పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము/ప్రథమ సందర్శన 1921

వికీసోర్స్ నుండి



2. ప్రథమ సందర్శన 1921

గాంధీజీ ఏలూరు వస్తారని తెలియటంతో చుట్టు ప్రక్కల గ్రామములనుండి సుమారు 50 వేల మంది ప్రజలు వచ్చిచేరారు. పురమంతా మామిడి తోరణములతోను, కొబ్బరి ఆకుల పందెళ్ళతోను, అరటిచెట్లతోను అలంకరించబడింది. ఏలూరు నగరమంతా పండుగ వాతావరణాన్ని తలపింపచేసింది. 1921 ఏప్రియల్ 3వ తేదీ సాయంత్రము 4 గం||లకు రాజమండ్రి నుంచి వచ్చురైలులో సతీసమేతంగా గాంధీజీ, ఆయన అనుచరవర్గం ఏలూరు రైల్వేస్టేషను నందు దిగినారు. ఏలూరు రైల్వే స్టేషనునుండి ఇనుపవంతెన వరకు జనం క్రిక్కిరిసిపోయారు. ప్లాట్ ఫారముపై మోతే గంగరాజు, సోమంచి సీతారామయ్య, వలూరి రామారావు పంతులు, ఎర్రమిల్లి మంగయ్య వారణాశి రామమూర్తి, బడేటి వెంకట రామయ్య నాయుడు వేచియున్నారు. ఈ పెద్దలంతా గాంధీజీకి ఆహ్వానంపలికి పుష్పమాలాంకృతులను గావించారు. బ్యాండు, సన్నాయి, భజనలతో రెండు గుట్టాల బగ్లీపై ఏలూరు అంతా ఊరేగించారు. తరువాత టౌన్ హాలులో పదివేల మంది స్త్రీలు హాజరయిన సభలో గాంధీజీ ఉపన్యసించారు. తరువాత శ్రీమతి సత్తెరాజు వెంకట రత్తమ్మ గారి స్త్రీ సమాజ భవనమునకు గాంధీజీ శంకుస్థాపన గావించారు. స్త్రీ ప్రార్థనాసమాజం పక్షాన గాంధీజీ దంపతులకు సన్మానపత్రం సమర్పించబడింది. అచ్చట నుండి శనివారపుపేట రోడ్డుపై పయనించి సహాయనిరాకరణవాదులు నిర్మించిన "గాంధీ జాతీయ విద్యాలయమునకు ప్రారంభోత్సవం గావించి జాతీయ విద్యాలయాల ప్రాముఖ్యత వివరించారు. అచ్చట వరదారామస్వామి గారి పొలమునందు ఏర్పరచిన పారసభలో ప్రజలకోరికపై లోకమాన్య బాల గంగాధరతిలక్ చిత్రపటాన్ని ఆవిష్కరిసూ గాంధీజీఅద్భుత ఉపన్యాసాన్ని ఇచ్చారు. "నన్ను మీరు లోకమాన్యుని పటం ఆవిష్కరించమన్నారు. ఆమహానుభావుడు "స్వరాజ్యం తనజన్మహక్కు అనిభావించి తన సర్వస్వం ధారపోసి అందుకోసం యావజ్జీవం కృషిచేశారు. మరి మరణకాలంలో కూడా స్వరాజ్యమంత్రాన్నే జపించారు. అట్టి దేశబాంధవుని రూపము మీఎదుట ఉన్నది. స్వరాజ్యతత్వాన్ని చక్కగా గ్రహించే మీరు ఆమహానుభావుని చిత్రపటాన్ని ఆవిష్కరించమని కోరి ఉంటారు. గడచిన సంవత్సరమునుండి నేను, నా సోదరుడు మౌలానా షాకాత్ అలీ కలిసి దేశములో తిరుగుచున్నాము. కాని ఇప్పడు స్వరాజ్యసంపాదనకు కాలవ్యవధి సమీపించుచున్నందున మేము కలిసి పర్యటించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

వీలుకాకున్నది. నేను వర్గాశ్రమ ధర్మాలను పాటించే హిందువుడను, ఆయన స్వచ్ఛమైన మహమ్మదీయుడు అయినప్పటికీ ఇద్దరమూ కలిసి తిరుగుటకు మాకేమీ అభ్యంతరములేదు. ದಿನಿನಿ ಬಲ್ಗೆ హిందూ-మహ్మదీయ సమ్మేళనము సులభ సాధ్యమని మీరు భావించవచ్చును. ఈ సమ్మేళనము మీదనే మన భవిష్యత్తు ఆధారపడిఉంది."

" వర్ణాశ్రమధర్మాలు ఆయా కులాలు ఎక్కువ, తక్కువలను నిర్ణయించటానికి ఏర్పడలేదు. ఏకులమునకు ఆ కులమే గొప్పది. బ్రాహ్మణులు సర్వసంగ పరిత్యాగులై తమ ధర్మాల్ని పాటిసూ పూర్వకాలంలో చాలామేలు చేకూర్చియున్నారనే మాట ఒప్పకొనక తప్పదు. కాని ఆ బ్రాహ్మణులే చండాలురు మొదలగువారిని తాకరాదని నిర్ణయించి చాల ఉపద్రవమును తెచ్చిపెట్టారు. ఈ అస్పృశ్యతాదోషం ఫెూరపాతకం మనలను ఆవరించియున్నది. భగవద్గీతలో ఎచ్చటనూ చండాలుని తాకరాదని చెప్పలేదు. కావున దీనిని నివారించవలెనని హిందువలనందరినీ కోరుతూ, పంచమాది నిమ్నజాతుల వారిని కొంత ఓపిక కలిగి యుండవలెనని ప్రార్జించుచున్నాను.

ఈ ఆంధ్ర దేశమునందు నాకు ఒక గొప్పలోపం కనిపిస్తూంది. నేను కాకినాడలో ఉండగా కొందరు భోగపు స్త్రీలు నాదర్శనమునకు వచ్చారు. వారివృత్తి విన్నప్పడు నాపాదముల క్రింద భూమి కృంగిపోవనారంభించింది. ప్రతి స్త్రీ మన సోదరీమణియే.

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

ప్రతి స్త్రీ మనమాతయే అని భావించకుండా మన కామశాంతికై కొందరిని ఈ నీచవృత్తికి ప్రత్యేకించి, వారి జీవితాలను ఆధోగతి పాల్చేసూన్నాము. మన సహాయనిరాకరణ ఉద్యమము అతిపవిత్రమైనది. అందు ఇటువంటి ధర్మవిరుద్దపుకార్యములకు తావులేదు. అసత్యమునకు, హింసకు ఇందుతావులేదు. కనుక ప్రస్తుత ప్రభుత్వమును సైతాను ప్రభుత్వము అని మనము అంటున్నాము. ప్రస్తుత రాజ్యపాలనను రావణరాజ్యంతో పోలుస్తున్నాము. అటువంటి మనము భోగపస్త్రీలనే ఒకజాతిని నిలిపి ఉంచటం ఎంతో విచారకరము. ఆంధ్రనాయకులందరూ ఈ అపచారాన్ని అంతంచేయటానికి నడుము కట్టాలి. స్త్రీ సమాజాభివృద్ధికి పాటుపడే సేవకురాండ్రందరూ ముందంజ వేయాలి. వారు ఇంటింటికీ తిరిగి ఈ అపవిత్రవృత్తిని విసర్జించేటట్లు చేయాలి. ఆవిధంగా చేసి మీ ఆంధ్ర దేశములో 'భోగపుస్త్రీ కులవ్యవస్థ అదృశ్యమైనదని నాకు తెలిపితే నేను ఎంతో సంతోషిస్తాను.” 2

"సోదరులారా ! మనకార్మికుల దుస్థితికి నేను అనేక సంవత్సరములు, అనేక ప్రయత్నములు కావించి చివరకు రాట్నమే అన్ని సమస్యలకు పరిష్కారమనే నమ్మకమునకు వచ్చాను. మనరాట్నములు ఎప్పడు మూలన పడినవో అప్పడే మన భాగ్యదేవత అంతరించింది. అందుచే మీరందరూ రాట్నములను పునరుద్ధరించవలెనని కోరుతున్నాను. రాట్నముమన ఆర్థికపరిస్థితిని ఉద్ధరించుటయేకాక, స్వరాజ్య సంపాదనకు కూడా ముఖ్యసూత్రమని నా అభిప్రాయము.

మనము స్వరాజ్యము ఆరునెలలలో రావలెనని కోరుతున్నాము. అందుకు అఖిలభారతకాంగ్రెసు సంఘమువారు మూడు విషయములను నిర్ణయించారు. అవి. 1. జూన్ 3వ తేదీలోగా కోటి రూపాయలు 'తిలక్ స్వరాజ్యనిధి'కి సేకరించుట, 2. కోటిమందిని కాంగ్రెస్ &&%Seלחכג చేర్పించుట, 3. ప్రతియింటా రాట్నము తిరిగేటట్లు చేయుట, కనీసం దేశములో 20 లక్షల రాట్నములైనా ఏర్పరచుట.

ఈ మూడు విషయములను ఈ రెండు మాసములలోగా పూర్తిగా మీరు నెరవేర్చవలసియుంది. మీరు ఒక్క గజం విదేశీవస్తాన్ని ధరించినా మహాపాతకం చేసిన వారగుదురు. మీ ప్రాంతములో తయారుచేయబడుతున్న నూలు చాల ప్రశస్తముగా ఉంది. ఇక్కడ తయారుచేయుచున్న వస్త్రములు మిక్కిలి కోమలముగా ఉన్నాయి. ఇట్టివస్తాలు

ෙ23 ම పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

మావైపు తయారగుటలేదు. మీరు విజ్ఞానములో, పట్టుదలలో, కార్యశూరతలో చాలా ముందంజలో ఉన్నట్లుతోసూంది. దక్షిణాఫ్రికాలో నా ఉద్యమంలో నాతో ప్రారంభం నుండీ ఊతగాచేరి పనిచేసిన వారు కూడ మీరే. చివరి వరకూ నాతో మిగిలిన వారు కూడ మీరే. ఇదినాకు బాగా జ్ఞాపకమున్నది.

సోదరులారా! ఆంగ్ల భాష తెలియని వేలాది మందిగల ఈ సభలో నేను ఇంగ్లీషులో మాట్లాడవలసి వచ్చినందుకు, నేను మాట్లాడే అతిసులువైన చిన్న చిన్న హిందుస్తానీ మాటలను తెనుగులో చెప్పగలవారొకరైనా ఇక్కడ లేనందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. కాబట్టి ఇంతకు ముందు ప్రారంభించిన జాతీయ విద్యాలయములోని ఉపాధ్యాయులు తప్పకుండా ఈపట్టణంలోని ఈ పెద్దలోపాన్ని సరిదిద్దగలరని ఆశిస్తాను. మీ పాఠశాలలో ఈ సంవత్సరము రాట్నముపై నూలు తీయటం, హిందీ భాష నేర్పటం ముఖ్య కార్యక్రమాలుగా ఏర్పరచుకొని దేశోద్ధరణకు పూనుకొనవలెనని ప్రార్ధిస్తూన్నాను.

ఒక్కవిషయమును చెప్పి ఉపన్యాసమును ముగిస్తాను, అది ప్లీడరులను గురించి. నా ఉద్యమములో ఇంకా చేరకుండా వెనుకబడియున్న మహానీయులగు ప్లీడరులకు త్యాగమును, దూరదృష్టిని, దేశసేవాతత్పరతను భగవంతుడు అనుగ్రహించును గాక! అని ప్రార్థించుటయే నేను వారికి చెప్పదలచిన విషయము."

ఉపన్యాసము పూర్తి అయిన తరువాత 'తిలక్ స్వరాజ్యనిధి'కి చందాలు వసూలు చేయటం ప్రారంభమైనది. సభలో ఉన్నవారు అనేకులు తమయథాశక్తి చందాలు సమర్పించారు. శ్రీమతి కలగర రావమ్మ 10 కాసుల బంగారపు కడ్డీ మురుగును గాంధీజీకి సమర్పించారు. దానిని వేలం వేయగా రూ.220/- నిధికి చేర్చబడినాయి. చిలుకూరి నరసింహారావు సమర్పించిన చేతికర్రను మోతే గంగరాజు రూ.200/-కు కొన్నారు. ఒక నూలు కండువాను గ్రంధిరామమూర్తి రూ.25/–కు వేలం పాడారు. మహాత్ముని మెడలోని పుష్చ హారమును రూ.300/-కు కందుల రామయ్య, మరియొక హారమును ఒక బ్రాహ్మణుడు రూ. 45/- కు కొన్నారు. వాచీలు, గొలుసులు, ఉంగరములు మొదలగు ఆభరణములు ఎన్నో స్వరాజ్య నిధికై గాంధీజీకి సమర్పించారు. వేలం వేయుటకు వ్యవధి లేనందున మహాత్ముడు సభను ముగించారు. తరువాత మెయిల్లో మచిలీపట్నం వెళ్ళటకు బయలుదేరారు. * ఏలూరునందు తిలక్ స్వరాజ్యనిధి వస్తువుల విలువతో సహా రూ. 1021/- లు వసూలైనది.  గాంధీజీ ఏలూరును సందర్శించిన సందర్భములో గాంధీ జాతీయ విద్యాలయాన్ని గూర్చి కొంత చెప్పివలసియుంది. సహాయనిరాకరణోద్యమంలో భాగముగా ప్రభుత్వ పాఠశాలను నెలకొల్పాలని గాంధీ పిలుపునిచ్చారు.

సర్దార్ దండు నారాయణరాజు
పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ రథసారధి

ఆ సందర్భాన్ని అనుసరించి ఏలూరు నందు జాతీయ పాఠశాలను ఏర్పరచాలనే ఉద్దేశముతో మానేపల్లి సూర్యనారాయణ, తమ్మన మాణిక్యం, పసుమర్తి పురుషోత్తం, కంభంపాటి కన్నయ్య అనే నలుగురు వైశ్య ప్రముఖులు ఒక దీక్షా సంఘముగా ఏర్పడి ఈ విద్యాలయస్థాపనకై ఒక లక్ష్మరూపాయలు చందాలు వసూలుచేయాలని, విద్యాలయస్థాపన పూర్తి అయ్యేంతవరకూ ఇండ్లకు పోరాదని దీక్షవహించారు. వీరు తమ దీక్షాసంఘానికి పురప్రముఖుడైన మోతే గంగరాజు గారిని అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు. 1921 ఏప్రియలు నందు గాంధీజీ ఏలూరు రాకను పురస్కరించుకొని, ఆయన చేతుల మీదుగా, గాంధీజీ పేరున విద్యాలయ సంస్థాపన జరిపించాలని ఈ దీక్షా సంఘం సంకల్పించింది. నాటికి రూ. 62,488/- మాత్రమే వసూలుచేయగలిగారు. గాంధీజీ ఏలూరు వచ్చిన సందర్భమున దీక్షా సంఘము కోర్మెను అంగీకరించి గాంధీజీ, కస్తూర్బాతో కలిసి ఏప్రియల్ 3, 1921, ఆదివారం రౌద్రి నామసంవత్సరం, ఫాల్గుణ బహుళ ఏకాదశి రోజున మార్కండేయస్వామి వారి సన్నిధిలో బాలురకు అక్షరాభ్యాసము చేయించి గాంధీ జాతీయ విద్యాలయాన్ని సంస్థాపన చేశారు ఈ సందర్భమున దీక్షా సంఘమువారు గాంధీజీకి సమర్పించిన స్వాగతపత్రము ఈ దిగువునఉన్నది

దీక్షా సంఘమువారి స్వాగతపత్రము

"హేలాపురి దీక్షా సంఘమువారు శ్రీయుత మహాత్మా మొూహాన్ దాస్ కరుణా సాంద్ర గాంధీగారి కొసంగిన స్వాగతము.

మహాత్మా! లోకము పాపభారమునకులోనై ఐహిక సౌఖ్యాంధకారమున మునిగినపుడెల్ల భగవదంశా సంభూతులగు అవతారపురుషులు జన్మించుచుందురు. అట్టివారిలో నీవొక్కడవు. నేటికి భగవదీయ దర్శన స్పర్శాదులచే మాప్రదేశము పావనమైనది. మన భారత వర్షము ప్రాచీనవిధానములను మరచి పాశ్చాత్య నాగరకత అను మహాసముద్రమున మునిగి పోవనున్న ఈ సమయములో నీవవతరించి ఋషిప్రోక్తములగు సత్య, శౌచాది గుణంబులు ప్రజలమనంబుల నెలకొల్పి అహింసావిధానంబున భారతపుత్రులకు స్వరాజ్య ప్రదానమును గావింప సమకట్టి తన్మూలమున లోకవిజయము గాంచనెంచితివి. దానికి ప్రధమ సోపానంబుగ హిందూ, మహ్మదీయ సోదర సమ్మేళనమును సమకూర్చితివి. భారత వర్షమును కష్టపరంపరల ముంచి పీడించుచున్న దాస్యాన్ని దౌర్జన్యరహితమగు సహాయనిరాకరణముచే నిర్మూలనము గావింప బూనితివి. నీ పాదపద్మములననుసరించి కార్యనిర్వహణ మొనర్చ సమకట్టిన మమ్ము ఆశీర్వదించి మాపురమున జాతీయవిద్యా పీఠమును స్థాపింప బ్రార్థించుచున్నారము. భారత వర్షమునకు సత్వరస్వరాజ్యమును సమకూర్చుటకును, లోకమునందెల్లెడల శాంతిని నెలకొల్పుటకును పరాత్పరుడు నీకు చిరకాలాయురారోగ్యముల నొసంగి నీకుటుంబమును సాకునుగాక అని మిగుల వేడుకొనుచున్నాము".

భవదీయ, భక్తులు,
హేలాపురి దీక్షా సంఘము.

ఈ సందర్భమునందు స్త్రీ ప్రార్థనాసమాజము వారు సమర్పించిన సన్మానపత్రము ఈ విధముగానున్నది.

"ఏలూరు స్త్రీ ప్రార్థనా సమాజము పక్షాన శ్రీ మహాత్మాగాంధీ దంపతులకు సమర్పింపబడిన వినతి పత్రిక.

మహాత్మా జననీ,

పరదేశీయ నిరంకుశ పాలనమున నామావశేషమై విషమావస్థయందు జిక్కి నిలయముగా నుండిన ప్రాచీన భారత వైభవమును బునరుద్దరింప భగవానుడు మిమ్ము సృజించెననుట స్తుతిపాఠముకాదు. 1857వ సం॥న భారతీయస్వాతంత్ర్య రక్షణమునకై, ఆత్మగౌరవమునకై భారత ఖండంబున విజృంభించిన భయంకర సంగ్రామము గాని, దాదాభాయి నౌరోజీ, లోకమాన్య బాలగంగాధర తిలక్‌లకు, స్కాట్, వెడర్బరన్ మహామహులచే స్థాపితమై 35 సం॥ వ్యాహతముగ, రాజకీయ రంగమున భారతీయ పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ధర్మ స్వాతంత్ర్య సముద్దరణమున ఏకదీక్షగ పనిచేసిన దేశీయమహాసభగాని, 1919 సం|న బయలుదేరిన భారతీయ ప్రజాప్రతినిధుల రాయబారములవలన గాని లేశమయిన చలింపని బ్రిటీషు సామ్రాజ్యమును చంపారన్, కైరాలలోను, 1919 సO11న పంజాబు హత్యల సందర్భమునను మీరు ప్రయోగించిన సత్యాగ్రహాస్త్ర శక్తి పునాదులతో కదలించినది. నేటి మీ సహాయనిరాకరణ దీక్షతో, మీ సత్య బలప్రతిష్టతో, మీ ఆత్మశక్తితో సామ్రాజ్యము దుర్బలావస్థ చెందినది. హిందూ మహ్మదీయ సమ్మేళనమునకు మీరు సూత్రధారులై భరతఖండమును అఖండ శక్తివంతముగ చేసితిరి, మీరడిగిన గడువులోపున భారతమునకు తప్పక స్వరాజ్యసిద్ధి కాగలదని మా విశ్వాసము.

స్వదేశము కొఱకాత్మరక్తము తర్పణము వీడిననాటి రూన్సీ లక్ష్మీభాయి, భర్తృశార్య ప్రతాపముల నుద్రిక్తపరచిన ఖడ్డ తిక్కన గారి నర్గాంగలక్ష్మియు, దక్షిణాఫ్రికా ప్రభుత్వముతో పొసగిన ధర్మసమరమున మీ కష్టనష్టములయందును, మీ విజయమునందును, తోడునీడవలెనుండు జనని కసూరి బాయియ, వంగరాష్ట్రమున శారీరక వ్యాయామ మందిరముల వ్యాప్తిని పెంచి, అచ్చట పురుషనామము సార్ధక పరచిన సరళాదేవి చౌదరాణియు, కన్న పుత్రులను, మతవిశ్వాసమునకు, మాతృదేశ సేవకును అప్పగించిన అలీ సోదరుల తల్లి అబాదీ భానో సాహిబాగారును, మాస్త్రీమండలి నుండి ప్రాదుర్భవించి ఆత్మీయ సర్వస్వ సమర్పణమొనర్చి, దేశహితమునకు తోడ్పడునట్లు ఆశీర్వదింపడు. మీ త్రికరణ శుద్ధి, మీ ఆత్మసాక్షాత్కారము, మీ ధార్మికదీక్ష మీ దృఢ సంకల్పము మీ స్వరాజ్యసంపాదన ఆకాంక్ష భరతవర్షమునకు స్వరాజ్యము ప్రసాదింపగలదని ప్రతిభారత వ్యక్తి యొక్క అంతరాత్మ 'తధాస్త శబ్దము చేయుచున్నది. మా ఏలూరు స్త్రీ సమాజము కొరకు నిర్మితము కానున్న మందిరమునకు ఎట్లో రెండు వేల రూపాయలు భిక్షతో నార్జించగలిగితిమి. ఇది నిశ్చయముగ భగవత్మారుణ్యమే. తన్మందిరమునకు మీ అమృత హస్తములతో శంకుస్థాపన గావించి పునీత మొనర్పుడు. మా సమాజమును ధన్యముగా వింపుడు. చిరస్థాయిగ నుండు నటుల దీవింపడు.

మీ దంపతులకు, మీ కుటుంబమునకు దీర్షాయురారోగ్యములును, మీ దేశహితైక సేవాపరత్వమునకు ఆత్మబలమును పరమేశ్వరుడు ప్రసాదించుగాక అని ప్రార్జింతుము".

గాంధీజీ ఆంధ్రదేశ పర్యటన పూర్తి అయిన పిదప 1921 ఏప్రియల్ రెండవ వారపు "యంగ్ ఇండియా' పత్రికలో ఈ విధంగా ఆంధ్రులను ప్రశంసించారు. “ఆంధ్రదేశము -పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

ఉత్కళ దేశమువలె గాదు. అదినిండు శక్తితో విరాజిల్లుతున్నది. ప్రజలు బలవంతులు, శక్తివంతులు, ఉదారవంతులు, పట్టుదలగలవారు, ప్రేమపూరితులు, స్వరాష్ట్ర భావిస్థితి గూర్చి, హిందూదేశ భావి భాగ్యోదయమునుగూర్చి వారికి విశ్వాసముకలదు.స్త్రీలకును, పురుషులకును కావలసినన్ని బంగారునగలు కలవు. ఆ నగలను నాకు కనబరచుట కడు నష్టదాయకము. తిలక్ మహారాజ్గారి జ్ఞాపకార్థం స్వరాజ్యం కొరకు అవినాకు కావలెనని మర్మము విడిచి అడిగితిని. స్త్రీలు, పురుషులు సంతోషపూర్వకముగా నాకు ఇచ్చిరి. ఆంధ్రదేశంలో ఆరురోజుల సంచారములో 50 వేల రూపాయలు నాకు ఇచ్చారు. స్త్రీలకు సహజ వినయ, సద్దుణములు కూడ చేరియున్నవి. ఇదిమిగుల ప్రశంసా వాక్యమని నాకు తెలుసు. నా అభిప్రాయమును నేను మార్చుకొనను. ఇటీవలనే వివాహితయై కలకత్తాలో విద్య నేర్చుకొనుచున్న అన్నపూర్గాదేవియను బాలిక మంగళసూత్రము తప్ప మిగిలిన సొమ్ములన్నింటిని "స్వరాజ్యనిధి'కి విజయవాడ సభలో నాకు సమర్పించి, సంపూర్ణ ఖద్దరు వస్త్రధారిణియై సమావేశమున పాల్గొనినది. ఆంధ్రదేశ స్త్రీ పురుషుల ఔదార్య స్వభావములు నన్ను ఎక్కువగా ఆకర్షించినవి". 7

గాంధీజీ ఏలూరు పర్యటన పశ్చిమగోదావరి జిల్లా ప్రజానీకంపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగించింది. జాతీయ విమోచనోద్యమానికి తాము చేయగలిగిన కృషిని శక్తి వంచన లేకుండా ప్రారంభించారు. చాలా మంది ఖద్దరు ధారణకు ప్రతినబూని రాట్నం వడకటం ప్రారంభించారు. అంతవరకూ పరదాలో ఉన్న అనేకమంది స్త్రీలు ఉద్యమంలో ప్రవేశించి కార్యోన్ముఖులైనారు. విదేశీవస్తాలను గుట్టలుగా వేసి తగులబెట్టటం, షాపులు పికెటింగు చేయటం జరిగింది. కల్లు, సారాయి దుకాణములు పికెటింగు చేయటం-ఈత, తాడి చెట్ల నరికివేయటం- ఆబ్కారీవేలంపాటలు స్తంభింపచేయటం చేశారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, మునసబు, కరణములు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. విద్యారులు పాఠశాలలను బహిష్కరించారు. అహింసాయుత విధానాలతో గాంధీజీ అడుగుజాడలలో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సహాయనిరాకరణ ఉద్యమాన్ని అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు.\

సహాయనిరాకరణ ఉద్యమతీర్మానం నందలి యోగ్యతాపత్రాలు, బిరుదులు పరిత్యజించవలెననే కార్యక్రమాన్ని అనుసరించి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నందు తటవర్తి పట్టాభిరామయ్య, పస్తుల సాగరం, మరియూ సత్యదేవర రామేశ్వరరావు తమ పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గౌరవమెజిస్టేటు పదవులకు రాజీనామాలు సమర్పించారు. నర్సాపురంనందు సౌదాగర్ యూసఫ్ ఖూన్ తన 'జహందర్ భిరుదాన్నిత్యజించారు. విద్యాలయాలను బహిష్కరించవలెను అనే కార్యక్రమం ప్రకారం చంద్రుపట్ల బాపిరాజు, వడ్లపట్ల గంగరాజు, కలగర కృష్ణారావు, బద్దిరాజు నాగభూషణం, మంగిపూడి పురుషోత్తమశర్మ, దాట్ల సీతారామరాజు, నిడమర్తి వెంకట ఉమామహేశ్వరరావు మొదలగు విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెప్పారు. గజవల్లి రామచంద్రరావు, ప్రతివాది భయంకర కృష్ణమాచార్యులు, సత్తిరాజు రామమూర్తి, గొట్టముక్కల వెంకన్న శనివారపు సుబ్బారావు మొదలగు జాతీయ భావములు గల ఉపాధ్యాయులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. దండునారాయణరాజు, ఎర్రమిల్లి మంగయ్య, తల్లాప్రగడ చలపతిశర్మ, అతోట వీరరాఘవరాపు, ఎర్రమిల్లి నారాయణమూర్తి, అడవి బాపిరాజు మొదలైన న్యాయవాదుల ప్రభుత్వన్యాయస్థానాలను బహిష్కరించారు. పేరిచర్ల సుబ్బరాజు, మందలపర్తి తిమ్మరాజు, గొట్టముక్కల వెంకటపతిరాజు, చిటూరి ఇంద్రయ్య బోళ్ళప్రకాశం, మొదలగు 55 మంది గ్రామోద్యోగులు తమ పదవులకు రాజీనామా ఇచ్చారు.

విదేశీవస్త్ర బహిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా ఎంతో దీక్షతో కొనసాగించినది. అనేకమంది కాంగ్రెసు కార్యకర్తలు జిల్లా అంతా పర్యటించి గాంధీజీ ఆశయాలను ప్రచారం గావించి, విదేశీ వస్తాలను గుట్టలుగా వేసి తగులబెట్టారు. స్వదేశీ వస్తాలను వాడవలసినదిగా ప్రోత్సహించారు. సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రచారం చేసిన జిల్లాకు చెందిన ఏకైక స్త్రీ రత్నము మాగంటి అన్నపూర్ణాదేవి. జిల్లాలో అనేక ఖాదీ విక్రయశాలలు ప్రారంభించారు. ఖద్దరుధారణ, గాంధీటోపీ అహింసా వ్రతులకు సంకేతముగా గుర్తించబడింది. గాంధీ చిత్ర పటములు జిల్లా అంతా వ్యాపించాయి. అనేక మంది జనసామాన్యం కాంగ్రెసు నందు సభ్యులుగా చేరారు. నిర్మాణకార్యక్రమాలలో కూడా జిల్లాముందంజ వేసింది. ఉద్యమకారులు ప్రభుత్వన్యాయస్థానాలు బహిష్కరించి వాటి స్థానే పంచాయితీ కోర్టులు స్థాపించారు. కుముదవల్లి, శృంగవరము, పురుషోత్తమపల్లి, మట్లపాలెం మున్నగు గ్రామము లలో పంచాయితీ కోర్టులు స్థాపించి వివాదములను గ్రామములందే పరిష్కరించారు. పంచముల అభివృద్ధికై అనేక కార్యక్రమాలు చేపట్టబడినవి. అనేక పాఠశాలలను స్థాపించారు. వారిలో విజ్ఞానాన్ని పెంపుదలచేయుటకు సభలను నిర్వహించారు. ఉమర్ OMV ఆలీషా, దండు నారాయణరాజు, వెల్లంకి కృష్ణమూర్తి, మంత్రిప్రగడ మార్కండేయులు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

వంటి నాయకులు, నరాలశెట్టి దేవేంద్రుడు, రాయిడు గంగయ్య, అత్తిలి సూర్యనారాయణ, గొట్టముక్కల వెంకన్న మొదలుగు హరిజన నాయకులతో కలసి జిల్లా అంతా హరిజనోద్యమ కార్యక్రమాలు, అస్పృశ్యతా నివారణ సభలు, మద్యపాన నిషేధప్రచార సభలు నిర్వహించి, హరిజనులలో ఆత్మస్టెర్యాన్నినింపారు. జిల్లా వివిధ తాలూకాలలో కల్లు పాటలు జరుగకుండా నివారించారు. మద్యపానము వలన కలిగే అనర్గాలను ఉపన్యాసముల ద్వారా, నాటకముల ద్వారా, కరపత్రముల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. గాంధీజీ పర్యటన వలన జిల్లా ప్రజానీకంలో నూతనచైతన్యం ఏర్పడినది. ఆయన భగవంతునిగాను, ఆయన వాక్కు దైవ వాక్కుగా భావించారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు తీసిపోనివిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఉన్నతస్థాయిలో జరిగింది. గాంధీజీ సందర్శనతో స్పూర్తినొంది దండు నారాయణరాజు, ఆత్మకూరి గోవిందాచారి మొదలగు నాయకులు గాంధేయవాదులై జాతీయోద్యమంలో ప్రవేశించి జిల్లాలో శాంతియుత, అహింసా విధానాల ద్వారా ఉద్యమాన్ని నడిపించారు.

බුදුහිරිපථ

 :

1. ఆంధ్రపత్రిక, ఏప్రియల్ 7, 1921. గురువారము, పే-6, కా-1.

2. పే-6, కా=1&2

3. తల్లాప్రగడరామారావుకి మహాత్ముని ఉపదేశములు, (జీవిత సంగ్రహము), జన్మభూమి గ్రంధమాల, మచిలీపట్నం, 1922 పే- 112 & 113 మరియూ ఆంధ్రపత్రిక, ఏప్రియల్-7, 1921. గురువారము, పే-6, కా-2

4. ఆంధ్రపత్రిక– ఏప్రియల్-7, 1921. గురువారము, పే-6, కా-2

5.ఆంధ్రపత్రిక- ఏప్రియల్ 11, 1921, సోమవారం, పే-8, కా-2

6. ఆంధ్రపత్రిక-ఏప్రియల్ 6, 1921. బుధవారం, పే-9, కా-3 మరియుపే-10,కా-1.

7. Young India, April 9, 1921. & eso(5.635, 33 dóe5 16, 1921.

శనివారము, పే-7 పేజీ పూర్తి