Jump to content

పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/ప్రచేతసుల తపంబు

వికీసోర్స్ నుండి


తెభా-4-895-వ.
వెండియు నిట్లనియె “ఇట్లు ముకుందయశంబునం జేసి భువనపావనంబు, మనశ్శుద్ధికరంబు, సర్వోత్కృష్టఫలప్రదాయకంబు, దేవర్షివర్య ముఖ వినిస్సృతంబు నైన యీ యధ్యాత్మ పారోక్ష్యంబు నెవ్వండు పఠియించు నెవ్వండు విను నట్టివాఁరు లింగశరీరవిధూననంబు గావించి ముక్త సమస్త బంధుడయి విదేహకైవల్యంబు నొంది సంసారమునందుఁ బరిభ్రమింప"డనిన మైత్రేయునకు విదురుం డిట్లనియె.
టీక:- వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఇట్లు = ఈ విధముగ; ముకుంద = విష్ణుమూర్తి; యశంబునన్ = కీర్తి; చేసి = వలన; భువన = లోకములను; పావనంబున్ = పవిత్రము చేయునది; మనస్ = మనస్సును; శుద్ధికరంబు = శుద్ధి చేయునది; సర్వ = అన్నిటికన్నను; ఉత్కృష్ట = శ్రేష్ఠమైన; ఫల = ఫలితములను; ప్రదాయకంబున్ = చక్కగా కలుగ జేయునది; దేవర్షి = దేవఋషులలో; వర్యా = శ్రేష్ఠుని; ముఖ = నోటినుండి; వినిస్సృతంబున్ = చక్కగా వినిపింపబడినది; ఐన = అయిన; ఈ = ఈ; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; పారోక్ష్యంబున్ = ఉపాఖ్యానమును; ఎవ్వండు = ఎవరైతే; పఠియించు = చదివునో; ఎవ్వండు = ఎవరైతే; వినున్ = వినునో; అట్టి = అటువంటి; వారున్ = వారు; లింగశరీర = లింగశరీరమును; విధూననంబున్ = విడువబడినదిగా; కావించి = చేసి; ముక్త = విముక్తమైన; సమస్త = సమస్తమైన; బంధులు = బంధములు కలవాడు; అయి = అయ్యి; విదేహ = దేహరహితమైన; కైవల్యమున్ = ముక్తిని; ఒంది = పొంది; సంసారమున్ = ఇక సంసారము; అందున్ = అందు; పరిభ్రమింపరు = తిరుగరు; అనినన్ = అనగా; మైత్రేయున్ = మైత్రేయుని; కున్ = కి; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- (మైత్రేయుడు విదురునితో) ఇంకా ఇలా అన్నాడు. “నారదముని బోధించిన హరికీర్తిని కొనియాడే ఈ ఆధ్యాత్మ పారోక్ష్యం లోకాన్ని పవిత్రం చేస్తుంది. మనశ్శుద్ధిని కలిగిస్తుంది. అన్నిటికంటే గొప్పదైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి దీనిని చదివేవాడు, విన్నవాడు లింగశరీరాన్ని విడిచి సమస్త బంధాలను త్రెంచుకొని విదేహ కైవల్యాన్ని పొందుతాడు. సంసారంలో భ్రమించడు” అని చెప్పిన మైత్రేయునితో విదురుడు ఇలా అన్నాడు.

తెభా-4-896-క.
"మునినాథ! ప్రచేతసు లా
మగు రుద్రోపదిష్ట మలోదర కీ
ర్తమున నే గతిఁ బొందిరి
జాక్షుఁడు సంతసింప వా రనఘాత్మా!

టీక:- ముని = మునియైన; నాథ = ప్రభువా; ప్రచేతసులు = ప్రచేతసులు; ఆ = ఆ; ఘనము = మిక్కిలి గొప్పది; అగు = అయిన; రుద్ర = శివునిచే; ఉపదిష్ట = ఉపదేశింపబడిన; కమలోదర = విష్ణుమూర్తి {కమ లోదరుడు - కమలము ఉదరమున కలవాడు, విష్ణువు}; కీర్తనమునన్ = స్తోత్రమును; ఏ = ఏ; గతిన్ = విధముగ; పొందిరి = పొందిరి; వనజాక్షుడు = విష్ణుమూర్తి {వనజాక్షుఁడు - వనజము (పద్మము) వంటి కన్నులు యున్నవాడు, విష్ణువు}; సంతసింపన్ = సంతోషించునట్లు; వారున్ = వారు; అనఘాత్మ = పుణ్యాత్ముడా.
భావము:- “మునీంద్రా! ప్రచేతసులు శివుడు ఉపదేశించిన స్తోత్రాన్ని జపించి, విష్ణువును సంతోషింపజేసి ఏ గతిని పొందారు?

తెభా-4-897-తే.
డఁగి మఱి వారు యాదృచ్ఛిమున జేసి
రికి నిత్యప్రియుం డగు రునిఁ గాంచి
తని వలన యనుగ్రహ మంది మోక్ష
మంది రని చెప్పి; తది నిశ్చయంబు మఱియు

టీక:- కడగి = పూని; మఱి = మరి; వారున్ = వారు; యాదృచ్ఛికమున = అనుకోకుండా జరిగినదాని; జేసి = వలననైను; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; నిత్య = శాశ్వతమైన; ప్రియుండు = ప్రియమైనవాడు; హరుని = శివుని; కాంచి = దర్శించి; అతని = అతని; వలని = నుండి; అనుగ్రహమున్ = అనుగ్రహమును; అంది = పొంది; మోక్షమున్ = ముక్తిని; అందిరి = పొందిరి; అని = అని; చెప్పితి = చెప్పితివి; అది = అది; నిశ్ఛయంబున్ = నిశ్ఛయమే; మఱియున్ = ఇంకను.
భావము:- వారు అప్రయత్నంగా శ్రీహరికి ఇష్టుడైన శివుని దర్శించి ఆయన అనుగ్రహం వల్ల మోక్షం పొందారని చెప్పావు. అది నిజమే!

తెభా-4-898-క.
రి దర్శన పూర్వం బిహ
లోకములందు నా నృపాల తనయు లం
దిరి యే ఫలముల నందఱు
నితి నెఱింగింపు;"మన మునివరుఁడు పలికెన్.

టీక:- హరి = విష్ణుమూర్తి; దర్శన = దర్శనమునకు; పూర్వమున్ = పూర్వము; ఇహ = ఇక్కడివి; పర = ఇతరములైన; లోకముల్ = లోకములు; అందున్ = లోను; ఆ = ఆ; నృపాలతనయులన్ = రాకుమారులు; అందిరి = పొందిరి; ఏ = ఎలాంటి; ఫలములన్ = ఫలితములను; అందఱున్ = వారందరు; నిరతిన్ = మిక్కిలి ఆసక్తితో; ఎఱిగింపుము = తెలుపుము; అనన్ = అనగా; ముని = మునులలో; వరుడు = శ్రేష్ఠుడు; పలికెన్ = పలికెను.
భావము:- శ్రీహరిని దర్శించటానికి ముందు ఈ లోకంలోను, పరలోకంలోను ఈ రాజపుత్రులు ఏ ఫలాలను పొందారు నాకు చెప్పు” అని విదురుడు అడుగగా మైత్రేయుడు ఇలా అన్నాడు.

తెభా-4-899-క.
"విను జనకాదేశము ముద
మునఁ దాల్చి నృపాత్మజులు సముద్రోదరమం
నుపమ జపయజ్ఞంబున
నొరఁ దపం బూని ముదము నొందుచు నుండన్.

టీక:- విను = వినుము; జనక = తండ్రి యొక్క; ఆదేశమున్ = ఆజ్ఞను; ముదమున్ = సంతోషముతో; తాల్చి = ధరించి, స్వీకరించి; నృపాత్మజులున్ = రాకుమారులు; సముద్ర = సముద్రము; ఉదరమున్ = కడుపు; అందున్ = లో; అనుపమ = సాటిలేని; జపయజ్ఞంబునన్ = జపయజ్ఞము; ఒనరన్ = పొసగునట్లుగా; తపంబున్ = తపస్సునకు; పూని = పూనుకొని; ముదమున్ = సంతోషమును; ఒందుచున్ = పొందుతూ; ఉండగన్ = ఉండగా.
భావము:- “విను. తండ్రి ఆనతిని తలదాల్చి ఆ రాకుమారులు అయిన ప్రచేతసులు సముద్రమధ్యంలో రుద్రగీతాన్ని జపిస్తూ తపస్సును ప్రారంభించారు.

తెభా-4-900-క.
దివే లేఁడులు నిష్ఠను
లక తప మాచరింప వారల కర్థిన్
యాంతరంగుఁ డభయ
ప్రదుఁడు సనాతనుఁడు నైన ద్మోదరుఁడున్.

టీక:- పదివేల = పదివేల (10, 000); ఏడులు = సంవత్సరములు; నిష్ఠను = నియమపాలనను; వదలక = వదలిపెట్టకుండగా; తపమున్ = తపస్సును; ఆచరింపన్ = చేయగా; వారల్ = వారి; కిన్ = కి; అర్థిన్ = కోరి; సదాయాంతరంగుడున్ = హరి {సదాయాంతరంగుడు - సత్ (మిక్కిలి) దయా (కృపగల) అంతరంగుడు (మనసు గలవాడు), విష్ణువు}; అభయప్రదుడున్ = హరి {అభయ ప్రదుడు - అభయము ఇచ్చువాడు, విష్ణువు}; సనాతనుడున్ = హరి {సనాతనుడు - పురాతనుడు, విష్ణువు}; అయిన = ఐన; పద్మోదరుడున్ = హరి {పద్మోదరుడు - పద్మము ఉదరముననున్నవాడు, విష్ణువు}.
భావము:- వారు పదివేల సంవత్సరాలు నిష్ఠతో తపస్సు చేయగా దయామయుడు, అభయప్రదాత, సనాతనుడు అయిన శ్రీహరి…

తెభా-4-901-క.
నుపమ శాంతము లగు నిజ
ను రశ్ములచే నృపాల నయ తపో వే
లు శమింపగఁ జేయుచు
యముఁ బ్రత్యక్ష మయ్యె; చ్యుతుఁ డంతన్.

టీక:- అనుపమ = సాటిలేని; శాంతములున్ = శాంతము కలిగించెడివి; అగు = అయిన; నిజ = తన; తను = శరీరము యొక్క; రశ్ములు = కాంతులు; చేన్ = చేత; నృపాలతనయ = రాజకుమారుల; తపః = తపస్సు యొక్క; వేదనలున్ = బాధలను; శమింపగన్ = శాంతించునట్లు; చేయుచున్ = చేస్తూ; అనయమున్ = అవశ్యము; ప్రత్యక్షము = ప్రత్యక్షము; అయ్యెన్ = అయ్యెను; అచ్యుతుడు = హరి {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; అంతన్ = అంతట.
భావము:- ఆ రాకుమారుల తపఃక్లేశాన్ని శమింపజేస్తూ, తన సాటిలేని శరీరకాంతులతో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు.

తెభా-4-902-సీ.
న మేరుశృంగ సంత నీల మేఘంబు-
నెఱి గరుడస్కంధ నివసితుండుఁ
మనీయ నిజదేహకాంతి విపాటితా-
భీలాఖి లాశాంతరా తముఁడు
సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర-
సేవక పరిజన సేవితుండు
మండిత కాంచన కుండల రుచిరోప-
లాలిత వదన కపోతలుఁడు

తెభా-4-902.1-తే.
చారు నవరత్నదివ్యకోటీ ధరుఁడు
కౌస్తుభప్రవిలంబ మంళగళుండు
లిత పీతాంబరప్రభాలంకృతుండు
హార కేయూర వలయ మంజీర యుతుఁడు

టీక:- ఘన = గొప్ప; మేరు = మేరు; శృంగ = పర్వతశిఖరము; సంగతన్ = సాంగత్యముగల; నీలమేఘంబున్ = నీలిమేఘము వలె; నెఱిన్ = నిండుగా; గరుడ = గరుత్మంతుని; స్కంధ = మూపున; నివసితుండున్ = వసించుతున్నవాడు; కమనీయ = మనోజ్ఞమైన; నిజ = తన; దేహ = శరీర; కాంతి = కాంతిచే; విపాటిత = విరగగొట్టబడిన; ఆభీల = భయంకరమైన; అఖిలా = సమస్తమైన; ఆశాంత = దిక్కుల; అంతరాళ = లోపలి; తముండు = చీకటిగలవాడు; సు = మిక్కిలి; మహిత = గొప్ప; అష్ట = ఎనిమిది; ఆయుధ = ఆయుధములు {విష్ణుని అష్టాయుధములు - 1 శంఖము 2చక్రము 3శారజ్ఞము అనెడి విల్లు, 4కత్తి 5పద్మము 6గదా 7దండము 8శూలము}; సుమనః = దేవతలు; ముని = మునులలో; ఈశ్వర = శ్రేష్ఠులు; సేవక = సేవకులు; పరిజన = పరివారములుచేతను; సేవితుండు = సేనింపబడుతున్నవాడు; మండిత = అలంకృతమైన; కాంచన = బంగారపు; కుండల = చెవికుండలముల; రుచిర = కాంతులచే; ఉపలాలిత = బుజ్జగింపబడుతున్న; వదన = మోము; కపోల = చెక్కిళ్ళ; తలుడు = ప్రదేశములు కలవాడు.
చారు = అందమైన; నవరత్న = నవరత్నములు పొదిగిన; దివ్య = దివ్యమైన; కోటీర = కిరీటము; ధరుడు = ధరించినవాడు; కౌస్తుభ = కౌస్తుభమణి; ప్రవిలంబ = చక్కగావేళ్ళాడుతున్; మంగళ = శుభప్రదమైన; గళుండు = కంఠముగలవాడు; లలిత = అందమైన; పీతాంబర = పట్టుబట్టల; ప్రభా = కాంతులచే; అలంకృతుడు = అలంకరింపబడినవాడు; హార = హారములు; కేయూర = బాహుపురులు; వలయ = కంకణములు; మంజీర = అందెలు; యుతుడు = కలిగినవాడు.
భావము:- ఆ శ్రీహరి మేరుపర్వత శిఖరంపై నల్లని మేఘం వలె గురుడుని మూపుపై కూర్చున్నాడు. తన శరీర కాంతులతో నలుదిక్కుల నడుమ వ్యాపించిన చీకటిని తొలగిస్తున్నాడు. అష్టాయుధాలు {విష్ణుదేవుని అష్టాయుధములు - 1 శంఖము 2చక్రము 3శార్ఙ్గము అనెడి విల్లు, 4కత్తి 5పద్మము 6గదా 7దండము 8శూలము} మూర్తిమంతాలై అతనిని సేవిస్తున్నవి. దేవతలు, మునీశ్వరులు సేవకులై కొలుస్తున్నారు. ఆయన చెవులకు ధరించిన బంగారు కుండలాల కాంతి ముఖంమీద, చెక్కిళ్ళమీద వ్యాపిస్తున్నది. నవరత్నమయమైన కిరీటాన్ని ధరించాడు. కౌస్తుభమణి మంగళకర మైన కంఠంలో వ్రేలాడుతున్నది. అందమైన జిలుగు పట్టు బట్టలు కట్టుకున్నాడు. ముత్యాలహారాలు, భుజకీర్తులు, కడియాలు, అందెలు ధరించాడు.

తెభా-4-903-క.
లితాయ తాష్ట భుజ మం
మధ్యస్ఫురిత రుచివిడంబిత లక్ష్మీ
నా కాంతిస్పర్ధా
లిత లసద్వైజయంతికా శోభితుఁడున్

టీక:- లలిత = అందమైన; ఆయుత = నిడుపైన, దీర్ఘమైన; అష్ట = ఎనిమిది; భుజ = భుజముల; మధ్యస్ = మధ్యభాగము, వక్షస్థలము; స్ఫురిత = విలసిల్లి; రుచి = వెలుగులు; విడంబిత = వెదజల్లుతున్న; లక్ష్మీలలన = లక్ష్మీదేవి; కాంతి = కాంతితో; స్పర్థా = పోటీకి; ఆకలిత = వచ్చుచున్న; లసత్ = అందమైన; వైజయింతికా = వైజయింతికా మాలచే; శోభితుండు = శోభిల్లుతున్నవాడు.
భావము:- అతని అందమైన ఎనిమిది భుజాల మధ్య వైజయంతిక అనే వనమాల లక్ష్మీదేవితో పోటీ పడుతూ ప్రకాశిస్తున్నది.

తెభా-4-904-క.
సు గరుడ యక్ష కిన్నర
నిరుపమ జేగీయమాన నిఖిలాశా సం
రిత యశోమహనీయ
స్ఫుణుండు నగు న ప్పురాణ పురుషుం డెలమిన్

టీక:- సుర = దేవతలు; గరుడ = గరుడులు; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరలచే; నిరుపమ = సాటిలేని విధముగ; జేగీయమాన = స్తుతింపబడుటచే; నిఖిల = సకల; ఆశా = దిక్కులు; సంభరిత = నిండిపోయిన; యశో = కీర్తిగలిగిన; మహనీయ = గొప్పగా; స్ఫురణుండు = తెలియబడువాడు; అగు = అయిన; ఆ = ఆ; పురాణపురుషుండు = హరి; ఎలమిన్ = సంతోషముతో.
భావము:- దేవతలు, గరుడులు, యక్షులు, కిన్నరులు దిక్కుల నడుమ నిండిన శ్రీహరి కీర్తిని గానం చేస్తున్నారు. ఆ పురాణ పురుషుడైన విష్ణువు…

తెభా-4-905-క.
రుణావలోకనంబులు
నివొంద నృపాలసుతుల నీక్షించి రమా
రుఁ డంబుద గంభీర మ
ధు భాషలఁ బలికెఁ బ్రియము దూఁకొనుచుండన్

టీక:- కరుణ = దయతో కూడిన; అవలోకనంబులున్ = చూపులు; ఇరవొంద = విలసిల్లగా; నృపాలసుతులన్ = రాజకుమారులను; ఈక్షించి = చూసి; రమావరుడు = విష్ణుమూర్తి; అంబుద = సముద్రము వంటి; గంభీర = గంభీరమైన; మధుర = తియ్యని; భాషలన్ = పలుకులతో; పలికెన్ = పలికెను; ప్రియము = ప్రేమ; దూకొనుచుండన్ = తొణికిసలాడుచుండగా.
భావము:- శ్రీపతి అయిన హరి దయను వెలార్చే చూపులతో ప్రచేతసులను చూచి, మేఘ గంభీర మధుర వాక్కులతో ఇలా అన్నాడు.

తెభా-4-906-తే.
"తాపసోత్తము లగు ప్రచేసులు! వేడ్క
వినుఁడు మీరలు సౌహార్దము నభిన్న
ర్ము లగుట భవత్సౌహృమున కేను
జాలఁ బరితోష మందితి మత నేఁడు

టీక:- తాపస = తాపసులలో; ఉత్తములు = ఉత్తమమైనవారు; అగు = అయిన; ప్రచేతసులు = ప్రచేతసులు; వేడ్కన్ = వేడుకతో; వినుడు = వినండి; మీరలు = మీరు; సౌహార్దమునన్ = స్నేహముతో; అభిన్న = ఒకే విధమైన; ధర్ములు = ధర్మములు గలవారు; అగుటన్ = అగుటచేత; భవత్ = మీ మధ్య గల; సౌహృదమున్ = స్నేహము భావముల; కున్ = కు; ఏనున్ = నేను; చాలన్ = మిక్కిలి; పరితోషమున్ = సంతోషమును; అందితి = పొందితి; సమతన్ = చక్కగా; నేడు = ఈనాడు.
భావము:- “తాపసశ్రేష్ఠులారా! ప్రచేతసులారా! వినండి. మీరు అందరూ కలిసి మెలిసి ఒకే ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మీ స్నేహానికి నేను చాల తృప్తి చెందాను.

తెభా-4-907-క.
యమును మీ మనోరథ
మొరింతు; నెఱుంగఁ బలుకుఁ; డుత్తము లగు మి
మ్మనుదినము నెవ్వఁడు సుఖశ
నుఁడై మదిలోనఁ దలఁచు నా నరుఁ డెపుడున్.

టీక:- అనయమునున్ = అవశ్యము; మీ = మీ యొక్క; మనోరథమున్ = కోరికలను; ఒనరింతున్ = తీర్చెదను; ఎఱుంగన్ = తెలియునట్లు; పలుకుడు = చెప్పండి; ఉత్తములు = శ్రేష్ఠులు; అగు = అయిన; మిమ్మున్ = మిమ్ములను; అనుదినమున్ = ఎల్లప్పుడు; ఎవ్వడున్ = ఎవరైతే; సుఖ = సుఖముగా; శయనుడు = విశ్రాంతి తీసుకొనుచున్నవాడు; ఐ = అయ్యి; మదిన్ = మనసు; లోన్ = లోపల; తలచున్ = తలచుతుండునో; ఆ = ఆ; నరుడున్ = మానవుడు; ఎపుడున్ = ఎప్పుడు.
భావము:- కాబట్టి మీకు వరం ఇస్తాను అడగండి. ఉత్తములైన మిమ్మల్ని ఏ మానవుడు నిత్యం నిద్రపోయే ముందు స్మరిస్తాడో…

తెభా-4-908-క.
భ్రాతృజన సౌహృదంబును
భూదయాగుణము విమల బుద్ధియు సుజన
ప్రీతియుఁ గల్గి సుఖించును
వీ సమస్తాఘుఁ డగుచు విశ్వములోనన్.

టీక:- భ్రాతృ = సోదరులైన; జన = వారి; సౌహృదంబునున్ = స్నేహమును; భూత = జీవుల యెడ; దయా = దయ కలిగి ఉండెడి; గుణమున్ = లక్షణమును; విమల = స్వచ్ఛమైన; బుద్ధియున్ = బుద్ధి; సుజన = మంచివారి; ప్రీతియున్ = ప్రేమను; కల్గి = కలిగి ఉండి; సుఖించునున్ = సుఖములు అనుభవించుచుండును; వీత = వదలివేసిన; సమస్తా = సమస్తమైన; ఆఘుడు = పాపములు కలవాడు; అగుచున్ = అవుతూ; విశ్వము = జగతి; లోనన్ = లోపల.
భావము:- అతడు సోదర స్నేహాన్ని, భూతదయను, నిర్మల బుద్ధిని, సజ్జనుల ప్రేమను పొ౦ది సుఖిస్తాడు. అతని సమస్త పాపాలు నశిస్తాయి.

తెభా-4-909-వ.
మఱియు రుద్రగీతం బయిన మదీయస్తవం బెవ్వ రనుదినంబును స్తోత్రంబు చేయుదురు, వారల కభిమతవరంబులు, శోభనకరం బగు ప్రజ్ఞయు నిత్తు; మీరలు ముదన్వితులై జనకాదేశం బంగీకరించుటం జేసి మీ కీర్తి లోకంబుల విస్తరిల్లు; మీకు ననూన బ్రహ్మగుణుండు నాత్మసంతతింజేసి లోకత్రయ పరిపూర్ణ గుణాకరుండు నైన పుత్రుండు సంభవింపంగలండు; కండుమహాముని తపోవినాశార్థంబుగా నింద్రుని చేతఁ బ్రేషిత యగు ప్రమ్లోచ యను నప్సరస గర్భంబు దాల్చి యమ్మునీంద్రుని వీడ్కొని దివంబునకుం జను సమయంబునం బ్రసూతయై తత్పుత్రిని వృక్షంబు లందుఁ బెట్టి చనిన.
టీక:- మఱియున్ = ఇంకనూ; రుద్ర = శివునిచే; గీతంబున్ = స్తోత్రము చేయబడినది; అయిన = అయిన; మదీయ = నా యొక్క; స్తవంబున్ = స్తుతిని; ఎవ్వరున్ = ఎవరైతే; అనుదినంబున్ = ప్రతిదినము; స్తోత్రంబున్ = కీర్తించుట; చేయుదురు = చేసెదరో; వారల్ = వారి; కిన్ = కి; అభిమత = కోరిన; వరంబులున్ = వరములను; శోభనకరంబున్ = శోభను యిచ్చెడిది యగు; ప్రజ్ఞయున్ = ప్రజ్ఞను; ఇత్తున్ = ఇచ్చెదను; మీరలు = మీరు; ముదన్వితులు = సంతోషము కలవారు; ఐ = అయ్యి; జనక = తండ్రి; ఆదేశంబున్ = ఆజ్ఞను; అంగీకరించుటన్ = అంగీకరించుట; చేసి = వలన; మీ = మీ యొక్క; కీర్తిన్ = యశస్సును; లోకంబులన్ = లోకము లన్నిటను; విస్తరిల్లు = వ్యాపించును; మీ = మీ; కున్ = కు; అనూన = వెలితి లేనంత; బ్రహ్మ = గొప్ప; గుణుండున్ = గుణములు గలవాడు; ఆత్మ = తన; సంతతిన్ = సంతానము; చేసి = వలన; లోకత్రయ = ముల్లోకములను; పరిపూర్ణ = నిండుదనము చేయగల; గుణా = గుణములకు; ఆకరుండు = నివాసమైనవాడు; అగు = అయిన; పుత్రుండు = కుమారుడు; సంభవింపంగలడు = పుట్టగలడు; కండు = కండుడు అనెడి; మహా = గొప్ప; ముని = ముని; తపః = తపస్సును; వినాశ = భంగము; అర్థంబున్ = చేయుట; కాన్ = కొరకు; ఇంద్రునిన్ = ఇంద్రుని; చేతన్ = చేత; ప్రేషిత = ప్రేరేపింపబడినది; అగు = అయిన; ప్రమ్లోచ = ప్రమ్లోచ; అనున్ = అనెడి; అప్సరస = అప్సరస {అప్సరసలు - 1రంభ 2ఊర్వశి 3తిలోత్తమ 4మేనక ఆది దేవనర్తకిలు}; గర్భంబున్ = గర్భమును; తాల్చి = ధరించి; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; వీడ్కొని = వదలి; దివంబున్ = స్వర్గమున; కున్ = కు; చను = వెళ్ళెడి; సమయంబునన్ = సమయములో; ప్రసూత = ప్రసవించినది; ఐ = అయ్యి; తత్ = ఆ; పుత్రిని = కుమార్తెను; వృక్షంబుల్ = చెట్లు; అందున్ = లో; పెట్టి = ఉంచి; చనినన్ = వెళ్ళగా.
భావము:- ఇంకా రుద్రునిచేత గానం చేయబడిన నా స్తోత్రాన్ని నిత్యం జపించేవారికి కోరిన వరాలను, శుభకరమైన ప్రజ్ఞను ప్రసాదిస్తాను. మీరు తండ్రి ఆనతిని సంతోషంగా తల ధరించారు. కాబట్టి మీ కీర్తి లోకంలో వ్యాపిస్తుంది. గుణాలలో బ్రహ్మకు తక్కువ కానివాడు, తన సంతతివల్ల మూడు లోకాలలోను వ్యాపించే కీర్తి కలవాడు అయిన పుత్రుడు మీకు జన్మిస్తాడు. పూర్వం కండు మహాముని చేస్తున్న తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు ప్రమ్లోచ అనే అప్సరసను పంపించాడు. ఆమె కండుమునివల్ల గర్భం ధరించి ఒక పుత్రికను ప్రసవించి చెట్ల మధ్య వదిలి స్వర్గానికి వెళ్ళిపోగా…

తెభా-4-910-సీ.
శిశు వపుడు పేరాఁకలిచేఁ గుంది-
వావిచ్చి బిట్టు వాపోవు చుండ
నాలించి యటకు రాజైన సోముఁడు వచ్చి-
లనొప్ప నవసుధార్షి యైన
యాత్మీయ తర్జని ర్థిఁ బానమ్ము చే-
యింపంగఁ బెరిఁగి య య్యిందువదనఁ
న్యా వరారోహఁ డఁక మారిష యను-
చెలువఁ బుణ్యుండు ప్రాచీనబర్హి

తెభా-4-910.1-తే.
న్నృపునిచేఁ బ్రజా విసర్గావసరము
నందు వేడ్కఁ దదాదిష్టులైన మీర
లందఱును నెయ్యమున వివాహంబు గండ"
ని సరోరుహనయనుఁ డిట్లనియె; మఱియు.

టీక:- ఆ = ఆ; శిశువు = శిశువు; అపుడున్ = అప్పుడు; పేరాకలి = అత్యధికమైన ఆకలి; చేన్ = చేత; కుంది = భాధపడి; వావిచ్చి = నోరువిప్పి; బిట్టు = గట్టిగా; వాపోవుచుండన్ = ఏడ్చుచుండగా; ఆలించి = విని; అట = అక్కడ; కున్ = కి; రాజు = ప్రభువు; ఐన = అయినట్టి; సోముడు = సోముడు; వచ్చి = వచ్చి; వలనొప్పన్ = నేర్పు; ఒప్పన్ = ఒప్పునట్లుగా; నవ = మృదువైన; సుధా = అమృతమును; వర్షి = స్రవించెడి; ఐన = అయిన; ఆత్మీయ = తన యొక్క; తర్జని = చూపుడువేలు; అర్థిన్ = కోరి; పానమ్మున్ = తాగునట్లు; చేయింపగన్ = చేయించగా; పెరిగి = పెరిగి; ఆ = ఆ; ఇందు = చంద్రుని వంటి; వదనన్ = మోముకలామెని; కన్యా = కన్యలలో; వర = ఉత్తములలో; ఆరోహ = గొప్పామెని; కడకన్ = పూని; మారిష = మారిష; అను = అనెడి; చెలువన్ = స్త్రీని {చెలువ - చిన్నవయసుకల, స్త్రీ}; పుణ్యుండు = పుణ్యుడు; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి.
ఆ = ఆ; నృపునిన్ = రాజు; చేన్ = చేత; ప్రజా = సంతానము; విసర్గా = పుట్టించెడి; అవసరంబునన్ = పని; అందున్ = లో; వేడ్కన్ = కోరి; తత్ = దానియందు; ఆదిష్టులు = ఆనతియ్యబడినవారు; మీరలు = మీరు; అందఱునున్ = అందరును; నెయ్యమునన్ = స్నేహముతో; వివాహంబున్ = వివాహము; కండు = చేసికొనుడు; అని = అని; సరోరుహనయనుడు = విష్ణుమూర్తి {సరోరహనయనుడు - సరోరుహము (పద్మము) వంటి నయనుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; మఱియున్ = ఇంకనూ.
భావము:- ఆ శిశువు ఆకలి బాధతో నోరు తెరచి గట్టిగా ఏడ్వసాగింది. ఆ ఏడుపు విని రాజైన చంద్రుడు వచ్చి అమృతం స్రవించే తన చూపుడు వ్రేలిని శిశువు నోటిలో ఉంచాడు. శిశువు అమృతం త్రాగి పెరిగింది. యౌవనవతి అయింది. ఆమె పేరు మారిష. మీ తండ్రి ప్రాచీనబర్హి ఆజ్ఞచేత ప్రజాసృష్టి చేయటానికి పూనుకొన్న మీరు అందరూ ప్రేమతో ఆమెను పెండ్లాడండి” అని చెప్పి విష్ణువు ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-911-వ.
“అనఘాత్ములారా! యభిన్న ధర్మశీలు రయిన మీకు నందఱకు నా సుమధ్య యైన కన్య యభిన్న ధర్మశీలయు భవ దర్పితాశయయు నయిన భార్య యగు; మీర లప్రతిహత తేజస్కులై దివ్యవర్ష సహస్రంబులు భౌమ దివ్య భోగంబులు మదనుగ్రహులై యనుభవించెద; రంత నా యందుల భక్తిం జేసి నిర్మలాంతఃకరణులై యీ భోగంబులు నిరయ ప్రాయంబులుగాఁ దలంచి మదీయ స్థానంబు నొందెద” రని వెండియు నిట్లనియె.
టీక:- అనఘాత్ములారా = పుణ్యాత్ములారా; అభిన్న = ఒకేవిధమైన; ధర్మ = ధర్మమున; శీలురు = నడచెడివారు; అయిన = అయినట్టి; మీ = మీ; కున్ = కు; అందఱు = అందరు; కున్ = కి; ఆ = ఆ; సు = చక్కటి; మధ్య = నడుముకలిగినామె; ఐన = అయిన; కన్య = స్త్రీ; అభిన్న = సమగ్రమైన; ధర్మ = ధర్మము గల; శీలయున్ = నడవడిక కలామె; భవత్ = మీ యందు; అర్పిత = అర్పింపబడిన; ఆశయమున్ = ఆశయములు కలామె; అయిన = అయిన; భార్య = భార్య; అగు = అగును; మీరలు = మీరు; అప్రతిహత = తిరుగులేని; తేజస్కులు = తేజస్సు గలవారు; ఐ = అయ్యి; దివ్య = దివ్యమైన; వర్ష = సంవత్సరములు; సహస్రంబులున్ = వేలకొలది; భౌమ = భౌతికమైన; దివ్య = దివ్యమైన; భోగంబులున్ = భోగములను; మత్ = నా యొక్క; అనుగ్రహులు = అనుగ్రహము గలవారు; ఐ = అయ్యి; అనుభవించెదరు = అనుభవించెదరు; అంత = అంతట; నా = నా; అందలన్ = ఎడ; భక్తిన్ = భక్తి; చేసి = వలన; నిర్మల = స్వచ్ఛమైన; అంతఃకరణులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ఈ = ఈ; భోగంబులున్ = భోగములను; నిరయ = నరకమునకు; ప్రాయంబులును = సమానమైనవి; కాన్ = అగునట్లు; తలంచి = భావించి; మదీయ = నా యొక్క; స్థానంబున్ = స్థానమును; ఒందెదరు = పొందెదరు; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- “పుణ్యాత్ములారా! మీరు అభిన్నమైన ధర్మశీలం కలవారు. ఆమెకూడా అభిన్న ధర్మశీలయై మిమ్ముల నందరినీ సమానమైన ప్రేమతో సేవింపగలదు. మీరు గొప్ప బలవంతులై వేలకొలది దివ్య సంవత్సరాలు భూలోక సుఖాలను, స్వర్గలోక సుఖాలను నా అనుగ్రహం చేత అనుభవిస్తారు. ఆ తరువాత నామీది భక్తివల్ల చిత్తశుద్ధిని పొంది ఆ సుఖాలను నరకప్రాయంగా భావించి నా స్థానాన్ని చేరుకుంటారు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-912-చ.
"య గృహస్థు లయ్యును మర్పిత కర్ములు నస్మదీయ సుం
చరితామృతశ్రవణ త్పర మానస యాతయాములున్
స గుణాఢ్యు లై తనరు సాధుల కీ గృహముల్ దలంప దు
ష్క భవబంధ హేతువులు గావు నృపాత్మజులార! యెన్నఁడున్.

టీక:- అరయన్ = తరచి చూసినచో; గృహస్థులు = గృహస్థులు; అయ్యును = అయినప్పటికిని; మత్ = నాకు; అర్పిత = అర్పింపబడిన; కర్ములున్ = కర్మములు చేయువారు; అస్మదీయ = నా యొక్క; సుందర = అందమైన; చరిత = వర్తనలు యనెడి; అమృత = అమృతమును; శ్రవణ = వినుట యనెడి; తత్ = వాటి యందు; పర = లగ్నమైన; మానస = మనసులు; యాత = గడచిన; యాములున్ = జాములు గలవారు; సరస = సరసమైన; గుణా = గుణములు యనెడి; ఆఢ్యులు = సంపద గలవారు; ఐ = అయ్యి; తనరు = అతిశయించెడి; సాధుల్ = మంచివారి; కిన్ = కి; గృహముల్ = గృహములు; తలంపన్ = భావింపగా; దుష్కర = కష్టములుకలిగించెడి; భవబంధ = భవబంధములను కలిగించుటకు; హేతువులు = కారణములు; కావు = కావు; నృపాత్మజలులారా = రాకుమారులారా; ఎన్నడున్ = ఎప్పుడును, ఎప్పటికిని.
భావము:- “రాజపుత్రులారా! గృహస్థు లైనప్పటికీ కర్మలను నాకు సమర్పించి అమృతం వంటి నా కథలను వింటూ కాలాన్ని గడిపే సజ్జనులకు గృహాలు బంధాలు కానే కావు.

తెభా-4-913-వ.
అది యెట్లంటిరేని.
టీక:- అది = అది; ఎట్లు = ఏ విధముగా; అంటిరేని = అనినచో.
భావము:- అది ఎలా అంటే…

తెభా-4-914-చ.
నుపమ బ్రహ్మవాదు లగు నంచిత యోగిజనానుగీయమా
నిజకథా సముత్సుకుఁ డనందగు నేను మదీయులంద నూ
ముగ నుందుఁ గావున నుదారత వారికి నీ గృహావళుల్
భవబంధ హేతువులు గా; విది యంతయు నిక్క మారయన్.

టీక:- అనుపమ = సాటిలేని; బ్రహ్మవాదులు = ఆధ్యాత్మికవాదులు; అగు = అయిన; అంచిత = మనోహరమైన; యోగి = యోగులు ఐన; జనా = వారిచే; అనుగీయమాన = కీర్తింపబడెడి; నిజ = తన; కథా = కథలు యందు; సమ = మిక్కిలి; ఉత్సకుండున్ = ఉత్సాహము గలవాడు; అనన్ = అనుటకు; తగు = తగిన; నేను = నేను; మదీయులు = నా వారు; అందున్ = ఎడల; అనూతనముగన్ = అరమరిక లేకుండగ; ఉందున్ = ఉంటాను; కావునన్ = కనుక; ఉదారతన్ = విస్తారముగ; వారి = వారి; కిన్ = కి; ఈ = ఈ; గృహ = గృహస్థ; ఆవళుల్ = సమూహములు; ఘన = మిక్కిలి; భవ = సంసారమనెడి; బంధ = బంధములను కలిగించెడి; హేతువులు = కారణములు; కావు = కావు; ఇది = ఇది; అంతయున్ = అంతా; నిక్కమున్ = నిజమైనది; అరయన్ = తరచి చూసినచో.
భావము:- బ్రహ్మవాదులైన యోగిజనులు నా కథలను గానం చేస్తారు. అందుచేత నేను నా కథాగానాన్ని వినేవారి హృదయాలలో ఎప్పటికప్పుడు అరమరిక లేకుండా నివసిస్తాను కాబట్టి నా భక్తులకు గృహాలు బంధాలు కానేకావు. ఇది నిజం.

తెభా-4-915-క.
సుఁడ నగు ననుఁ బొందిన
పురుషులు ఘన శోక మోహ మోదంబులఁ బొం
రు; గావున నెనయఁగను ద్రి
పురుషాధీశ్వరుఁడ బ్రహ్మభూతుఁడ నగుదున్."

టీక:- సరసుడను = సరసముగా యుండెడివాడను; అగు = అయిన; ననున్ = నన్ను; పొందిన = పొందినట్టి; పురుషులు = మానవులు; ఘన = అత్యధికమైన; శోక = దుఃఖము; మోహ = వ్యామోహముల; మోదంబులన్ = సంతోషములను; పొందరు = పొందరు; కావునన్ = అందుచేత; ఎనయగన్ = ఎంచి చూసినచో; త్రిపురుషాధీశ్వరుడన్ = త్రిపురుషాత్మకమైన ప్రభువును {త్రిపురుషాధీశ్వరుడు - త్రిపురుష (1క్షరపురుషుడైన వ్యక్తి 2అక్షర పురుషుడైన జీవుడు 3అంతర్యామియైన పురుషోత్తముడు) తానే అయిన ప్రభువు}; బ్రహ్మభూతుండు = పరబ్రహ్మయైనవాడను; అగుదున్ = అవుతాను.
భావము:- నన్ను మనస్సులో నిల్పుకొనువారు శోకాన్ని గాని, మోహాన్ని గాని, మోదాన్ని గాని పొందరు. నేను త్రిపురుషులకు అధిపతిని. నేను బ్రహ్మను.”

తెభా-4-916-వ.
అని యిట్లు పలుకుచున్న పురుషార్థ భాజనుం డగు జనార్దనుని దర్శించి తద్దర్శన విధ్వస్త రజస్తమోగుణు లయిన ప్రచేతసులు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = పలుకుతున్న; పురుషార్థ = పురుషార్థములను {పురుషార్థములు - ధర్మార్థకామమోక్షములు అనెడి చతుర్విధములు}; భాజనుండున్ = ఆధారమైనవాడు; అగు = అయిన; జనార్దనునిన్ = హరిని; దర్శించి = దర్శించి; తత్ = అతని; దర్శన = దర్శినమువలన; విధ్వస్త = ధ్వంసము చేయబడిన; రజస్ = రజోగుణము; తమః = తమోగుణములు; గుణులు = గుణములు కలవారు; అయిన = అయిన; ప్రచేతసులు = ప్రచేతసులు.
భావము:- అని ఈ విధంగా పలుకుతున్న పురుషార్థాలకు ఆధారమైన శ్రీహరిని దర్శించి, అతని దర్శనంతో రజస్తమోగుణాలు ధ్వంసం కాగా ప్రచేతసులు…

తెభా-4-917-చ.
సరసీరుహంబు లెసకం బెసఁగన్ ముకుళించి గద్గద
స్వములఁజేసి యిట్లనిరి ర్వశరణ్యు నగణ్యు నిందిరా
రు నజితున్ గుణాఢ్యు ననద్యచరిత్రుఁ బవిత్రు నచ్యుతుం
రుఁ బరమేశు నీశు భవబంధవిమోచనుఁ బద్మలోచనున్.

టీక:- కర = చేతులుయనెడి; సరసీరుహంబుల = పద్మముల {సరసీరుహము - సరసున పుట్టునది, పద్మము}; ఎసకము = అతిశయము; ఎసగన్ = అతిశయించగా; ముకుళించి = ముడిచి; గద్గద = బొంగురుపోయిన; స్వరములన్ = కంఠముల; చేసి = తో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; సర్వశరణ్యున్ = విష్ణుమూర్తిని {సర్వశరణ్యుడు - నిఖిలములకు శరణము ఐనవాడు, విష్ణువు}; అగణ్యున్ = విష్ణుమూర్తిని {అగణ్యుడు – గణించుటకు రానివాడు, విష్ణువు}; ఇందిరావరున్ = విష్ణుమూర్తిని {ఇందిరా వరుడు - ఇందిర (లక్ష్మీదేవి యొక్క) వరుడు (భర్త), విష్ణువు}; అజితున్ = విష్ణుమూర్తిని {అజితుడు - గెలుచటకు సాధ్యము కానివాడు, విష్ణువు}; గుణాఢ్యున్ = విష్ణుమూర్తిని {గుణాఢ్యుడు - సుగుణములు అనెడి సంపద గలవాడు, విష్ణువు}; అనవద్యచరిత్రున్ = విష్ణుమూర్తిని {అనవద్యచరిత్రుడు - మచ్చలేని నడవడిక గలవాడు, విష్ణువు}; పవిత్రున్ = విష్ణుమూర్తిని {పవిత్రుడు - పవిత్రతేతానైనవాడు, విష్ణువు}; అచ్యుతున్ = విష్ణుమూర్తిని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; పరున్ = విష్ణుమూర్తిని {పరుడు - అతీతమైనవాడు, విష్ణువు}; పరమేశున్ = విష్ణుమూర్తిని {పరమేశుడు - పరమమైన (అత్యుత్తమమైన) ఈశుడు, విష్ణువు}; ఈశున్ = విష్ణుమూర్తిని {ఈశుడు - ఈశత్వము (ప్రభుత్వము) గలవాడు, విష్ణువు}; భవబంధవిమోచనున్ = విష్ణుమూర్తిని {భవబంధ విమోచనుడు - సంసారబంధనములనుండి విముక్తిని ప్రసాదించువాడు, విష్ణువు}; పద్మలోచనున్ = విష్ణుమూర్తిని {పద్మ లోచనుడు - పద్మముల వంటి కన్నులు గలవాడు, విష్ణువు}.
భావము:- సంతోషంతో తామరలవంటి తమ చేతులను మోడ్చి గద్గదస్వరంతో అందరూ శరణు కోరేవాడు, గణింప శక్యం కానివాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, గెలువరానివాడు, సుగుణసంపద కలవాడు, మచ్చలేని చరిత్ర కలవాడు, పవిత్రుడు, అచ్యుతుడు, అతీతుడు, పరమేశుడు, సంసారబంధాలనుండి విముక్తిని ప్రసాదించేవాడు, కమలనేత్రుడు అయిన విష్ణువుతో ఇలా అన్నారు.

తెభా-4-918-సీ.
"కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు-
గురుసన్మనో వాగగోచరుఁడవు
నిద్ధమనోరథ హేతుభూతోదార-
గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవస్థితి విలయార్థధృతనిత్య-
విపులమాయాగుణ విగ్రహుఁడవు
హితాఖిలేంద్రియ మార్గ నిరధిగత-
మార్గుఁడ వతిశాంత మానసుఁడవు

తెభా-4-918.1-తే.
విలి సంసార హారి మేస్కుఁ డవును
దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
ర్వభూత నివాసివి ర్వసాక్షి
వైన నీకు నమస్కారయ్య! కృష్ణ!

టీక:- కేశవ = నారాయణ {కేశవః - విష్ణుసహస్రనామములలో 23వ నామము 648వ నామము, మంచివెంట్రుకలుగలవాడు, త్రిమూర్తులు క (బ్రహ్మ) అ (విష్ణు) ఈశ (శివ) వశవర్తులుగా కలవాడు, కేశి అను అసురుని సంహరించినవాడు, కేశములు (అంశువులు, కిరణములు) ప్రకాశించు వాడు, కేవలము శుభమైనవాడు, విష్ణువు}; సంతతక్లేశనాశనుడవు = నారాయణ {సంతతక్లేశనాశనుడవు - నిత్యము క్లేశముల (చిక్కుల)ను నాశనముచేయువాడవు, విష్ణువు}; క్లేశ = {క్లేశములు - చిత్తవృత్తులనుండి జనించునవి యైదు 1ప్రమాణము (త్రివిధప్రమాణములు అవ 1ఇంద్రియగోచరము 2అనుమానము 3శబ్దప్రమాణము) 2విపర్యయము (ప్రమాణాతీతమైనది) 3మిథ్య (ఉన్న స్థితికి వేరుగ దర్శించుట) 4నిద్ర (గుర్తించెడి సామర్థ్యము లోపించుట) 5స్మృతి (ప్రమాణము లేనప్పటికిని గుర్తించుట)} గురుసన్మనోవాగగోచరుడవు = నారాయణ {గురుసన్మనోవాగగోచరుడవు - మిక్కిలి మంచివారికైనా మనస్సులకు వాక్కులకు అగోచరుడవు (అందనివాడవు), విష్ణువు}; ఇద్ధమనోరథహేతుభూతోదారగుణనాముడవు = నారాయణ {ఇద్ధమనోరథహేతుభూతోదారగుణనాముడవు - ఇద్ధ (ప్రసిద్ధమైన) మనోరథ (శ్రేయస్సులకు)హేతుభూత (కారణమైన) ఉదార (ప్రసాదించెడి) గుణ (సుగుణములకు)నాముడవు (పేరుబడ్డవాడవు), విష్ణువు}; సత్త్వగుణుడవు = నారాయణ {సత్త్వగుణుడవు – సత్త్త్వగుణము గలవాడవు, విష్ణువు}; అఖిల విశ్వోధ్భవ స్థితి విలయార్థధృత నిత్యవిపుల మాయాగుణ విగ్రహుడవు = నారాయణ {అఖిల విశ్వోధ్భవ స్థితి విలయార్థధృత నిత్య విపుల మాయాగుణ విగ్రహుడవు - సమస్తమైన లోకములకు ఉద్భవ (సృష్టి) స్థితి లయముల అర్థ (ప్రయోజనములకు) ధృత (ధరింపబడిన) నిత్య (శాశ్వతమైన) విపుల (విస్తారమైన) మాయా (మాయతోకూడిన) గుణ (గుణములు) విగ్రహుడవు (రూపముకలవాడు, విష్ణువు}; = = మహితాఖిలేంద్రియ మార్గ నిరవధి గతమార్గుడవు = నారాయణ {మహితాఖిలేంద్రియ మార్గ నిరవధిగత మార్గుడవు - మహిత (గొప్ప) అఖిల (సర్వ) ఇంద్రియముల (నడవడికకు) నిరవధిక (ఎడతెగని) గత (వెళ్ళిన మార్గమున) (అధిగతుతుడవు), విష్ణువు}; అతిశాంతిమానసుడవు = నారాయణ {అతి శాంతి మానసుడవు - మిక్కిల శాంతిస్వభావముగలవాడవు,విష్ణువు};
తవిలిసంసారహారిమేధస్కుడవును = నారాయణ {తవిలిసంసారహారిమేధస్కుడవు - తవిలి (తగులుకొన్న) సంసార (భవబంధములను) హారి (హరించునట్టి) మేధస్కుడవు (బుద్ధిబలము గలవాడవు), విష్ణువు}; దేవదేవుడవును = నారాయణ {దేవదేవః - దేవవుళ్ళకే దేవుడవు, విష్ణువు}; వాసుదేవుడవును = నారాయణ {వాసుదేవః - వసుదేవుని పుత్రుడు, అంతటను నిండి ఉండువాడు, తనమాయాశక్తిచే సర్వము ఆవరించిన వాడు, కృష్ణుడు,విష్ణుసహస్రనామాలలో 332వ నామం, 695వ నామం, 709వ నామం}; సర్వభూత నివాసివి = నారాయణ {సర్వభూతనివాసివి - సర్వ (సకల) భూతముల (జీవుల) యందును నివసించెడివాడవు, విష్ణువు}; సర్వసాక్షివిన్ = నారాయణ {సర్వసాక్షివి - సమస్తమునకు సాక్షీభూతుడవు, విష్ణువు}; ఐన = అయిన; నీకున్ = నీకు; నమస్కారమున్ = నమస్కారము; అయ్య = తండ్రి; కృష్ణా = కృష్ణుడా.
భావము:- “కేశవా! నీవు దుఃఖాన్ని తొలగిస్తావు. భక్తుల మనస్సునకు, మాటకు అందవు. సకల శ్రేయస్సులను కలిగించే ఉదార గుణాలు, నామాలూ కలవాడవు. సత్త్వగుణసంపన్నుడవు. ప్రపంచ సృష్టి, స్థితి, విలయాల కోసం మాయామయమైన బ్రహ్మాది గుణ విగ్రహాన్ని ధరిస్తావు. నీవు సర్వేంద్రియ మార్గాల చేత తెలియబడని మార్గం కలవాడవు. ప్రశాంతమైన మనస్సు కలవాడవు. సంసారాన్ని హరించే జ్ఞానం కలవాడవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. నీవు సర్వ ప్రాణులలో నివసిస్తావు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! నీకు నమస్కారం.

తెభా-4-919-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా…

తెభా-4-920-ఉ.
తోరుహోదరాయ భవదుఃఖహరాయ నమో నమః పరే
శా సరోజకేసర పిఙ్గ వినిర్మల దివ్య భర్మ వ
స్త్రా పయోజ సన్నిభ పదాయ సరోరుహ మాలికాయ కృ
ష్ణా పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేధసే.

టీక:- తోయరుహోదరాయ = విష్ణుమూర్తి {తోయరు హోదరాయ - తోయరుహము (పద్మము) ఉదరాయ (గర్భమున గలవాడ), విష్ణువు}; భవదుఃఖహరాయ = విష్ణుమూర్తి {భవదుఃఖ హరాయ - భవ (సంసారము)యొక్క దుఃఖములను హరాయ (హరించెడివాడ), విష్ణువు}; నమోనమః = నమస్కారము; పరేశాయ = విష్ణుమూర్తి {పరేశాయ - పర (అత్యున్నతమైన, సర్వాతీతమైన) ఈశ (దైవమా), విష్ణువు}; సరోజ కేసరపిశఙ్గ వినిర్మల దివ్యభర్మ వస్త్రాయ = విష్ణుమూర్తి {సరోజ కేసర పిశఙ్గ వినిర్మల దివ్యభర్మ వస్త్రాయ - సరోజ (పద్మము)ల కేసరముల వలె పిశంగ (పసుపు రంగు) గల వినిర్మల (స్వచ్ఛమైన) దివ్య (దివ్యమైన) భర్మ (బంగారు) వస్త్రాయ (బట్టలు ధరించినవాడ), విష్ణువు}; పయోజసన్నిభపదాయ = విష్ణుమూర్తి {పయోజ సన్నిభ పదాయ - పయోజ (పద్మము) సన్నిభ (సమానమైమ) పదాయ (పాదములు గలవాడ), విష్ణువు}; సరోరుహ మాలికాయ = విష్ణుమూర్తి {సరోరుహ మాలికాయ - సరోరుహ (పద్మము)ల మాలిక ధరించినవాడ, విష్ణువు}; కృష్ణాయ = విష్ణుమూర్తి {కృష్ణాయ - కృష్ణ (నల్లనివాడు) అయినవాడ}; పరాపరాయ = విష్ణుమూర్తి {పరాపరాయ - పరము అపరమూ కూడ అయినవాడ, పరలోకములకే పరమైనవాడ, విష్ణువు}; సుగుణాయ = విష్ణుమూర్తి {సుగుణాయ - సుగుణములు గలవాడ, విష్ణువు}; సురారిహరాయ = విష్ణుమూర్తి {సురారి హరాయ - సురారుల (రాక్షసుల)ను హరాయ (హరించువాడ), విష్ణువు}; వేధసే = విష్ణుమూర్తి {వేధసే – సృష్టికర్త యైనవాడ, విష్ణువు}.
భావము:- కమలనాభా! నీవు సంసార దుఃఖాన్ని హరిస్తావు. నీవు పరానికి నాథుడవు. తమ్మి పుప్పొడి వలె పసుపు పచ్చని రంగు కల వస్త్రాన్ని ధరిస్తావు. పద్మమాలికలను ధరిస్తావు. నీవు సుగుణవంతుడవు. నీవు సృష్టికర్తవు. నీవు రాక్షసులను సంహరిస్తావు. నీకు నమస్కారం”.
ప్రతీకలు - పద్మం – సృష్టి, వికాసం, విజ్ఞానం; ఉదరం – వ్యక్తం కావటానికి హేతువు; పద్మనాభం – ఆది వికాసానికి కారణభూతం; సంసార దుఃఖ హరం – పునర్జన్మ రాహిత్యం; పద్మాల పుప్పొడి - జ్ఞానం; బంగారు వస్త్రం – శ్రేష్ఠ మైన ఆవరణ; పద్మపాదం - వికాసాలకి ఆధారభూతం; పద్మమాలిక - విజ్ఞాన సర్వస్వం; నీలవర్ణం - ఆకాశ తత్వం; పరాపరం – ద్వైతాద్వైతాలు; సుగుణ – త్రిగుణ అతీతం; రాక్షస సంహారం – అతి తమోగుణ హరణం; వేధస్ అంటే ప్రకృతి పురుష ఆవిర్భావ కారణభూతం; నమః – అభిన్నత్వం, సత్తు; ప్రచేతస్సులు అబేధ ధర్ములు పదిమంది – పంచేంద్రియ పంచతన్మాత్ర జన్య జ్ఞానం; తపస్సు – అకుంఠిత సాధన; విష్ణువు - విశ్వవ్యాపకత్వం; స్తుతించడం – స్మరణ.

తెభా-4-921-వ.
అని వినుతించి.
టీక:- అని = అని; వినుతించి = స్తుతించి.
భావము:- అని స్తుతించి…

తెభా-4-922-చ.
"లదళాక్ష! దుఃఖలయ కారణమై తగు తావకీన రూ
ము ననివార్య దుర్భర విద్దశ దుఃఖము నొందు మాకు నీ
సుహిత సత్కృపా గరిమఁ జూపుట కంటె ననుగ్రహంబు లో
మునఁ దలంప నొండొకటి ల్గునె? భక్తఫలప్రదాయకా!

టీక:- కమలదళాక్ష = హరి {కమలదళాక్ష - కమలముల వంటి అక్ష (కన్నులు గలవాడ), విష్ణువు}; దుఃఖ = శోకములను; లయ = నాశనము చేయుటకు; కారణము = కారణభూతుడు; ఐ = అగుటకు; తగు = తగిన; తావకీన = నీ యొక్క; రూపమున్ = స్వరూపమును; అనివార్య = వారింపరాని; దుర్భర = భరింపరాని; విపత్ = ఆపదల చెందెడి; దశన్ = పరిస్థితి యందలి; దుఃఖమున్ = దుఃఖమును; ఒందు = పొందెడి; మాకున్ = మాకు; నీ = నీ యొక్క; సు = మిక్కిలి; మహిత = గొప్పదైన; సత్ = సత్యవంతమైన; కృపా = దయ యొక్క; గరిమన్ = విస్త్రుతిని; చూపుట = చూపించుట; కంటెన్ = కంటెను; అనుగ్రహంబు = కరుణించుట; లోకమునన్ = జగత్తులో; తలపన్ = తరచి చూసిన; ఒండొకటిన్ = ఇంకొకటి; కల్గునె = ఉండునా ఏమి, ఉండదు; భక్తఫలప్రదాయకా = హరి {భక్త ఫల ప్రదాయకా - భక్త(భక్తులకు) ఫల (మంచి ఫలితములను) ప్రదాయకా (చక్కగా యిచ్చువాడ), విష్ణువు}.
భావము:- “భక్తుల కోర్కెలను తీర్చే పద్మపత్ర నేత్రా! దుఃఖాన్ని నశింపజేసే నీ రూపాన్ని భరించరాని కష్టాలతో విచారించే మాకు చూపించావు. ఇంతకంటే అనుగ్రహం లోకంలో మరొకటి ఉంటుందా?

తెభా-4-923-ఉ.
భూరిశివేతరాపహవిభూతి సమేత! మహాత్మ! దీనర
క్షాతి నొప్పు నీవు చిరకాలమునన్ సుఖవృత్తి వీరు మా
వా లటంచు బుద్ధి ననద్య! తలంచిన యంతమాత్ర స
త్కామె చాలు నట్లగుట గా కిటు సన్నిధి వైతి వీశ్వరా!

టీక:- భూరిశివేతరాపహవిభూతిసమేత = హరి {భూరి శివేతరాపహ విభూతి సమేత - భూరి (గొప్ప) శివ (శుభములకు) ఇతర (వ్యతికర మైనవాటిని) అపహ (పోగొట్టెడి) విభూతి (వైభవము) సమేత (తో కూడి ఉండెడివాడ), విష్ణువు}; మహాత్మ = హరి {మహాత్మ - మహా (గొప్ప, పరమ) యైన ఆత్మ, విష్ణువు}; దీన = దీనులను; రక్షా = రక్షించుట యందు; రతిన్ = ప్రీతితో; ఒప్పు = ఒప్పెడి; నీవున్ = నీవు; చిర = ఎంతో; కాలమునన్ = కాలమునుండి; సుఖ = చక్కటి; వృత్తిన్ = విధముగా; వీరున్ = వీరు; మా = మా యొక్క; వారలు = వాళ్ళు; అటన్ = అని; అంచున్ = అనుచూ; బుద్ధిన్ = మనసున; అనవద్య = హరి {అనవద్య - నిందలేనివాడ, విష్ణువు}; తలంచినన్ = భావించిన; అంతమాత్రన్ = అంతమాత్రము; సత్కారమే = గౌరవమే; చాలున్ = మాకు చాలు; అట్లు = ఆ విధముగ; అగుటన్ = అగుటయే; కాక = కాకుండగ; ఇటున్ = ఈ విధముగ; సన్నిధి = ఎదుటకి వచ్చినవాడవు; ఐతివి = అయినావు; ఈశ్వరా = భగవంతుడా.
భావము:- ఈశ్వరా! నీవు అశుభాలను తొలగిస్తావు. నీవు మహాత్ముడవు. దీనరక్షణ నీ దీక్ష. వీరు మావారు అని భావిస్తున్నావు. అందుచేతనే మాకు సాక్షాత్కరించావు. ఆమాత్రం గౌరవం మాకు చాలు.

తెభా-4-924-చ.
యఁగ క్షుద్రభూత హృదయంబుల యందుల నంతరాత్మవై
తిముగ నుండు నీవు భవదీయ పదాంబురుహద్వయార్చనా
మతు లైన మాకును శుప్రద భూరి మనోరథంబు లీ
రుదుగ నీవె! భక్తహృదప్రమదప్రద! ముక్తినాయకా!

టీక:- అరయగన్ = పరిశీలించినచో; క్షుద్ర = అల్పమైన; భూత = జీవుల; హృదయంబులన్ = హృదయముల; అందున్ = లోపల; అంతరాత్మవున్ = అంతరాత్మవు; ఐ = అయ్యి; తిరముగన్ = స్థిరముగా; ఉండు = ఉండెడి; నీవున్ = నీవు; భవదీయ = నీ యొక్క; పద = పాదములు యనెడి; అంబుజ = పద్మముల {అంబురుహము - అంబువు (నీరు యందు) ఈరుహము (పుట్టినది), పద్మము}; ద్వయ = జంటను; అర్చనా = పూజించుట యందు; పర = లగ్నమైన; మతులు = మనసులుగలవారు; ఐన = అయిన; మాకున్ = మాకు; శుభ = శుభములను; ప్రద = ఇచ్చెడి; భూరి = గొప్ప; మనోరథంబుల్ = కోరికలను; ఈవున్ = నీవు; అరుదుగన్ = అపూర్వముగ; ఈవే = ఈయవా ఏమి, ఇచ్చెదవు; భక్తహృదయ = హరి {భక్త హృదయ - భక్తుల హృదయమున ఉండెడివాడ, విష్ణువు}; ప్రమదప్రద = హరి {ప్రమద ప్రద - ప్రమద (సంతోషము)ను ప్రద (ఇచ్చెడివాడ), విష్ణువు}; ముక్తినాయకా = హరి {ముక్తి నాయకా - మోక్షమునకు ప్రభువా, విష్ణువు}.
భావము:- నీవు నీచ ప్రాణుల హృదయాలలో కూడా అంతర్యామివై స్థిరంగా ఉంటావు. నీ పాదపద్మాలను పరమభక్తితో పూజించే మాకు శుభాన్ని కలిగించే వరాలేవో నీకు తెలియవా? నీవు ముక్తినాథుడవు. భక్తుల హృదయాలలోని కోర్కెలను నెరవేరుస్తావు.

తెభా-4-925-సీ.
యినను విను సరోజాయత లోచన-
ర మోక్ష మార్గ ప్రర్తకుఁడవుఁ;
బురుషార్థ భూత విస్తరుఁడవు నగు నీవు-
గిలి ప్రసన్నుఁ డగుట మాకు
ర్థి మనోభీష్ట మైన వరం బయ్యె-
నైనను నాథ! పరాపరుండ
వైన నిన్నొక వరం ర్థింతు మనినను-
భువిఁ దావకీన విభూతు లెన్న

తెభా-4-925.1-తే.
నంత మెఱుఁగంగ రామి ననంతుఁ డనుచుఁ
లుకుదురు; నిన్ను నది గానఁ రమపురుష!
యే వరం బని కోరుదు మేము? దప్పి
గొన్న బాలకుఁ డబ్ధి నీ ళ్ళెన్ని గ్రోలు?

టీక:- అయిననున్ = అయినప్పటికిని; విను = వినుము; సరోజాయతలోచన = హరి {సరోజాయతలోచన - సరోజ (పద్మముల) వంటి ఆయత (పెద్ద) లోచన (కన్నులుగలవాడ), విష్ణువు}; పరమ = అత్యుత్తమమైన; మోక్ష = మోక్షము యొక్క; మార్గ = మార్గమున; ప్రవర్తకుడవు = నడచెడివాడవు; పురుషార్థభూత = ధర్మార్థ కామ మోక్షము లైనవానిని; విస్తరుడవు = అతిశయింపజేయువాడవు; అగున్ = అయినట్టి; నీవున్ = నీవు; తగిలి = పూని; ప్రసన్నుడవు = ప్రసన్నమైనవాడవు; అగుటన్ = అగుట; మాకున్ = మాకు; అర్థిన్ = కోరి; మనోభిష్టము = కోరిన కోరికలు; అయినన్ = అయిన; వరంబున్ = వరము; అయ్యెన్ = అయ్యెను; ఐనన్ = అయినను; నాథ = ప్రభువా; పరాపరుండవు = భగవంతుడవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; ఒక = ఒక; వరంబున్ = వరమును; అర్థింతుమున్ = కోరెదము; అనిననున్ = అన్నప్పటికిని; భువిన్ = ప్రపంచములో; తావకీన = నీ యొక్క; విభూతుల్ = వైభవములను; ఎన్నన్ = ఎంచుటకు; అంతమున్ = పూర్తిగా; ఎఱుగంగరామిన్ = తెలియరాకపోవుట చేత; అనంతుడన్ = అనంతుడవు; అనుచున్ = అనుచూ; పలుకుదురు = పలుకుతారు.
= నిన్నున్ = నిన్ను; అదిగాన = అందుచేత; పరమపురుష = నారాయణ; ఏ = దేనిని; వరంబున్ = వరము; అని = అని; కోరుదుము = కోరెదము; మేము = మేము; దప్పికన్ = దాహము; కొన్న = వేసిన; బాలకుడు = పిల్లవాడు; అబ్ధిన్ = సముద్రమునుండి; నీళ్లు = నీళ్ళు; ఎన్ని = ఎన్ని; క్రోలు = తాగును.
భావము:- కమలనయనా! విను. భగవంతుడవైన నీవు మాకు ప్రసన్నుడవు కావటమే మాకు ఇష్టమైన వరం. ఒకవేళ నిన్ను ఒక వరాన్ని అడుగదలచినా అదికూడ కష్టమే. నీ విభూతులు అనంతాలు. అందుచేత నిన్ను అనంతు డంటారు. కాబట్టి నిన్ను ఏ వరమని కోరగలం? దప్పికొన్న బాలుడు సముద్రంలోని నీళ్ళను ఎన్ని త్రాగగలడు?

తెభా-4-926-వ.
ఇదియునుం గాక.
టీక:- అదియునున్ = ఇంతే; కాక = కాకుండగ.
భావము:- ఇంతేకాక…

తెభా-4-927-ఉ.
పూని భవత్పదాంబురుహ మూల నివాసులమైన మేము మే
ధానిధి! నీ విలోకనముఁ క్కఁగ నన్యముఁ గోర నేర్తుమే?
మానిత పారిజాత కుసుస్ఫుట నవ్యమరందలుబ్ధ శో
భాయశాలి యైన మధుపంబు భజించునె యన్యపుష్పముల్?

టీక:- పూని = యత్నించి; భవత్ = నీ యొక్క; పద = పాదములు యనెడి; అంబురుహ = పద్మముల; మూల = అరికాలు వద్ద; నివాసులము = ఆశ్రయించి ఉండెడివారము; ఐన = అయిన; మేము = మేము; మేధానిధి = జ్ఞాని {మేధానిధి - బుద్ధిబలమునకు నిధివంటివాడు, జ్ఞాని}; నీ = నీ యొక్క; విలోకనమున్ = దర్శనమును; తక్కన్ = తప్పించి; అన్యమున్ = ఇతరములను; కోరన్ = కోరుటను; నేర్తుమే = చేయగలమా ఏమి, చేయలేము; మానిత = పూజనీయమైన; పారిజాతకుసుమ = పారిజాతపుష్పము; స్ఫుటన్ = వెలువడెడి; నవ్య = సరికొత్త; మరంద = పూదేనె; లుబ్ధ=ఆశించెడి; శోభా = శోభాయమైన; నయశాలి =నీతిశాలి; ఐన = అయిన; మధుపంబున్ = తేనెటీగ; భుజించునే = తాగునా ఏమి, తాగదు; అన్య = ఇతర; పుష్పముల్ = పూల యందు.
భావము:- జ్ఞానివైన వాసుదేవా! నీ పాదాలను ఆశ్రయించుకున్న మేము నీ దర్శనం తప్ప మరొకటి కోరగలమా? పారిజాత పుష్పంలోని తేనెను రుచి మరిగిన తుమ్మెద మరొక పుష్పం దగ్గరికి వెళ్ళదు కదా!

తెభా-4-928-చ.
రి! భవదీయ మాయ ననయంబును జెందిన నేము నిచ్చలుం
మనురక్తి నేది తుదగా భవకర్ములమై ధరిత్రి పైఁ
దిరుగుదు, మంతదాఁక భవదీయజనంబులతోడి సంగతిన్
గురుమతి జన్మజన్మములకున్ సమకూరఁగ జేయు మాధవా!

టీక:- హరి = నారాయణ; భవదీయ = నీ యొక్క; మాయన్ = మాయలో; అనయంబున్ = ఎల్లప్పుడు; చెందిన = పడెడి; ఏము = మేము; నిచ్చలున్ = నిత్యము; కరమున్ = మిక్కిలి; అనురక్తిన్ = ఆసక్తితో; ఏది = ఏదయితే; తుద = అత్యంత ప్రయోజనము; కాన్ = అగునట్లు; భవ = సంసారపు; కర్ములమున్ = కర్మలు చేయువారము; ఐ = అయ్యి; ధరిత్రి = భూమి; పైన్ = మీద; తిరుగుదుము = వర్తించెదమో; అంతదాక = అప్పటిదాకా; భవదీయ = నీ యొక్క; జనంబుల్ = వారి; తోడి = తోటి; సంగతిన్ = సాంగత్యమును; గురు = పెద్ద; మతిన్ = మనసుతో; జన్మజన్మములకున్ = అన్నిజన్మలందు కూడ; సమకూరగన్ = కలుగునట్లు; చేయు = చేయుము; మాధవా = నారాయణ.
భావము:- హరీ! మాధవా! నీ మాయకు చిక్కి మేము కర్మమార్గంలో ఎంతకాలం నిత్యమూ తిరుగుతూ ఉంటామో అంతవరకూ మాకు నీ భక్తులతో సహవాసాన్ని జన్మజన్మలలోను సమకూర్చు.

తెభా-4-929-మ.
లాధీశ్వర! తావకీన వరభక్తవ్రాత సంసర్గ లే
ముతోడన్ సరిగాఁ దలంప; మెలమిన్ స్వర్గాపవర్గాది సౌ
ఖ్యములన్నన్ వినుమానుషంబు లగు నీ కామంబులం జెప్ప నే
; మునీంద్రస్తుతపాదపద్మ! సుజనాలాపానుమోదాత్మకా!

టీక:- కమలాధీశ్వర = నారాయణ {కమ లాధీశ్వర - కమల (లక్ష్మీదేవి) కి అధీశ్వర (భర్త), విష్ణువు}; తావకీన = నీయొక్క; వర = శ్రేష్ఠమైన; భక్త = భక్తు; వ్రాత = సమూహముతోడి; సంసర్గ = సాంగత్యము యొక్క; లేశము = చిన్నభాగము; తోడన్ = తోటి; సరి = సమానము; కాన్ = అగునట్లు; తలపము = భావించము; ఎలమిన్ = తెలివి కలిగి; స్వర్గ = స్వర్గము; అపవర్గ = మోక్షము; ఆది = మోదలగు; సౌఖ్యములన్ = సౌఖ్యములను; అన్నన్ = అనినచో; విను = వినుము; మానుషంబులు = మానవ కల్పితములు; అగున్ = అయిన; ఈ = ఈ; కామంబులన్ = కోరికలను; చెప్పన్ = చెప్పుట; ఏలన్ = ఎందులకు; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివారిచే; స్తుత = స్తోత్రము చేయబడెడి; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మములను గురించి; సు = మంచి; జన = వారి; ఆలాప = మాటల వలన; అనుమోద = సంతోషించెడి; ఆత్మకా = మనసు కలవాడా.
భావము:- మాధవా! మునీంద్రులు స్తుతించే పాదపద్మాలు కలవాడా! శిష్ట వాక్యాలచేత ఆనందించేవాడా! స్వర్గ సుఖాలు కాని, అపవర్గ సౌఖ్యాలు కాని భక్తి సంసర్గంతో కొంచెమైనా సాటిరావు. ఇక మానవలోకంలోని క్షణికాలైన క్షుద్రసౌఖ్యాల మాట చెప్పటం దేనికి?

తెభా-4-930-వ.
మఱియు భగవద్భక్త సంగంబుల యందుఁ దృష్ణాప్రశమనంబులైన మృష్ట కథలు చెప్పఁబడుటచే భూతంబుల యందు వైరంబును నుద్వేగంబును లేకుండు నని.
టీక:- మఱియున్ = ఇంకను; భగవత్ = భగవంతుని; భక్త = భక్తులతోటి; సంగంబులన్ = సాంగత్యములు; అందున్ = అందు; తృష్ణ =కోరికలను, పేరాశను; ప్రశమనంబులున్ = పోగొట్టి శాంతి నొందించెడివి; ఐన = అయిన; మృష్ట = రుచికరములైన; కథలు = కథలు; చెప్పబడుటన్ = చెప్పబడుట; చేన్ = చేత; భూతంబుల్ = జీవుల; అందున్ = ఎడల; వైరంబున్ = శత్రుత్వమును; ఉద్వేగంబునున్ = ఆతురతలు; లేకుండును = లేకుండగా పోవును; అని = అని.
భావము:- ఇంకా భగవద్భక్తుల సభలలో పేరాశలను నశింపజేసే నీ మధుర గాథలను కీర్తిస్తారు. ఆ కథలను ఆలకించటం వల్ల ప్రాణులయందు ద్వేషం, భయం నశిస్తాయి అంటూ…

తెభా-4-931-చ.
ముల ముక్తసంగు లగువారు నుతింపఁ దనర్తు వీవు; గా
వు నిలఁ బుణ్యతీర్థములఁ బోలఁ బవిత్రము చేయఁ బూని య
ర్థినిఁ బదచారులై ధరఁ జరించు భవత్పద భక్త సంగమం
నుపమ భూరి సంసృతి భస్థుని బుద్ధి రుచింపకుండునే?

టీక:- వనములన్ = అడవులలో; ముక్త = వదిలేసిన; సంగులు = తగులములు గలవారు; అగున్ = అయిన; వారు = వారు; నుతింపన్ = స్తుతింపగా; తనర్తువు = తృప్తిచెందెదవు; ఈవున్ = నీవు; కావునన్ = కనుక; ఇలన్ = భూమిపైన; పుణ్య = పుణ్యవంతములైన; తీర్థములన్ = తీర్థములను; పోలన్ = వలె; పవిత్రమున్ = పవిత్రమును; చేయన్ = చేయవలెనని; పూని = పూనుకొని; అర్థినిన్ = కోరి; పదచారులు = పాదచారులు; ఐ = అయ్యి; ధరన్ = భూమిపైన; చరించు = వర్తించెడి; భవత్ = నీ యొక్క; భక్త = భక్తులతోడి; సంగమంబునున్ = సాంగత్యములు; అనుపమ = సాటిలేని; సంసృతి = భవ, సంసార; భయస్థునిన్ = భయముచెందినవాని; బుద్ధిన్ = బుద్ధికి; రుచింపకన్ = రుచించకుండగా; ఉండునే = ఉండునా ఏమి, ఉండదు.
భావము:- అడవులలో ముక్తసంగులైనవారు నిన్ను స్తుతిస్తారు. కాబట్టి పుణ్య తీర్థాలలాగా పవిత్రం చేయటానికి పూనుకొని పాదచారులై భూమిపై సంచరించే నీ భక్తులతోడి సహవాసం సంసార భీతుడైన వాని మనస్సుకు ఎలా రుచింపకుండా ఉంటుంది?

తెభా-4-932-వ.
కావున.
టీక:- కావునన్ = అందుచేత.
భావము:- కాబట్టి…

తెభా-4-933-చ.
రుహపత్రలోచన! భత్సఖుఁడైన సుధాంశుమౌళితో
డి నిమిషమాత్ర సంగతిఁ గడింది వ్రణంబును దుశ్చికిత్సము
న్ననఁ దగు జన్మరోగమున ర్మిలి వైద్యుఁడ వైన నిన్ను నే
యముఁ జూడఁ గంటిమి; కృతార్థులమై తగ మంటి మీశ్వరా!

టీక:- వనరుహపత్రలోచన = నారాయణ {వనరుహ పత్ర లోచన - వనరుహము (తామర) యొక్క పత్రము (ఆకు)ల వంటి లోచన (కన్నులు గలవాడ), విష్ణువు}; భవత్ = నీ యొక్క; సఖుండున్ = స్నేహితుడు; ఐన = అయిన; సుధాంశుమౌళి = శివుని {సుధాంశు మౌళి – సుధాంశువు (అమృత కిరణుడైన చంద్రుడి))ని మౌళి (శిరోలంకారముగా ధరించినవాడు), శివుడు}; తోడి = తోటి; నిమిష = నిమిషము పాటు సమయము; మాత్ర = మాత్రమైన; సంగతిన్ = సాంగత్యమువలన; కడింది = పెద్ద; వ్రణంబునున్ = పుండును; దుశ్చికిత్సమున్ = మాన్ప రానిది; అనన్ = అనుటకు; తగు = తగినట్టి; జన్మరోగమున్ = పుట్టుకలు అనెడి రోగమున; కున్ = కు; వైద్యుడవు = పోగొట్టువాడవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; ఏము = మేము; అనయమున్ = అవశ్యము; చూడగంటిమి = చూడగలిగితిమి; కృతార్థులము = సార్థకమైన జన్మ కలవారము; ఐ = అయ్యి; తగన్ = చక్కగా; మంటిమి = కాపాడబడితిమి; ఈశ్వరా = నారాయణ.
భావము:- కమలనయనా! ఈశ్వరా! నీ మిత్రుడైన శివునితో ఒక్క క్షణకాలం మాకు కలిగిన సమాగమం వల్ల పెద్ద పుండు అనదగినదై, చికిత్సకు అసాధ్యమైన జన్మరోగాన్ని మాన్పే మేటి వైద్యుడవైన నిన్ను దర్శించి కృతార్థులం అయ్యాము.

తెభా-4-934-వ.
దేవా! మదీయ స్వాధ్యాయాధ్యయనంబులును, గురు ప్రసాదంబును, విప్రవృద్ధానువర్తనంబును, నార్యజననమస్కరణంబును, సర్వభూతా నసూయయు, నన్న విరహితంబుగా ననేక కాలం బుదకంబుల యందు సుతప్తంబయిన తపంబు చేయుటయు, నివి యన్నియును బురాణ పురుషుండ వైన భవదీయ పరితోషంబు కొఱకు నగుంగాక యని విన్నవించెద;" మని వెండియు నిట్లనిరి.
టీక:- దేవా = భగవంతుడా; మదీయ = మా యొక్క; స్వాధ్యాయము = వేదాధ్యయము; అధ్యయనంబు = చదువులు; గురు = గురుదేవుల; ప్రసాదంబునున్ = అనుగ్రహము; విప్ర = బ్రాహ్మణుల; వృద్ధ = పెద్ధల; అనువర్తనంబున్ = అనుసరించుటలు; ఆర్య = పూజనీయమైన; జన = వారికి; నమస్కరణంబునున్ = నమస్కరించుటలు; సర్వ = అఖిల; భూతా = జీవుల; అనసూయయున్ = అసూయ లేకపోవుటను; అన్న = ఆహారము; విరహితంబుగాన్ = లేకుండగా; అనేక = ఎక్కువ; కాలంబున్ = కాలము; ఉదకంబుల్ = నీళ్ళ; అందున్ = లో; సు = మిక్కిలి; తప్తంబున్ = తపింపబడినది; అయిన = అయిన; తపంబున్ = తపస్సును; చేయుటయున్ = చేయుట; ఇవి = ఇవి; అన్నియునున్ = అన్ని; పురాణపురుషుండవున్ = పూరాణకాలము నుండియు ఉన్న పురుషుడవు; ఐన = అయిన; భవదీయ = నీ యొక్క; పరితోషంబున్ = సంతోషము; కొఱకున్ = కోసము; అగుగాక = అగుగాక; అని = అని; విన్నవించెదమున్ = చెప్పుకొనెదము; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఇట్లు; అనిరి = అనిరి.
భావము:- దేవా! మా వేదాధ్యయనం, గురుప్రసాదం, విప్రవృద్ధ సేవ, ఆర్యజన వందనం, సకల జీవులయందు అసూయ లేకపోవటం, అన్నం లేకుండా చాలాకాలం నీటిలో ఉగ్రతపం చేయటం మొదలైనవన్నీ పురాణ పురుషుడవైన నీకు సంతోషాన్ని కలిగించు గాక!

తెభా-4-935-మ.
ను పద్మాసన ధూర్జటిప్రముఖ ధీమంతుల్ తపోజ్ఞాన స
త్త్వనిరూఢిం దగువారు నీ మహిమమున్ ర్ణింపఁ బారం బెఱుం
నివా రయ్యును నోపినంత వినుతుల్ గావింతు; రట్లౌట నే
మును నిన్నర్థి నుతింతు మీశ! వరదా! బుద్ధ్యాదిమూలంబుగన్."

టీక:- మను = మనువు; పద్మాసన = బ్రహ్మదేవుడు; దూర్జటి = శివుడు; ప్రముఖ = మొదలగు; ధీమంతుల్ = ధీశక్తి యుతులు; తపో = తపస్సు; జ్ఞాన = జ్ఞానము; సత్త్వ = సత్తువల; నిరూఢిన్ = నేర్పరితనములతో; తగు = తగినవారు; నీ = నీ యొక్క; మహిమమున్ = మహత్యము; వర్ణింపన్ = వర్ణించుటకు; పాఱంబున్ = ఆవతలి దరిని; ఎఱుంగనివారు = తెలియనివారు; అయ్యున్ = అయినప్పటికిని; ఓపినంత = సామర్థ్యమున్నంతవరకు; వినతుల్ = స్తుతించుటలు; కావింతురు = చేసెదరు; అట్లు = ఆ విధముగ; ఔటన్ = అగుటవలన; ఏమునున్ = మేము; నిన్నున్ = నిన్ను; అర్థిన్ = కోరి; నుతింతుము = స్తుతింతుము; ఈశ = భగవంతుడా; వరదా = నారాయణ {వరదా - వరములను దా (ఇచ్చువాడ), విష్ణువు}; బుద్ధిన్ = బుద్ధి; ఆది = మొదలగువాని; మూలంబునన్ = ద్వారా.
భావము:- ఈశ్వరా! వరదా! తపోజ్ఞాన సత్త్వ సంపన్నులైన మనువు, బ్రహ్మ, శివుడు మొదలైనవారే నీ మహామహిమను వర్ణించలేరు. అయినా శక్తి కొలది నుతిస్తారు. అందుచేత మేము కూడా మా శక్తికొలది నిన్ను నుతిస్తాము”.

తెభా-4-936-వ.
అని మఱియు "సముండవు నాదిపురుషుండవుఁ బరుండవు శుద్ధుండవు వాసుదేవుండవు సత్త్వమూర్తివియు భగవంతుండవు నైన నీకు నమస్కరించెద;" మని యిట్లు ప్రచేతసులచేత నుతింపంబడి శరణ్యవత్సలుండగు హరి సంతుష్టాంతరంగుండై వారల కోరిన యట్ల వరంబు లిచ్చిన.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; సముండవు = హరివి {సముండవు - ఇంద్రియాదులందు సమముగా వర్తించువాడవు, విష్ణువు}; ఆదిపురుషుండవు = హరివి {ఆదిపురుషుండవు - సృష్ఠికి ఆది నుండి యున్న పురుషుడవు, విష్ణువు}; పరుండవు = హరివి {పరుండవు - సమస్తమునకు ఆతీతమైనవాడవు, విష్ణువు}; శుద్ధుండవు = హరివి {శుద్ధుండవు - పరిశుద్ధమైనవాడవు, విష్ణువు}; వాసుదేవుండవు = హరివి {వాసుదేవుండవు - వసుదేవుని పుత్రుడవు, విష్ణువు}; సత్త్వమూర్తివియున్ = హరివి {సత్త్వమూర్తివి - సత్త్వ గుణము స్వరూపమైనవాడవు, విష్ణువు}; భగవంతుడవున్ = హరివి {భగవంతుండవు – ఐశ్వర్యములు గలవాడవు, విష్ణువు}; ఐన = అయిన; నీకున్ = నీకు; నమస్కరించెదము = నమస్కరింతుము; అని = అని; ఇట్లు = ఈ విధముగ; ప్రచేతసుల్ = ప్రచేతసుల; చేతన్ = చేత; నుతింపబడి = స్తుతింపబడి; శరణ్య = శరణుజొచ్చినవారి ఎడల; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; అగు = అయిన; హరి = నారాయణుడు; సంతుష్టాంతరంగుండు = సంతృప్తిపొందిన మనసు గల వాడు; ఐ = అయ్యి; వారల = వారు; కోరిన = కోరిన; అట్ల = విధముగా; వరంబున్ = వరములు; ఇచ్చిన = ఇవ్వగా.
భావము:- అని చెప్పి ఇంకా “నీవు అందరియందు సముడవు. ఆదిపురుషుడవు. పరుడవు. రాగాదులు లేని పరిశుద్ధుడవు. వాసుదేవుడవు. సత్త్వమూర్తివి. భగవంతుడవు. నీకు నమస్కారం” అని ఈ విధంగా ప్రచేతసులు నుతించారు. భక్తవత్సలుడైన శ్రీహరి సంతృప్తి పొంది వారు కోరినట్లు వరాలు ప్రసాదించి…

తెభా-4-937-త.
య మా నృపనందనుల్ ముదమార సన్నుతిఁ జేయఁగాఁ
ములోఁ బరితోష మంది రమాహృదీశుఁడు భక్త పా
కరుండు తదీయ దర్శన లాలసాత్మకు లాత్మలం
నివి చాలక చూడ నాత్మపదంబు కేగె రయంబునన్.

టీక:- అనయమున్ = అవశ్యము; నృపనందనుల్ = రాజకుమారులు; ముదమార = సంతోషస్ఫూర్తిగా; సన్నుతిన్ = స్తుతించుటలు; చేయగాన్ = చేయగా; మనము = మనసు; లోన్ = లో; పరితోషమున్ = సంతోషమును; అంది = చెంది; రమాహృదీశుండు = నారాయణుడు {రమా హృదీశుడు - రమ (లక్ష్మీదేవి)కి హృదీశుడు (భర్త), విష్ణువు}; భక్తపాలనకరుండు = నారాయణుడు {భక్త పాలనకరుడు - భక్తులను పాలించుట చేయువాడు, విష్ణువు}; తదీయ = అతనిని; దర్శన = దర్శించవలెననెడి; లాలస = మిక్కిలి ఆసక్తి గల; ఆత్మకులు = మనసు గలవారు; ఆత్మలన్ = మనసులలో; తనివిన్ = తృప్తిని; చాలక = తీరక; చూడన్ = చూస్తుండగా; ఆత్మ = తన; పురంబున్ = నగరమున; కున్ = కి; ఏగెన్ = వెళ్ళెను; రయంబునన్ = వేగముగా.
భావము:- ఆ రాకుమారులైన ప్రచేతసులు సంతోషంతో చేసిన నుతికి సంతోషించి, భక్తరక్షకుడైన శ్రీహరి ఎంత చూసినా తనివి తీరక వారు తనవంక చూస్తూ ఉండగా తన స్థానానికి వేగంగా వెళ్ళిపోయాడు.

తెభా-4-938-వ.
తదనంతరంబ ప్రచేతసులు భగవదాజ్ఞ శిరంబుల ధరియించి సముద్రసలిల నిర్గతులయి.
టీక:- తదనంతరంబ = తరువాత; ప్రచేతసులు = ప్రచేతసులు; భగవత్ = హరి యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; శిరంబులన్ = తల; ధరియించి = దాల్చి; సముద్ర = సాగర; సలిల = నీటినుండి; నిర్గతులు = వెలువడినవారు; అయి = అయ్యి.
భావము:- ఆ తరువాత ప్రచేతసులు శ్రీహరి ఆనతిని తలదాల్చి మున్నీటి నీటిలోనుండి వెలువడి…

తెభా-4-939-క.
భూరి సమున్నతి నాక
ద్వా నిరోధంబు గాఁగఁ గఁ బెరిఁగిన యా
భూరుహ సంఛన్నాఖిల
ధారుణి నీక్షించి రాజనయులు వరుసన్.

టీక:- భూరి = అత్యధికమైన; సమున్నతిన్ = ఎత్తుగా; నాక = స్వర్గము యొక్క; ద్వార = ద్వారమునకు; నిరోధంబు = నిరోధించునవి; కాగన్ = అగునట్లుగా; తగన్ = మిక్కిలిగా; పెరిగిన = పెరిగిపోయిన; ఆ = ఆ; భూరుహ = చెట్లచే; సంఛన్నా = కప్పబడిన; అఖిల = సమస్తమైన; ధారుణిన్ = భూమిని; ఈక్షించి = చూసి; రాజతనయలు = రాకుమారులు; వరుసన్ = వరుసగా.
భావము:- ఆ రాకుమారులు మిక్కిలి పొడవుగా పెరిగి స్వర్గద్వారాన్ని అడ్డగించినట్లున్న చెట్లతో కప్పబడిన భూమిని చూచి….

తెభా-4-940-చ.
కుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహ లో
నుగతి నుగ్రులై ధరణి క్రము నిర్వసుధారుహంబుగా
యముఁ జేయఁ బూనిన జనాధిపసూనుల మోములందుఁ దా
ల సమీరముల్ జనన మంది కుజంబులఁ గాల్పఁ జొచ్చినన్.

టీక:- ఘన = గొప్ప; కుపిత = కోపము గల; ఆత్మలున్ = మనసులు గలవారు; ఐ = అయ్యి; విలయ = ప్రళయ; కాల = కాలము నందలి; భయంకర = భయంకరమైన; హవ్యవాహనలోచనున్ = శివుని {హవ్యవాహన లోచనుడు - హవ్యవాహనుడు (అగ్ని) లోచనుడు (కన్నుల గలవాడు), శివుడు}; గతిన్ = వలె; ఉగ్రులు = కోపము గలవారు; ఐ = అయ్యి; ధరణి = భూ; చక్రమున్ = మండలమును; నిర్వసుధారుహంబున్ = చెట్లులేనిది; కాన్ = అగునట్లు; అనయమున్ = తప్పకుండ; చేయన్ = చేయవలెనని; పూనినన్ = సంకల్పించిన; జనాధిపసూనులన్ = రాకుమారుల {జనాధిప సూనులు - జనాధిప (రాజు యొక్క) సూనులు (పుత్రులు), రాకుమారులు}; మోముల్ = ముఖములు, నోర్లు; అందున్ = నుండి; తాము = తాము; అనల = అగ్నిదేవుడు; సమీరముల్ = వాయుదేవుడు; జననమున్ = పుట్టుటను; అంది = చెంది; కుజంబులన్ = చెట్లను {కుజంబులు - కు (భూమి) నుండి జంబులు (పుట్టినవి), చెట్లు}; కాల్పన్ = కాల్చివేయుట; చొచ్చినన్ = మొదలిడగా.
భావము:- పట్టరాని ఆగ్రహాన్ని పొంది ప్రళయకాలంలోని కాలాగ్ని రుద్రుని వలె భయంకరులై భూమండలం మీది సర్వ వృక్షాలను నాశనం చేయడానికి పూనుకున్నారు. ఆ రాజపుత్రుల ముఖాలనుండి అగ్గిగాలుపు పుట్టి ఆ చెట్లను దహింపసాగాయి.

తెభా-4-941-క.
లినభవుఁ డా మహీజ
ప్రయముఁ గని వచ్చి ధరణిపాల తనూజా
తు మధురోక్తుల నుపశాం
తులఁ గావించుచును నయము దూఁకొనఁ బలికెన్

టీక:- నలినభవుడున్ = బ్రహ్మదేవుడు {నలిన భవుడు - నలినము (పద్మము) అందు భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; ఆ = ఆ; మహీజ = వృక్షముల; ప్రళయమున్ = ప్రళయమును; కని = చూసి; వచ్చి = వచ్చి; ధరణీపాల = రాజు యొక్క; తనూజాతులన్ = కుమారులను; మధుర = తీయని; ఉక్తులన్ = మాటలతో; ఉపశాంతులన్ = శాంతించినవారిని; కావించుచునున్ = చేయుచూ; నయమున్ = మృదుత్వము; దూకొనన్ = అతిశయించుతుండగా; పలికెను = పలికెను.
భావము:- చెట్లకు కలిగిన వినాశనాన్ని చూచి బ్రహ్మ దిగివచ్చి, తియ్యని మాటలతో ప్రచేతసులను శాంతింపజేశాడు.

తెభా-4-942-వ.
అట్లు పలికి వారల నుపశమిత క్రోధులం జేసిన యనంతరంబ.
టీక:- అట్లు = ఆ విధముగ; పలికి = చెప్పి; వారలన్ = వారిని; ఉపశమిత = శాంతించిన; క్రోధులన్ = కోపము గలవారు; చేసినన్ = చేసిన; అనంతరంబ = తరువాత.
భావము:- ఆ విధంగా మాట్లాడి వారి కోపాన్ని శాంతింపజేసిన తర్వాత…

తెభా-4-943-సీ.
వశిష్ట ధరణీరుహంబులు భయ మంది-
తివిరి చతుర్ముఖాదేశమునను
మారిష యను సతీణిఁ దమ కూఁతును-
నా ప్రచేతసులకు ర్థి నిచ్చె;
నా రపాలక సూనులు దక్షున-
రయంగ మున్నీశ్వరాపరాధ
మునఁ బ్రాప్త మైనట్టి పాల జన్మంబు-
కుఁ గారణం బైన లిననయన

తెభా-4-943.1-తే.
నాదరంబునఁ గమలజు నాజ్ఞఁ జేసి
డఁక దీపింప విధివత్ప్రకారమునను
రుస నందఱుఁ గూడి వివాహ మైరి
డవ వచ్చునె దైవ సంల్ప మెందు?

టీక:- అవశిష్ట = మిగిలిన; ధరణీరుహంబులున్ = చెట్లు {ధరణీరుహంబులు - ధరణి (భూమి)నుండి పుట్టినవి, చెట్లు}; భయమున్ = భయమును; అంది = చెంది; తివిరి = పూని; చతుర్ముఖ = బ్రహ్మదేవుని {చతుర్ముఖుడు - నాలుగు ముఖములుగలవాడు, బ్రహ్మదేవుడు}; ఆదేశముననున్ = ఆదేశముప్రకారము; మారిష = మారిష; అను = అనెడి; సతీమణిన్ = స్త్రీలలో మణివంటియామెను; ఆ = ఆ; ప్రచేతసుల్ = ప్రచేతసుల; కున్ = కు; అర్తిన్ = కోరి; ఇచ్చెన్ = ఇచ్చెను; నరపాలకసూనులున్ = రాజకుమారులు; దక్షన్ = దక్షున; కున్ = కు; అరయంగన్ = చూడగా; మున్ను = పూర్వము; ఈశ్వర = శివుని యెడల; అపరాధమునన్ = చేసినతప్పువలన; ప్రాప్తము = కలిగిన; అట్టి = అటువంటి; జనపాల = రాజవంశమున; జన్మంబునన్ = పుట్టుట; కున్ = కు; కారణంబున్ = కారణము; ఐన = అయిన; నలిననయనన్ = స్త్రీని {నలిననయన - నలినము (పద్మము)ల వంటి నయన (కన్నులుగలామె), స్త్రీ}; ఆదరమునన్ = మన్ననతో; కమలజున్ = బ్రహ్మదేవుని {కమలజుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; ఆజ్ఞన్ = ఆజ్ఞ; చేసి = ప్రకారము.
= కడకన్ = పూని; దీపింపన్ = ప్రకాశముగా; విధివత్ = విధింబడిన; ప్రకారముననున్ = ప్రకారముగా; వరుసన్ = వరుసగా; అందఱున్ = అందరు; కూడి = కలిసి; వివాహమైరి = పెండ్లిచేసుకొనిరి; కడవన్ = దాటుటకు; వచ్చునె = వచ్చునా ఏమి, రాదు; దైవ = దేవుని; సంకల్పమున్ = సంకల్పమును; ఎందున్ = ఎక్కడైనా.
భావము:- కాలగా మిగిలిన చెట్లు భయపడి బ్రహ్మ ఆజ్ఞచేత మారిష అనే తమ పుత్రికను ఆ ప్రచేతసులకు సమర్పించాయి. బ్రహ్మ ఆజ్ఞచేత వారందరూ విధియుతంగా ఆమెను పెండ్లి చేసుకున్నారు. దైవ సంకల్పాన్ని ఎవరూ దాటలేరు కదా!

తెభా-4-944-క.
దే జగతిం బదురు నృ
పు కిల నొక భార్య యెందుఁ బొసఁగునె? వినఁగా
లినోదరు ఘనమాయా
లితాద్భుతములకు నతులు గావింపఁ దగున్.

టీక:- కలదే = ఉన్నదా; జగతిన్ = ప్రపంచములో; పదురు = పదిమంది; నృపుల = రాజుల; కిన్ = కి; ఇలన్ = భూమిమీద; ఒక = ఒక; భార్య = భార్య; ఎందున్ = ఎక్కడైనా; పొసగునె = జరుగునా ఏమి; వినగన్ = వినెద మన్నను; నలినోదరు = హరి {నలి నోదరుడు - నలినము (పద్మము) ఉదరమున గలవాడు, విష్ణువు}; ఘన = గొప్ప; మాయా = మాయవలన; కలిత = కలిగిన; అద్భుతముల్ = అద్భుతముల; కున్ = కు; నతులున్ = స్తుతులు; కావింపన్ = చేయుట; తగున్ = తగును.
భావము:- పదిమంది రాజులకు ఒక్కతె భార్య కావటం లోకంలో ఎక్కడా లేదు. విష్ణుమాయవల్ల అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ అద్భుతాలకు మనం నమస్కరించటమే మంచిది.

తెభా-4-945-వ.
అంతఁ జాక్షుషమన్వంతరంబున దైవచోదితుండై యిష్ట ప్రజాసర్గంబు గావించుచుఁ బ్రసిద్ధుండైన దక్షుండు పూర్వదేహంబు గాలవిద్రుతం బగుచుండం బ్రచేతసులకు నమ్మారిష యను భార్య యందు సంభవించి నిజకాంతింజేసి సమస్తతేజోధనుల తేజంబును బిహితంబుగాఁ జేయుచుఁ గర్మదాక్ష్యంబున దక్షుం డను నామంబు వహించి బ్రహ్మ చేతం బ్రజాసర్గరక్షయందు నియోగింపంబడి మరీచ్యాదులం దత్తద్వ్యాపారంబులందు నియోగించి యుండె; నంత.
టీక:- అంతన్ = అంతట; చాక్షుస = చాక్షుస అనెడి; మన్వంతరంబునన్ = మన్వంతరములో {మన్వంతరములు - పద్నాలుగు, 1స్వాయంభువ 2స్వారోచిష 3ఉత్తమ 4తామస 5రైవత 6చాక్షుస 7వైవస్వత 8సూర్యసావర్ణి 9దక్షసావర్ణి 10బ్రహ్మసావర్ణి 11ధర్మసావర్ణి 12రుద్రసావర్ణి 13రౌచ్య 14భౌచ్య మన్వంతరములు ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవస్వతమన్వంతరము జరుగుచున్నది}; దైవ = దైవముచేత; చోదితుండు = ప్రేరేపింపబడినవాడు; ఐ = అయ్యి; ఇష్ట = యజ్ఞరూపమైన; ప్రజా = సంతానము; సర్గంబున్ = సృష్టించుట; కావించుచున్ = చేయుచూ; ప్రసిద్ధుండున్ = ప్రసిద్ధిపొందినవాడు; ఐనన్ = అయినట్టి; దక్షుండు = దక్షుడు; పూర్వ = పాత; దేహంబున్ = శరీరమును; కాల = కాలమున; విద్రుతంబున్ = కరిగింపబడినది; అగుచుండన్ = అగుతుండగా; ప్రచేతసుల్ = ప్రచేతసుల; కున్ = కు; ఆ = ఆ; మారిష = మారిష; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; సంభవించి = పుట్టి; నిజ = తన; కాంతిన్ = ప్రభలు; జేసి = వలన; సమస్త = సమస్తమైన; తేజః = తేజస్సు; ధనుల్ = సంపదగా గలవారి; తేజంబునున్ = తేజస్సులను; పిహితంబునున్ = కప్పబడినవి; చేయుచున్ = చేయుచూ; కర్మ = యజ్ఞకర్మలు చేయుట యందు; దాక్ష్యంబునన్ = దక్షత, సమర్థత వలన; దక్షుండు = దక్షుడు; అను = అనెడి; నామంబున్ = పేరు; వహించి = ధరించి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతన్ = చేత; ప్రజా = సంతానమును; సర్గ = సృష్టిని; రక్ష = రక్షించుట; అందున్ = అందు; నియోగింపంబడి = నియమించబడి; మరీచి = మరీచి; ఆదులన్ = మొదలగువారి; అందున్ = యెడల; తత్తత్ = ఆయా; వ్యాపారంబుల్ = వ్యవహారములు; అందున్ = లో; నియోగించి = నియమించి; ఉండెన్ = ఉండెను; అంత = అంతట.
భావము:- పూర్వం చాక్షుష మన్వంతరంలో శివదూషణం చేసిన కారణం చేత దక్షుడు మనుష్యుడై ప్రచేతసులకు, మారిషకు పుట్టాడు. కర్మలో దక్షు డవటం చేత దక్షుడు అనే పేరును అతడు ధరించాడు. బ్రహ్మచేత ప్రజాసృష్టి చేయటానికి నియోగింపబడిన దక్షుడు మరీచుడు మొదలైన వారిని ఆయా పనులలో నియోగించాడు. అప్పుడు…