆవరింపబడినది; అగు = అయిన; లోకంబున్ = లోకము; అను = అనెడి; స్వదేహంబున్ = తన శరీరమును; విస్తరింపన్ = విస్తరించునట్లు; చేయున్ = చేయును; గుణ = త్రిగుణముల అందు {త్రిగుణములు - సత్త్వరజస్తమోగుణములు}; అభిమానులు = ఆపేక్ష కలవారు; అగు = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలగువారు; సర్వేశ్వరుని = భగవంతుని {సర్వేశ్వరుడు - సర్వులపైన ఈశ్వరుడు , విష్ణువు}; చేతన్ = చేత; జగత్తున్ = విశ్వము; సర్గంబున్ = సృష్టి {నవవిధసర్గములు - 1మహత్సర్గము 2అహంకారసర్గము 3భూతసర్గము 4ఇంద్రియసర్గము 5దేవసర్గము 6తమస్సర్గము 7వనస్పత్యాదిసర్గము 8 తిర్యక్సర్గము 9మనుష్యసర్గము ఇవికాక కుమారసర్గము ఒకటుంది అదికూడ వానిలోని భాగమే}; అందున్ = అందు; నియోగింపబడి = ఆజ్ఞాపించబడి; ప్రతిదినంబున్ = నిత్యమును; అయ్యయి = ఆయా; సర్గంబున్ = సృష్టికార్యములు; చేయన్ = చేయుట యందు; అప్రమత్తులు = జాగరూకులు; ఐ = అయ్యి; ఉండుదురు = ఉంటారు; పిత్ర = పితృదేవతలు; ఆదులు = మొదలగువారు; పుత్ర = సంతానమును; ఉత్పత్తి = పుట్టించుట; చేయుదురు = చేసెదరు; కాలుండు = కాలము అను దేవుడు, యముడు; మృత్యు = మృత్యుదేవత; సహాయుండు = సహాయము కలవాడు; ఐ = అయ్యి; మారకుండు = చంపువాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అని = అని; చెప్పి = చెప్పి; కపిలుండు = కపిలుడు; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అప్పుడు దేవుడు జీవుని స్వరూపాన్ని ఏర్పరచుకొని అందులో ప్రవేశించి ఉంటాడు. అటువంటి జీవునిలో ఉన్న దేవుని యోగమార్గంతో కాని, భక్తిమార్గంతో కాని పురుషుడు పొందగలుగుతాడు. ఆ పరమాత్మ ప్రకృతి పురుషులతో కూడి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ పరమాత్మయే ప్రకృతినుండి వేరై కర్మలు చేయనివాడై కూడా ఉంటాడు. ఇదే భగవంతుని రూపం. ఇది జీవులందుగల పరస్పర భేదాలకు ఆధారమై అత్యంత శక్తిమంతమై ఉంటుంది. అదే కాలం అనబడుతుంది. అటువంటి కాలం మహదాది తత్త్వాలకు, మహత్తత్త్వాభిమానులకు భీతి గొల్పుతుంది. అందుకనే అది అన్ని జీవులకు ఆశ్రయమై, ఆ జీవులలో ఉంటూ ఒక ప్రాణిచేత మరొక ప్రాణిని గ్రసింపజేస్తుంది. భగవంతుడైన విష్ణువు యజ్ఞఫల ప్రదాతయై, ఆ జీవులను స్వాధీనంలో ఉంచుకొని, వాటిని పాలించే మహారాజుగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతనికి ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు బంధువు అంటూ ఎవరూ లేరు. అటువంటి విష్ణువు అందరిలోను ఆవేశించి అప్రమత్తుడై ఉంటాడు. ప్రమత్తులైన వారిని అణచివేస్తుంటాడు. ఆ పరమాత్ముని గురించిన భయం వల్లనే గాలి వీస్తుంది. సూర్యుడు ఎండ కాస్తాడు. ఇంద్రుడు వాన కురిపిస్తాడు. నక్షత్రాలు వెలుగుతాయి. చంద్రుడు వెన్నెలలు వెదజల్లుతాడు. ఆయా కాలాలలో చెట్లూ, తీగలూ మొదలైనవి ఓషధులతో కూడి పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. నదులు ప్రవహిస్తాయి. సముద్రాలు హద్దు మీరకుండా ఉంటాయి. అగ్ని మండుతుంది. భూమి కొండల బరువుకు క్రుంగకుండా ఉంటుంది. ఆకాశం అందరికీ చోటిస్తుంది. మహత్తత్త్వమే ఈ లోకానికి మూలభూతమైనది. ఏడు ఆవరణాలు గల ఈ లోకం అనే తన దేహాన్ని విస్తరింపచేస్తుంది. బ్రహ్మ మొదలైనవాళ్ళు సర్వేశ్వరుని ద్వారా ఈలోకసృష్టి నిమిత్తం నియమింపబడినవారై ప్రతిదినం ఆయా సృష్టికార్యక్రమాలలో జాగరూకులై ఉంటారు. తండ్రులు కుమారులకు జన్మనిస్తారు. కాలస్వరూపుడైన యముడు మృత్యుదేవత సాయంతో జీవులను చంపుతూ ఉంటాడు. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం అంతా భగవంతుని కట్టడిలో ఉంటుంది” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-973-క.
"నెఱి నిట్టి నిఖలలోకే
శ్వరుని పరాక్రమముఁ దెలియ సామర్థ్యంబె
వ్వరికినిఁగలుగదు మేఘము
రువలి విక్రమముఁ దెలియఁగా లేని గతిన్.

టీక:- నెఱిన్ = పూర్తిగ; ఇట్టి = ఇటువంటి; నిఖలలోకేశ్వరుని = సర్వేశ్వరుని; పరాక్రమమును = సామర్థ్యము {పరాక్రమము - పర (గొప్ప) క్రమము (విధానము)}; తెలియన్ = తెలిసికొనగల; సామర్థ్యము = నేర్పు; ఎవ్వరికిని = ఎవరికీ; కలుగదు = ఉండదు; మేఘము = మేఘము; కరువలి = గాలి యొక్క; విక్రమమున్ = సామర్థ్యమును; తెలియగన్ = తెలిసికొన; లేని = లోని; గతిన్ = విధముగ.
భావము:- “గాలిలో ఎగిరే మేఘానికి గాలిశక్తిని తెలుసుకొనే శక్తి ఉండదు. అదేవిధంగా సకల లోకేశ్వరుడైన భగవంతుని శక్తిని గుర్తించే శక్తి ఎవ్వరికీ ఉండదు.

తెభా-3-974-క.
గువా! విను సుఖహేతుక
గు నర్థము దొరకమికి మహాదుఃఖమునం
గులుదు రిది యంతయు నా
వంతుని యాజ్ఞఁజేసి ప్రాణులు మఱియున్.

టీక:- మగువా = తల్లీ; విను = వినుము; సుఖ = సుఖమునకు; హేతువు = కారణము; అగు = అగునట్టి; అర్థమున్ = వస్తువు; దొరకమి = లభించకపోవుట; కి = చేత; మహా = మిక్కిలి; దుఃఖమునన్ = దుఃఖమునందు; తగులుదురు = చెందెదురు; ఇది = ఇది; అంతయున్ = అంతా; భగవంతునిన్ = భగవంతుని; ఆజ్ఞ = ఆజ్ఞను; చేసి = అనుసరించి; ప్రాణులు = జీవులందరు; మఱియున్ = మరియును.
భావము:- అమ్మా! విను. దేనివల్ల సుఖం దొరుకుతుందో అది దొరకకపోవడం వల్ల జనులు దుఃఖాలపాలు అవుతున్నారు. ఇదంతా భగవంతుని ఆజ్ఞానుసారం జరుగుతూ ఉంటుంది. ఇంకా...

తెభా-3-975-సీ.
పూని యసత్యంబులైన గృహక్షేత్ర-
శు ధన సుత వధూ బాంధవాది
వివిధ వస్తువులను ధ్రుముగా మది నమ్మి-
ఱలు దుర్మతి యగువాఁడు జంతు
సంఘాత మగు దేహసంబంధమున నిల్చి-
ర్థి నయ్యై యోను లందుఁ జొరఁగ
నుగమించును వాని యందు విరక్తుండు-
కాక యుండును నరస్థుఁ డైన

తెభా-3-975.1-తే.
దేహి యాత్మీయదేహంబు దివిరి వదల
లే తన కది పరమసౌఖ్యారంబు
గాఁగ వర్తించు నదియును గాక యతఁడు
దేమాయావిమోహితభావుఁ డగుచు.

టీక:- పూని = పూని; అసత్యంబులు = నిజము కానివి; ఐన = అయినట్టి; గృహ = ఇల్లు; క్షేత్ర = పొలము; పశు = పశువులు; ధన = ధనము; సుత = సంతానము; వధూ = భార్య; బాంధవ = బంధువు; ఆది = మొదలైన; వివిధ = రకరకముల; వస్తువులను = వస్తువులను; ధ్రువముగా = స్థిరమైనవిగా; మదిన్ = మనసున; నమ్మి = నమ్మి; వఱలు = ప్రవర్తిల్లు; దుర్మతి = దుర్బుద్ధి; అగువాడు = అయినవాడు; జంతు = జంతువుల; సంఘాతము = గుంపులోది; అగు = అయిన; దేహ = శరీరముతోని; సంబంధమునన్ = సంబంధములందు; నిల్చి = ఉండి; అర్థిన్ = కోరి; అయ్యై = ఆయా; యోనులు = గర్భముల; అందున్ = లో; చొరగన్ = ప్రవేశించినవాడై; అనుగమించును = వెంటబడును; వాని = వాటి; అందున్ = అందే; విరక్తుండు = విరక్తి చెందినవాడు; కాక = కాకుండగ; ఉండును = ఉండును; నరకస్థుడు = నరకమునకు పోవువాడు; ఐనన్ = అయినను;
దేహి = జీవుడు; ఆత్మీయ = తన యొక్క; దేహంబున్ = శరీరమును; తివిరి = పూనుకొని; వదలన్ = వదలిపెట్ట; లేక = లేక; తన = తన; కున్ = కు; అది = అది; పరమ = అత్యంత; సౌఖ్య = సౌఖ్యమును; ఆకరంబున్ = కలిగించునది; కాగన్ = అయినట్లు; వర్తించున్ = నడచును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; అతడు = అతడు; దేవ = దేవుని; మాయా = మయయందు; విమోహిత = మిక్కిలి మోహము చెందుటను; భావుడు = పొందినవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- అశాశ్వతాలైన ఇల్లు, పొలం, పశువులు, ధనం, సంతానం, భార్య, బంధువులు మొదలైన వస్తువులే శాశ్వతం అని నమ్మి దుష్టబుద్ధియైన మానవుడు అనేకప్రాణుల శరీరాలను పొందుతూ వివిధ యోనుల్లో జన్మిస్తూ ఉంటాడు. వానిపట్ల విరక్తి చెందడు. నరకం అనుభవించిన తర్వాతకూడా దేహి తన దేహాన్ని వదలక అదే ఎంతో సుఖప్రద మైనదిగా భావించి దానినే అంటిపెట్టుకొని ఉంటాడు. అంతేకాక అతడు దేవుని మాయకు లొంగినవాడౌతాడు.

తెభా-3-976-క.
ముగఁ బుత్ర వధూపశు
గృహరక్షణము నందు త్తత్క్రియలన్
మునఁ దలపోయుచు దిన
దిమున్ దందహ్యమాన దేహుం డగుచున్.

టీక:- ఘనముగన్ = గొప్పగా; పుత్ర = కొడుకులు; వధూ = భార్య; పశు = పశువులు; ధన = సంపద; గృహ = ఇళ్ళ యొక్క; రక్షణము = కాపాడుట; అందున్ = లోను; తత్తత్ = ఆయా; క్రియలన్ = పనులను; మనమునన్ = మనసులో; తలపోయుచున్ = స్మరిస్తూ; దినదినమున్ = రోజురోజుకిని; దందహ్యమాన = దహించుకుపోతున్న; దేహుండున్ = దేహము కలవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- కుమారులు, భార్య, పశువులు, ధనం, ఇల్లు మొదలైన వానిని రక్షించుకొనే ఆలోచనలతో దినదినమూ వేగిపోతూ క్రాగిపోయిన దేహంతో క్రుంగి కృశిస్తూ...

తెభా-3-977-క.
తి మూఢహృదయుఁ డగుచు దు
రికర్మారంభమునఁ జరించుచుఁ దరుణీ
కృగోప్యభాషణములను
సులాలనభాషణములఁ జొక్కుచు మఱియున్.

టీక:- అతి = మిక్కిలి; మూఢ = మోహము చెందిన; హృదయుడు = హృదయము కలవాడు; అగుచున్ = అవుతూ; దురిత = పాపపు; కర్మ = పనులను; ఆరంభమునన్ = సంకల్పించుచు; చరించున్ = ప్రవర్తిల్లును; తరుణీ = స్త్రీలచే {తరుణి - తరుణ వయస్సున ఉన్నామె, స్త్రీ}; కృత = చేయబడు; గోప్య = రహస్యపు; భాషణములను = మాటలను; సుత = సంతానము యొక్క; లాలన = బుజ్జగింపు; భాషణములన్ = మాటలకును; చొక్కుచున్ = పరవశించిపోతూ; మఱియున్ = ఇంకను.
భావము:- తెలివిలేనివాడై పాపకార్యాలను ఆచరిస్తూ ఇల్లాలి సరస సల్లాపాలతోనూ, పిల్లల ముద్దుమాటలతోనూ మురిసిపోతూ (ఉంటాడు). ఇంకా...

తెభా-3-978-క.
విను, మింద్రియ పరవశుఁడై
మునుకొని తత్కూటధర్మములు గల దుఃఖం
యము సుఖరూపంబుగ
మునఁ దలపోసి తదభిమానుం డగుచున్.

టీక:- వినుము = వినుము; ఇంద్రియ = ఇంద్రియము లందు; పరవశుడు = మిక్కిలి లొంగినవాడు; ఐ = అయ్యి; మునుకొని = పూనుకొని; తత్ = ఆ; కూట = మోసపు; ధర్మములు = విధులందు; కల = ఉన్నట్టి; దుఃఖంబున్ = దుఃఖమును; అనయము = అత్యంతమైన; సుఖ = సుఖము యొక్క; రూపంబుగన్ = రూపము అయినట్లు; మనమునన్ = మనస్సులో; తలపోసి = అనుకొని; తత్ = వాని యందు; అభిమానుండు = అభిమానము కలవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- విను. ఇంద్రియాలకు లొంగి వాటి కుటిల గుణాలవల్ల కలిగే దుఃఖాన్నే పరమసుఖంగా భావించి, ఆ ఇంద్రియాలపై మరింత అభిమానాన్ని పెంచుకుంటూ...

తెభా-3-979-క.
తముఁ దమతమ సంపా
ది మగు నర్థములచేత ధృతిఁ బరులకుఁ గు
త్సిమతి హింసలు చేయుచు
తి మూఢమనస్కు లగుచు నాత్మజనములన్.

టీక:- సతతమున్ = ఎల్లప్పుడును; తమతమ = తమతమ; సంపాదితము = సంపాదించినవి; అగున్ = అయిన; అర్థముల = ధనముల; చేతన్ = చేత; ధృతిన్ = ధైర్యముతో; పరుల్ = ఇతరుల; కున్ = కు; కుత్సిత = నీచపు; మతిన్ = బుద్ధితో; హింసలున్ = బాధలను; చేయుచున్ = పెడుతూ; అతి = మిక్కిలి; మూఢ = మోహమున పడిన; మనస్కులు = మనస్సులు కలవారు; అగుచున్ = అవుతూ; ఆత్మ = తన; జనములన్ = వారిని;
భావము:- ఎప్పుడూ తాము సంపాదించుకొన్న ధనాన్ని చూచుకొని పొంగిపోతూ, కుటిలబుద్ధి కలవాడై ఇంతరులను హింసిస్తూ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ, తనవాళ్ళను....

తెభా-3-980-తే.
పూని రక్షించుచును వారిభుక్తశేష
నుభవించుచు నంత జీనమువోకఁ
డఁగి మఱిమఱి యపరార్థకాముఁ డగుచు
త్త్వమెడలి కుటుంబపోణము నందు.

టీక:- పూని = పూని; రక్షించుచున్ = కాపాడుతూ; వారి = వారి యొక్క; భుక్తశేషమునున్ = ఎంగిలిని, అనుభవించగా మిగిలినది; అనుభవించుచున్ = అనుభవిస్తూ; అంతన్ = అంతట; జీవనము = బ్రతుకు తెరువు; పోకన్ = గడవక; కడగి = పూని; మఱిమఱి = మరిమరి; అపర = ఇహలోకము; అర్థ = కోసమైన; కాముడు = కోరికలు కలవాడు; అగుచున్ = అవుతూ; సత్త్వము = సత్తువ; ఎడలి = తగ్గిపోయి; కుటుంబ = కుటుంబమును; పోషణమున్ = పోషించుట; అందున్ = కొరకు.
భావము:- పోషించుకుంటూ, వారు తినగా మిగిలినది తాను తింటూ, అప్పటికీ సంసారాన్ని ఈదలేక, బ్రతుకు బరువు భరించలేక స్వార్థపరుడై జవసత్త్వాలు కోల్పోయి, కుటుంబాన్ని పోషించడానికి...

తెభా-3-981-సీ.
లిమి సాలక మందభాగ్యుఁడై కుమతి యై-
పూని యపుడు క్రియాహీనుఁ డగుచు
విలి వృథాప్రయత్నంబులు సేయుచు-
మూఢుఁడై కార్పణ్యమునఁ జరించు
ట్టి యకించనుఁ గువానిఁ జూచి త-
ద్దారసుతాదు లాత్మలను వీఁడు
డు నశక్తుఁడు ప్రోవఁగాఁజాలఁ డితఁ డని-
సెగ్గింతు రర్థిఁ గృషీవలుండు

తెభా-3-981.1-తే.
డుగు ముసలెద్దు రోసిన గిది నంత
తఁడు నేవెంటలను సుఖం బందలేక
తాను బోషించు జనులు దన్ నరఁ బ్రోవ
బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపఱుప.

టీక:- బలిమి = శక్తి; చాలకన్ = సరిపడక; మంద = మందగించిన; భాగ్యుడు = అదృష్టము కలవాడు; ఐ = అయ్యి; కుమతి = దుర్భుద్ధి; ఐ = అయ్యి; పూని = పూని; అపుడున్ = అప్పుడు; క్రియా = పని; హీనుడు = లేనివాడు; అగుచున్ = అవుతూ; తవిలి = చిక్కుకొని; వృథా = వ్యర్థపు; ప్రయత్నంబులున్ = ప్రయత్నములు; చేయుచున్ = చేస్తూ; మూఢుడు = మోహమున పడినవాడు; ఐ = అయ్యి; కార్పణ్యమున = దీనత్వముతో; చరించున్ = ప్రవర్తిల్లుతుండు; అట్టి = అటువంటి; అకించనుడు = దరిద్రుడు; అగు = అయిన; వానిన్ = వానిని; చూచి = చూసి; తత్ = ఆ; దార = భార్య; సుత = సంతానము; ఆదులు = మొదలైనవారు; ఆత్మలను = మనస్సులలో; వీడు = వీడు; కడున్ = మిక్కిలి; అశక్తుడు = బలహీనుడు; ప్రోవగాన్ = పోషించుటకు; చాలడు = సమర్థుడుకాదు; ఇతడు = ఇతడు; అని = అని; సెగ్గింతురు = రోయుదురు, అసహ్యించుకొందురు; అర్థిన్ = కోరి; కృషీవలుండు = రైతు;
బడుగు = కృశించిన; ముసలి = ముసలి; ఎద్దున్ = ఎద్దును; రోసిన = అసహ్యించుకొనిన; పగిదిన్ = విధముగా; అంతన్ = అంతట; అతడు = అతడు; ఏ = ఏ; వెంటలను = దారిలోను; సుఖంబున్ = సుఖమును; అంద = పొంద; లేక = లేక; తానున్ = తను; పోషించు = పోషించెడి; జనుల్ = జనములు; తన్ = తనను; తనరన్ = అతిశయించి; ప్రోవన్ = పోషిస్తుండగ; బ్రతుకున్ = జీవించును; ముదిమి = ముసలి తనము; మిక్కిలి = అధికముగ; బాధ = బాధలు; పఱుపన్ = పెడుతుండగా.
భావము:- శక్తి చాలక, అదృష్టం సన్నగిల్లి, కుటిల బుద్ధితో ఏ విధమైన పనులూ చేయలేని సోమరిపోతై పనికిరాని ప్రయత్నాలు చేస్తూ, పరమ మూర్ఖుడై దీనంగా తిరుగుతూ ఉంటాడు. రైతు బక్కచిక్కిన ముసలి ఎద్దును అసహ్యించుకొన్నట్లు ఆ దరిద్రుణ్ణి చూచి అతని ఆలుబిడ్డలు ‘ఇతడు అశక్తుడు, ఈ పనికిమాలినవాడు మనలను పోషింపలేడు’ అని ఏవగించుకొంటారు. ఈవిధంగా అతడు ఎక్కడా ఏ విధంగానూ సుఖంలేక ఇన్నాళ్ళూ తాను ఎవరినైతే తిండిపెట్టి పోషించాడో వారు పెట్టే తిండి తింటూ, ముసలితనంతో మూలుగుతూ బాధగా బరువుగా బ్రతుకును ఈడుస్తూ (ఉంటాడు).

తెభా-3-982-క.
వెరూపు దాల్చి బాంధవు
లఁగ నిర్యాణమునకు భిముఖుఁడై యి
ల్వెలఁగజాలక శునకము
డువునఁ గుడుచుచును మేను డవడ వడఁకన్

టీక:- వెడ = వికృత; రూపు = రూపము; తాల్చి = ధరించి; బాంధవులున్ = బంధువులు; అడలగన్ = భయపడుతుండగ; నిర్యాణమున్ = మరణమున; కున్ = కు; అభిముఖుడు = ఎదురుపడ్డవాడు; ఐ = అయ్యి; ఇల్లు = ఇంటినుండి; వెడలగన్ = బయటకు పోవుటకు; చాలకన్ = శక్తి లేక; శునకము = కుక్క; వడువునన్ = వలె; కుడుచుచున్ = తింటూ; మేనున్ = శరీరము; వడవడ = గజగజ; వడకన్ = వణుకుతుండగా.
భావము:- రూపం మారిపోగా, బంధువులందరూ ఏవగిస్తుండగా, అంత్యకాలం సమీపించగా, గడప దాటి వెళ్ళలేక కుక్కలా తింటూ, శరీరంలో వణుకు పుట్టుకురాగా...

తెభా-3-983-సీ.
తిరోగ పీడితుండై మంద మగు జఠ-
రాగ్నిచే మిగుల నల్పాశి యగుచు
మెఱసి వాయువుచేత మీఁదికి నెగసిన-
న్నులు కఫమునఁ ప్పబడిన
నాళంబులను గంఠనాళంబునను ఘుర-
ఘుర మను శబ్దము దొరయ బంధు
నుల మధ్యంబున యనించి బహువిధ-
ములఁ దన్ను బిలువంగ లుకలేక

తెభా-3-983.1-తే.
టులతర కాలపాశవశంగతాత్ముఁ
గుచు బిడ్డలఁ బెండ్లాము రసి ప్రోచు
చింత వికలములైన హృషీకములును
లిగి విజ్ఞానమును బాసి ష్టుఁ డగుచు.

టీక:- అతి = అధికముగ; రోగ = రోగములతో; పీడితుండు = బాధింపబడువాడు; ఐ = అయ్యి; మందము = తగ్గినది; అగు = అయిన; జఠరాగ్ని = జీర్ణశక్తి; చేన్ = చేత; మిగులన్ = మిక్కిలి; అల్ప = కొంచమే; ఆశి = తినువాడు; అగుచున్ = అవుతూ; మెఱసి = ఉద్రేకించిన; వాయువు = వాయువు; చేతన్ = వలన; మీది = పై; కిన్ = కి; ఎగసిన = ఎగసిన; కన్నులు = కళ్ళు; కఫమునన్ = శ్లేష్మముచే; కప్పబడిన = పూడుకుపోయిన; నాళంబులను = నాసాది నాళములును; కంఠ = కంఠము యొక్క; నాళమునను = నాళమునుండి; ఘురఘుర = గురగుర; అను = అనెడి; శబ్దమున్ = ధ్వనులు; తొరయన్ = కలుగుతుండగ; బంధు = బంధువులైన; జనుల = జనములు; మధ్యంబునన్ = మధ్యలో; శయనించి = పడుకొని; బహు = అనేక; విధములన్ = విధములుగా; తన్నున్ = తనను; పిలువంగా = పిలవగా; పలుక = మారు పలుక; లేక = లేక;
చటులతర = మిక్కిలి భయంకరమైన {చటులము- చటుల తరము - చటులతమము}; కాలపాశ = యముని పాశములకు; వశంగత = లొంగిపోయిన; ఆత్ముడున్ = ఆత్మకలవాడు; అగుచున్ = అవుతూ; బిడ్డలన్ = పిల్లలను; పెండ్లామున్ = భార్యను; అరసి = కనుగొని, కనిపెట్టి; ప్రోచు = కాపాడెడి; చింతన్ = బాధతో; వికలములు = కలవరపెడుతున్నవి; ఐన = అయిన; హృషీకములును = ఇంద్రియములును; కలిగి = ఉండి; విజ్ఞానమున్ = తెలివి; పాసి = తప్పిపోయి; కష్టుడు = కష్టపడుతున్నవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- నానావిధాలైన వ్యాధులు బాధించగా, జఠరాగ్ని మందగించగా, తిండి పడిపోయి, ఆయాసం అతిశయించి, మిడిగ్రుడ్లు పడి, కంఠనాళం మూసుకుపోయి, గొంతులో గురక పుట్టి, బంధువుల అందరిమధ్య పండుకొని, వారు తనను పలుకరిస్తూంటే బదులు పలకడానికి నోరు పెకలక, భయంకరాలైన యమపాశాలు శరీరానికి చుట్టుకోగా, భార్యను పిల్లలను ఎవరు పోషిస్తారా అనే దిగులుతో శిథిలమై పోయిన ఇంద్రియాలతో తెలివి కోల్పోయినవాడై గిలగిలలాడుతూ...

తెభా-3-984-వ.
అంత మరణావస్థం బొందు సమయంబున నతి భయంకరాకారులు సరభసేక్షణులు నగు యమదూత లిద్దఱు దన ముందఱ నిలిచినం జూచి; త్రస్తహృదయుండై శకృన్మూత్రంబులు విడుచుచు; యమపాశంబులచే గళంబున బద్ధుండై శరీరంబువలన నిర్గమించి; యాతనా శరీరంబు నవలంబించి బలాత్కారంబున దీర్ఘంబై దుర్గమం బగు మార్గంబును బొంది; రాజభటులచే నీయమానుం డగుచు; దండనంబున కభిముఖుండై చను నపరాధి చందంబునఁ జనుచుండి.
టీక:- అంతన్ = అంతట; మరణ = చనిపోవు; అవస్థన్ = పరిస్థితిని; పొందు = పొందెడి; సమయంబునన్ = సమయములో; అతి = మిక్కిలి; భయంకర = భయంకరమైన; ఆకారులు = ఆకారములు కలవారు; సరభస = తొందరపాటు; ఈక్షణులు = దృష్టి కలవాడు; అగు = అయిన; యమదూతలు = యమకింకరులు; ఇద్దఱు = ఇద్దరు; తన = తన; ముందఱ = ముందు; నిలచినన్ = నిలువగా; చూచి = చూసి; త్రస్త = భయపడిన; హృదయుండు = హృదయము కలవాడు; ఐ = అయ్యి; శకృత్ = మలము; మూత్రంబులున్ = మూత్రములు; విడుచుచున్ = విడుస్తూ; యమపాశంబుల్ = యమపాశముల; చేన్ = చేత; గళంబునన్ = కంఠమున; బద్ధుండు = కట్టబడినవాడు; ఐ = అయ్యి; శరీరంబున్ = శరీరము; వలనన్ = నుండి; నిర్గమించి = విడిచి; యాతనాశరీరంబున్ = యాతనాశరీరమును {యాతనాశరీరము - మరణ సమయమున భౌతిక దేహము విడిచి యమలోకపు శిక్షలకు అనువగుటకు జీవుడు దాల్చు దేహము}; అవలంబించి = ధరించి; బలాత్కారంబునన్ = బలవంతముగ; దీర్ఘబున్ = పొడవైనదియును; దుర్గమంబున్ = చొరరానిదియును; అగు = అయిన; మార్గంబునున్ = దారిని; పొంది = చెంది; రాజభటుల = యమభటుల; చేన్ = చేత; ఈయమానుండు = ఈడ్చబడుతున్నవాడు; అగుచున్ = అవుతూ; దండనంబున్ = శిక్షించబడుట; కున్ = కు; అభిముఖుండు = ఎదురుపడువాడు; ఐ = అయ్యి; చను = వెళ్ళు; అపరాధి = తప్పుచేసినవాని; చందంబునన్ = వలె; చనుచున్ = వెళ్లుతూ; ఉండి = ఉండి.
భావము:- అంతలో మృత్యువు ముంచుకురాగా మిక్కిలి భయంకరమైన రూపాలతో తీక్షణమైన చూపులతో ఇద్దరు యమదూతలు తనముందు వచ్చి నిలబడగా, వాళ్ళను చూచి గుండెలు పగిలి మలమూత్రాలను విడుస్తూ, యమపాశాలు కంఠాన్ని బంధించగా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి యాతనాశరీరంలో ప్రవేశించి, పొడవుగా ఉండి నడవడానికి వీలులేని మార్గంలో యమభటులు బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళుతుంటే, రాజభటులవెంట అపరాధిలా శిక్షలు అనుభవించడానికి సంసిద్ధుడై వెళ్తూ...

తెభా-3-985-చ.
యము మూర్ఛ నొందు శునకావళిచేతను భక్ష్యమాణుఁడై
నుపమ కాలకింకర భయంకర తర్జనగర్జనంబులన్
ము గలంగ దేహము సస్తముఁ గంపము వొందగాఁ బురా
భవ పాపకర్మసముదాయముఁ జిత్తములోఁ దలంచుచున్.

టీక:- అనయమున్ = మిక్కిలి; మూర్ఛన్ = మూర్ఛను; పొందుచున్ = చెందుతూ; శునక = కుక్కల; ఆవళి = గుంపు; చేతను = చేత; భక్ష్యమానుండు = తినబడుతున్నవాడు; ఐ = అయ్యి; అనుపమ = సాటిలేని; కాలకింకర = యమభటుల; భయంకర = భయంకరమైన; తర్జన = అదలింపులకును; గర్జనలు = కోపించుటలును; మనమున్ = మనస్సు; కలంగ = కలతపడగా; దేహము = శరీరము; సమస్తమున్ = అంతయు; కంపమున్ = వణుకును; పొందగా = చెందగా; పురాతన = పాత; భవ = సంసారపు; పాప = పాపపు; కర్మ = కర్మల; సముదాయమున్ = సమూహములను; చిత్తము = మనస్సు; లోన్ = లో; తలంచుచున్ = స్మరిస్తూ.
భావము:- అక్కడ కుక్కలు పీక్కుతింటుంటే మూర్ఛపోతాడు. యమభటులు భయంకరంగా అరుస్తూ చేసే అదలింపులకు, బెదరింపులకు మనస్సు కలత చెందగా, శరీరమంతా కంపించిపోగా, పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పరితపిస్తూ...

తెభా-3-986-సీ.
నుపమ క్షుత్తృష్ణ లంతర్వ్యధలఁ జేయ-
ఝంఝానిలజ్వలజ్జ్వలన చండ
భానుప్రదీప్తి తప్తం బైన వాలుకా-
మార్గానుగత తప్యమాన గాత్రుఁ
డై వీఁపుఁ గశలచే డువంగ వికలాంగుఁ-
గుచు మార్గము నందు చట నచటఁ
జాల మూర్ఛిల్లి యాశ్రయశూన్య మగు నీళ్ళ-
మునుఁగుచు లేచుచు మొనసి పాప

తెభా-3-986.1-తే.
రూపమయిన తమముచే నిరూఢుఁ డగుచు
వెలయఁ దొంబదితొమ్మిదివేల యోజ
ముల దూరంబు గల యమగరమునకుఁ
బూని యమభటుల్ కొంపోవఁ బోవు నంత.

టీక:- అనుపమ = సాటిలేని; క్షుత్ = ఆకలి; తృష్ణలన్ = దాహములు; అంతర్ = లోపలనుండి; వ్యధలన్ = బాధలను; చేయన్ = కలుగజేయగా; ఝంఝానిల = పెనుగాలియును; జ్వలత్ = మండుచున్న; జ్వలన = మంటలవలె; చండ = భయంకరమైన; భాను = సూర్యునిచే; ప్రదీప్తంబున్ = వెలిగించబడుతున్నది; ఐన = అయినట్టి; వాలుకా = ఇసుక; మార్గ = దారిని; అనుగత = అనుసరించు; తప్యమాన = కాలుతున్న; గాత్రుడు = దేహము కలవాడు; ఐ = అయ్యి; వీపున్ = వీపున; కశల్ = కొరడాల; చేన్ = చేత; అడువంగ = బాదుతుండగా; వికల = విరిగిన; అంగుడున్ = అవయవములు కలవాడు; అగుచున్ = అవుతూ; మార్గమున్ = దారి; అందున్ = లో; అచటనచటన్ = అక్కడక్కడ; చాలన్ = ఎక్కువగా; మూర్చిల్లి = మూర్ఛపడి; ఆశ్రయ = దిక్కు; శూన్యము = మాలినవి; అగు = అయిన; నీళ్ళన్ = నీటిలో; మునుగుచున్ = ములుగుతూ; లేచుచున్ = లేస్తూ; మొనసి = ముసిరిన; పాప = పాపము యొక్క;
రూపమునన్ = రూపములో ఉన్న; తమము = చిమ్మచీకటి; చేన్ = చేత; నిరూఢుండు = వాడబడుతున్నవాడు; అగుచున్ = అవుతూ; వెలయన్ = ప్రసిద్ధముగ; తొంబదితొమ్మిదివేల = తొంభైతొమ్మిదివేల (99, 000) (99,000 యోజనములు అంటే సుమారు 1217243.4 కిమీ., లేదా 756360 మైళ్ళు); యోజనముల = యోజనముల; దూరంబున్ = దూరము; కల = కలిగిన; యమనగరంబున్ = యమపురి; కున్ = కి; పూని = పూని; యమభటుల్ = యమకింకరులు; కొంపోవపోవునంత = తీసుకెళ్ళిపోతుండగా.
భావము:- ఎడతెగని ఆకలి దప్పులతో లోలోపల వ్యాకులపడుతూ, సుడిగాలుల మధ్య సోలిపోతూ, భగభగమండే సూర్యకిరణాలకు వేడెక్కి మాడిపోతున్న ఇసుక ఎడారుల్లో కాళ్ళు కాలుతూ నడవలేక నడుస్తూ, కొరడా దెబ్బలకు బొబ్బలెక్కిన వీపుతో శిథిలమైన అవయవాలతో మార్గమధ్యంలో అచ్చటచ్చట మూర్ఛిల్లుతూ, దిక్కుమాలిన నీళ్ళలో మునిగితేలుతూ, పాపంలా క్రమ్ముకొన్న చిమ్మచీకటిలోనుంచి తొంబది తొమ్మిది వేల యోజనాల దూరంలో ఉన్న యమపట్టణానికి యమభటులచేత తీసుకొని పోబడతాడు.

తెభా-3-987-వ.
ఇట్లు మహాపాపాత్ముం డైనవాఁడు ముహూర్తత్రయ కాలంబునను సామాన్యదోషి యగువాఁడు ముహుర్తద్వయంబునను నేగి యాతనం బొందును; అందు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; మహా = ఎక్కువైన; పాపాత్ముండు = పాపములు చేసినవాడు; ఐన = అయినట్టి; వాడు = వాడు; ముహూర్త = ముహూర్తముల; త్రయ = మూటి; కాలంబునన్ = కాలములో; సామాన్య = సామాన్యమగు; దోషి = పాపములు చేసినవాడు; అగు = అయినట్టి; వాడు = వాడు; ముహూర్త = ముహూర్తముల; ద్వయంబునను = రెంటిలోను; ఏగి = వెళ్ళి; యాతనన్ = బాధలను; పొందును = చెందును; అందున్ = అక్కడ.
భావము:- ఈవిధంగా మహాపాపి యైనవాడు మూడు ముహూర్తాల కాలంలో, సామాన్యదోషి యైనవాడు రెండు ముహూర్తాల కాలంలో వెళ్ళి యాతనలను పొందుతారు. ఆ యమలోకంలో...

తెభా-3-988-క.
ట్టుదురు కొఱవులను వడిఁ
బెట్టుదు రసిపత్రికలను బెనుమంటల యం
దొట్టుదు రొడళ్ళు నలియన్
ట్టుదు రప్పాపచిత్తు త్తుం బెలుచన్.

టీక:- పట్టుదురు = కాల్చెదరు; కొఱవులను = కొరవులతో; వడిన్ = వేగముగ; పెట్టుదురు = పెట్టెదరు; అసిపత్రికలను = చిత్రికలను; పెను = పెద్ద; మంటలన్ = మంటల; అందున్ = లోనికి; తొట్టుదురు = తోయుదురు; ఒడళ్ళు = ఒళ్ళు; నలియన్ = నలిగిపోయేలా; మట్టుదురు = తొక్కెదరు; ఆ = ఆ; పాప = పాపపు; చిత్తున్ = మనస్సుకలవానిని; మత్తున్ = మదించినవానిని; పెలుచన్ = సుళువుగా.
భావము:- ప్రమత్తుడైన ఆ పాపాత్ముని పట్టుకొని కొరవులతో కాలుస్తారు. చురకత్తులు గ్రుచ్చుతారు. భగభగ మండే మంటలో పడవేస్తారు. ఒళ్ళంతా చిల్లులు పడేటట్లు చితుకబొడుస్తారు.

తెభా-3-989-ఉ.
ముంతురు తప్తతోయముల మొత్తుదు రుగ్రగదాసిధారలం
దెంతురు పొట్ట ప్రేవులు వధింతురు మీఁద నిభేంద్ర పంక్తి ఱొ
ప్పింతురు ఘోర భంగిఁ గఱపింతురు పాములచేత బిట్టు ద్రొ
బ్బింతురు మీఁద గుండ్లు దినిపింతురు దేహముఁ గోసి కండలన్.

టీక:- ముంతురు = ముంచెదరు; తప్త = కాగిన; తోయములన్ = నీటిలోకి; మొత్తుదురు = మొత్తెదరు; ఉగ్ర = భయంకరమైన; గదన్ = గదలతో; అసి = కత్తుల; ధారలన్ = పదునులతో; తెంతురు = తెంచివేసెదరు; పొట్ట = పొట్టలోని; ప్రేవులన్ = పేగులను; వధింతురు = నరకెదరు; మీదన్ = మీదకి; నిభ = ఏనుగులలో; ఇంద్ర = పెద్దవాని; పంక్తిన్ = వరుసగా; ఱొప్పింతురు = తోలెదరు; ఘోర = భయంకరమైన; భంగిన్ = విధముగ; కఱిపింతురు = కరిపించెదరు; పాముల = పాముల; చేతన్ = చేత; బిట్టున్ = మిక్కిలి; ద్రొబ్బింతురు = తొక్కించెదరు; మీదన్ = మీద; గుండ్లున్ = గుండ్రాళ్ళతో; తినిపింతురు = తినిపించెదరు; దేహమున్ = శరీరమును; కోసి = కోసి; కండలన్ = కండలను.
భావము:- వేడినీళ్ళలో ముంచుతారు. పెద్ద గదలతోను, కత్తులతోను మొత్తుతారు. పొట్టలోని ప్రేవులను త్రెంచుతారు. మదపుటేనుగులతో త్రొక్కిస్తారు. పాములచేత క్రూరంగా కరిపిస్తారు. బండరాళ్ళు మీదకు విసరుతారు. అతని దేహాన్ని కోసి ఆ కండలను ఆ పాపాత్మునిచేతనే తినిపిస్తారు.

తెభా-3-990-వ.
మఱియుఁ గుటుంబపోషణంబునఁ గుక్షింభరుం డగుచు నధర్మపరుం డై భూతద్రోహంబున నతిపాపుండై నిరయంబునుం బొంది నిజ ధనంబులు గోలుపడి మొఱవెట్టు నాపన్నుని చందంబునం బరస్పర సంబంధంబునఁ గల్పింపబడిన తమిస్రాంధతామిస్ర రౌరవాదు లగు నరకంబులం బడి తీవ్రంబు లయిన బహుయాతనల ననుభవించి క్షీణపాపుండై పునర్నరత్వంబునుం బొందు"నని చెప్పి వెండియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; కుటుంబ = కుటుంబమును; పోషణంబునన్ = పోషించుటలో; కుక్షింభరుండు = కడుపుకోసమైనవాడు {కుక్షింభరుడు - పొట్టపోసుకొనుట మాత్రము తెలిసినవాడు}; అగుచున్ = అవుతూ; అధర్మ = అధర్మమునకు; పరుండు = చెందినవాడు; ఐ = అయ్యి; భూత = జీవులకు; ద్రోహంబునన్ = ద్రోహము చేయుటచే; అతి = మిక్కిలి; పాపుండు = పాపి; ఐ = అయ్యి; నిరయంబున్ = నరకమును; పొంది = పొంది; నిజ = తన; ధనంబులున్ = ధనములను; కోలుపడి = పోగొట్టుకొని; మొఱవెట్టున్ = మొత్తుకొనుచున్న; ఆపన్నుని = ఆపదచెందినవాని; చందంబునన్ = విధముగ; పరస్పర = ఒకదానికొకటి; సంబంధంబునన్ = సంబంధించునట్లు; కల్పింపబడిన = కలుపబడిన; తమిస్ర = చీకట్లు నరకము; అంధతామిస్ర = గుడ్డిచీకట్లు నరకము; రౌరవ = రురువులు అనబడు పురుగులచే తినిపించుట; ఆదులు = మొదలగునవి; అగు = అయిన; నరకంబులన్ = నరకములలో; పడి = పడి; తీవ్రంబులు = తీవ్రమైనవి; అయిన = అయినట్టి; బహు = అనేక; యాతనలన్ = బాధలను; అనుభవించి = అనుభవించి; క్షీణ = తగ్గిన; పాపుండు = పాపములుకలవాడు; ఐ = అయ్యి; పునర్ = మరల; నరత్వంబున్ = మానవుడు అగుటను; పొందును = పొందును; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- పాపాత్ముడు సంసార పోషణకై పడరాని పాట్లు పడుతూ, తన పొట్టను నింపుకొంటూ, అధర్మమార్గంలో నడుస్తూ, ప్రాణులను హింసిస్తూ మహాపాపం మూటకట్టుకొని యమలోకానికి పోయి అక్కడ తన సొమ్మును పోగొట్టుకొని మొరపెట్టుకునే దిక్కులేని దీనునివలె ఆక్రోశిస్తూ ఒకదాని వెంట ఒకటిగా తామిస్రం, అంధతామిస్రం, రౌరవం మొదలైన నరకాలలో పడి సహింపరాని పెక్కు బాధలను అనుభవిస్తూ, తన పాపాలన్నీ తరిగిపోయిన తరువాత మళ్ళీ మనుష్యజన్మను పొందుతాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.