పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/విదురుండు హస్తినకరుగుట

వికీసోర్స్ నుండి


తెభా-4-969-క.
మునఁ దగఁ దాల్చి పలికె మైత్రేయునితోన్.
టీక:- విని = విని; విదురుండు = విదురుడు; ఆ = ఆ; ముని = మునులలో; వరున్ = ఉత్తముని; ఘన = గొప్ప; చరణముల్ = పాదములను; ఆత్మ = తన; మస్తకంబునన్ = తలపైన; మధుసూదనున్ = హరి యొక్క {మధు సూదనుడు - మధు యనెడి రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; చరణ = పాదములు యనెడి; అంభోరుహములు = పద్మములు; మనమునన్ = మనసులో; తగన్ = చక్కగా; తాల్చి = ధరించి; పలికెన్ = పలికెను; మైత్రేయుని = మైత్రేయుని; తోన్ = తోటి.
భావము:- విదురుడు మైత్రేయుడు చెప్పినది విని ఆ మహర్షి పాదాలను తల యందు, శ్రీహరి పాద పద్మాలను మనస్సునందు ధరించి అతనితో ఇలా అన్నాడు.

తెభా-4-970-క.
"మునినాథచంద్ర! కరుణా
నిధి! నీ చేత భక్తత్సలుఁడగు నా
జాక్షు తత్త్వ మెఱిఁగితి"
ని తత్పదములకు వినతుఁడై వినయమునన్.

టీక:- ముని = మునులకు; నాథ = నాయకులలో; చంద్ర = చంద్రుని వంటివాడ; కరుణా = దయా; వననిధి = సముద్రుడా; నీ = నీ; చేతన్ = చేత; భక్త = భక్తుల యెడ; వత్సలుడు = వాత్సల్యము గలవాడు; అగు = అయిన; ఆ = ఆ; వనజాక్షున్ = విష్ణుని {వనజాక్షుడు - వనజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; తత్త్వమున్ = తత్త్వమును; ఎఱిగితిన్ = తెలిసితిని; అని = అని; తత్ = అతని; పదముల్ = పాదముల; కున్ = కు; వినతుడు = నమస్కరించినవాడు; ఐ = అయ్యి; వినయమునన్ = వినయముతో.
భావము:- “మునీంద్రా! కరుణాసముద్రా! నీవల్ల భక్తవత్సలుడు అయిన శ్రీహరి తత్త్వాన్ని తెలుసుకున్నాను” అని వినయంతో అతని పాదాలకు నమస్కరించి…

తెభా-4-971-క.
మునిచే నా మంత్రితుఁ
డై నమున బంధు దర్శనాకాంక్షితుఁడై
ధీ హితుఁడైన విదురుఁడు
సాజపురమునకుఁ జనియె మ్మద మొప్పన్.

టీక:- ఆ = ఆ; ముని = ముని; చేన్ = చేత; ఆమంత్రితుండు = వీడ్కోలు పొందినవాడు; ఐ = అయ్యి; మనమునన్ = మనసులో; బంధు = బంధువులను; దర్శన = చూచుటను; కాంక్షితుండు = కోరువాడు; ఐ = అయ్యి; ధీ = ధీశక్తి కలుగుటచే; మహితుడు = గొప్పవాడు; ఐన = అయిన; విదురుడు = విదురుడు; సామజపురమున్ = హస్తినాపురము; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; సమ్మదము = సంతోషము; ఒప్పన్ = కలుగునట్లుగా.
భావము:- జ్ఞాన సంపన్నుడైన విదురుడు ఆ మైత్రేయ ముని దగ్గర సెలవు తీసుకొని బంధువులను చూచే కోరికతో హస్తినాపురానికి వెళ్ళాడు”.

తెభా-4-972-క.
ని శుకుఁడు పరీక్షిత్తున
నుకంపం జెప్పె "నీ యుపాఖ్యానంబున్
వినువాఁ డైశ్వర్యాయు
ర్ధ కీర్తిస్వస్తి గతులఁ గఁ బ్రాపించున్. "

టీక:- అని = అని; శుకుడు = శుకుడు; పరీక్షిత్తున్ = పరీక్షితుని; కున్ = కి; అనుకంపన్ = ఆదరముతో; చెప్పెన్ = చెప్పెను; ఈ = ఈ; ఉపాఖ్యానంబున్ = వృత్తాంతమును; విను = వినెడి; వాడు = వాడు; ఐశ్వర్య = ఐశ్వర్యము; ఆయుర్ = ఆయుష్షు; ధన = సంపదలు; కీర్తిన్ = యశస్సు; స్వస్తి = క్షేమముల; గతులన్ = మార్గములను; తగన్ = తప్పక; ప్రాపించున్ = ప్రాప్తినిపొందును.
భావము:- అని శుకమహర్షి పరీక్షిత్తుకు సాదరంగా చెప్పాడు. ఈ కథను విన్నవాడు ఐశ్వర్యాన్ని, ఆయుస్సును, ధనాన్ని, కీర్తిని, శుభాలను పొందుతాడు.

తెభా-4-973-క.
ని శుకయోగి పరీక్షి
జ్జపాల సుధాపయోధి చంద్రున కర్థిన్
వినిపించిన కథ మోదం
బు సూతుఁడు శౌనకాది మునులకుఁ జెప్పెన్.

టీక:- అని = అని; శుక = శుకుడు యనెడి; యోగి = యోగి; పరీక్షిత్ = పరీక్షితుడు యనెడి; జనపాల = రాజు యనెడి {జనపాలుడు - జనులను పాలించెడివాడు, రాజు}; సుధా = అమృతపు; పయోధి = సముద్రమునకు; చంద్రున్ = చంద్రుని వంటివాని; కిన్ = కి; అర్థిన్ = కోరి; వినిపించిన = చెప్పిన; కథన్ = కథను; మోదంబునన్ = సంతోషముతో; సూతుడు = సూతుడు; శౌనక = శౌనకుడు {శౌనకుడు – ఋషిర్యుడు శునకుని పుత్రుడు, ఒక మహర్షి}; ఆది = మొదలగు; మునుల్ = మునుల; కున్ = కు; చెప్పెన్ = చెప్పెను.
భావము:- అని శుక మహర్షి పరీక్షిన్మహారాజు చెప్పిన కథను సూతుడు శౌనకాది మునులకు వినిపించాడు.