పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/ప్రచేతసులు ముక్తికింజనుట

వికీసోర్స్ నుండి


తెభా-4-946-సీ.
నరఁ బ్రచేతసు లుత్పన్న విజ్ఞాను-
గుచు వేగంబ నారాయణోక్తిఁ
లఁచుచు నాత్మ నంను కడ నిజభార్య-
నిడి వనవాసులై డఁగి మున్ను
జాబాలి యను మునీశ్వరుఁడు సిద్ధుండైన-
భూరి పశ్చిమ వార్థి తీమునను
ర్వభూతాత్మ విజ్ఞానంబు గల యాత్మ-
న విమర్శకృత సంల్పు లైరి;

తెభా-4-946.1-తే.
యంత నచటికి సమ్మోద తిశయిల్ల
ర సురాసుర యక్ష కిన్నర వరేణ్య
మానితోన్నత సంపూజ్యమానుఁ డైన
నారదుండు వివేక విశారదుండు.

టీక:- ఒనరన్ = చక్కగా; ప్రచేతసుల్ = ప్రచేతసులు; ఉత్పన్న = కలిగిన; విజ్ఞానులున్ = విజ్ఞానులు; అగుచున్ = అగుతూ; వేగంబ = శ్రీఘ్రముగా; నారాయణ = హరి; ఉక్తిన్ = స్తుతులను; తలచుచున్ = తలచుకొనుచూ; ఆత్మ = తమ; నందను = కుమారుని; కడ = వద్ద; నిజ = తమ; భార్యన్ = భార్యను; ఇడి = ఉంచి; వన = అడవిలో; వాసులు = నివసించెడివారు; ఐ = అయ్యి; కడగి = పూని; మున్ను = పూర్వము; జాబాలి = జాబాలి; అను = అనెడి; ముని = మునులలో; ఈశ్వరుడు = నాథుడు; సిద్ధుండున్ = సిద్ధుడు; ఐనన్ = కాగా; భూరి = అతిపెద్ద, మహా; పశ్చిమ = పడమటి; వార్థిన్ = సముద్రపు; తీరముననున్ = తీరముయందు; సర్వ = సకల; భూత = భూతముల యొక్క; ఆత్మ = ఆత్మనుగూర్చిన; విజ్ఞానంబున్ = విజ్ఞానము; కల = కలిగిన; ఆత్మన్ = మనసులో; ఘన = గొప్పగా; విమర్శ = విచారించుకొని; కృత = చేసుకొన్న; సంకల్పులు = సంకల్పములు గలవారు; ఐరి = అయిరి.
అంతన్ = అంతట; అచటి = అక్కడ; కిన్ = కి; సమ్మోదము = సంతోషము; అతిశయిల్లన్ = ఉప్పొంగుతుండగా; నర = మానవులు; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరులయందు; వరేణ్యులు = ప్రముఖులచేత; మానిత = గౌరవింపబడెడి; ఉన్నత = ఉన్నతముగా; సంపూజ్యమానుడు = మిక్కిలిపూజింపబడెడివాడి; ఐనన్ = అయినట్టి; నారదుండు = నారదుడు; వివేక = మంచిచెడులు విమర్శించుకొనెడి; విశారదుండు = నేర్పుగలవాడు.
భావము:- ప్రచేతసులు జ్ఞానాన్ని పొందినవారై నారాయణుని బోధనలను పాటించి, భార్యను కొడుకు దగ్గర ఉంచి, వనవాసానికి సంసిద్ధులై పూర్వం జాబాలి అనే ముని సిద్ధిని పొందిన పడమటి సముద్ర తీరంలో సర్వ భూతాత్మ భావనతో ఆత్మ విచారం చేయటానికి సంకల్పించారు. అప్పుడు అక్కడికి నర సుర దానవ యక్ష కిన్నరుల చేత పూజలందుకొనేవాడు, వివేకవంతుడు అయిన నారదుడు వచ్చాడు.

తెభా-4-947-వ.
చనుదెంచి నిర్జితప్రాణ మనో వాగ్దర్శనులును జితాసనులును శాంతులును నసమాన విగ్రహులును నిర్మలంబైన పరబ్రహ్మంబు నందు నియోజితంబైన యంతఃకరణంబు గలవారును నైన రాజనందనుల కడ నిలిచిన.
టీక:- చనుదెంచి = వచ్చి; నిర్జిత = జయించిన; ప్రాణ = ప్రాణవాయువులు; మనః = మనసు; వాక్ = నోరు; దర్శనులునున్ = కన్నులు గలవారు; జిత = జయించిన; ఆసనులును = ఆసనములు గలవారు; శాంతులు = శాంత స్వభావము గలవారు; అసమాన = సాటిలేని; నిగ్రహులునున్ = నిగ్రహము గలవారు; నిర్మలంబు = స్వచ్ఛము; ఐనన్ = అయినట్టి; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మము; అందున్ = అందు; నియోజితంబున్ = నియమించబడినది; ఐనన్ = అయినట్టి; అంతఃకరణంబున్ = మనసు; కలవారునున్ = కలవారును; ఐనన్ = అయిన; రాజనందనుల్ = రాజకుమారులు; కడన్ = వద్ద; నిలిచినన్ = నిలబడగా.
భావము:- వచ్చి ప్రాణవాయువును, మనస్సును, వాక్కును, చూపును అదుపులో పెట్టుకున్నవారు, ఆసనములను జయించినవారు, శాంతస్వభావులు, సాటిలేని నిగ్రహం కలవారు, పరబ్రహ్మలో లీనం చేసిన స్వచ్ఛమైన మనస్సులు కలవారు అయిన ఆ రాకుమారుల వద్దకు వచ్చి నిలబడగా…

తెభా-4-948-క.
నుదెంచిన నారదమునిఁ
నుఁగొని నృపసుతులు లేచి కౌతుక మొప్పన్
విమితులై సముచిత పూ
ములఁ బరితుష్టుఁ జేసి ద్వినయమునన్.

టీక:- చనుదెంచిన = వచ్చిన; నారద = నారదుడు యనెడి; మునిన్ = మునిని; కనుగొని = చూసి; నృపసుతులున్ = రాజకుమారులు; లేచి = లేచి నిలబడి; కౌతుకమున్ = కుతూహలము; ఒప్పన్ = ఒప్పుతుండగా; వినమితులు = నమస్కరించినవారు; ఐ = అయ్యి; సముచిత = మిక్కిలి ఉచితమగు; పూజనములన్ = పూజలతో; పరితుష్టున్ = సంతృప్తిచెందినవానిగా; చేసి = చేసి; సత్ = చక్కటి; వినయమునన్ = వినయముతో.
భావము:- వచ్చిన నారదమునిని చూచి రాకుమారులు లేచి కుతూహలంతో నమస్కరించి తగిన పూజలు చేసి అతనికి తృప్తిని కలిగించి వినయంతో…

తెభా-4-949-చ.
ఘ! మునీంద్రచంద్ర! భవదాగమనంబు సమస్తలోక శో
మగు; నస్మదీయమగు భాగ్యవశంబున నేఁడు విశ్వపా
! నినుఁ జూడఁగంటి మనివార్య భవద్భ్రమణంబు లోకలో
ను గతి పోలెఁ బ్రాణులకు ర్వ భయాపహరంబు గావునన్."

టీక:- అనఘ = పుణ్యుడా; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠు లైన వారిలో; చంద్ర = చంద్రుని వంటివాడ; భవత్ = నీ యొక్క; ఆగమనంబున్ = రాక; సమస్త = సమస్తమైన; లోక = లోకములకు; శోభనమున్ = శుభములను కలిగించెడిది; అగు = అయిన; అస్మదీయమున్ = మాది ఐనట్టిది; అగు = అయిన; భాగ్య = అదృష్టము; వశంబునన్ = వలన; నేడున్ = ఈ నాడు; విశ్వపావన = జగత్తును పవిత్రము జేయువాడ; నినున్ = నిన్ను; చూడగంటిమి = చూడగలిగితిమి; అనివార్యము = వారింపరాని; భవత్ = నీ యొక్క; భ్రమణంబున్ = సంచారములు; లోకలోచనున్ = సూర్యుని; గతిన్ = సంచారములు; పోలెన్ = వలె; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; సర్వ = అన్ని; భయ = భయములను; అపహరంబున్ = పోగోట్టునవి; కావునన్ = కనుక.
భావము:- “పుణ్యాత్మా! మునీంద్రా! నీ రాక సమస్త లోకాలకు శుభాన్ని కలిగిస్తుంది. మా అదృష్టవశాన నేడు విశ్వపవిత్రుడవైన నిన్ను చూడగలిగాము. సూర్యుని సంచారం వలె నీ సంచారం ప్రాణులకు సర్వ భయాలను తొలగించి శుభాలను కలిగిస్తుంది.”

తెభా-4-950-వ.
అని మఱియు నిట్లనిరి.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అని ఇంకా ఇలా అన్నారు.

తెభా-4-951-సీ.
"నఘాత్మ! భగవంతులైన కేశవ వామ-
దేవులచే నుపదిష్టమైన
యాత్మతత్త్వంబు గృస్థుల మగు మాకు-
నయంబు విస్మృతం య్యె నట్టి
లిత తత్త్వార్థ ప్రకాశకంబును భూరి-
ఘో సంసారాబ్ధి తాకంబు
నై కర మొప్పారు నాత్మతత్త్వము నేఁడు-
చిరదయామతిఁ బ్రకాశింపఁ జేయు

తెభా-4-951.1-తే.
ని ప్రచేతసు లర్థిఁ బల్కినఁ జెలంగి
గవదాయత్త చిత్తుండు వ్యగుణుఁడు
ఖిలలోక విహారుండు నైన యట్టి
నారదుఁడు పల్కె నా రాకుమారులకును.

టీక:- అనఘాత్మ = పుణ్యాత్మా; భగవంతులు = దేవుళ్ళు; ఐనన్ = అయిన; కేశవ = విష్ణుమూర్తి; వామదేవుల్ = శివుడు; చేన్ = చేత; ఉపదిష్టము = ఉపదేశింపబడినది; ఐన = అయిన; ఆత్మతత్త్వంబున్ = ఆత్మతత్త్వమును; గృహస్థులము = గృహస్థాశ్రమముననుండెడి; మాకున్ = మాకు; అనయంబున్ = ఎల్లప్పుడు; విస్మృతంబున్ = మరపునబడినది; అయ్యెన్ = అయినది; అట్టి = అటువంటి; కలిత = సమగ్రమైన; తత్త్వ = తత్త్వ; అర్థ = జ్ఞానమును; ప్రకాశంబునున్ = ప్రకాశింపజేయునది; భూరి = అత్యధికమైన; ఘోర = భయంకరమైన; సంసార = సంసారము యనెడి; అబ్ధిన్ = సముద్రమును; తారకంబున్ = దాటించెడిది; ఐ = అయ్యి; కరము = మిక్కిలి; ఒప్పారు = చక్కనౌ; ఆత్మతత్త్వమున్ = ఆత్మతత్త్వమును; నేడు = ఇవాళ; చిర = మిక్కిలి; దయా = కృపగల; మతిన్ = మనసుతో; ప్రకాశింప = ప్రకాశించునట్లు; చేయుము = చేయుము; అని = అని.
ప్రచేతసుల్ = ప్రచేతసులు; అర్థిన్ = కోరి; పల్కినన్ = పలుకగా; చెలంగి = చెలరేగి; భగవత్ = భగవంతుని యందు; ఆయత్త = ఆధీనమైన; చిత్తుండు = మనసుగలవాడు; భవ్య = శుభమైన; గుణుడున్ = గుణములుగలవాడు; అఖిల = సమస్తమైన; లోక = లోకములందు; విహారుండున్ = విహరించెడివాడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; నారదుడు = నారదుడు; పల్కెన్ = పలికెను; ఆ = ఆ; రాకుమారుల్ = రాకుమారుల; కున్ = తోటి.
భావము:- “పుణ్యాత్మా! భగవంతులైన విష్ణువు, శివుడు ఉపదేశించిన ఆత్మజ్ఞానాన్ని సంసారంలో మునిగి మేము మరచిపోయాము. భయంకరమైన సంసార సముద్రాన్ని దాటించే ఆత్మ తత్త్వాన్ని నేడు మాకు మరల దయతో ప్రసాదించు” అని ప్రచేతసులు ప్రార్థించగా సంతోషించి శ్రీమన్నారాయణ చరణాయత్త చిత్తుడు, సద్గుణ సంపన్నుడు, త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ప్రచేతసులతో ఇలా అన్నాడు.

తెభా-4-952-సీ.
ర్చింప నరుల కే న్మకర్మాయుర్మ-
నో చనంబుల దేదేవుఁ
ఖిల విశ్వాత్మకుం డైన గోవిందుండు-
విలసిల్లు భక్తి సేవింపఁబడెడు
వియపో, జన్మ కర్మాయుర్మనో వచ-
ములను ధరణి నెన్నంగఁ దగును
నరుహనాభ సేవా రహితము లైన-
ననోపనయన దీక్షాకృతంబు

తెభా-4-952.1-తే.
లైన జన్మంబు లేల? దీర్ఘాయు వేల?
వేద చోదిత యగు కర్మ వితతి యేల?
ప తపశ్శ్రుత వాగ్విలాసంబు లేల?
హిత నానావధాన సార్థ్య మేల?

టీక:- చర్చింపన్ = చర్చించిచూడగా; నరుల్ = మానవుల; కున్ = కు; జన్మ = పుట్టుక; కర్మ = కర్మములు; ఆయుర్ = ఆయుర్దాయము; మనః = మనసు; వచనంబులన్ = వాక్కులతో; దేవదేవున్ = నారాయణుని; అఖిల = సమస్తమైన; విశ్వ = జగత్తునకు; ఆత్మకుండు = ఆత్మయైనవాడు; ఐన = అయిన; గోవిందుండున్ = నారాయణుడు; విలసిల్లు = విలసిల్లెడి; భక్తిన్ = భక్తితో; సేవింపబడెడున్ = సేవింపబడును; అవియపో = అవే; జన్మ = పుట్టుక; కర్మ = కర్మములు; వచనములనున్ = వాక్కులను; ధరణిన్ = భూమిపైన; ఎన్నంగన్ = ఎంచుటకు; తగును = తగియుండును; వనరుహనాభ = విష్ణు; సేవా = సేవించుటలు; రహితములు = లేనట్టివి; ఐన = అయిన; జనన = పురిటిశుద్ధి; ఉపనయన = వడుగు; దీక్షా = దీక్షలు; కృతంబులు = పట్టుటలు; ఐన = కలిగిన.
జన్మంబుల్ = జన్మలు; ఏలన్ = ఎందులకు; దీర్ఘ = పెద్దదైన; ఆయువు = ఆయుర్దాయము; ఏలన్ = ఎందులకు; వేద = వేదములప్రకారము; చోదిత = నడపబడెడివి; అగు = అయిన; కర్మ = కర్మల; వితతిన్ = సమూహము; ఏలన్ = ఎందులకు; జపః = జపము; తపః = తపస్సు; శ్రుత = వేదపఠనము; వాగ్విలాపంబులున్ = నోటితో చర్చలు; ఏలన్ = ఎందులకు; మహిత = గొప్ప; నానా = రకరకముల; అవధాన = అవధరించెడి; సామర్థ్యము = నేర్పులు; ఏలన్ = ఎందులకు.
భావము:- “దేవదేవుడు, విశ్వాత్మకుడు అయిన గోవిందుని సేవించే జన్మయే జన్మ, అదే కర్మ, అదే ఆయుస్సు, అదే మనస్సు, అదే వాక్కు. హరిని సేవించకుండ ఉపనయనం మొదలైన సంస్కారాలు గల జన్మ ఎందుకు? దీర్ఘాయువు ఎందుకు? వేదకర్మలను ఆచరించడం ఎందుకు? జపం, తపం, పాండిత్యం, వాక్చమత్కారం మొదలైనవి ఎందుకు?

తెభా-4-953-వ.
మఱియు హరి విరహితంబైన యింద్రియ పాటవంబును నిపుణ యైన బుద్ధియు బ్రాణాయామాది యోగంబును దేహాది వ్యతిరిక్తాత్మ జ్ఞానంబును సన్యాసాధ్యయనంబులును దక్కిన వ్రత వైరాగ్యాది శ్రేయస్సాధనంబులును నేల? సర్వేశ్వరుండును, సమస్త శ్రేయస్స్వరూపుండును, సమస్త శ్రేయోవధి భూతుండును, సర్వభూతావాసుండును, సర్వభూతాత్మప్రదుండును, సర్వభూతప్రియుండును, సర్వవ్యాపకుండునుం గావున.
టీక:- మఱియున్ = ఇంకను; హరి = నారాయణ; విరహితంబున్ = లేనిది; ఐన = అయిన; ఇంద్రియ = శక్తి; పాటవంబునున్ = సామర్థ్యములు; నిపుణ = నైపుణ్యముగలది; ఐన = అయిన; బుద్ధియున్ = బుద్ధి; ప్రాణాయామ = ప్రాణాయామము; ఆది = మొదలగు; యోగంబునున్ = యోగములు; దేహ = శరీరము; ఆది = మొదలగు; వ్యతిరిక్తాత్మ = ఆత్మతత్త్వమునకువేరైన; జ్ఞానంబునున్ = జ్ఞానమును; సన్యాస = సన్యసించుట; అధ్యయనంబులును = వేదాధ్యయనములు; తక్కిన = తతిమా; వ్రత = వ్రతములు; వైరాగ్య = వైరాగ్యము; ఆది = మొదలగు; శ్రేయస్ = మేళ్ళను; సాధనంబులును = సాధనములు; ఏలన్ = ఎందులకు; సర్వేశ్వరుండును = విష్ణుమూర్తి; సమస్త = సమస్తమైన; శ్రేయస్ = శ్రేయస్సే; స్వరూపుండును = స్వరూపముగా గలవాడు; సమస్త = సమస్తమైన; శ్రేయస్ = శ్రేయస్సునకు; అవధిభూతుండును = హద్దు అయినవాడు; సర్వ = అఖిల; భూత = జీవుల యందును; వాసుండును = నివసించెడివాడును; సర్వ = సమస్తమైన; భూత = జీవులకును; ఆత్మ = ఆత్మయై; ప్రదుండును = కలిగించుచుండువాడు; సర్వ = సమస్తమైన; భూత = జీవులకును; ప్రియుండును = ప్రియమైనవాడు; సర్వ = అన్నిటియందు; వ్యాపకుండునున్ = వ్యాపించి ఉండువాడు; కావునన్ = కనుక.
భావము:- ఇంకా హరిని సేవించకపోతే ఇంద్రియశక్తి, బుద్ధి నైపుణ్యం, ప్రాణాయామాది యోగాలు, ఆత్మతత్త్వానికి వేరైన శరీరం మొదలైన వాటి జ్ఞానం, సన్యాసం, వేదాధ్యయనం, వ్రతాలు, వైరాగ్యం మొదలైన మేలు కూర్చే సాధనాలు ఎందుకు? విష్ణువే సర్వేశ్వరుడు, సకల శ్రేయోరూపుడు, సర్వ శ్రేయస్సులకు హద్దు అయినవాడు, సర్వ భూతాలలో నివసించేవాడు, సర్వభూతాలకు ఆత్మనిచ్చేవాడు, సర్వ భూతాలకు ఇష్టమైనవాడు. అంతటా వ్యాపించేవాడు కనుక…

తెభా-4-954-మ.
లాధీశ్వరుఁ బూజ చేయుట సమగ్రప్రీతిఁ బ్రాణోపహా
ము సర్వేంద్రియ తృప్తి హేతువును సర్వక్ష్మాజమూలాభిషే
ము శాఖాభుజపుష్టిదంబు నగు రేఖన్ సర్వదేవార్హణ
క్రమై యొప్పు ధరావరేణ్య సుతులారా! బుద్ధి నూహించినన్.

టీక:- కమలాధీశ్వరున్ = విష్ణుని; పూజన్ = పూజలు; చేయుట = చేయుటలు; సమగ్ర = సంపూర్ణ; ప్రీతిన్ = ప్రేమతో; ప్రాణ = ప్రాణులకు; ఉపహారమున్ = ఉపచారముల వంటివి, ఉప ఆహారము; సర్వ = అన్ని; ఇంద్రియ = ఇంద్రియములకు; తృప్తిన్ = సంతృప్తికి; హేతువునున్ = కారణము; సర్వ = సకల; క్ష్మాజ = చెట్ల {క్ష్మాజము - క్ష్మ (భూమి)నుండి పుట్టినది, చెట్టు}; మూల = మొదలులో; అభిషేకము = నీరుపోయుట; శాఖా = కొమ్మలకు; భుజ = రెమ్మలకు; పుష్టిదంబున్ = బలమును చేకూర్చునవి; అగు = అయిన; రేఖన్ = విధముగా; సర్వ = నిఖిల; దేవా = దేవతలు; అర్హణ = పూజించెడి; క్రమము = విధానము; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడిని; ధరావరేణ్యసుతులారా = రాజకుమారులారా; బుద్ధిని = బుద్ధితో; ఉహించినన్ = ఆలోచించినచో.
భావము:- రాకుమారులారా! చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే కొమ్మలకు, రెమ్మలకు, పత్ర పుష్పాలకు పుష్టి కలుగుతుంది. అలాగే శ్రీహరిని పూజిస్తే సర్వేంద్రియాలకు తృప్తి కలుగుతుంది. శ్రీహరిని సేవిస్తే సర్వ భూతాలను సేవించినట్లే అవుతుంది.

తెభా-4-955-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతే కాకుండా…

తెభా-4-956-క.
పెను పగు వర్షాకాలం
బు దిననాయకుని వలనఁ బొడమిన సలిలం
యముఁ గ్రమ్మఱ గ్రీష్మం
బు సూర్యుని యందు డిందు పోలిక మఱియున్.

టీక:- పెనుపు = విస్తారము; అగు = అయిన; వర్షాకాలంబునన్ = వర్షాకాలములో; దిననాయకుని = సూర్యుని {దిననాయకుడు - దినమునకు నాయకుడు, సూర్యుడు}; వలనన్ = వలన; పొడమిన = కలిగిన; సలిలంబున్ = నీరు; అనయమున్ = అవశ్యము; క్రమ్మఱన్ = మరల; గ్రీష్మంబునన్ = వేసవికాలమున; సూర్యుని = సూర్యుని; అందున్ = లో; డిందు = లీనమగు; పోలికన్ = వలె; మఱియున్ = ఇంకను.
భావము:- మంచి వర్షాకాలంలో సూర్యుని కిరణాలవల్ల ఆవిరై మేఘంగా మారిన నీరు తిరిగి గ్రీష్మకాలంలో ఆ సూర్యునియందే లయమైనట్లుగా…

తెభా-4-957-క.
ణిఁ జరాచర భూతము
యఁగ జనియించి యందె డఁగిన పగిదిన్
రిచేఁ బుట్టిన విశ్వము
రి యందె లయంబు నొందు; ది యెట్లన్నన్.

టీక:- ధరణిన్ = భూమినుండి; చర = కదలగలవి; అచర = కదలలేనివి యైన; భూతముల్ = జీవులు; అరయగన్ = తరచి చూసినచో; జనియించి = పుట్టి; అందె = దానిలోనే; అడగిన = అణగిపోవు; పగిదిన్ = విధముగా; హరి = నారాయణు; చేన్ = వలన; పుట్టిన = పుట్టిన; విశ్వమున్ = జగత్తు; హరి = నారాయణుని; అందె = లోనే; లయంబున్ = లయమును; ఒందున్ = పొందును; అది = అది; ఎట్లు = ఏవిధముగ; అన్నన్ = అనగా.
భావము:- భూమిపై జన్మించిన చరాచర భూతాలు తిరిగి భూమియందే అడగిపోయినట్లుగా శ్రీహరినుండి జన్మించిన ఈ మహావిశ్వం తిరిగి శ్రీహరిలోనే లయమవుతుంది. అది ఎలా అంటే…

తెభా-4-958-మ.
రుదౌనభ్రతమఃప్రభల్ మును నభంబం దొప్పఁగాఁ దోఁచి క్ర
మ్మ వీక్షింపఁగ నందె లేనిగతి బ్రహ్మంబందు నీ శక్తులుం
రికింపం ద్రిగుణప్రవాహమున నుత్పన్నంబులై క్రమ్మఱన్
వితిం బొందుచు నుండుఁ గావున హరిన్ విష్ణున్ భజింపం దగున్.

టీక:- అరుదౌ = ఆశ్చర్యకరముగ; అభ్ర = మేఘములు; తమః = చీకట్లు; ప్రభల్ = కాంతులు; మునున్ = ముందు; నభంబున్ = ఆకాశము; అందున్ = లో; ఒప్పగా = చక్కగా; తోచియున్ =కనిపిస్తూ; క్రమ్మఱ = మరల; వీక్షింపగన్ = చూచినచో; అందె = అక్కడే; లేని = లేకపోవు; గతిన్ = విధముగా; బ్రహ్మంబున్ = పరబ్రహ్మము; అందున్ = లో; ఈ = ఈ; శక్తులున్ = శక్తులను; పరికింపన్ = పరికించి చూసినచో; త్రిగుణ = త్రిగుణముల; ప్రవాహముననున్ = ప్రవహించుటచేత; ఉత్పన్నంబులు = పుట్టినవి; ఐ = అయ్యి; క్రమ్మఱన్ = మరల; విరతిన్ = లయ మగుట; పొందుచున్ = పొందుతూ; ఉండున్ = ఉండును; కావునన్ = కనుక; హరిన్ = నారాయణుని; విష్ణున్ = విష్ణుని; భజింపన్ = సేవించుట; తగున్ = తగును.
భావము:- ఆకాశంలో మేఘాలు, తమస్సులు, ప్రకాశాలు ఒకప్పుడు కనిపించి మళ్ళీ చూద్దామంటే కనిపించవు. అట్లే విశ్వసృష్టికి, రక్షణకు, విలయానికి కారణాలైన త్రిగుణ శక్తులు పరబ్రహ్మలోనే ఒకప్పుడు ఆవిర్భవిస్తూ తిరిగి అణిగిపోతూ ఉంటాయి. కాబట్టి విష్ణువును సేవించాలి.

తెభా-4-959-వ.
మఱియును సమస్త దేహులకు నాత్మయు, నిమిత్తభూతుండును, నద్వితీయుండును, శశ్వత్ప్రకాశుండును, బ్రధానపురుషుండును, స్వతేజో విధ్వస్త గుణప్రవాహుండును, మానస బుద్ధి సుఖేచ్ఛాద్వేషాది వికల్పరహితుండును, నగుణుండును, దేహాత్మభ్రమ నివృత్త్యుపలభ్యుండును, నాది మధ్యాంత రహితుండును, నిత్యానంద స్వరూపుండును, సర్వజ్ఞుండును, బరమేశ్వరుండును నైన నారాయణు నభేద బుద్ధిం జేసి భజింపుఁడు; అతండు సర్వభూత దయాళువులును, నెంతమాత్రంబు సంభవించు నంతమాత్రంబున సంతుష్టచిత్తులును, సర్వేంద్రియోపశాంతులును నగు పురుషుల యెడ సంతుష్టుం డగు” నని వెండియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; సమస్త = సమస్తమైన; దేహుల్ = శరీరుల; కున్ = కు; ఆత్మయున్ = ఆత్మయైనవాడు; నిమిత్తభూతుండున్ = కారణముయైనవాడు; అద్వితీయుండునున్ = ఏకమాతృడును; శశ్వత్ = శాశ్వతమైన; ప్రకాశుండునున్ = ప్రకాశము గలవాడును; ప్రధానపురుషుండునున్ = మూలప్రకృతి యందలి పురుషుడు; స్వ = తన; తేజస్ = తేజస్సువలన; విధ్వస్త = నాశనము చేయబడెడి; గుణ = త్రిగుణముల; ప్రవాహుండునున్ = వర్తనలు గలవాడును; మానస = మానసిక; బుద్ధి = బౌద్ధిక; సుఖ = సౌఖ్యము లందు; ఇచ్చ = ఇష్టము; ద్వేష = అయిష్టము; ఆది = మొదలగు; వికల్ప = భ్రాంతులు; రహితుండును = లేనివాడును; అగుణుండును = గుణాతీతుడు; దేహ = శరీరము; ఆత్మ = ఆత్మ అనెడి; భ్రమ = భ్రాంతులను; నివృత్తి = పోగొట్టుకొనుటచే; ఉపలభ్యుండున్ = పొందదగినవాడు; ఆది = మొదలు; మధ్య = మధ్య; అంత = చివరలు; రహితుండును = లేనివాడును; నిత్య = శాశ్వతమైన; ఆనంద = ఆనందము యొక్క; స్వరూపుండునున్ = స్వరూపమైనవాడును; సర్వజ్ఞుండునున్ = సమస్తమైన జ్ఞానములు గలవాడును; పరమేశ్వరుండును = భగవంతుడును; ఐన = అయిన; నారాయణున్ = హరిని; అబేధబుద్ధిన్ = బేధభావము లేని బుద్ధి; చేసి = వలన; భజింపుడు = సేవించండి; అతండు = అతడు; సర్వ = సమస్తమైన; భూత = జీవులయెడ; దయాళువులునున్ = దయ కలిగియుండెడివారు; ఎంత = ఎంత; మాత్రంబున్ = మాత్రము; సంభవించున్ = లభించిన; అంత = అంత; మాత్రంబునన్ = మాత్రముతోనే; సంతుష్ట = సంతృప్తిచెందిన; చిత్తులును = మనసు గలవారు; సర్వ = సమస్తమైన; ఇంద్రియ = ఇంద్రియములను; ఉపశాంతులును = శాంతింప జేసుకొన్నవారు; అగు = అయిన; పురుషుల = పురుషుల; ఎడన్ = అందు; సంతుష్టుండు = సంతృప్తిచెందినవాడు; అగున్ = అగును; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంకా సమస్త శరీరాలకు ఆత్మ యైనవాడు మరియు కారణమైనవాడు, అద్వితీయుడు, శాశ్వత ప్రకాశం కలవాడు, మూలప్రకృతి అయిన పురుషుడు, త్రిగుణ సంచారాన్ని తన తేజస్సుతో నాశనం చేసేవాడు, మానసిక బౌద్ధిక సుఖాల పట్ల ఇష్టానిష్ఠ భ్రాంతి లేనివాడు, గుణాతీతుడు, శరీరం ఆత్మ అనే భ్రమలను పోగొట్టుకొన్నవారికి సులభంగా దక్కేవాడు, ఆదిమధ్యాంతాలు లేనివాడు, శాశ్వతానంద స్వరూపుడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరుడు అయిన నారాయణుని భేదభావం లేని బుద్ధితో సేవించండి. అతడు సర్వ ప్రాణులపట్ల దయ గలవాడు. లభించిన దానితోనే తృప్తి పడుతూ ఇంద్రియాల నన్నింటిని అణచుకొన్న మానవుల పట్ల సంతృప్తిని పొందుతాడు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-960-చ.
తురత నట్టి యీశ్వరుఁడు జ్జనలోక నిరస్త సర్వ కా
మి విమలాంతరంగమున మిశ్రిత భావనఁ జేసి సన్నిధా
పితుఁ డగుచున్ దయాకర గభీర గుణంబులఁ జాల నొప్పి యా
శ్రి జన పారతంత్ర్యమును జేకొని పాయక యుండు నిచ్చలున్.

టీక:- చతురతన్ = నేర్పరితనముతో; అట్టి = అటువంటి; ఈశ్వరుడు = భగవంతుడు; సత్ = మంచి; జన = వారి; లోక = సమూహమునకు; నిరస్త = పోగొట్టబడిన; సర్వ = సమస్తమైన; కామిత = కోరికలతో; విమల = స్వచ్ఛమైన; అంతరంగమునన్ = మనసు; మిశ్రిత = కూడియున్న; భావనన్ = భావము; చేసి = వలన; సన్నిధాపితుండున్ = సన్నిధి పొందబడినవాడు; అగుచున్ = అగుచూ; దయా = కృపకు; ఆకర = నివాసమై; గభీర = గంభీరమైన; గుణంబులన్ = లక్షణములతో; చాలన్ = మిక్కిలి; ఒప్పి = పొందిక కలిగి; ఆశ్రిత = ఆశ్రయించిన; జన = వారి; పారతంత్రమునున్ = పరతంత్రమును కలిగుండుటను; చేకొని = చేపట్టి; పాయకన్ = విడువక; ఉండున్ = ఉండును; నిచ్చలున్ = ఎల్లప్పుడు.
భావము:- “అటువంటి భగవంతుడు కోరికలను పోగొట్టుకొన్న సత్పురుషుల స్వచ్ఛమైన మనస్సులలో చేరి గంభీర గుణాలతో ఒప్పి ఆశ్రయించినవారి పారతంత్ర్యంతో ఎల్లపుడు వదలక ఉంటాడు.

తెభా-4-961-క.
శ్రు ధన కుల కర్మ సము
న్న మదములఁ జేసి సజ్జప్రతతికి సం
మును నెగ్గొనరించు కు
తు లర్థిం జేయు పూజ తిఁ గొనఁ డెందున్.

టీక:- శ్రుత = కీర్తి; ధన = సంపదలు; కుల = వంశగౌరవము; కర్మ = గొప్పపనులవలన; సమున్నత = మిక్కిలి అధికమైన; మదములన్ = గర్వముల; చేసి = వలన; సత్ = మంచి; జన = వారి; ప్రతతి = సమూహమున; కున్ = కు; సంతతమునున్ = ఎల్లప్పుడు; ఎగ్గున్ = కీడును; ఒనరించు = కలిగించెడి; కు = చెడు; మతులున్ = బుద్ధి గలవారు; అర్థిన్ = కోరి; చేయు = చేసెడి; పూజన్ = పూజలు; మతిన్ = మనసులోకి; కొనడున్ = స్వీకరించడు; ఎందున్ = ఏవిధముగను.
భావము:- (ఆ భగవంతుడు) కీర్తి, ధనం, కులం, కర్మల గొప్పదనం వల్ల గర్వించి సజ్జనులకు కీడు చేసే దుష్టులు చేసే పూజను స్వీకరించడు.

తెభా-4-962-వ.
అది యెట్లనిన.
టీక:- అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనినచో.
భావము:- అది ఎలాగంటే…

తెభా-4-963-సీ.
లనొప్పఁ దను ననుర్తించు నిందిరా-
కామినీమణిఁ దదాకాంక్షు లగుచు
ధృతి ననువర్తించు దేవేంద్రముఖ్యుల-
నైన నెవ్వఁడు చూడఁ డాత్మ నట్టి
నిత్య స్వతంత్రుని నిజభక్త వరదుని-
దీనవత్సలు గుణాధీశు నజునిఁ
బురుషోత్తముని జగద్భరితు సర్వేశ్వరు-
నారాయణునిఁ జిదానందమయుని

తెభా-4-963.1-తే.
జితు నచ్యుతుఁ బుండరీకాయతాక్షుఁ
విలి సేవింపకుండునే? ర రసజ్ఞుఁ
డైన పురుషుండు సమ్మోదితాత్ముఁ డగుచుఁ
జారుమతులార! రాజకుమారులార!

టీక:- వలనొప్పన్ = తగినట్లు; తనున్ = తనను; అనుసరించు = అనుసరించెడి; ఇందిరాకామినీమణిన్ = లక్ష్మీదేవిని {ఇందిరాకామినీమణి - ఇందిర (లక్ష్మీ) యనెడి కామినీ (స్త్రీలలో) మణివంటియామె, లక్ష్మీదేవి}; తత్తత్ = ఆయా; కాంక్షలు = కోరికలుకోరెడివారు; అగుచున్ = అగుచునూ; ధృతిన్ = పూని; అనువర్తించు = అనుసరించెడి; దేవేంద్ర = దేవేంద్రుడు; ముఖ్యులన్ = మొదలగువారును; ఐన = అయిన; ఎవ్వడున్ = ఎవరైతే; చూడడున్ = చూడరో; ఆత్మన్ = మనసుపెట్టి; అట్టి = అటువంటి; నిత్యస్వతంత్రుని = హరిని {నిత్యస్వతంత్రుని - శాశ్వతమైనస్వతంత్రుడిని, విష్ణువు}; నిజభక్తవరదునిన్ = హరిని {నిజభక్తవరదునిన్ - సత్యమైన భక్తులకు వరములను ఇచ్చెడివానిని, విష్ణువు}; దీనవత్సలున్ = హరిని {దీనవత్సలున్ - దీనులయెడవాత్సల్యముగలవానిని, విష్ణువు}; గుణాధీశునిన్ = హరిని {గుణాధీశునిన్ - త్రిగుణములు అధీనమున యుంచుకొనెడి వానిని, విష్ణువు}; పురుషోత్తమునిన్ = హరిని {పురుషోత్తమునిన్ - పురుషులలో ఉత్తముని, విష్ణువు}; జగద్భరితున్ = హరిని {జగద్భరితున్ - భువనములను భరించెడివానిని, విష్ణువు}; సర్వేశ్వరున్ = హరిని {సర్వేశ్వరున్ - సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}; నారాయణునిన్ = హరిని {నారాయణునిన్ - నీటిలో వసించెడివానిని, విష్ణువు}; చిదానందమయునిన్ = హరిని {చిదానందమయునిన్ - చిత్ (చైతన్యవంతమైన) ఆనందముతో మయుని (నిండినవానిని), విష్ణువు}; అజితున్ = హరిని {అజితున్ - జయింపరానివానిని, విష్ణువు}; అచ్యుతున్ = హరిని {అచ్యుతున్ - చ్యుతము (పతనము) లేని వాడు, విష్ణువు}; పుండరీకాయతాక్షున్ = హరిని {పుండరీకాయతాక్షున్ - పుండరీకములు (తామర) ఆయత (పత్రముల) వంటి అక్షున్ (కన్నులుగలవానిని), విష్ణువు}; తవిలి = పూని.
= సేవింపకన్ = సేవించకుండగా; ఉండునే = ఉండునా ఏమి, ఉండడు; ధరన్ = భూమిపైన; రసజ్ఞుడు = రస జ్ఞానముగలవాడు; ఐన = అయిన; పురుషుండు = పురుషుడు; సమ్మోదిత = సంతోషించిన; ఆత్ముడు = మనసుగలవాడు; అగుచున్ = అగుచును; చారు = చక్కని; మతులారా = మనసలుగలవారా; రాజకుమారులారా = రాకుమారులారా.
భావము:- రాకుమారులారా! తనను కోరి అనుసరించే లక్ష్మిని ఐశ్వర్యంకోసం అనుసరించే ఇంద్రుడు మొదలైనవారిని అనుసరింపని రసజ్ఞుడైన పురుషుడు మనసు పెట్టి నిత్యస్వతంత్రుడు, భక్త వరదుడు, దీనవత్సలుడు, త్రిగుణాధీశుడు, జన్మరహితుడు, పురుషోత్తముడు, తనలో లోకాలన్నీ నిండినవాడు, సర్వేశ్వరుడు, నారాయణుడు, జ్ఞానమనే ఆనందం కలవాడు, ఓడింపరానివాడు, పాపరహితుడు, కమలనేత్రుడు అయిన విష్ణువును సేవింపకుండా ఉంటాడా?”

తెభా-4-964-వ.
అని మఱియు నిట్లనియె; “భవదీయ వంశధుర్యుండుఁ జిత్రరథుండు నగు ధ్రువుండు సపత్నీమాతృ వాగ్భాణ భిన్నహృదయుండై పంచవర్షార్భకుం డగుచుఁ దపోవనంబున కరుగు నపుడు మార్గంబున నాచే నుపదిష్టంబైన క్రమంబున భగవంతుఁ డగు పుండరీకాక్షు నారాధించి యితరులచే నొందరాని సర్వోత్తమంబగు పదంబు నొందె; కాన మీరును రుద్రోపదేశ క్రమంబున సర్వభూతాంతర్యామి యగు నీశ్వరు భవచ్ఛేదంబునకై భజియింపుడు."
టీక:- అని = అని; మఱియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను; భవదీయ = నీ యొక్క; వంశ = వంశము నందలి; ధుర్యుండున్ = భారము వహించెడివాడు; అగు = అయిన; ధ్రువుండున్ = ధ్రువుడు; సపత్నీ = సవితి; మాతృ = తల్లి యొక్క; వాక్ = మాటలు యనెడి; బాణ = బాణములచే; భిన్న = ముక్కలైన; హృదయుండున్ = హృదయము గలవాడు; ఐ = అయ్యి; పంచ = ఐదు (5); వర్షా = సంవత్సరముల; అర్భకుండున్ = బాలకుడు; అగుచున్ = అగుచు; తపోవనంబున్ = తపసు చేసుకొనెడి అడవి; కున్ = కు; అరుగున్ = వెళ్ళు; అప్పుడున్ = సమయములో; మార్గంబునన్ = దారిలో; నా = నా; చేన్ = చేత; ఉపదిష్టంబు = ఉపదేశింపబడినది; ఐన = అయిన; క్రమంబునన్ = విధముగా; భగవంతుడు = మహైశ్వర్యములు గలవాడు; అగు = అయిన; పుండరీకాక్షున్ = విష్ణుమూర్తిని; ఆరాధించి = సేవించి; ఇతరుల్ = ఇతరుల; చేన్ = చేత; ఒందరాని = పొందరాని; సర్వ = సమస్తమైనవాని కంటెను; ఉత్తమంబున్ = శ్రేష్ఠమైనది; అగు = అయిన; పదంబున్ = స్థానమును; ఒందెన్ = పొందెను; కాన = కనుక; మీరునున్ = మీరు కూడ; రుద్ర = శివునిచేత; ఉపదేశ = ఉపదేశింపబడినన; క్రమంబునన్ = విధముగా; సర్వభూతాంతర్యామి = విష్ణుమూర్తి {సర్వ భూతాంతర్యామి - అఖిల జీవులకును అంతర్యామి (లోపల ఉండెడి వాడు), విష్ణువు}; అగున్ = అయిన; ఈశ్వరున్ = భగవంతుని; భవత్ = భవబంధముల; ఛేదంబున్ = తెంపుట; కై = కోసము; భజియింపుడు = సేవించండి.
భావము:- అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “మీ వంశంలో ప్రసిద్ధుడైన ధ్రువుడు సవతితల్లి మాటల బాణాలచేత మనస్సులో నొచ్చుకొని అయిదేళ్ళ వయస్సులోనే తపోవనానికి వెళ్తూ దారిలో కలిసిన నేను ఉపదేశించిన విధంగా భగవంతుడైన విష్ణువును ఆరాధించి ఇతరు లెవ్వరూ పొందరాని ఉత్తమపదాన్ని పొందినాడు. కనుక మీరు కూడ శివుడు ఉపదేశించిన విధంగా సర్వాంతర్యామి అయిన విష్ణువును సేవించి భవబంధాలనుండి తరించండి”.

తెభా-4-965-క.
ని యివ్విధమున నారద
ముని రాజకుమారులకును ముదము దలిర్పన్
జోదరు సచ్చరితము
వినిపించి సరోజభవుని వీటికిఁ జనియెన్.

టీక:- అని = అని; ఇవ్విధంబునన్ = ఈ విధముగా; నారద = నారదుడు యనెడి; ముని = ముని; రాజకుమారుల్ = రాకుమారుల; కున్ = కు; ముదమున్ = సంతోషము; తలిర్పన్ = చిగురించునట్లుగా; వనజోదరున్ = హరి యొక్క {వనజోదరుడు - వనజము (పద్మము) ఉదరమున గలవాడు, విష్ణువు}; సత్ = చక్కటి; చరితమున్ = వర్తనములను; వినిపించి = వినిపించి; సరోజభవుని = బ్రహ్మదేవుని {సరోజ భవుడు - సరోజ (పద్మమున) భవుని (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; వీటి = నివాసమున; కిన్ = కిని; చనియెన్ = వెళ్లెను.
భావము:- అని ఈ విధంగా నారదమహర్షి రాజపుత్రులైన ప్రచేతసులకు నారాయణుని సచ్చరిత్రాన్ని వినిపించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు.

తెభా-4-966-వ.
ఇట్లు నారదుండు చనిన యనంతరంబ.
టీక:- ఇట్లు = ఈ విధముగా; నారదుండు = నారదుడు; చనినన్ = వెళ్ళిపోయిన; అనంతరంబ = తరువాత.
భావము:- ఆ విధంగా నారదుడు వెళ్ళిన తరువాత…

తెభా-4-967-చ.
వరనందనుల్ గడఁక నారద వక్త్ర వినిర్గతంబు సుం
మును మంగళావహము న్యము లోకమలాపహంబునై
రఁగిన విష్ణు సద్యశము క్తి నుతించి ముకుంద చింతనా
నిరుపమ భక్తిఁ జెంది హరినిత్య పదంబును బొంది రున్నతిన్.

టీక:- నరవరనందనుల్ = రాజకుమారులు; కడకన్ = దీక్షతో; నారద = నారదుని; వక్త్ర = నోటినుండి; వినిర్గతంబున్ = వెలువడినది; సుందరమునున్ = అందమైనది; మంగళ = శుభములు; ఆవహమున్ = కలిగించునది; ధన్యమున్ = సార్థకమును; లోక = లోకముల యందలి; మల = మలములను; అపహంబున్ = పోగొట్టునది; ఐ = అయ్యి; పరగిన = ప్రసిద్ధమైన; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; సత్ = చక్కని; యశమున్ = కీర్తిని; భక్తిన్ = భక్తితో; ముకుంద = విష్ణుమూర్తి; చింతనా = ధ్యానించెడి; నిరుపమ = సాటిలేని; భక్తిన్ = భక్తిని; చెంది = పొంది; హరిన్ = విష్ణుని; నిత్య = శాశ్వతమైన; పదంబున్ = స్థానమును; పొందిరి = పొందిరి; ఉన్నతిన్ = ఔన్నత్యముతో.
భావము:- రాకుమారులు నారదముని వర్ణించిన సుందరమూ శుభప్రదమూ ధన్యమూ లోకమాలిన్యాన్ని తొలగించేదీ అయిన నారాయణుని కీర్తిని పొగడి ఆయనను భక్తితో సేవించి శాశ్వతమైన హరి పదాన్ని పొందినారు.

తెభా-4-968-వ.
అని మైత్రేయుండు విదురున కిట్లనియె “మహాత్మ! నీవు నన్నడిగిన ప్రచేతోనారద సంవాద రూపంబైన హరికీర్తనంబు మను పుత్రుండైన యుత్తానపాదుని వంశప్రకారంబును జెప్పితి;” నని వెండియు నిట్లనియె “నారదు వలనం బ్రియవ్రతుం డాత్మవిజ్ఞానంబు నొంది మహీమండలంబుఁ బరిపాలించి యనంతరంబునఁ బుత్రులకు రాజ్యంబుఁ బంచి యిచ్చి పరలోకగతుండయ్యె;” ననిన.
టీక:- అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురున్ = విదురుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను; మహాత్మ = గొప్పవాడ; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడిగిన = అడిగినట్టి; ప్రచేతస్ = ప్రచేతసులు; నారద = నారదుల; సంవాద = సంభాషణ; రూపంబున్ = రూపమున కలది; ఐన = అయిన; హరిన్ = విష్ణుని; కీర్తనంబున్ = స్తోత్రమును; మను = మనువు యొక్క; పుత్రుండు = కుమారుడు; ఐన = అయిన; ఉత్తానపాదుని = ఉత్తానపాదుని {ఉత్తానపాదుడు - ఉత్తాన (ఎత్తిన) పాదుడు (పాదము గలవాడు), ముందుకు సాగుట మొదలు పెట్టినవాడు}; వంశ = వంశము యొక్క; ప్రకారంబున్ = విధమును; చెప్పితిని = చెప్పితిని; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను; నారదున్ = నారదుని; వలనన్ = వలన; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు {ప్రియవ్రతుడు - ప్రీతి కలిగి యుండుటే వ్రతముగా గలవాడు}; ఆత్మవిజ్ఞాన = ఆత్మతత్త్వమును; ఒంది = పొంది; మహీ = భూ; మండలంబున్ = మండలమును; పరిపాలించి = ఏలి; అనంతరంబునన్ = తరవాత; పుత్రుల్ = కుమారుల; కున్ = కు; రాజ్యంబున్ = రాజ్యమును; పంచి = భాగించి; ఇచ్చి = ఇచ్చివేసి; పరలోక = పరలోకమునకు; గతుండున్ = వెళ్లినవాడు; అయ్యెన్ = అయ్యెను; అనినన్ = అనగా.
భావము:- అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు. “మహాత్మా! నీవు అడిగిన ప్రచేతో నారద సంవాద రూపంలో ఉన్న హరి కీర్తనాన్ని, మనువు పుత్రుడైన ఉత్తానపాదుని వంశచరిత్రను నీకు చెప్పాను” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “నారదుని వల్ల ప్రియవ్రతుడు ఆధ్యాత్మ విద్యను గ్రహించి భూమండలాన్ని పాలించి, ఆ తరువాత పుత్రులకు రాజ్యాన్ని పంచి ఇచ్చి పరలోకగతుడయ్యాడు” అని చెప్పగా…