పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి


పోతన తెలుగు భాగవతము
అష్ఠమ స్కంధము


తెభా-8-1-క.
శ్రీన్నామ! పయోద
శ్యా! ధరాభృల్లలామ! గదభిరామా!
రామాజనకామ! మహో
ద్ధా! గుణస్తోమధామ! శరథరామా!

టీక:- శ్రీమన్నామ = శ్రీరామ {శ్రీమన్నాముడు - శ్రీమత్ (మంగళవంతమైన) నామ (పేరు గలవాడు), రాముడు}; పయోదశ్యామ = శ్రీరామ {పయోద శ్యాముడు - పయోద (మేఘము వంటి) శ్యామ (నల్లనివాడు), రాముడు}; ధరాభృల్లలామ = శ్రీరామ {ధరాభృ ల్లలాముడు - ధరాభృత్ (రాజులలో) లలాముడు (శ్రేష్ఠమైనవాడు), రాముడు}; జగదభిరామ = శ్రీరామ {జగ దభిరాముడు - జగత్ (లోకములకు) అభి (మిక్కిలి) రాముడు (అందమైనవాడు), రాముడు}; రామాజనకామ = శ్రీరామ {రామాజన కాముడు - రామా (రమించునట్టి వారైన, స్త్రీ జన (జనులకు) కాముడు (మన్మథుని వంటివాడు, కోరబడు వాడు), రాముడు}; మహోద్ధామ = శ్రీరామ {మహోద్ధాముడు - మహా (గొప్ప) ఉద్ధాముడు (ఉద్ధరించెడివాడు), రాముడు}; గుణస్తోమధామ = శ్రీరామ {గుణస్తోమ ధాముడు - గుణస్తోమ (సుగుణములకు) ధాముడు (నెలవైనవాడు), రాముడు}; దశరథరామా = శ్రీరామ {దశరథ రాముడు - దశరథుని యొక్క కుమారుడైన రాముడు (ఆనందింప జేయువాడు), రాముడు}.
భావము:- మంగళకర మైన పేరు కలవాడా! మేఘం వంటి కాంతివంత మైన దేహం కలవాడా! రాజులలో బహు గొప్పవాడా! ఆఖిల లోకాలలో అందమైన వాడా! స్త్రీలకు మన్మథుని వంటి వాడా! బహు గంభీరమైన వాడా! సుగుణాలనే సంపదలకు నిలయమైన వాడా! దశరథకుమారు డైన శ్రీరామచంద్రా! అవధరించు!

తెభా-8-2-వ.
మహనీయ గుణగరిష్ఠు లగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుం డైన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని.
టీక:- మహనీయ = గొప్పవైన; గుణ = సుగుణములచే; గరిష్ఠులు = మిన్నయైనవారు; అగు = అయిన; ఆ = ఆ; ముని = మునులలో; శ్రేష్ఠుల్ = ఉత్తముల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = వివరించుట యందు; వైఖరీ = మంచి నేర్పు; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయిన; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; ప్రాయోపవిష్టుండు = ప్రాయోపవేశము చేయువాడు; ఐన = అయిన; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రుడు = రాజు {నరేంద్రుడు - నరులకు ఇంద్రుని వంటివాడు, రాజు}; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రుని; కనుంగొని = చూసి.
భావము:- గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూతమహర్షి ఇలా అన్నాడు. "ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని చూసి"