Jump to content

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

వికీసోర్స్ నుండి

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారం

డా॥గాదం గోపాలస్వామి

ఎం.ఎ, ఎం.ఫిల్, పి.హెచ్.డి,

రీడర్, చరిత్ర శాఖ,

శ్రీవల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్ట్స్ & సైన్సు కళాశాల,

అత్తిలి.

శ్రీ సత్య పబ్లికేషన్స్

రామన్నపేట, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా.

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

Pachima Godavari Zilla Loo Mahatmuni Samcharamu

డా॥ గాదం గోపాల స్వామి

Dr. G. Gopala Swami

ప్రచురణ సంఖ్య : 1

ప్రథమ ముద్రణ : 2005

ముద్రణ : ముద్రా ఆఫ్ సెట్ ప్రింటర్స్, విజయవాడ.

ప్రతులకు:

శ్రీ సత్య పబ్లికేషన్స్

గాదం వెంకటరాహుల్, రామన్నపేట, అత్తిలి - 534 134
పశ్చిమ గోదావరిజిల్లా
ఫోన్: (08819) 2559 11

వెల: రు.30-00/-

పరిచయ వాక్యం

ఆచార్య బి. కేశవనారాయణ.
చరిత్ర మరియు
ఆర్కియాలజీ శాఖాధిపతి , (రిటైర్డ్)
ఆంధ్రవిశ్వవిద్యాలయం
విశాఖపట్నం.

గాంధీజీ రాజకీయరంగప్రవేశం చేసి కాంగ్రెస్ కు నాయకత్వం వహించిన తర్వాత భారత స్వాతంత్ర్యోద్యమ స్వరూపస్వభావాలు మారినవి. అంతకు పూర్వం ఉన్నత వర్గాలకు చెందిన వారు మాత్రమే కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొనేవారు. అందువల్ల కాంగ్రెస్ కు లభించిన మద్దతు - పరిమితంగా ఉండేది. కాని గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ నిర్వహించిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం ప్రజాఉద్దమంగా మారింది. ఈ పరిణామం గాంధీజీ అన్నివర్గాల వారి మద్దతు కూడ గట్టడానికి అవలంభించిన పద్దతుల పర్యవసానమే , ముఖ్యంగా మహిళలు నిమజాతుల వారిని ఆకర్పించడానికి కాంగ్రెస్ విధానములో మారులు అవసరమైనాయి. ఈలక్షసాధనకు గాంధీజీ మిగిలిన ప్రాంతాలనేగాక పశ్చిమగోదావరి జిల్లాలో కూడా పర్యటించారు. 1921లో తిలక్ స్వరాజ్యనిధికి విరాళాలకై పర్యటించారు. 1929 లో ఇద్దరు ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి పర్యటించారు. బహింరంగ సభలలో ప్రసంగించి ఇద్దరు సందేశాన్ని ప్రజలకు వినిపించారు. ఇద్దరును ఉత్తత్తి చేయమని , ఇద్దరు అమ్మకాలను ప్రోత్థాపించమని , ఈ కార్యక్రమం అమలైతే అందువల్ల కొంతమందికి ఆర్థిక స్వావలంబన లభిస్తుందని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం అమలైతే విదేశీ వస్త్రాలకు గిరాకీ తగ్గి ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా తగుతుందని పర్యవసానంగా ప్రభుత్వం ఆర్థికంగా బలహీనపడుతుందని చెప్తారు. 1933 లో జరిపిన పర్యటనలో హరిజనులుహిందూసమాజానికి చెందిన వారనీ, వారిని ఉద్దరించడం ప్రతివారి కర్తవ్యమని, అంటరానితనం నిర్మూలించకపోతే హిందూ సమాజానికి మనుగడలేదనే సత్వాన్ని గుర్తించమని ప్రజలను కోరారు. ఈ పర్యటనలకు జిల్లా వాసులు అనుకూలంగా స్పందించారు. కాంగ్రెసుకు అనుకూల వాతావరణం ఏర్షడింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా బిటువేసి అధికారంలో ఉన్న జస్టిస్ పార్టీని ఓడించారు. 1937 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామాలకు సంబందించి అనేక విషయాలను డా|| గాదం గోపాల స్వామి ఈ పుస్తకంలో సమగ్రంగా పొందు పరిచారు. సమకాలీన వారా పత్రికలను అధ్యయనం చేసి విషయ సేకరణ చేశారు. జిల్లా స్థాయి నాయకులుగా గుర్తింపు పొందిన దండునారాయణ రాజు, ఆత్మకూరి గోవిందాచార్కులను గురించి దేశ స్వాతంత్రం కోసం సత్యాగ్రహాలు చేసిన త్మాగధనుల వివరాలు ఇందులో కలవు. చరిత్ర పరిశోధలకు ముఖ్యంగా ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశించవచ్చు.

గురు వాక్యం

డా || కలిదిండి వెంకటరామరాజు,
భాషాప్రవీణ, ఎమ్.ఏ., పి.హెచ్.డి
రీడర్ (రిటైర్డ్),
దాసుడు వీధి, బలుసుమూడి,
భీమవరం -2.

డా|| గాదం గోపాలస్వామిగారు ఆత్మవిశ్వాసంతో, దీక్షాదక్షతలతో, పరిశోధనాత్మక దృక్షధంతో రచించిన ఈ ' పశ్చిమగోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము " అను గ్రంథము సర్వవిధముల ప్రశంసార్షమై ఉన్నది. సువిశాలభావ సంపనుడైన ఈ రచయిత యొక్క రచనా పాటవముకు, సమకాలిక భావస్తుందనలకు, గాంధేయు సిద్ధాంత విశ్వాసాభిమానులకు, సువిమర్శనాత్మక ధోరణికి, నిరర్గళధారాశుద్ధితో సాగిన సరళభాషా శైలికిని ఈ గ్రంథము ఒక నిదర్శనము. అధ్యాపకుడుగా, పరిణత పరిశీలకుడు గాను విశేషానుభవాన్ని గడించియుండుటచే వీరి రచనలో స్పష్టప్రతిపత్తి, భావ పరిపుష్టియు కానవచుచున్నవి. గంభీరమైన ఆలోచన, దేశభక్త సత్కధర్మనిరతి, అహింసా మార్గము, నీతినియమ సంపన్షత, సదభ్యాసాలు, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అను వాని సరస సమ్మేళనమే ఈ సద్దంథ భూమిక.

"Fire arts are those in which the aimed, the heart and the hand go together"

అని ఒక ఆంగ్ల విమర్శకుడు అన్న పదం ఈ రచయిత యొక్క బుద్ధిబలము, సుస్థిర మనసికస్థితిగతులు, రమణీయురచనా రూపంలో సాగిన హరెన్న విన్యాన వైఖరియయిను ఏకోన్ముఖంగాసాగి తమ ప్రభావమును చూపినవి.

ఈగ్రంథమున రూపొందింపబడిన " పరిచయము - తొలిప్రయోగాలు, ప్రథమసందర్శనము,ఇద్దరు యాత్ర, హరిజన యాత్ర, మన కర్తవ్యం" అను ఐదు విభాగాలలో గాంధీజీయొక్క సంగ్రహ జీవిత చరిత్ర, దేశసంచారము, ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా సమగ్రసంచారం, స్వాతంత్ర్యోదమ ప్రచారం, ఇద్దరు వస్త్రధారణ, విదేశీవస్తు బహిష్కరణ అస్పశ్యతా నివారణ, జాతిమత, కుల, వర్గ భేదాలకతీతమైన సుస్థిర సారిOుక వ్యవస్థను ఏర్పరుచుట, విద్యాలయాలు స్థాపించి, చక్కటి దేశీయ విద్యను ప్రోత్తహించుట, త్యాగశీలముధానధర్మములు, ఆత్మస్టెర్మము, క్రమశిక్షణ మొదలగు ఉదాత్త గుణాలనుఅలవరుకొనుట అను మహోన్లతాశయాలను గాంధీజీ ప్రబోధ తరంగిణిలో జాలు వారి నటు ಇಂದು కానవచ్చును.

పశ్చిమగోదావరిజిల్లా యొక్క రాజకీయ, సాంఘిక, సంస్కారాత్మక విన్యాస వైరియెర్వైలు, కొండా వెంకటప్పయ దండు నారాయణరాజు, ఆత్మకూరి గోవిందాచార్యులు, ఎర్రమిల్లి నారాయణ మూర్తి, మాగంటి బాపినీడు, మాగంటి అన్నపూర్ణాదేవి మొదలగు ప్రముఖ గాంధేయవాదులు విమల జీవిత సార్థకతలు ఇందు సుస్పష్టంగారతిబింబిసున్నాయి.

చరిత్రాధ్యాపకుడుగా, విషయ పరిశోధకుడుగా తాను సాధించిన ప్రగతికి, అనుభవజ్ఞానానికి, పరిజ్ఞాన పాటవానికి ఈ గ్రంథము ఒక ఆటపట్టుగా కానవచ్చు చున్నది. ఇది చదువరులకు చక్కని సందేశాలను అందించే ఉత్తమగ్రంథము.

ఈ ఆదర్శప్రాయ రచయిత యొక్క కమనీయ లేఖని నుండి ఇట్ එබීජ సద్దంథములను వెలయించుటకు తగిన శక్తి యుక్తులను, పరిపూర్ణ ఆయురారోగ్య సౌభాగ్వాలను ఆపరాత్తరుడు అనుగ్రహించుగాక!

తజస్వినావధీతమస్తు

ఆప్తవాక్యము

- మండెల సూర్యనారాయణ ఎమ్.కాం, ఎమ్.ఫిల్ ప్రిన్సిపాల్, శ్రీవల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, అత్తిలి.

ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వారిలో మహాత్మా గాంధీవలె ప్రజల దృష్టిని ఆకర్నించిన నాయకుడు మరొకరు లేరు. ఆయన వాక్కులు భారతీయులకు వేద మంత్రములయినవి. ఆయన చేపట్టిన కార్యక్రమములన్నీ ఘనత కెక్కాయి. ఆయన నిరాహారదీక్ష చేస్తే లక్షలాది ప్రజలు నిరాహారదీక్ష చేశారు. ఇరవైవ శతాబ్దంలో ప్రజలకోసం జీవితాన్ని త్యాగం చేసి తాదాత్మంచెందే అదృష్టం ఆయనకేదక్కింది. భారత స్వాతంత్ర్యసము పార్థనకు ఆయన అహింసా విధానంతో రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్నారు. స్వాతంత్ర యోధులకు ఈతత్వాన్ని బోధించి మార్గదర్శకుడైనారు. ఆయన కృషి రాజకీయరంగానికి మాత్రమే పరిమితంకాదు. అది సర్వతోముఖమై సాంఘిక, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాలకు వ్యాపించి ప్రజాజీవన విధానంలో విప్లవాత్మక మారును తెచ్చినది. అందుచే ఆయనను 'జాతిపిత"గా పరిగణిసూన్నాము.

అటువంటి మహామనిషి ఈ భూమిపై నడయాడినాడంటే భావితరాల వారు విస్మయాన్ని చెందుతారు. ఆయనకు సమకాలికులైన భారతప్రజల జన్మ చరితార్థమైనది. అట్టి అసాధారణమానవుడు స్వాతంత్ర్యోద్యమ కాలంలోపశ్చిమగోదావరి జిల్లాను మూడు పర్యాయములు సందర్శించారు. వారిరాక సందర్ణముగా జిల్లా ప్రజానీకం యావతూ తరతమ భేదాలను విస్మరించి ఆయనను ఘనంగా స్వాగతించి, సత్కరించిన వివరాలను కనులముందు కదలాడే విధంగా రచించిన "పశ్చిమగోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము' అనే గ్రంథాన్ని చదివి నా హృదయం ఆనందంతో పులకించింది. గాంధీజీ పాదస్పర్శతో పునీతమైనందున ఈ జిల్లా పసిడి రాసులను వెదజిమ్ముతు ందనటంలో అతిశయోక్తి లేదనుకొంటాను. గాంధీజీ ఆశయాలు, వాటిని సాధించుటకు ఆయన అనుసరించిన మారాలు సర్వకాలములందు అనుసరణీయాలు. "నా జీవితమే నా సందేశం’ అనిన గాంధీజీ వాక్కులు అక్షర సత్కాలు. ఇటువంటి అమూల్యమైన గ్రంథాన్ని అందించిన మిత్రుడు డా|| గాదం గోపాలస్వామి కడు అభినందనీయుడు. ఆయనకు సర్వదానిండైన ఆయురారోగ్యాలు కలగాని, ఈ గ్రంథాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ చదివి దేశభక్తికి పునరంకితులు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

"జెైహింద్"

కృతజ్ఞతలు

జాతిపిత మహాత్మాగాంధీ పై గల భక్తి భావముతో ఈ గ్రంథము వ్రాయటానికి సాహసించాను. ఆయన జీవితము ఒక మహాసాగరం, అది ఎనో ఆటుపోటులకు గురియై స్వాతంత్ర్కమనే కల్ల వృక్షాన్ని భారతజాతికి అందించింది.గంధిీజీ నాయకత్వంలో స్వాతంత్ర్యపోరాటం అనే మహాయజ్ఞంలో ఎనో కుటుంబాలు సమిధలైపోయాయి. ఆ మహామహులు చేసిన త్యాగాలను మనం అను నిత్యం స్మరించుకుంటూ ఉంటే గాని స్వాతంత్ర్యం యొక్క విలువ తెలియదు. గాంధీజీ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ప్రజాస్త్రందన, వారు చేసిన త్యాగాలు జ్ఞప్తికి తెచ్చి ఈనాటి యువతకు, విద్యార్థులకు సూర్తి కలిగించటమే ఈ గ్రంథం యొక్కప్రధాన ఆశయం.

ఈ గ్రంథములో అధికభాగం ప్రాధమిక ఆధారాలను అనుసరించి వ్రాయుట జరిగింది. వాస్తవాలను ప్రతిబింబింప చేయటానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచాను. చరిత్ర పరిశోధనా విద్యార్శలకు ఉపయుక్తమగురీతిగ ఆధారములను సవివరముగా పేర్కొనటం జరిగింది. కీ.శే.పద్మభూషణ ఆచార మామిడిపూడి వెంకటరంగయ్య గారి భారత స్వాతంత్ర్యోద్యమంపై వివిధ రచనలు, కొడాలి ఆంజనేయులుగారి 'ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి కాంగ్రెస్ చరిత్ర ఈ రచనా గమనాన్ని నిర్దేశిస్తూ ముందుకు నడిపించినవి. వారికి నా కృతజ్ఞతలు. “ఆంధ్రపత్రిక", "కృష్ణాపత్రిక", "సత్యాగ్రహి" వంటి సమకాలీన పత్రికలు పదిలపరచి సమాచార సేకరణకు సహాయపడిన రాష్ట్ర రాజ్య అభిలేఖా నిలయమువారికి ధన్యవాదములు.

దయతో ఈ గ్రంథానికి " పరిచయ వాక్యం "వ్రాసి ఇచ్చిన ఆచార్య జి.కేశవనారాయణ గార్కి, నాకృషిని గమనిస్ళూ నన్ను నిరంతరం ప్రోత్తహించే ఆచార్య జి. మస్తానయ్య గార్కి, 'గురువాక్యం' వ్రాసిఇచ్చి ఆశీర్వదించిన డా || కలిదిండి వెంకరామరాజు గార్కి నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనములు.

ఉన్నత పాఠశాలలో చేరిన నాటి నుండి నాయందు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నా జీవితానికి దశను, దిశను నిర్దేశించి అధ్యాపకునిగా,పరిశోధకునిగా నను తీర్షిదిద్దన గురుకులాలంకారులు కీ.శే సున్నం ఆంజనేయులు గార్కి ఆజన్మాంతము కృతజ్ఞడను.

నా అభివృద్ధిని కాంక్షిస్తూ నిరంతరం ప్రోత్తహించే మా శ్రీవల్లీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆ & సైన్మ డిగ్రీ కళాశాల, అత్తిలి యాజమాన్యం వారికి, కళాశాల కులపతి శ్రీ మండెల సూర్యనారాయణ గార్కి, ఈ పుస్తకానికి ప్రూఫ్ చదివి, తగు సలహాలిచిన మిత్రులు 8 సిద్ధిరెడ్డి కృష్ణమూర్తి , ఆర్థికశాస్త్రశాఖాధిపతి గార్కి, ప్రముఖ రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ గార్కి నా హృదపూర్వక ధన్యవాదములు. ఈ పుస్తకం తయారు చేసే కాలంలో నా చిరాకుపరాకులను

చిరునవ్వుతో భరిసూ నా వ్యాపకాన్ని ప్రోత్తహించిన నా శ్రీమతి వీర వెంకట సత్యవతికి నా ప్రేమ పూర్వక ధన్యవాదాలు. ఈ గ్రంథం టైపు సెట్టింగ్, ముద్రణ సకాలంలో పూర్తిచేసి, గ్రంథాన్ని ఆకర్షణీయంగా తయారుచేసి ఇచ్చిన ముద్ర ఆఫ్సెట్ ప్రింటర్ట్ అధినేత శ్రీ తుమ్మల సుబ్బారావు గార్కి, కంప్యూటర్ అపరేటర్ దేవరకొండ పూర్ణిమ గార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

అత్తిలి , గాదంగోపాలస్వామి

1-7-2OO5.

విషయసూచిక

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
17

21

31

63

83

1

This work is released under the Creative Commons Attribution-Share Alike 4.0 International license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed—and if you alter, transform, or build upon this work, you may distribute the resulting work only under the same license as this one.