పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము/ఖద్దరుయాత్ర 1929

వికీసోర్స్ నుండి



3. ఖద్దరు యాత్ర 1929

సహాయనిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమము సంయుక్తముగా నిర్వహించ బడుతున్నప్పటికీ హిందూ, ముస్లింల మధ్య మతకల్లోలాలు ప్రారంభమైనవి. 1921 ఆగష్టులో మలబారు ప్రాంతములో మెప్లా అనే ముస్లిం తెగవారు బ్రిటీషు వారినే కాక అనేక మంది హిందువులను కూడ చంపారు. 1922 ఫిబ్రవరి, 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ జిల్లా యందలి చౌరీచౌరాలో ప్రభుత్వ దమననీతితో కోపోద్రిక్తులయిన కొందరు ప్రజలు పోలీసు స్టేషనుపై దాడిచేసి ఒక సబ్ ఇనస్పెక్టరును, ఇరవై ఒక్కమంది కానిస్టేబుల్లను సజీవదహనం చేశారు. ఉద్యమం హింసాయుతంగా మారటంతో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని విరమించటంతో ముస్లిం, కాంగ్రెస్ వర్గాలన్నింటిలోను, ప్రజలలోను తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఇట్టి స్థితిలో అదను చూసి ప్రభుత్వం మహాత్ముని 1922 మార్చిలో అరెస్టుగావించి ఆరుసంత్సరాలు శిక్ష విధించింది. కాని గాంధీజీని అనారోగ్యకారణములపై 1924 ఫిబ్రవరిలో విడుదల చేసింది.

1924 లో గాంధీజీ యర్రవాడ జైలునుండి విడుదలైనప్పటి నుంచీ ఆంధ్రదేశ నాయకులు ఆయనను తమ రాష్ట్రానికి రావలసినదిగా ఆహ్వానిస్తూ వచ్చారు. కాని ఆయన ఏవో కొన్ని పరిస్థితులలో ఆంధ్రదేశానికి రాలేక పోవటం జరిగింది. ఆంధ్రనాయకులలో కొన్ని భేద భావాలు కలగటం ఆంధ్రులలో బహునాయకత్వం ఉందని గాంధీజీ విమర్శించటం కూడ జరిగింది. అందుచే గాంధీజీ ఆంధ్రరాష్ట్రాన్ని బహిష్కరించారా! అనే అపోహకూడ కొంతమంది ఆంధ్రులకు కలిగింది. ఆ భావాన్ని తొలగించేందుకు గాంధీజీ 1927 జూన్ 16వ తేదీ 'యంగ్ ఇండియా' లో ఈ విధంగా వ్రాశారు." విూ సంచార కార్యక్రమములో ఆంధ్ర రాష్ట్రం సంగతి కనబడటం లేదు అందుచే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని బహిష్కరించారా? అని చాలామంది నన్ను అడుగుతున్నారని కొండా వెంకటప్పయ్య గారు నాతో అన్నారు” “ఆంధ్రులపై నాకుగల చిరకాలప్రేమ వలన వారికీ నాకు ఉన్న సంబంధమును నేనెన్నటికీ మరువలేను. కొంతమంది ఆంధ్రులు నన్ను విసిగిస్తూన్నప్పటికీ, నేను ఆంధ్ర దేశమును బహిష్కరించవలెననుకొన్నా బహిష్కరించలేను. ఆంధ్రులు చాలామంచివారు. వారికి మిక్కిలి దేశాభిమానం ఉంది......... ఈ పర్యాయము SLSSLSLSSLSLSSLSLSLSLSLSLSLSLSLSLSLS —-పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము e3OC5 రాష్ట్రములో ఖద్దరు విషయములో మాత్రమే పని చేసానని కూడ వారు తెలుసుకొనవలెను. అస్పృశ్యతానివారణ కూడ నాకు ముఖ్యమయినదే కాని అదికూడ ఖద్దరు කරඹඑ* ඩීටිෆිෆාටයි. බීරධිපත්‍ය, గొప్ప వారు అనే భేదములను తొలగించి ဂိöö§ సమత్వం కలిగించటమే ఖద్దరు వలన కలిగే ముఖ్యప్రయోజనము. నూలుదారము పేదల గుడిసెలలో నుండి ధనికుల మేడలలోనికి వ్యాపించి ధనికులను, పేదలను విడిపోకుండ బంధించగలదు.” 1 గాంధీజీ 1927, డిశంబరు 2 నుండి 7 వరకూ గంజాం జిల్లాలో సంచారం చేశారు. వారు మద్రాసు నుండి గంజాం జిల్లాకు పోతూ మధ్యలో బెజవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, గోదావరి మీదుగా వెళ్ళారు. అన్ని స్టేషనులలోను వేలకొలది జనం ఆయనను సందర్శించినారు. ఏలూరు నందు పది వేల మందికి పైగా రైల్వేస్టేషనుకు వచ్చి గాంధీజీ ఖద్దరు నిధికి కానుకలు సమర్పించుకొన్నారు. తదుపరి 1929 ఏప్రియల్లో జరుగనున్న తన ఆంధ్ర దేశసంచారమును గురించి గాంధీజీ “యంగ్ ఇండియా లో ఇట్లు వ్రాశారు. “నా ఆధీనములోలేని అనేక పరిస్థితుల వలన ఆంధ్రదేశ మిత్రులను నేను పదేపదే నిరాశపర్చవలసి వచ్చింది. అందులకు వారు నన్ను క్షమించవలెను. నాకువీలు కలిగినట్లయితే ఇంతకుముందే నేను ఆంధ్రదేశానికి వచ్చేవాణ్ని నేను ఏప్రియల్ నెల ప్రారంభంలో ఆంధ్రదేశానికి రాగలనని అనుకొంటున్నాను. బొంబాయి నుండి ఏప్రియల్ 5, 6 తేదీలలో బయలుదేరగలను. ఆంధ్రదేశంలో ఒకనెల మాత్రమే సంచరించగలను. ఇంకా ఎక్కువ కాలము ఆంధ్రదేశంలో ఉండవలెనని తలంపు ఉన్నది కాని వీలుపడదు. ఈ పర్యాయము నేను పూర్తిగా ఖాదీ కోసమే పర్యటించుచున్నాను. లాలాలజపతిరాయ్ స్మారక నిధికి కూడా విరాళాలు స్వీకరిస్తాను. వీటికన్నా ööဃသ္မန္တဝf\° కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమాలను, విశేషించి కాంగ్రెసు వర్మింగు కమిటీ వారిచే పేర్కొనబడిన బహిష్కార ప్రణాళికను గురించి తీవ్ర ప్రచారంచేయ సంకల్పించాను. ఆంధ్రులు సన్ననూలు వడకుటకు ఎక్కువ కృషి చేయాలి. నూలు ఉత్పత్తి చేయుటకు వారికి అంతులేని శక్తి సామర్థ్యములున్నాయి. కావలసినంత ప్రత్తి పండుతుంది. వారికి సమర్ధులయిన కార్యకర్తలు న్నారు. ఆంధ్రులు దేశభక్తిలో ఏ రాష్ట్రానికి తీసిపోరు. కాని వారిలో నాయకులు ఎక్కువ అనుచరులు తక్కువ. వారి öööရွှဗ်”ခေါ်သဒ္ဒဎ శక్తిసామర్ష్యాలు చిన్న చిన్న అసూయలను, చిల్లరి తగాదాలను ప్రోత్సహిస్తున్నాయి. నేను ෂටර් ධීජඣ వచ్చేసరికి అందరూ కలిసిమెలసి అణకువగా ఉండగలగడం వారి శక్తికి మించిన పని అని నేను పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

అనుకోను. ఆంధ్ర దేశానికి సంబంధించి నంతవరకు నా పర్యటనలో ఖద్దరు ఉత్పత్తికోసం విరాళములు సేకరించదలచాను. ఉత్సాహవంతులయిన కార్యకర్తలందరూ నా పట్ల దయకలిగి ఉండవలెను.

మహాత్ముని ఆంధ్ర దేశ పర్యటన హైదరాబాద్ నుండి ప్రారంభమైనది. 1929 ఏప్రియల్ 6వ తేదీ సాయంత్రము హైదరాబాదు చేరారు. నాటి నుండి ఏప్రియల్ 22 వ తేదీ వరకు హైదరాబాద్, జగ్గయ్య పేట, నందిగామ, నూజివీడు, బెజవాడ, ఉయ్యూరు, కపిలేశ్వరపురం, ఎలకుర్రు, గుడివాడ, దివిసీమ, కొడాలి, మచిలీపట్నం, గుంటూరు, తిమ్మసముద్రంలందు సంచారము గావించి బెజవాడ చేరి అచ్చటనుండి పశ్చిమగోదావరి జిల్లా సందర్శనకై బయలుదేరారు.\

"సత్యాగ్రహి' పత్రిక గాంధీజీ పశ్చిమగోదావరి జిల్లా రాకను పురస్కరించుకొని ఇట్లు ప్రకటించినది. మహాత్ముని సంచారమున ప్రజలు గమనింప వలసిన కొన్ని ముఖ్య విషయములు.\

"1. మహాత్ముడు మీటింగులోనికి వచ్చునప్పుడు గాని, మీటింగు నుండి వెళ్ళనప్పుడు , "మహాత్మాగాంధీకీ జై' అనిగాని, 'వందేమాతరం’ అనిగాని కేకలువేయుచు ధ్వని చేయరాదు.

2. మహాత్ముడు సభకు వచ్చుటకు పూర్వమే జనులందరూ ప్రశాంతముగ సభలో కూర్పునియుండవలెను. మహాత్ముడు ప్రవేశించునప్పుడు סחk(, $(& వెళ్ళునప్పుడుగాని సభికులు వారివారి స్థానములనుండిలేవరాదు.

3. ప్రజలు వచ్చుటకు ఒక మార్గము, వెళ్ళటకు 5ూక్ష మార్గము సభలో ఏర్పరచి స్వచ్ఛంద సేవకులు ఇరువైపుల నిలబడవలెను.

4. మహాత్మునికి పూలమాలలు వేయుటకుగాని, పాదములపై పడుటకుగాని ప్రయత్నించరాదు.

5. ప్రశాంతముగా, ఆయనకు ఏ విధమయిన ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించవలెను." *

ఏప్రియల్ 23వ తేదీ మంగళవారం గాంధీజీ ఆయన సహచర బృందము బెజవాడ నుండి పశ్చిమగోదావరి జిల్లాకు బయలు దేరినారు. సరిగా ఉదయం 7.30 ని| పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించారు. జిల్లా బోర్డు ప్రసిడెంటు పెన్మత్స పెద్దిరాజు తన బృందముతో గాంధీజీకి ఎదురేగి ఆహ్వానించారు. పెరికేడులో మహాత్మునికి రూ. 100/- నగదు, కొన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ఆభరణములు సమర్పించబడ్డాయి. వసంతవాడయందు సన్మాన పత్రంతో పాటు రూ. 602/- ఖద్దరునిధికి చేకూరింది. మహాత్ముడు కొక్కిరిపాడునందు ఉన్న 40 చేనేత మగ్గముల వారిని ఖద్దరునే నేయవలెనని కోరారు. అందరూసమైక్యంగా ఉండవలెనని, త్రాగుడు మానవలెనని, ఖద్దరును ధరించవలెనని బోధించారు.

తరువాత గాంధీజీ నాయుడుగూడెం వెళ్ళారు. అక్కడ గారపాటి సాంబయ్యగారి కుమార్తె 21 సం||లు గల బాలవితంతు శ్రీమతి ఎలమంచిలి సత్యవతమ్మ రూ. 1400/- విలువ గల తన 100 కాసుల బంగారు అభరణములను గాంధీజీకి సమర్పించి, గాంధీ ఆశ్రమంలో ఉండటానికి అనుమతినివ్వవలసినదని గాంధీజీని ప్రార్ధించింది. గాంధీజీ అందుకు వెంటనే అంగీకరించారు. ఆమె భర్త ఎలమంచిలి వెంకటరామయ్య చెన్నపురి యందు ఇండియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చదువుతూ 1928లో শুতি-তৰ্পং০ওঁ* మరణించారు. ఈ పర్యటన ముగిసిన తదుపరి ఆమెను ఆశ్రమమునకు పంపగలమని ఆమెతల్లిదండ్రులు చెప్పారు.

తరువాత గాంధీజీ పెదపూళ్ళ వెళ్ళి ఆ గ్రామసుల సన్మానపత్రంతో పాటు రూ. 1116 /- ఖద్దరు నిధి స్వీకరించారు. అక్కడ పెద్దబహిరంగసభలో ఉపన్యసించారు. 89 ఉపన్యాసంలో ఖద్దరును ఉత్పత్తి చేయమని, ధరించమని బోధించటంతోపాటు యలమంచిలి సత్యవతి నగలను ఖద్దరునిధికి ఇచ్చటను, ఆమెత్యాగశీలతను ప్రశంసించారు. ఆమె దయనీయ జీవితాన్ని గూర్చి జాలికరంగా మాట్లాడుతూ, ఆమె పైూషాలో ఉన్నదని, ఫెూషా తొలగించవలెనని, ఆమెకు అంగీకారమయిన పునర్వివాహము చేసుకొనుటకు అనుమతించవలెనని కోరారు. భార్యచనిపోయిన భర్త వివాహం చేసుకొంటున్నప్పుడు, భర్తచనిపోయిన భార్య తిరిగి ఎందుకు వివాహం చేసుకొనరాదని ప్రశ్నించారు. వితంతువుగా ఉండి బ్రహ్మచర్యం అవలంబిస్తే మంచిదే కాని నిర్బంధ బ్రహ్మచర్యం ఎంత మాత్రం తగదని అన్నారు. నీ ఉపన్యాసం అనంతరం దండు నారాయణ Ο ορΣο విదేశీవస్తాలను పోగుచేసి గుట్టగావేసి దగ్ధంచేశారు.

Yeo68 అచ్చటనుండి పనుకొల్ల, కలపర్రుమీదుగా వటూరు చేరారు. ఆయా (6੦ ప్రజలు ఖద్దరు నిధికి రూ.100/- రూ. 140/- రూ.516/- సమర్పించారు. గాంధీజీ వటూరునందు తన మెడలో వేసిన ఖద్దరు దండను వేలం వేయగా రూ. 16/–లకు ఒకరు కొన్నారు. ఉ| 10-30 నిuలకు (Yeටඨිසී ಬೃ೦ದಿ೦ ఏలూరునందలి గాంధీజాతీయ పాఠశాల'కు చేరుకున్నారు. విద్యాలయ ప్రాంగణంలో రెండు తాటిఆకుల కుటీరములు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

నిర్మించబడినవి. వాటికి ఎదురుగా మామిడి ఆకుల తోరణములతోను, ఖద్దరు త్రివర్ణ పతాకములతోను అలంకరించబడిన రెండు పందిళ్ళ వేయబడెను. అందు ఒకటి గాంధీ కుటీరము, కార్యాలయము. రెండవది కసూరిబాయికి, కూడ వచ్చిన వారికి ఏర్పాటు చేయబడెను. మిగిలినవారికి విద్యాలయ ప్రాంగణంలో బస ఏర్పాటుచేసిరి.

సుమారు రెండు వేలమంది ప్రజలు అచ్చట గాంధీజీకి స్వాగతం చెప్పారు. గాంధీజీ సందర్శించిన అన్ని గ్రామములందు ఆయనకు అఖండ స్వాగతం లభించింది. కొన్ని గ్రామములందు గాంధీ దంపతులను పూలమాలతో సత్కరించి, పూజలు గావించారు. గాంధీజీతో కారులో ఉన్న దేశభక్త కొండా వెంకటప్పయ్య గాంధీజీ ఉపన్యాసాలను అనువదించి చెప్పేవారు. దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు, దండు నారాయణరాజు, ఆత్మకూరి గోవిందాచారి పెన్మత్స పెద్దిరాజు, 2OOO వియ్యన్న పంతులు గాంధీజీ కారుకు మార్గాన్ని చూపుతూ ముందు కారులో ప్రయాణించేవారు. 7 జిల్లాయందు గాంధీజీ యాత్రలో లంకలకోడేరు వాస్తవ్యుడగు సయ్యపురాజు వెంకటరాజు గాంధీజీకి అంగరక్షకునిగా వ్యవహరించారు

గాంధీజీ మధ్యహ్నం 3 గం. ల వరకూ రాట్నముతో నూలువడకుచూ ఇష్టాగోష్టి జరిపారు. జాతీయ పాఠశాల ప్రిన్సిపల్ వేమూరి రామకృష్ణారావు విద్యావిధానమును గూర్చి గాంధీజీతో చర్చించారు. ఖద్దరు వ్యాపకమును జిల్లాలో అభివృద్ధి చేయుటకై ఎక్కువగా చర్చించారు. సాయంత్రము గాంధీజీ కార్యక్రమము ఎంతో వత్తిడికి గురైంది. 5 గం. లు అయ్యేసరికి జనం క్రిక్కిరిసి పోయి విద్యాలయం వద్ద గాంధీజీ కారుకదులుటయే కష్టమైంది. కాలువ రోడ్డుపై ఫర్గాంగువరకు ఇసుక వేసినరాలనంత జనసందోహం గుమిగూడారు. ఎంతో కష్టముగా పయనించి సాయంత్రం గం. 5.55ని.లకు గాంధీజీ "శ్రీమతి అన్నపూర్ణాదేవి బాలికల పాఠశాల"కు, అచ్చటనుండి పురమందిరమునకు వెళ్ళారు. అచ్చట సమావేశమయిన రెండు వేలమంది స్త్రీలను ఉద్దేశించి ఐదు నిమిషములు ఉపన్యసించారు. 'మీరు ఖద్దరు చీరలను కట్టండి. నాడు స్వర్గీయ అన్నపూర్ణాదేవి, నేడు ఎలమంచిలి సత్యవతి ఒసంగినట్లు మీ నగలను విరివిగా ఖద్దరు నిధికి సమర్చించండి. స్త్రీలకు నిజమయిన భూషణ మెట్టిదో సీతాదేవి చరిత్ర’ చదివిన స్పష్టమగుతుంది. మీరు ఆభరణములు ఇవ్వదలచుకొనిన ఇప్పడే ఇచ్చివేయండి'కి అని ఉద్బోదించారు. కాలాతీతమగుటచే గాంధీజీ ఉపన్యాసాన్ని తగ్గించి, ధనము, ఆభరణములను వసూలు చేయించారు. తాడేపల్లి సత్యవతీజయదేవి రూ.100/- బలుపూడి సుందరమ్మ బంగారు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

జత గాజులు, భాగవతుల లక్ష్మీనరసమ్మ బంగారు కంఠమాల ఇంకా చాలా మంది ఖద్దరు నిధికి సమర్పించారు.

ఏలూరులో బహిరంగ సభ

సాయంకాలము 6.35 ని! మైదానములో గాంధీజీ పెద్ద బహిరంగ సభలో సంగ్రహముగా ఉపన్యసించారు. వివిధ సంఘములవారు స్వాగత పత్రములు సమర్పించారు. స్వచ్ఛంద సేవకులు ఏలూరు పౌరులతరపున స్వాగత పత్రము, ఆంధ్ర చిత్రకళా పరిషత్తు చిత్రకారులు తాము వేసిన చిత్రరూపాలు బహూకరించారు.

ఏలూరు పౌరుల స్వాగతపత్రము

శ్రీయుత మొూహన్దాస్ కరంచంద్ గాంధీగారికి,

ఆర్యా !

1. పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య స్థానమగు ఏలూరు పురవాసులమైన మేము మా పురాతన నగరమున తమకు హృదయ పూర్వకమైన స్వాగత మొసంగుచున్నాము.

2. మా పురపాలక సంఘము, ఒక సంవత్సరకాలము నిర్జీవావస్థ యందుండిన పిదప ఇటీవలనే పునర్నిర్మాణమయ్యెను. ప్రథమ సమావేశము జరుపు కొనకుండ సివిలు కోర్డుచే మొన్ననే నిరోధించబడుటచే తమకు అర్జరీతిన స్వాగతమిచ్చు మహాభాగ్యము నకునోచుకోనందుకు విచారించుచున్నాము.

3. తమరు వెనుక ఏలూరు పురమునకు వచ్చిన నాటినుండియు జాతీయ పునరుజ్జీవనమునకై తాము చేయుచున్న కృషియందెల్ల మేము యధా శక్తిని పాల్గొను చునేయున్నాము. మాపురమందలి గాంధీ మహావిద్యాలయము తమ ఎడలను, తమ సిద్దాంతములందును మూకుగల పరిపూర్ణ విశ్వాసమును సూచింపగలదని వినయముగా మనవి చేయుచున్నాము. -

4. 1921లో తాము ప్రారంభించిన మహోద్యమము నిరాంటకముగా కొనసాగి మన గమ్యస్థానమగు స్వరాజ్యమును బడయునుగాక అని హృదయపూర్వకముగా నభిలషించుచున్నాము. భారత జాతీయ ఉద్యమమును మేము త్రికరణ శుద్ధిగా දිරියළුටඩ්ටඩ් ఎట్టి కష్ట నిష్కరములకును వెనుదీయక తమయాజ్ఞకు బదులమైనడువగలమని వక్కాణించుచున్నాము.

5. మహాత్మా! వేుము తమ్మును స్తోత్రము చేయబూనలేదు. ఐననూ పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

హృదయాంతరాళములందలి ఒక్క భావమును మాత్రము వెలిబుచ్చుటకు తమయనుజ్ఞ వేడుచున్నాము. తాము తమ గంభీర సత్య ప్రేమసాధనముచే అనుపమానమగు ఆత్మోన్నతిని, దివ్యశక్తినిగడించి, విశ్వజగత్తు యొక్క అందు ముఖ్యముగా భారతీయులయొక్క గౌరవమును విధేయతను చూరగొంటిరి.

6. ప్రియమైన మనమాతృ దేశమును విదేశదాస్యమునుండి విముక్తి నొందించి సత్వరస్వరాజ్యస్థాపన యొనరించునట్లు భగవానుడు తమకు బలమును, శక్తిని అనుగ్రహించు గాక అని ప్రార్థించుచున్నాము.

- ఏలూరు పురవాసులు

" కొండా వెంకటప్పయ్య అనువాదము చెప్పచుండగా, గాంధీజీ తన ఉపన్యాసములో మీరు నాకు అనేక స్వాగత పత్రములు, ఖద్దరు నిధికి ధనమును ఇచ్చినారు. అందులకు నా వందనములు. నేను ఏలూరు వచ్చినప్పడు తీరని దుఃఖముకలిగింది. దానిని వెలిబుచ్చక ఉండలేను. అదేమనగా స్వర్గసురాలయిన ಅನ್ನಿಪು'ರಾದೆವಿನಿ నేను ఈ రోజున మీ మధ్య చూడజాలక పోవుటయే. నేను బెజవాడ సభలో నున్నప్పుడు (1921 సం||లో) ఆమె నన్ను చూచి కాపాడింది. ఆ సంఘటనను నేనెన్నడూ మరిచిపోలేను. అప్పడే ఆమె తన సర్వ ఆభరణములు తిలక్నిధికి ఇచ్చివేసింది. নত০55 జ్ఞాపకమున్నంత వరకూ తన విలువైన ఆభరణములన్నింటినీ 'తిలక్ స్వరాజ్యనిధి' కి సమర్పించిన ఏకైక భారతీయ మహిళ అన్నపూర్గాదేవి. అప్పడు నాకు గలిగిన పరమానందము చెప్పలేను. నాటి నుండి మరణించేంత వరకూ ఆమె ఎన్ని కార్యక్రమములు చేసినదో చెప్పలేను. భారత దేశంలో అదృష్టవశాత్తు నేను అనేకమందిని కుమార్తెలుగా భావిస్తూన్నాను. ఈమె నా బిడ్డలలోకెల్లా ఉత్తమురాలు. తన భర్త అమెరికాలో ఉన్నప్పటికినీ હ9ઠo తనపట్టుచీరలు, విదేశీవస్తువులు నన్నింటినీ విసర్జించుట సామాన్యమైన పనిగాదు. ఆమె దేశాభిమానము, త్యాగశీలము వర్ణింపనలవికాదు. మీరు నిజముగా ఆమెను ఆదర్శంగా తీసుకొన్నట్లయితే ఎన్నటికీ ಖಡೆಶಿ వస్త్రములు ధరింపరు. నేను ఏలూరు వచ్చుచున్నప్పుడు అనేకులు ఖద్దరు ధరించుట నేను చూడలేదు. ఎవరైతే విదేశీ వస్తాలు ధరించినారో వాటిని విడనాడి ఖద్దరు ధరించవలెనని ప్రార్థించుచున్నాను. అస్పృశ్యతను మీరు విడనాడండి. అన్నపూర్ణ జన్మించిన ఈ ప్రదేశములో ఆమెను మీరు స్మరించుచున్నట్లయితే అస్పృశ్యతను విడనాడుదురుగాక. కొందరు అస్పృశ్యులునావద్దకు వచ్చారు. వారికిని మీకును భేదములున్నట్లు నాకు కనిపించలేదు. భాషలో కూడ వారికి, మీకు భేదము కన్పించలేదు. మీలోవలెనే వారిలో SLSLSCSLSLMLSSLSLSSLSLS -పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

కూడ కొందరు భాగ్యవంతులు ఉన్నారు. వారు కూడ సుఖముగనే ఉన్నారు. పండితమదనమోహనమాలవ్య గారి పాఠశాలలో ఒక పంచమబాలుడు నాతో “దేవాలయములో ఒక బల్లకట్టియున్నది. దానిపై ಏ೦ಏಮಿಲು, మహ్మదీయులు, క్రైస్తవులు రాకూడదు అనియున్నది." అని అన్నాడు. " ఎవరైతే ఈ బల్ల కట్టియున్నారో వారిని రాకూడదని ఆమహానుభావుడు పరమేశ్వరుడు లిఖించియున్నాడు. ఆయన ఏమి చెప్పచున్నాడనగా ఎవరైనా ఒకరిని అంటరానివానిగా భావించిరో ఆహృదయములో నేను

పలూరునందు బహిరంగ సభ, 1929

ఉండను. కనుక దేవాలయధర్మకర్తలతో ఒక విషయము చెప్పచున్నాను. ఇప్పడే, నేడే ఆబోర్డులను తీసివేయవలెను, కొందరు పంచములు చెప్పిరట మేము ఆ మందిరములకు పోము, కాని అట్టి బల్లకట్టినవారు మాపై దోషారోపణము చేయుచూ బల్ల కట్టినందుచేత సిగ్గుపడుచున్నాము. కనుక అట్టి అవమానకరమైన బల్లలను తీసివేయవలెను. కల్లుసారాయి త్రాగువారు, మతుపదార్ధములు ఉపయోగించువారు తమ దురభ్యాసములను మానివేయవలెను. ఇది కాంగ్రెసు యొక్క శాసనము. దానిని అమలుచేయవలసియున్నది." అని పేర్కొన్నారు. సభనందే గాంధీజీ ఏలూరు తాలూకా ඪ*තු నుండి రూ. 1,116/– పశ్చిమ గోదావరి జిల్లా బోర్డు నుండి రూ.116/- ఏలూరు పౌరులనుండి రూ. 8,000/- ఏలూరు తాలూకా విద్యార్థి సంఘం నుండి రూ. 191/- ఖద్దరు నిధికి విరాళాలు స్వీకరించారు. రాజామంత్రిప్రగడ భుజంగరావు గాంధీజీకి నూలు కండెలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము- SSSSSSSSSSSSSSSSSS

తరువాత గాంధీ సాయంత్రం 7గం|లకు ఏలూరు సమీపమునందలి చాటపర్రు గ్రామానికి వెళ్ళారు. అచ్చట రూ.900/-డబ్బు సంచిని గ్రామస్తులు (YPටඨිසීෂී ෂටරඹීපෙරය. ( \ට්ටඨිසී చిరునవ్వుతో అది వెయ్యినూట పదహార్లు మొత్తం చేయక పోతే సత్యాగ్రహం చేస్తానన్నారు. మాగంటి సుబ్రమణ్యంగారి కుమారై శ్రీమతి ఎర్నేని ఇందిరా దేవి అమిత ఆనందముతో రూ. 116/– గాంధీజీకి స్వయంగా ಇವಲ್ಟರು. గాంధీజీ ఆమెను 'అమ్మా స్వదేశాభివృద్ధికి కష్టపడగలవా" అని అడుగుగా ఆమె అత్యుత్సాహముతో తన పతి ఆజ్ఞానుసారం సంసిద్దురాలనని పలికినది. గాంధీజీ కోరిన మొత్తం రూ.1.116/- పూర్తి అగుటతో రాత్రి 8గం|లకు తిరిగి ఏలూరు చేరారు. 11 ఏప్రియల్ 23వ తేదీన వసూలైన మొత్తం రూ. 8,990/- మరియూ రెండు వేల రూపాయల విలువైన నగలు కూడా ఖద్దరు నిధికి చేకూరాయి. మాగంటి బాపినీడు తనవివాహం రోజున అన్నపూర్గాదేవి తన వేలికి అలంకరించిన ఉంగారాన్ని కూడా గాంధీజీకి సమర్పించారు.

ఏప్రియల్ 24వ తేదీ ఉదయం మబ్బులు వేసిన చల్లగాలిలో ఏలూరుకు 16 మైళ్ళు దూరాన ఉన్నచింతలపూడి తాలూకాలోని ధర్మాజీగూడెమునకు గాంధీజీ వెళ్ళారు. అచ్చట గాంధీజీకి పరిసర గ్రామస్తులు, స్థానిక కో-ఆపరేటివ్ యూనియన్వారు సన్మానపత్రం సమర్పించారు. ఆ సన్మానపత్రాన్ని వేలం వేయగా ఎనిమిది రూపాయలు వచ్చాయి. ఒక స్త్రీ రూ.30/- విలువగల నాగరాన్ని ఇచ్చినది. ఖద్దరు నిధికి ఆసభలో రూ. 1116/– చేకూరాయి. గాంధీజీ ఆ సభలో ఖద్దరు, వివిధ వర్గాల ఐకమత్యము, అస్పృశ్యతా నివారణము, మద్యపాన నిషేధములపై ఉపన్యసించారు. ఏలూరు నుండి ధర్మాజీగుడెం వెళ్ళెడి మార్గమునందున్న శనివారపు పేట గ్రామస్తులు సన్మానపత్రాన్ని రూ. 154/– ఖద్దరు నిధిని సమర్పించారు. విజయరాయ్లో రూ.119/-, నడుపల్లిలో రూ.316/– ఖద్దరునిధి చేకూరింది. 14 తరువాత తిరిగి ఏలూరు గాంధీ జాతీయ విద్యాలయమునకు చేరుకొన్నారు. సాయంత్రం 3గం| వరకు అచ్చట విశ్రాంతి తీసుకొన్నారు. తదుపరి తనను చూడవచ్చిన దివాన్ బహదూర్ మోచర్ల రామచంద్రరావు పంతులు గారితోను, పెద్దలు, కార్యకర్తలతోను ఒక గంట ముచ్చటించారు. ఆ సందర్భములో "విదేశీ వస్త్రములు ధరించిన బాలబాలికలను బడికి రానీయవదు. ప్రభుత్వము నుండి ఏవిధమయిన ధనసహాయము విద్యాలయము పొందరాదు. ఏ సందర్భము నందునూ ప్రభుత్వం టెక్నికల్ పరీక్షలకు ವಿದ್ಯೇಯ್ದಿಲು వెళ్ళుటకు అనుమతినీయరాదు. స్వతంత్ర వృత్తితో జీవించుటకు పనికివచ్చు వృత్తి విద్యలు నేర్పవలెను" అని వివరించారు. కొందరి ప్రశ్నలకు జవాబుగా పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిచువారును, విదేశీ వస్త్రములు ధరించువారును పాలకవర్గ సభ్యులుగా నుండరాదు అని పేర్కొన్నారు.

సాయంత్రం 5 గం|లకు పాకీవారి పిల్లలు కొందరు తమ ఉపాధ్యాయునితో కలసి గాంధీజీ సందర్శనకై వచ్చారు. వారంతా చక్కగా పరిశుభ్రముగా ఉన్నారు. గాంధీజీ ప్రేమతో వారిని పలుకరించి కష్టసుఖాలు తెలుసుకొని వారికి మిరాయిలు పంచిపెట్టారు. జాతీయ పాఠశాల పాలకవర్గ సభ్యులను రప్పించి విద్యాభివృద్ధిని గూర్చి ప్రసంగించిరి. ప్రభుత్వ సహాయములేకుండా స్వశక్తిపై విద్యాలయం ఆధారపడవలెనని, మంచి నియమ నిబంధనలతో విద్య నేర్పవలెనని, సంఖ్యతగ్గినా ఫరవాలేదు, విద్యా విలువలు మాత్రం తగ్గరాదని బోధించారు. 13

గాంధీజీ ఏలూరు వచ్చిన తరువాత క్షురకర్మకై ఖద్దరు కట్టిన మంగలి కావలెనని అన్నారు. 36 గం|లు దాటినా అట్టి మంగలి లభ్యంకాలేదు."మీరు ఖద్దరు ధరించిన మంగలి వారికి ఎక్కువ గిరాకీ ఉండేటట్లు చేయవలెను. అదే విధంగా వడ్రంగులు, చాకళ్ళు, ఇతరపని వాళ్ళ విషయంలోకూడా ఖద్దరు కట్టిన వారికే ఎక్కువగిరాకీ ఉండేటట్లు చేయండి. ఆ విధంగా ప్రజలలో ఖద్దరు వ్యాపకం చేయవలెను"అని గాంధీజీ కార్యకర్తలకు නි”ශිටඞටරය. పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

పోతునూరు

సాయంత్రం 5.30ని|లకు గాంధీజీ ఆయన అనుచరులు ఏలూరుకు 10 మైళ్ళ దూరంలో ఉన్న పోతునూరు గ్రామానికి బయలుదేరారు. రోడ్లు అన్నీ జనసందోహంతో క్రిక్కిరిసిపోయినవి. "గాంధీజీకిజై', "వందేమాతరం' నినాదాలు మిన్నుముట్టాయి. సంపన్నులయిన పోతునూరు గ్రామస్తులు గాంధీజీని ఆహ్వానించుటకు మనోహరమైన ఏర్పాట్ల గావించారు. పోతునూరు గ్రామంలో ప్రత్యేకముగా నిర్మించిన ఒక పందిరిలో నాలుగు వేలకు పైగా ప్రజలు సమావేశమైనారు. ఒక స్త్రీ ‘వివేకానంద గ్రంథాలయ నిర్మాణానికి కావలసిన ధనాన్ని ఇవ్వగలనని వాగ్గానం చేయటం వలన, దానికి పునాది రాయి వేసేందుకై (ಗ್ಮಿನ್ಡಲು గాంధీజీని ప్రార్థించారు. గాంధీజీ కూర్చుండిన కారులోనికి ఒక బొక్కెన, సున్నము, ఒక ఇటుక, తీసుకొని వచ్చి అందించారు. గాంధీజీ వెండి తాపీతో సున్నం తీసి ఇటుకపైవేసి పునాది వేసినట్టు ప్రకటించారు. గాంధీజీకి గ్రామస్తులచే రూ.2,000/- సమర్పించబడినవి. అందులో రూ.190/- లాలాజీ నిధికి కేటాయించ బడ్డాయి.

( \ලටඨිස් ඩීමටයි.ඒ” ఉపన్యసిసూ 'మీరు నాకు ఖద్దరు నిధికి కొంత నగదు, కొన్ని నగలు ఇచ్చారు. చాలా ఆనందము కాని మీరందరూ విదేశీ వస్త్రములను విసర్జించి ఖద్దరు కట్టండి. మీరు ఆవిధంగా చేస్తే డబ్బు వసూలు చేయవలసిన అవసమే ఉండదు. ఇక్కడ తాగుబోతులు ඒරිෆික්‍ෂත්‍රඡාබ්ඩුක්‍රි. కల్లు, బ్రాంది వంటివి తాగుడు భూతాలు. ఇక్కడ పంచములలో తాగినవానికి ఐదు రూపాయాలు జరిమానా విధిస్తారని ఇప్పడేవిన్నాను. అది భేషయినపని" అని అన్నారు. తరువాత అంటరానితనము అనే పాపకార్యమును విడనాడమని, బాల్య వివాహములు అనాగరికములని, స్వరాజ్య సంపాదనకు మీరు కృతనిశ్చయులైతే కాంగ్రెసు కార్యక్రమమును తప్పకుండా నిర్వర్తించవలసి ఉంటుందని ఉద్బోధించారు. తరువాత వెండి తాపీని వేలం వేయగా వచ్చిన రూ.80/- లు ఖద్దరునిధికి జమచేశారు.

కొవ్వలి

పోతునూరు నుండి గాంధీజీ తన అనుచరులతో సంపన్నమైన కొవ్వలి గ్రామానికి సాయంత్రం 6.30ని|లకు చేరారు. వడ్లపట్ల కొండయ్య, వెంకటరత్నం మొదలగు వారినాయకత్వంలో గ్రామస్తులు ఎదురేగి ఆయనను ఆహ్వానించారు. పురజనులు 'తిలక్ పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గ్రంధాలయం' తరపున రూ. 950/- సమర్పించారు. రాజవీధి నుండి గాంధీజీ వచ్చుచుండగా 80 సం|వృదురాలగు వల్లభనేని గంగమ్మగారు కారు తన ఇంటిముందు అపి రూ.116/- సమర్పించగా గాంధీజీ చిరునవ్వుతో స్వీకరించారు. గాంధీజీ గ్రామసభ యందు పదినిమిషములు విదేశీ వస్త్ర బహిష్కరణ, ఖాదీ ధారణనుగూర్చి ప్రత్యేకంగా బోధిసూ, కాంగ్రెసు కార్యక్రమములను విధిగా నిర్వర్తించవలెనని చెప్పారు. సభలో స్త్రీలు సమర్పించిన ఆభరణముల విలువ రూ.300/- వడ్లపట్ల మాణిక్యాలరావు గాంధీ దంపతులకు ఖద్దరు వస్త్రములు సమర్పించి వారి దీవెనలు పొందారు. వెలమాటి శ్రీమన్నారాయణ రూ.116/–, వడ్లపట్ల కొండయ్య, వెలమాటి దశరధరామయ్య, వడ్లపట్ల రామకృష్ణయ్య, వడ్లపట్ల వరఖలు కృష్ణయ్య ఒకొక్కరు రూ.50/- చొప్పన, మద్దిపాటి చినబసవయ్య, వెలమాటి రామచంద్రరావు, వెలమాటి రామదాసు, జిళ్ళెళ్ళి మూడి సింహాద్రి అప్పారావు మొlవారు ఒక్కొక్కరు రూ.25/- చొప్పున ఖద్దరు నిధికి సమర్పించారు. గాంధీజీ 7.15 నిuలకు కొవ్వలినుండి బయలుదేరారు.

ධීරයළුලෙරිය

గాంధీజీ సా|| 7.45 ని|లకు దెందులూరు చేరినారు. గ్రామస్తులు రు. 1,000/- కొన్ని నగలు ఖద్దరు నిధికి సమర్పించారు. సహకార సంఘము వారి సన్మాన పత్రాన్నిస్వీకరిస్తూ ఖద్దరు ఉత్పత్తి పెంచుటకు, ఖద్దరు ఎక్కువగా సరఫరా చేయుటకు సహకార ఉద్యమం తోడ్పడవలెనని ఉపన్యసించారు. స్వచ్ఛంద సేవకులు సభను చక్కని క్రమశిక్షణతో నిర్వహించారు.

గుండుగొలను

రాత్రి 8.00గంIలకు గాంధీజీ గుండుగొలను గ్రామం చేరారు. గ్రామస్తులాయనను ఎంతో ఉత్సాహంతో స్వాగతించారు. సుమారు రెండు వేలమంది సభకు హాజరయ్యారు. గాంధీజీ ఉదయం నుండి సంచారమునందు ఉండుటవలన బడలిక వలన మాట్లాడలేనని epr;8). గ్రామస్థలు పదే పదే కోరిన మీదట కారులో కూర్చుండియే ఖద్దరు ధారణ, విదేశీవస్త్ర బహిష్కరణలను గూర్చి మాట్లాడారు. పసులూరి కోదండ రామయ్యగారు ప్రజలను శాంతముగా ఉండాలని కోరారు. అప్పుడు ప్రోతలలో ఒకరు “ఖద్దరు చాలప్రియముగా ఉన్నది. అందువలన కట్టలేకుండా ఉన్నావ " అన్నారు. గాంధీజీ దానికి జవాబుగా "ఖద్దరు ఎంత ఖరీదయినా ప్రియంకాదు. మీకు సన్నిహితులు, ప్రేమ పాత్రులు అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

వారు ఎవరైనా ఖైదులో బంధించబడినప్పడు ఎంత ఖర్చు అయినప్పటికీ さye○○ విడిపించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కదా! అదే విధంగా పరప్రభుత్వ బంధనం నుండి దేశ స్వరాజ్యం సంపాదించవలెనని మీరు కోరితే ఎంతటి త్యాగమయినా చేయగలరు. అట్టిత్యాగనిరతితో ఖద్దరు ధరించండి. ఖద్దరు ప్రియమైనదని మీరనటం త్యాగం చేయకుండా స్వరాజ్యం సంపాదించవలెనని మీ అభిప్రాయమైనట్లు కనబడుతుంది. విదేశీ వస్తాలు చౌక అంటరా మీరు. అది ఊరకనే లభించినా స్వీకరించరాదు. దానివెనుక పరతంత్రమనే డు, మీ బలహీనత దాగి ఉన్నాయి. దానిని విసర్జించండి. మీ వస్తాల కోసం మీ స్వశక్తిపై ఆధారపడండి. ఏ సందర్భములోను మీ మాతృదేశంనుండి మీ సొమ్మ పరాయి దేశములకు పారవేయకండి" అని ఉద్వేగంతో ఉపన్యసించారు.

సమావేశం పూర్తిఅయిన తరువాత బాదర్వాడ శేషమ్మ పల్లెడ (రూ. 50/-), కొండ గంగమ్మ గాజులజత (రూ. 40/-), ఉనికిల ఈశ్వరమ్మ గాజులజత (రూ. 40/-), కొండ నాగమ్మ 2 సవరసులు (రూ.27/-), ఉమ్మా అన్నపూర్ణ ఒక గాజు (రూ.20/-), భోగరాజు కనక దుర్గమ్మ కొండ రామమ్మ, బరద్వాడ రామలక్ష్మీ దత్తాడ వెంకమ్మ ఒకొక్కరు ఒక ఉంగరము(రూ.20/-) చొప్పన సమర్పించారు. కొండ చిన్నమ్మ, మహదేవుని రాజేశ్వరమ్మలు 1/4 కాసు చొuన ఇచ్చారు. ధనరూపమున రూ. 1,116/- ఖద్దరు నిధి పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

చేకూంది. తదుపరి విదేశీ వస్త్రములను గుట్టగా వేసి తగులబెట్టారు. ఆరాత్రి గాంధీజీ భోగరాజు వీరవెంకయ్యగారి గృహమున నిద్రించారు. కొద్దిగా రాత్రి వర్షము కురిసినది.

తాడేపలిగూడెం

ఏప్రియల్ 25వ తేదీ ఉదయం గాంధీజీని తాడేపల్లిగూడెం తాలూకా బోరు అధ్యక్షుడు కలిదిండి గంగరాజు, ఆహ్వానసంఘం కార్యదర్శి శనివారపు సుబ్బారావు, జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డానజీర్ అహమ్మద్, తాలూకాబోర్డు ఉపాధ్యక్షుడు దావులూరి శేషగిరిరావు మహాత్ముని గుండుగొలనులో కలుసుకొన్నారి. వీరిని దండునారాయణరాజు గాంధీజీకి పరిచయము చేశారు. వీరందరూ తల ఒక నారింజపండు గాంధీజీ హస్తములందు ఉంచి నమస్కరించి తాడేపల్లిగూడెమునకు రావలసినదిగా ఆహ్వానించారు. గూడెములో జరుగబోవు కార్యక్రమ వివరాలను గంగరాజు గాంధీజీకి వ్రాసి ఇచ్చారు. పైవారందరూ శలవుతీసుకొని బయలుదేరెదము అనగానే గాంధీజీ నేను బయలుదేరుచున్నాను కలిసే వెళ్ళిదము అన్నారు. నజీరు అహ్మద్ మేముముందుగా వెళ్ళి కార్యక్రమము జయప్రదముగా జరుగుటకు ఏర్పాట్లచేసెదమని బయలుదేరి గూడెముచేరారు.

సభాస్థలి ఏర్పాట్ల బైర్రాజు రామరాజు, యద్దనపూడి సుబ్బారావు, పసల సోమయ్య నాయకత్వంలో సమర్థవంతంగా నిర్వహించబడింది. గాంధీజీ తన అనుచరవర్గముతోసహా తాడేపల్లిగూడెం 7గంIIలకు చేరినారు. దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ రాజమండ్రి నుండి గాంధీజీకి అభినందనలు సమర్పించేటందుకు SoéSooÖ విద్యార్థినులను తీసుకొని వచ్చారు. గాంధీజీని సన్మానించేందుకు ఏర్పాటుచేయబడిన మంటపమునందు ఆ బాలికలు గాంధీజీకి హారతి ఇచ్చారు. ఈ బాలికలు, స్థానిక విద్యార్థినులతో కలసిపాడిన దేశభక్తి గీతములతో సభ ప్రారంభమైంది.

గాంధీజీ ఆహ్వాన సంఘమువారేర్పరచిన వేదికపై కూర్చుండిరి. లైgూలూSం ಬೌಲ್ಡಿ వర్తక సంఘముల తరుపున కలిదిండి గంగరాజు, తాలూక గ్రామపంచాయితీ సంఘము తరుపున ఇందుకూరిసుబ్బరాజ్ఞు, కేసరీ సమాజ నాటక సంఘము తరుపున మాచిరాజు రామచంద్రమూర్తి గాంధీజీకి సన్మానపత్రములనొసంగారు. వర్తక సంఘమువారు రూ.1,133/- తాలూకా బోర్డు మెంబర్లు రూ. 116/–, తాలూకా గ్రామపంచాయితీలు రూ.116/–, కేసరీనాటకసమాజం రూ.116/–, ఖద్దరునిధికి సమర్పించారు. సభయందలి ప్రజానీకాన్ని ఖద్దరు నిధిని సమర్పించవలసినదిగా కోరారు. కలిదిండి గంగరాజుగారి పశ్చిమ గోదావరి జిల్లాలో 0మహాత్ముని సOూరము

సన్మాపత్రము వేలం వేయుచున్న గాంధీజీ

కుమార్తె, రాజమండ్రి స్త్రీ సనాతన విద్యాలయములో చదువుతున్న 11సం!! బాలిక చేతిబంగారు గాజులజతను, గంగరాజుగారి భార్య చంద్రయ్య మరి ఒక గాజుల జతను, గంగరాజుగారి మేనకోడలు, మరియూ కలిదిండి పుల్లయ్యగారు చెరి ఒక ఉంగరమును గాంధీజీకి సమర్పించారు. దామోజీవరపు నరసింహరావు కుమారై రూ.20/– తదితరులు గాంధీజీ పాదములను స్పృశించి ధనము సమర్పించు కొన్నారు. ఎల్లమిల్లి నివాసి వెలగలేటి సుబ్బారాయుడు తానే స్వయంగా తయారుచేసిన 80వ నంబరు నూలు వస్త్రముల జత గాంధీజీకి సమర్పించి పాదాభివందనం చేశారు. పిమ్మట గాంధీజీ సన్మాన పత్రము లను తీసుకొని వాటిని వేలము వేశారు. ముందుగా వర్తకసంఘము వారు ఇచ్చిన ధనము చాలదు కనుక వారే వేలము పాడవలెనన్నారు. అంత వర్తకులలో ప్రముఖులయిన గుజరాత్వాసి రైసుమిల్ల యజమాని) రమేశ్లాల్గారిని గాంధీజీకి పరిచయము చేశారు. సన్మాన పత్రముపాట ప్రారంభము రూ.10/- అన్నారు. తక్కువ అని గాంధీజీ అనగా, అంతట రూ. 50/- అన్నారు. అదియూ చాలదని గాంధీజీ అన్నారు. అంత గంగరాజుగారితో రమేశ్లాల్గారు సంప్రదించారు. ఇది చూసిన గాంధీజీ గంగరాజుగారితో మీరు నా తరపున వకాలా తీసుకొనండి అన్నారు. అంతట రూ.200/-కు పాటను కొట్టివేసి రమేశ్ లాల్ గారికి గాంధీజీ ఆ సన్మానపత్రాన్ని స్వయంగా అందచేశారు. తరువాత గాంధీజీ 5,000 మంది SSSSSSL SSSSSSSSSSSSSSSSSSS -పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

సభాసదుల నుద్దేశించి ఖద్దరు గూర్చి, అస్పృశ్యతను గూర్చి ఉపన్యసించారు. గాంధీజీ ఉపన్యాసమును దేశభక్త S°OCO వెంకటప్పయ్య అనువదించి చెప్పారు. ఈ సభకు మంగిపూడి పురుషోత్తమశర్మ, నిడదవోలు వెంకటరావు, పసల కృష్ణమూర్తి, ಮಾತ್ರೆ నారాయణరావు, ఆత్మకూరి గోవిందాచారి మున్నగు జిల్లా నాయకులు హాజరైనారు.17

తాడేపల్లిగూడెం నుండి ఉదయం 8గం|లకు గాంధీజీ అనుచరవర్గం చిలకంపాడు వెళ్ళి అచ్చట రూ.116/- ఖద్దరు నిధి స్వీకరించి, పిప్పర వెళ్ళారు. పిప్పరలో ఏర్పాట్ల సరిగాలేవు. ప్రజలు మహాత్ముని మోటారును ముట్టడించి ఇబ్బందికలిగించారు. ప్రజల అవధులులేని ప్రేమలో గాంధీజీ ఉక్కిరిబిక్కిరైనారు. గడచిన రాత్రి వరమపడుట వలన మార్గము నందు గాంధీజీ రాక తెలిసి మేఘములు నీళ్ళ చల్లినట్లు కనిపించింది. గాంధీజీ పిప్పర నుండి ఉండి గ్రామం బయలు దేరి వెళ్ళారు. మార్గములో గణపవO పరిసర గ్రామాలప్రజలు. రూ. 570/-, మందలపర్రు ప్రజలు రూ.116/–, పాందువ్వలైబ్రరీవారు రూ.50/-, గ్రామప్రజలు రూ.92/-, చెరుకుమిల్లి ప్రజలు రూ. 116/- ఖద్దరు నిధిని సమర్పించారు. සීටයි గ్రామములో రహదారి బంగళా ဝဲပ်င္ငံ సుమారు 8 వేల మందిని ఉద్దేశించి గాంధీజీ ప్రసంగిం చారు. ప్రజలు ఆనందోత్సాహములతో పరవశించారు. ఖద్దరు నిధికి రూ. 350/- సమర్పించారు. 18

ఆకివీడు\

ఉండి గ్రామము నుండి పలవర్తి లక్ష్మణస్వామి పట్టుదల వలన గాంధీజీ సాయంత్రము 5.30నిuలకు ఆకివీడు గ్రామం చేరారు. మూడు వేల మంది హాజరయిన సభలో గాంధీజీ ఉపన్యసించారు. ఖద్దరు ధారణ, విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వడకుట, హిందూ మహ్మదీయ ఐక్యత, మద్యనిషేధము, అస్పృశ్యతను రూపుమాపట మొదలగు విషయములపై బోధన సాగింది. స్త్రీ పురుషులు శ్రద్ధతో ఉపన్యాసమును ఆలకించారు.పులవర్తి లక్ష్మణస్వామి సన్మానపత్రముతో పాటు రూ. 1116/- ఇవ్వగా మిగిలిన వారు శక్తికొలది ధనమును, ఆభరణములను ఖద్దరు నిధికి సమర్పించారు. జయ జయధ్వానముల మధ్య సాయంత్రం 6. 303) గాంధీజీ ఆకివీడు నుండి భీమవరం బయలుదేరారు. గాంధీజీని తమ గ్రామమునకు తీసుకొని వచ్చినందుకు పులవర్తి లక్ష్మణస్వామి గారిని ఆకివీడు ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. " పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

బీమవరం

ఆకీవీడు నుండి రాత్రి 7, 30 ని|లకు గాంధీజీ భీమవరం చేరారు. తాలూకా బోరు ఆఫీసు నుండి రెండు ఫర్గాంగుల పొడవున అత్యంత మనోహరంగా అలంకరించిన పందిరిలో 30వేలమందికి పైగా ప్రజలు సమావేశమై గాంధీజీని నిరుపమానమైన ఉత్సాహముతో ఆహ్వానించారు. మహాత్మునికారు ఆజనవాహిని నుండి నెమ్మదిగా తాలూకా బోరు ఆఫీసుకు చేరింది. గాంధీజీని ఎత్తైన వేదికపై ఆసీనులను కావించారు. తాలూకా బోర్డు వారు ఆయనకు సన్మాన పత్రం తో పాటు రూ.2,400/- ఖద్దరు నిధిని సమర్పించారు. ఒక యువకుడు గాంధీజీ చిత్రాన్ని గీసి బహుకరించాడు. ఆ చిత్రాన్ని వేలం వేయగా రూ. 116/- వచ్చింది. తదుపరి గాంధీజీ ಛಬ್ಜಿಲಿು ඡරාට්ෆි, వినియోగములపై ఉపన్యసించారు. అచ్చటనుండి వీరవాసరం, పొలమూరు మీదుగా పెనుమంట్ర 25వ తేదీ రాత్రికి చేరారు. వీరవాసరం, పొలమూరు ప్రజలు రూ.116/- చొuన ఖద్దరు నిధికిcv 20 .وكعملية oمعO وع

36&cole

గాంధీజీ రాత్రి గం| 8.45 నిuలకు పెనుమంట్రలోని డా|దాట్ల నీలాద్రి రాజు ఇంటికి చేరుకున్నారు. డా|దాట్ల నీలాద్రి రాజు, వారికుటుంబం ఖద్దరునిధికి రూ. 8,000/- ఇతరులు ఇచ్చినది రూ.319/- వెరసి రూ.3,319/- చేకూరింది. గాంధీజీ అక్కడ సమావేశమైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఖద్దరు భారతజాతి ఆత్మగౌరవం, పౌరుషం కాపాడగలదని సంగ్రహంగా ఉపన్యసించారు. ఆ రాత్రి నీలాద్రిరాజు ఇంటిలో విశ్రమించారు, ఏప్రియల్ 26వ తేదీ ఉదయం 6 గం|లకు గాంధీజీ, ఆయన సహచరులు పెనుమంట్రకు 20 మైళ్ళ దూరంలో ఉన్న మట్లపాలెంకు బయలుదేరారు. దారిలో ఆలమూరు ప్రజలు రూ. 116/–, జిన్నూరు వాసులు రూ. 116/–, పోడూ

రునందు రుద్రరాజు వెంకట సత్యనారాయణరాజు రూ.116/–, వెలగలేరునందు డా|వేలాల రాఘవరాజు రూ.310/–, వారి సతీమణి రెండు బంగారు గాజులు, గుబ్బలూరు గ్రంధాలయం వారు రూ. 50/- ఖద్దరు నిధికి సమర్పించారు.

మటపాలెం

గాంధీజీ తన బృందముతో ఏప్రియల్ 26వ తేదీ ఉదయం గం|7-25 ని|లకు -పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

మట్లపాలెం చేరారు. ప్రముఖ కాంగ్రెసు నాయకుడు, (স্পেৰ্ম9 59%, గాంధేయవాది అగు పేరిచర్ల సుబ్బారాజు గ్రామస్తులతో ఎదురేగి స్వాగతించారు. సుమారు 5,000 మంది స్త్రీ, పురుషులు ఏతెంచిన బహిరంగసభలో గాంధీజీ ఉపన్యసించారు. అక్కడి జాతీయ పాఠశాలను సందర్శించారు. గ్రామస్తులందరూ ఖద్దరు ధరించవలెనని, విద్యార్ధులు ఖద్దరునేయుట, ధరించుట అలవాటు చేసుకొనవలెని ఉద్బోదించారు. ఎలమంచిలి గ్రామస్తులు రూ.150/- ఖద్దరు నిధికి ఇచ్చారు. ఎలమంచిలి గ్రామమునకు చెందిన ఎలమంచిలి గోపాలకృష్ణయ్య రూ.150/- విలువ కలిగిన వాచీని గాంధీజీకి సమర్పించుకొన్నారు.

మట్లపాలెంనందు పెనుమంట్ర వాస్తవ్యులయిన డా|| దాట్లనీలాద్రిరాజు మట్లపాలెమునందలి జాతీయ పాఠశాలకు సుక్షేత్రమయిన 10 ఎకరములు భూమిని గాంధీజీ సమక్షంలో దానము చేశారు.21 పేరిచర్ల సుబ్బరాజు తన గ్రామమునందు వసూలు అయిన రూ. 600/-ను ఖద్దరునిధికి సమర్పించారు. తరువాత గాంధీజీ విశ్రాంతి కొరకు పాలకొల్లకు ఉ18.30ని బయలుదేరినారు. చాలా అలసియున్న కారణమున సాయంత్రము వరకు కార్యక్రమములు వాయిదా వేశారు.

పాలకొలు

గాంధీజీ పాలకొల్లు ఉదయం 9.15 ని|లకు తన అనుచరులతో చేరారు. ఒక పాఠశాలలో బస ఏర్పాటు చేశారు. బసలో తగిన ఏర్పాట్ల జరుగలేదు. అనేక మంది ప్రహరీగోడలు దూకి గాంధీజీని తడికెలనుండి చూచుచుండిరి. తాగుబోతులను కూడా ఎవరూ నిరోధించలేదు. గాంధీజీకి వారు చేసెడి అల్లరి మిక్కిలి అసౌకర్యము కలిగింది. మహాత్ముని అనుచరులుకూడ ఇబ్బందులు పడినారు. సాయంత్రము 4 గం|లకు విశ్రాంతి అయినపిదప గాంధీజీ తాను విశ్రమించిన గదికి వెనుకప్రక్క మరియొక గదిలోనికి వెళ్ళారు. గాంధీజీ, వారి అనుచరుల నిమిత్తము పండ్లు, కూరగాయలు కోకొల్లలుగా ఉంచబడ్డాయి. గాంధీజీ వాటిని చూసి తన అనుచరులతో మనమింత తిండిపోతులమగుట విషాదకరమని, ప్రజాధనమును ఇట్లు మితి తప్పి ఖర్చుచేసి విందులారగించుట యుక్తము కాదని అన్నారు. సన్మానసంఘము వారిని వారించి ఆ పదార్ధములన్నింటిని అచటనుండి పంపించి వేశారు.22 తరువాత ఎందరో నిరుపేదలు పూటకైన గంజిలేక శోషిలుచుండ మనము విందులారగించుట తగదని, కేవలము ఆకలి నివారణ కొరకు తగిన సామాన్య పదార్ధములు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

తినినసరిపోవును కాని, పరులసొమ్ముతో పెరుగు, నేయి, పిండివంటలు, పక్వాన్నములు భుజించుట పాడిగాదని బోధించారు.

సాయంత్రం గం|5-30ని|లకు బహిరంగసభ జరిగెను. సభకు సుమారు ఎనిమిది వేల మంది పౌరులు హాజరైనారు. గాంధీజీకి మున్సిపల్ కొన్సిలువారు, తాలూకా ಬೌಲ್ಡಿ వారు, వైశ్య, క్షత్రియ, వర్తక సంఘములవారు సన్మాన పత్రములను సమర్పించారు. సుమారు రూ. 1,500/- ఖద్దరు నిధి చేకూరింది. గాంధీజీ తన ఉపన్యాసంలో "పాలకొల్లులో విదేశీ బట్టల దుకాణములు హెచ్చుగానున్నవని వింటిని. అది చాలా విచారకము. మీరు విదేశీవస్త్రములను బహిష్కరించవలెను. విదేశీ వస్త్రవ్యాపారాన్ని నిలుపుదల చేయవలెను. మీరు మాలమాదిగలను చాలా ఇబ్బందిపెట్టుచున్నారని, వారి పిల్లలను పాఠశాలలోనికి రానీయటంలేదని విన్నాను. వారి పిల్లలను పాఠశాలలోనికి రానిచ్చుటయేకాక, వారికి ఉచితముగా పాఠములు చెప్పవలెను. దానివలన మనకు లాభమే కలుగును, కాని నష్టము కలుగదు. పంచములను దుకాణముల వద్దకు రానీయటం లేదని విన్నాను. అది పంచములలో నిరాశకు కారణమవుతుంది. కులీనులమనుకొనేవారు పంచములను తమ సోదరులుగా చూడవలెను అని బోధించారు.

ఆచంట

పాలకొల్లు నుండి ఆచంట చేరులోపున గాంధీజీ కారులో నిద్రించారు. ప్రతీగ్రామము నందు ప్రజలు వేలవేలుగా గుమిగూడియుండిననూ ఆచంట చేరువరకు మహాత్మునకు మెలకువరాలేదు. ఆచంట గ్రామంలో కొత్తగా తవ్వచున్న చెరువుగట్టు వద్ద Теодаš పయనించే కారు మట్టిలో కూరుకొనిపోయింది. గాంధీ మండుటెండలో దారిసరిగా లేకున్నను పావకోళ్ళ తొడుగుకొని ఆ మిట్టపల్లపు నేలలో, కసూరిబాయితో కలిసి సభాస్టలికి నడవవలసి వచ్చింది. దారినునుపుగా లేదు చాలా ఒడిదొడుకులుగా ఉంది అని ఒక కార్యకర్త అనగా నిజమే మన జీవితమంతా కూడ ఒడిదొడుకుగానే ఉంది అని మహాత్ముడన్నారు. మహాత్ముడు మాట్లాడుచుండగా అకస్మికముగ ఒక పాము వచ్చింది. ఇది విషసర్పము కాదు బురదపాము అని ఒకరన్నారు. "విషసర్పము కూడ మహాత్ముని సన్నిధిని విషరహితమగును" అని మంగిపూడి పురుషోత్తమశర్మ వ్యాఖ్యానించగా, 'అలాగా అని మహత్ముడు పకపక నవ్వెను

సభావేదికపై ఆచంట పౌరులపక్షాన జిల్లా బోరు వైస్ ప్రసిడెంటు నెక్కంటి దొరయ్య పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

మహాత్మునకు రూ.800/- కొడమంచిలి గ్రామసులు రూ. 63/- దేవ గ్రామస్తులు రూ. 178/- ఖద్దరు నిధికి సమర్పించిరి. కొంతమంది డబ్బు ఇచ్చుటకు సంకోచించు చున్నట్లు చూచి గాంధీజీ తన ఉపన్యాసంలో "దొరయ్యగారు మీరు గ్రామమున లక్షాధికారులు ಇಲ್ಲೆ వారు ఇచ్చట చాలా మందికలరు. ఇట్టి సంపన్న గ్రామమున రూ.800/- ఇచ్చుట తక్కువే. మీరు ఇంకనూ హెచ్చు సంఖ్యలో ఇవ్వాలి. నన్ను నడచివచ్చునట్లు చేసినందులకైననూ మీరు హెచ్చగానియ్యవలెను. నేను మీ గ్రామమునుండి వెళ్ళలోగా మీరు ఆ లోటును భర్తీ చేయవలెను. ఖద్దరు విషయమున మీరు లుబ్ధత్వమును చూపరాదు. ధనవంతులు ఎంత ఇచ్చినా తక్కువే యగును కావున మీరింకా ఇవ్వవలెను అన్నారు. తరువాత సంభాషణ కోనసాగిస్తూ ఆచంటలో కొన్ని సంవత్సరముల క్రితము వరకూ చాలా రాట్నములు పనిచేసూ ఉండేవని విన్నాను. ఆ నూలుతో చేయబడిన వస్రాలనే గ్రామస్తులు వాడేవారని విన్నాను. అవి ఇప్పడు ఎందుకు ఆగిపోయినవో తెలియదు. ఆ నూలుపనిని పునరుద్దరించవలెనని కోరుచున్నాను. ప్రతియింటా కనీసము ఒక రాట్నమైనా తిరుగుచుండవలెను. ఖద్దరును ప్రేమిస్తున్న నేటి యువకులు అందుకోసము గట్టిగా కృషి చేయవలెను. వారు మద్యపాననిషేధము, విదేశీవస్త్ర బహిష్కారము, అస్పృశ్యతా నివారణ, ಛದ್ದಿಯಿ ప్రచారము విరివిగా సాగించవలెను. ఐక్యముగా వ్యవహరించవలెను. మత విభేదములు కలుగరాదు. మాలమాదిగలు మన్నగువారిని పాఠశాలలకు రానీయవలెను. వారికి కూడా చదువు చెప్పవలెను. వారికి కూడ రాట్నములు ఇచ్చి నూలు ఒడికించవలెను. ఖద్దరు ప్రచారముచేస్తూ కాంగ్రెసు కార్యక్రమము సక్రమంగా నిర్వహిస్తూ 1929 సంత్సరాంతంలో స్వరాజ్యసంపాదనకు జరిగే మహత్తర ప్రయత్నానికి సంసిద్దులుకాగలరని ఆశిస్తూన్నాను" అని పేర్కొన్నారు.

ఆరోజు రాత్రి గాంధీజీ నెక్కంటి దొరయ్యగారి గృహమున విశ్రమించారు. మాటల సందర్భంగా “ఈ గ్రామమున ఇవ్వబడిన రూ.800/-లలో దొరయ్య గారివి రూ.50/– మాత్రమే. మీకు ఆతిధ్యమిచ్చిన వారును, జిల్లాబోరు ఉపాధ్యక్షుడును అగు దొరయ్యగారి వంటి సంపన్నుడు రూ. 50/- ఇచ్చుట మిక్కిలి తక్కువ" అని ఎవరో అన్నారు. అంతట గాంధీజీ దొరయ్యగారిని పిలిపించి వివరము అడిగారు, అంత దొరయ్యగారు రూ.50/- ఇచ్చినట్టు ఒప్పకొన్నారు. " మీ వంటి హూందాయైన మనుష్యులు రూ.50/- ఇవ్వటమా" అని మాగంటి బాపినీడు సరసముగా దొరయ్యగారిని ఉద్దేశించి అన్నారు. “మీరు నిరంతరము ఖద్దరు ధరించవలెను. మీ దర్బారుకు తగినటుల ధనమీయవలెను" అని పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

మహ్మాత్ముడు అనగా "రూ, 400/- ఇచ్చెదనని, నిరంతరము ఖద్దరు కట్టెదనని" దొరయ్యగారు వాగ్లానం చేశారు. అంత గాంధీజీ "మీభార్య ఇంతకు ముందే ఇచ్చటకు వచ్చి రూ.25/– లు ఇచ్చారు. ఆమె ఖద్దరు ನಿರಾಣಮಿ ఎడల తన ఆసక్తి వెల్లడించారు. మీరు ఆమె కృషికి ఎట్టి అభ్యంతరము వెల్లడించరాదు. &ရွှဉ့်ထဲသံ პ<6უoზ%Oტზ ಅನ್ನಿಪುಣರಾದೆವಿ ఎట్లు పనిచేసిరో మీరు వినియుండలేదా ! నాలుగు రోజుల క్రితము ఎలమంచిలి సత్యవతీదేవి రూ. 1,400/ —లు విలువ గలిగిన నగలు ఇచ్చుటయైనా తెలియదా!" ** అని గాంధీజీ అన్నారు.

తణుకు

27వ తేదీ తెల్లవారుజామున గాంధీజీ ఆచంట నుండి తణుకు ప్రయాణమైనారు. మార్గంలో ఆచంట విడచిన పిమ్మట భర్తను కోల్పోయిన ఒక పేద బ్రాహ్మణ యువతి మహాత్ముని దర్శించి రూ.100/- లు ఖద్దరు నిధికి సమర్పించింది. పెనుగొండ యందు రూ. 500/-లు, ఏలేటిపాడులో రూ. 500/- లు ఒసంగబడింది. గాంధీజీ ఉదయం గం|7-10ని|లకు తణుకులో సభావేదిక వద్దకు చేరుకున్నారు. סחo&c8 275 386 ఉదయం వచ్చెదరనే వార్త తెలిసి చుట్టుప్రక్కల గ్రామములనుండి వేనవేల ప్రజానీకం 26వ తేదీ రాత్రి హైస్కూలు గ్రౌండునకు వచ్చిచేరారు. సుమారు 20 వేల జనవాహినితో క్రిక్కిరిసియున్న సభయందు గాంధీజీ ప్రవేశించారు. చుటూ ఈలచెట్లు ప్రశాంతముతో බ්ථaඨයීට් స్వచ్ఛంద సైనిక దళమువలె కనబడుచుండెను. ఉదయభానుని సూర్యకిరణములు జనులకు ఉల్లాసము కలిగించుచుండెను. స్వచ్ఛంద కాంగ్రెసు వాలంటీర్లు బారులుతీరి నిలబడియున్నారు. సభయందు ప్రశాంతమైన వాతావరణము అమరియున్నది. గాంధీజీ సభయందు అరగంటసేపు ఉన్నారు. పుణ్యాంగనలు నీరాజనములు ಇಮ್ಲೀಗ್, వృదులు మహ్మత్ముని పాదములపైబడి దోషములు హరింపుమని, దవడలపై కొట్టుకొనుచుండిరి. తణుకు పౌరులు రూ.400/-, బోర్డు హైస్కూలువారు రూ.116/–, ముళ్ళపూడిరాయుడు రూ.100/-, దువ్వ గ్రామసులు రూ.232/- వడూరు గ్రామసులు రూ. 116/– సమర్పించారు. గాంధీజీ ముళ్ళపూడి రాయుడు గారితో "మీరు కోటీశ్వరులగుటచే రూ.100/- చాలదు" అన్నారు. ఈ గ్రామము వదలి వెళ్ళలోపుగా ఇంకా హెచ్చుమొత్తము ఇచ్చెదనని రాయుడుగారు తెలిపారు. కొందరు ఉంగరములు, కొత్త ఖద్దరు వస్త్రములు, గడియారములు కానుకలుగా అర్పించారు. కొందరు మహ్మత్ముని పాదములపై పడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

కనులకదు కొన్నారు. ఆ రోజున తణుకులోని అన్ని విధముల కూలీలు పనులను మానివేసిరి. తూర్పుకాపులు, సెట్టి బలిజలు, పంచములు మన్నగు నిరుపేదలు ఆరు పైసలు మొదలు రూపాయి వరకు తమ శక్తికొలది మహాత్మునికి సమర్పించారు. మహాత్ముని కారు సభారంగమున ఆగినపిదప పెన్మత్స లక్ష్మీపతిరాజుగారిచే రచించబడిన "గాంధీశతకము' గాంధీజీకి సమర్పించబడింది. గాంధీజీ చిరునవ్వుతో ఇంతకంటె ధనము ఇచ్చినచో సంతసించెదనన్నారు. దానిని అచ్చువేయించి అందు పైవచ్చు లాభమును ఖద్దరునిధికి ఈయవలసినది అని కవి కోరగా గాంధీజీ అంగీకరించెను.

గాంధీజీ 8గంIIలకు ఎర్రమిల్లి రామనాథముగారి మేడయందు విశ్రాంతికై ప్రవేశించారు. గాంధీజీని దర్శించుటకు వేలకొలది జనము రామనాథముగారి మేడబయట ఎండలో నిలుచున్నారు. గాంధీజీ రెండు పర్యాయములు ప్రజలకు దర్శనము ఇచ్చారు. 11గంuల తరువాత బయటకురాలేదు. అంతకంతకూ జనము అధికమైనారు ఎండవేడిమిచే ప్రజలు మిగుల ఇక్కట్లపడారు. సాయంత్రము గం|4.30ని.లకు విపరీతజనసమ్మర్ధము ”ნამბršćა. గాంధీజీ వారికి దర్శనము ఇచ్చి మరల లోనికేతెంచి, తన ఆంతరంగిక సభ జరిపారు. తరువాత తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం తాలూకా బోర్డుల ప్రెసిడెంట్ల వచ్చిన కార్యనిర్వాహక సభయందు తదుపరి కార్యక్రమమును నిర్ధారించుకున్నారు. తదుపరి ఐదు వేలమంది స్త్రీలు హాజరయిన సమావేశమునందు గాంధీజీ ఉపన్యసించారు. ఆ సభలో స్త్రీలు రూ. 172/- ఖద్దరు నిధికి సమర్పించారు. తణుకు నుండి సాయంత్రం గం| 5.30 ని|లకు గాంధీజీ కారు బయలుదేరుచుండగా కీ.శే. పానుగంటి అన్నాజీరావుగారి తల్లి రూ.50/- లు వెండి పళ్ళెరమునబోసికొని వచ్చి పళ్ళెరముతోసహా (Yeටඨිකීපී సమర్పించారు. జయజయధ్వానములతో తణుకు ప్రజలు గాంధీజీకి వీడ్కొలుపలికిరి. ఎర్రమిల్లి రామనాధముగారి ఇంటియందు అత్యంత ఉత్సాహముతో గాంధీజీ గడిపినారని నాయకులు ఆనందించారు. డిర్

నిడదవోలుకు పోయే మార్గమునందు బ్రాహ్మణగూడెంలో రూ.116/–లు ఖద్దరునిధి చేకూరింది. సమి(శిగూడెంనందు తణుకు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడు ෂීරාංඡ ဗဒ္ဓသံဝါသ္မီ) బ్రహ్మన్న ప్రముఖ వ్యాపారి కోట్ల నరసింహం మహాత్మునకు రూ. 116/–లు చొప్పన సమర్పించారు. నిడదవోలు నందు జరిగిన పెద్దసభలో అఖిలభారత తంతుకారక సంఘము, నిడదవోలు శాఖవారు, వర్తక సంఘమువారును, డాక్టరు బొమ్మకంటి రామమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము చెరుకుమిల్లి దక్షిణామూర్తిశాస్త్రి మహాత్మునకు రూ.116/–లు చప్పన సమర్పించారు

చాగలు

గాంధీజీ నిడదవోలు నుండి బయలుదేరి వెళ్ళుచుండగా తాళ్ళూరిసూరన్న చాగంటి రాజయ్యగార్ల నాయకత్వములో చాగల్లు నందు మహాత్మునకు పౌరసన్మానము గావించారు. చాగల్లుప్రజలు రూ. 170/- లు, నేలటూరు గ్రామసులు రూ. 81/-లు ఖద్దరు నిధిసమర్పించారు. అక్కడ సంగ్రహముగా ఉపన్యసించి మూడు మైళ్ళ దూరానఉన్న 'ఆనందనికేతన్ ఆశ్రమానికి వెళ్ళారు. సహాయనిరాకరణ ఉద్యమకాలంలో ఏర్పరచబడిన ఈ ఆశ్రమానికి తల్లాప్రగడ ప్రకాశరాయుడు, తల్లా ప్రగడ నరసింహవర్మ ఆత్మవంటివారు. లక్కంసాని గంగరాజు ఈ ఆశ్రమానికి భూవసతిని సమకూర్చగా, ఆంధ్రపత్రిక అధిపతి ಡೆಕ್ದ್ದರs కాశీనాధుని నాగేశ్వరరావు అధిక ధనమును ఖర్చుచేసి భవనములను కట్టించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా 'ఆనందనికేతన్"ను తీర్చిదిద్ది కార్యకర్తలు, నిమ్నజాతి విద్యార్ధులు కూడ ఆశ్రమంలోనే ఉంటున్నారు. గాంధీజీ వాహనము ఆశ్రమద్వారం వద్ద ఆగగానే, ఆశ్రమ విద్యార్ధులు, పరిసరగ్రామ ప్రజలు గాంధీజీకి స్వాగతమర్పించి, పూలమాలలువేశారు. గాంధీజీ, కారులోని వెనుక సీటుపై కూర్చుండి ఆశ్రమ విద్యార్ధులనుద్దేశించి మృదుమధురమైన ఉపన్యాసం ato)6).

గాంధీజీ ఆశ్రమంలోనికి వెళ్ళి స్నానాద్యనుషానాలు పూర్తికావించుకొని ఆశ్రమ భవనానికి ముందుండిన ఆవరణలో పిల్లల మధ్య కూర్చొని, వారిని తాను చేయబోయే దైవప్రార్థనలో పాల్గొనమని ఆదేశించారు. విద్యారులు, ఇతరులూ కూడ తదేక ధ్యాననిమగ్నులై ప్రశాంతముగా కూర్చున్నారు. ప్రకాశరాయుడు తన శిష్యవర్గంతో కలిసి ప్రార్ధన గీతం పాడారు. తదుపరి గాంధీజీకి పండ్లు సమర్పించారు. ప్రకాశరాయుడు గారి వృద్ధురాలైన తల్లిగారు రూ. 100/- లను తన గతించిన కుమార్తె యొక్క వెండిగిన్నెయును మహాత్మునకు సమర్పించారు. * ఇతర సమర్పణలు రూ. 122 /– ఖద్దరునిధికి వసూలైనాయి. అంతలో చిగురుపాటి భీమయ్య అనే హరిజన బాలుడు "మహాత్మా ఇది నేను స్వయంగా నేసిన జంపఖానా తాము స్వయంగా వాడుకోవలెను. ఎవ్వరికీ ఇవ్వరాదు." అని షరతు విధించి గాంధీజీకి సమర్పించాడు. గాంధీజీ “నేతప్ప ఎవ్వరూ వాడుకోరాదా, నేచనిపోయిన నాతోనే తగుల బెట్టవలెనా లేక మళ్ళీ నీకు కావలెనా" అని పరిహాస " మాడుతూ మహాప్రసాదమని కళ్ళకద్దుకున్నారు. గాంధీజీ ఆశ్రమములోనున్న పిల్లలను పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

పిలిచి తనకు సమర్పించిన ఫలములన్నింటిని వారికి పంచిపెట్టారు. రాత్రి గం19.30నిuలు కు గాంధీజీ విశ్రమించారు. చాగల్లు ఆశ్రమానికి గాంధీజీతో వచ్చిన ప్రముఖులలో మోతే నారాయణరావు, జిల్లా కాంగ్రెసు సంఘకార్యదర్శి කරඛථ కృష్ణమూర్తి, శనివారపు సుబ్బారావు, మంగిపూడి పురుషోత్తమ శర్మ కోడేటి వెంకటరాజు, డాక్టర్ యం. వి. కృష్ణారావు, ఆత్మకూరి గోవిందాచార్యులు ಹಿನಾಯಿ

. SošÓSóo

ఏప్రియల్ 28వ తేదీన మహాత్ముడు, ఆయన అనుచరవర్గము చాగల్లు છોડo૦° ఉదయం 4 గOIIలకు నిద్ర మేల్కొని ప్రాతఃకాలకృత్యాలు తీర్చుకొని ఉదయం గం:14, 30ని.లకు ఆశ్రమవాసులతోను, ఇతరులతోను కలిసి ప్రార్థన, భగవద్గీత పారాయణము జరిపి 5.30 ని|లకు బయలుదేరి 6 గం|లకు దేవరపల్లికి చేరారు. బయలుదేరుటకు ముందుగా పసల కృష్ణమూర్తిగారి భార్య తన శరీరము మీద మిగిలియున్న కంటెయు, బంగారపు గాజులును మహాత్మునకు సమర్పించారు. అచ్చట దేవరపల్లి హనుమంతరావు, దేవరపల్లి సుబ్బారాయుడు, దోనెపూడి లక్ష్మయ్య, అంబటి సత్యనారాయణ గారపాటి వెంకన్న మరియు పరిసర ప్రాంతవాసులు కలిసి రూ. 500/- ఖద్దరు నిధికి సమర్పించారు. కొవ్వూరు తాలూకా කි°තු అధ్యక్షుడు ముళ్ళపూడి రాయుడు గారి కుమారుడు తిమ్మరాజు కోరికపై గాంధీజీ దొమ్మేరు వెళ్ళారు. తిమ్మరాజు నాయకత్వమున యూనియనుబోరువారు సన్మానపత్రమును సమర్పించారు. తన స్వగృహమునందు తిమ్మరాజు రూ. 500/- ఖద్దరునిధికి సమర్పించారు.

గాంధీజీ సరిగా ఉదయం గం| 7.30 ని|లకు కొవ్వూరు చేరారు. శివుడు శివరావుగారి తల్లి మహాత్మునకు రూ.116/–లు, ఖద్దరుహారమును సమర్పించారు. 'లజపతినగర్లో స్వర్గీయ తల్లాప్రగడ సూర్యనారాయణరావు ఏర్పాటు చేసిన 'ఆంధ్ర ಗಿರಾಣ విద్యాలయ భవనము నందు బహిరంగసభ జరిగింది. తాలూకాబోరు అధ్యక్షుడు ముళ్ళపూడి తిమ్మరాజుగారు, యూనియనుబోర్డు అధ్యక్షుడు శివుడు శివరావు తమ బోర్డుల పక్షమున మహాత్మునకు సన్మానపత్రములను సమర్పించారు. కొవ్వూరు తాలూకా ప్రజలు, కొవ్వూరు సహకారసంఘము వారు గూడ సన్మాన పత్రములు సమర్పించారు. ఖద్దరునిధి రూ. 450/- చేకూరింది. శివుడు శివరావుగారు రూ. 300 /- లాలాజీ నిధికి సమర్పించారు. శివుడు శివరావు గారి కోర్మెపై ိလ္လဝ့်ထဲ లాలాలజపతిరాయ్ చేసిన దేశసేవకు పశిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము t 0I| 80 I || 8 脚6 | Z | [69 I6 | Z | I 69-I 安城II| 8 |ɛI89 |II| 8 $ | Z | OL||9869 | 0 | 0 | 001Z | OI %O II † 16/,9ĩ7OI|is? }O | ĢI Į jogo, 1, 1 *** |* | *****0 | 9 I 如ț7 | 8 I || 9 IŤ Z, Z | O || 0 || 00Zį7 | 8I 密%;OI||OZ09ț7 || 0 || 0 || 009 Z难r0I 篮g | #7 I || GVIŤ I || 0 || 0 || 00/,Ģ Ī ĪZI GJOI| 3 | 9ɛɣIŤ || 0 || 0 || 000Ø |01||8 義 |홍g|6 |8932P ||0||0|| OoO3 |홍g|6 g | I || I†799 Z | O || 0 || 009 I || 8 | I 09 C C |-68.08% 6 l8I I ZI Coyo-退岛 容员g ) 3%6法法 圆圈圈圈圈圈圈圈则6EG曲 gI | * | ··· | ·····8I| Z CQCCgCgლot7) | 泥配馆 82gBo% –– 8I ගුශිනු ෆoca-Cශ්‍රය්දී Q Q CQCQ ĝecoç ởGņedo gaușoau golios: 6461 Qặc2 လoခါ၆&လွှ29s CCලූනුGඉCලූබේ %%% လွှဇံလွှ၃(ဒွ ශුද්ධශ්‍ර %Bに3g o守况母z2G %Bに3% QacCộOCụ 静密守汾 腰涧况 C3 CSeCS3 ZI O H H. H. cQc2OCQg - Ci Crs it is to N od cs పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

నిదర్శనముగా నిర్మించిన ప్రాంతానికి 'లాలాజీనగర్ అని గాంధీజీ నామకరణం చేసి ప్రారంభించారు ఆ తదుపరి లాలాలజపతిరాయ్ దేశసేవలను వివరించారు. * ప్రజలు గాంధీజీకి సమర్పించిన వెండి గిన్నె ఖద్దరు ధోవతిని వేలము వేయగా న్యాయవాది టి.వి శేషావతారం, రూ. 35/–, రూ.8/-లకు కొన్నారు. నాలుగువేల గజాల ఖద్దరునూలు రూ. 10/-లకు విక్రయించారు.

ఉదయం 9 గం|లకు మహాత్ముడు, శ్రీమతి కసూరిబాయి, శ్రీమతి ప్రభావతి, ప్యారీలాల్ (గాంధీజీ ಪ್ರವೆಟಿ సెక్రటరీ), సుబ్బయ్య (సంక్షిప్త విలేఖకుడు), ఇమాంసాహేబ్, దేశభక్త కొండావెంకటప్పయ్య, వేమూరి నారాయణమూర్తి, నిడదవోలు వెంకటరావు, సుబ్బరామయ్య కలకత్తా మెయిల్లో ఉదయం 9.15 ని|ల బయలుదేరి విశాఖపట్నము వెళ్ళారు.

జీ ఖద్దరు యాత్ర, కొవ్వూరు.1929 గాంధీ

పశ్చిమగోదావరిజిల్లాలో గాంధీజీ ప్రచారం ప్రజలలో నూతనోత్తేజాన్ని కలిగించింది. ఆయన ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగాలు వారిలో జాతీయతాభావాన్ని స్వాతంత్ర్యోద్యమ పిపాసను రేకెత్తించాయి. ఖద్దరు నిధికి వారు ధారాళంగా విరాళములను అందించారు. గాంధీజీ ఏప్రియల్ 23వ తేదీ ఉదయం 7.30 ని|ల నుండి 28వ తేదీ ఉదయం గం:18 వరకు పశ్చిమగోదావరి జిల్లాలో 250 మైళ్ళ ప్రయాణం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

సుమారు 48 గ్రామాలను దర్శించారు. అంతవరకూ ఏ ప్రముఖ జాతీయ నాయకుడు ఎప్పడూ కాలుపెట్టి ఎరుగని కుగ్రామములకు కూడ ఆయన పర్యటన భాగ్యం లభించింది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ పశ్చిమగోదావరి జిల్లాకు ఖద్దరు నిధికై నిర్ణయించిన కోటా రూ.25,000/- లు కాగా వసూలు అయినది ధనరూపంలో రూ.39,436/-లు, వస్తువుల రూపంలో రూ.2000/- లు మొత్తం రూ. 41,436/- లు. 1929లో గాంధీజీ ఆంధ్రదేశంలో 13 జిల్లాలలో పర్యటించగా ఖద్దరు నిధిని చేకూర్చుటలో పశ్చిమగోదావరి తృతీయస్థానము دلة كغاوعoع(O6.28

గాంధీజీ పర్యటనలో అనేక గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలు, లైgరిలూoSD ಬಿಲ್ಡಿಲು, කිඳාදිකි”තු సన్మాన పత్రములను సమర్పించటంతో పాటు, ఖద్దరు నిధికి విరాళములు అందచేశాయి. ఈ చర్యను సహించలేని జిల్లా కలెక్టరు స్థానిక సంస్థల ధనమును ఖద్దరునిధికి ఇచ్చుట చెల్లదని, వారు తమ సొంత ధనమును మాత్రమే ఇవ్వవలెనని ఉత్తర్వులు జారీచేశారు. గాంధీజీ సందర్శించిన ప్రదేశాలలో ప్రతీ ఒక్కరు ఆయన పట్ల అపూర్వ గౌరవాన్నికనపర్చారు. మండుటెండలలో, చేలగట్ల నుండి బయలుదేరి పుణ్యక్షేత్రాలకు పోతున్నట్లు జన సమూహం తరలి వచ్చింది. గంటలతరబడి, ఎండను కూడ లెక్కచేయకుండా, ಫ್ಲೀಲ, పిల్లలు, వృదులు rveටඨිසී రాకకై నిరీక్షించారు. Յօ3 కప్పలపైన, ప్రహరీగోడలపైన, చెట్లపైన కూడ చేరి గాంధీజీని తనివితీర వీక్షించాలని ప్రజలు తహతహలాడారు. ఆయన నోటినుంచి వెలువడిన ప్రతీమాట వేదవాక్కు කරව ప్రజలువిన్నారు. గాంధీజీ పశ్చిమగోదావరిజిల్లా సందర్శనము అఖండ విజయాన్ని సాధించినదనుటలో సందేహంలేదు. ఈ పర్యటనతో జిల్లావాసులు సహాయ నిరాకరణఉద్యమ విరమణ నాటినుండీ ఏర్పడిన మందకొడితనాన్ని వదిలించుకొని నూతన చైతన్యాన్ని పొందారు. ܩ గాంధీజీ పశ్చిమగోదావరి జిల్లా యాత్ర అనంతరము మంగిపూడి పురుషోత్తమ శర్మ కృష్ణాపత్రికలో 1929 మే, 18 వ తేదీన "పూజాంజలి అనుశీర్షికయందు గాంధీజీని ప్రశంసిసూ ఈ విధంగా పేర్కొన్నారు.

“ధన్యమైనది పశ్చిమగోదావరి. ఆదిని పవిత్ర గోదావరి చేత ఆవల శ్రీ సీతారాముల వలన ధన్యమైన ఈ గడ్డ నేడు మహాత్ముని పాదస్పర్శతో ముమ్మాటికి శాశ్వతంగా ధన్యమైంది. ఆహా ! మహా భాగ్యం. 99

"స్వీకృత సర్వదరిద్రలోకశోకుడు; వశీకృత విశ్వభారత హృదయుడు ; నిఖిల పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

భూత చేతోమయుడు ; శ్రీశుకయోగి సదృశుడు; గాంధీ భగవానుడు. గింగురుమంటున్నాయి చెవులు, చుటూ ముసురుకొన్న జనుల జయజయ ధ్వనులతో నిత్యం లక్షలాది భక్తిపూర్వకకరాంగుళులు తనకు కానట్లు పరిగ్రహించే ఆ పరమపురుషుడు ఒక్క మారు వినీతుడై నిమీలితనేత్రుడై కరకమలాలు ముకుళించి అణువుకంటె అణువై" ఓమ్ నమో నారాయణాయ అంటూ తన చుటూ సహస్ర శీరుడై ; సహస్రాక్షుడై, సహస్ర పాదుడై అవతరించి ఇష్టదైవాన్ని మానసికోపాసనచేస్తూ భక్తిరసామృత సింధుగర్భంలో మునకలు వేస్తూ మహాసమాధి నిమగ్నుడైనాడు.

ఓహో! మహాత్ముని ఇన్నిసుందరాకృతులు చూచి ముగ్గుడనైనాను. కాని ఇట్లాంటి నిర్భర దివ్య సౌందర్యరూపం ఎన్నడూ ఎక్కడా చూడలేదు. వర్చస్వంతమైన ఆ విశాలఫాల పట్టిక పై "దేహబుద్ద్యాస్మి దాసోహం జీవ బుద్ద్యాత్వదంశకం ఆత్మబుద్ధ్యాత్వమేవాహం” అన్నపూర్ణసత్యం యొక్క వివిధ కళలు ద్రుత గతితో ప్రజ్వలించి అన్నట్లయింది. “ಭಿನಿಸ್ಬಿ! ూహన్దాస్ ధన్యోస్మి 99

“ప్రభూ ! నీ పాదకమలంబు నెమ్మిడగ్గరగాని తరలి పోవంగ పాదాలు రావు" ఈ స్వల్పకాలంలో "మామనంబులెల్ల మరపి దొంగిలి తెట్లు బ్రతుకు వారమేలాగు మేలాగు, ఏమిచేయువారమిక మహాత్మా అని శ్రీకృష్ణుడంతర్జానమైన తరవాత గోపికలనుభవించిన అవస్థలనుభవిస్తూ ఆ అమృతమూర్తిని హృదయ పేటికలో బంధించుకొని ధ్యానించు కొంటూ విధిలేక మళ్ళలేక అంతలో వెనక్కిమళ్ళినాను.

"స్థానేహృషీకేశ ! తవ ప్రకీర్యా
జగత్ర్పహ్భష్యత్యను రజ్యతే చ
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘూ8
కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్
గరీయ సే బ్రహ్మడో ప్యాది కర్రే"

మహాత్మానీవు నరుడవు. కాని విశ్వరూపుడవు. నీ రూపం భూమి అంతా నిండినది పైగా 10 అంగుళాలు మిగిలినది. "అత్యతిష్ఠద్దశాంగులమ్" అజ్ఞలునిన్ను మానవ మాత్రునిగా గ్రహిస్తారు. కాని తత్త్వజ్ఞలు అసామాన్యుడవైన మహాత్ముడవంటారు. నీవకేవలం గాంధీవికావు. సమస్త భూత చేతోమయమూర్తివి, సమవర్తివి, అణువులోను, మహత్తునందు, పుణ్యనందు, పాపియందు, శునియందు శ్వపాకునియందు సర్వసమంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

అలుముకొనియున్నావు. నీకంటే మాకితర దైవాలెందుకు, ఇతరలక్ష్యాలెందుకు ఇతరప్రేమలెందుకు, ఇతర వాంఛలెందుకు, ముమ్మాటికి మేమనిన్నే వరిస్తాం నిన్నేస్మరిస్తాం. నిన్నేకీర్తిస్తాం. అవును నీకీర్తంటే జగత్తుకు ఆనందము. నీకీర్తం జగత్తుకనురాగము. రాక్షసులు నిన్నుగని భీతిల్లి దిద్దిగంతాలకు పారిపోతున్నారు. దేవతల సిద్దులు నీకు జోహార్లు చేస్తున్నారు. ఎందుకు మొక్కరు. మహాత్మానీకు ! ఆదికర్త అయి బ్రహ్మకంటె కూడ అధికుడవు - ఎందుకు మొక్కరు నీకు. "కస్మాచ్చతేన నమేర

పశ్చిమగోదారి జిల్లా యందు ఖద్దరు వసూళ్ళు 9-5-1929 “యంగ్ ఇండియు మహాత్మన్,29 యందు ఈ విధంగా ప్రచురించారు. 24-4-1929 పోతునూరు 25-4-1929 (එeළාපෘඨිබ්බ්රිඪ.78) దోసపాడు కొవ్వలి ਕੇਹੇ 50 దెందులూరు గుండుగొలను Š°eočOJočo అర్ధవరం గణపవరం సిరిపల్లి భువనపల్లి నిడమర్రు පි”ඡකරවූ చెరుకుగణేశ అగ్రహారం తాడేపల్లిగూడెం మందలపర్రు పాందువ్వ రూ. అ. పై 1809 - 10 - O 50 - O - O 1077 - 13 - 1 50 - O - O 751 - 10 - O 1173 - O - 9 128 - O - O 116 - O - O 401 - O - O 18 - O - O 51 - 0-0 15 - O - O 25 ー 0ー 0 100 - O - O 1924 - 4 - O 116 - O - O 162 - O - O పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము (లాలాజీ నిధి రు.20) పిప్పర 201 - 6 - 1 పొలమూరు 116 - O - O భీమవరం 2567 - O - 6 వీరవాసరం 116 - 1 - 0 ఉండి 329 - O - O ఆకివీడు 1333 - 13 - 4 26-4-29 పెనుమంట్ర 3319 - 6 - 6 ఆలమూరు - 116 - O - O ධීවරුපීරය 31 O - O - O కోడూరు 248 - 8 - 1 జిన్నూరు 127 - O - 6 పాలకొల్ల బ్రాడీపేట 240 - 8 - O పాలకొల్ల బ్రాడీపేట 57 - 4 - O మార్గమునందు 7 - O - O පොංඝුධි-පිට 2,103 - 4 - 9 (లాలాజీ నిధి రు.100) රාළුධිරයටඩ්ෂීව 152 - O - 3 గుమ్మలూరు 77 - O - O నర్సాపూర్బార్ అసోసియేషన్ 116 - O - O పాలకొల్లు 2459 - 3 - O పండితవెలూరు 61 - O - O 27-4-29 ఆచంట 1118 - 5 - 8 (లాలాజీ నిధి రు.50) దేవ 179 - O - O “ රියදිරියිරාහටඩ්ෂී) 42 - 9 - O కొడమంచిలి 63 - O - O పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ఆచంట వేమవరం 90 - O - O పెనుగొండ , 505 - O - O ඩ්ජ්හීඩ්ට්ඨ 459 - 5 - 4 తణుకు 1577 - 4 - 8 (లాలాజీ నిధి రు.3) దువ్వ 232 - O - O తాడిపర్రు - 40 - O - O వడూరు 116 - O - 0 తేతలి 35 - 8 - O బ్రాహ్మణగూడెం 116 - O - O నిడదవోలు 251 - O - O నేలటూరు 81 - O - O 28-4-1929 చాగల్లు 397 - 15 - 6 దేవరపల్లి 506 - 5 - 1 దొమ్మేరు 500 - O - O కొవ్వూరు 943 - 13 - 6 (లాలాజీ నిధికి రు. 310) ఇసుక పల్లి 4 - 11 - 3 మార్గములో - 5 - 2 - O తూర్పు కృష్ణాజిల్లా తరువాత వసూళ్లు 20 - 0 - 0 తూర్పు గోదావరి మార్గంలో వసూళ్ల90 - 3 - 5 O Ω rwr

aළeඨිර්මපාර

────────────────────────────

1. Young India, June 16, 1927.

2.Young India, March 7, 1929.

3.సత్యాగ్రహి, ఏప్రియల్ 9, 1929. మంగళవారం, పే.2

4. ఆంధ్ర పత్రిక - ఏప్రియల్ 24, 1929. బుధవారం, పే-6, కా - 1 . 5. పై మూలం పే-6, కా-3 . 6.ఆంధ్రపత్రిక - ఏప్రియల్ 27, 1929, శనివారం, పే-16, కా-3 10. 11. 12. 13. 14. 15. 16. 7. 18. 19. 21. 22. 23. 24. 25. 26. 27. 29. 30,

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

ఆంధ్ర పత్రిక - ఏప్రియల్ 24, 1929. బుధవారం, పే-6, కా - 1. Iš čávoevo పే-6, కా-2 ఆంధ్ర పత్రిక - ఏప్రియల్ 29, 1929. సోమవారం, పే-3, కా-1. ඩී ඊරා”ළුට పే-9, పూర్తిగా, ఆంధ్రపత్రిక-ఏప్రియల్ 24, 1929. బుధవారం, పే-6, కా-3. ఆంధ్రపత్రిక=ఏప్రియల్ 25, 1929, గురువారము, పే-7,కా-1. ఆంధ్రపత్రిక-ఏప్రియల్ 27, 1929, శనివారము, పే-16 కా-8&4 కొడాలి ఆంజనేయులు : ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1978. 3-464. ఆంధ్రపత్రిక ఏప్రియల్ 27, 1929, శనివారము, పే-19, కా-3 సత్యాగ్రహి, ఏప్రియల్ 30, 1929. మంగళవారం, పే-12 కా-2 మరిము ఆంధ్రపత్రిక, ఏప్రియల్ 27, 1929, శనివారము పే-14, కా-1. ఆంధ్రపత్రిక-ఏప్రియల్ 29,1929 సోమవారము, పే-13, కా-1&2 ఆంధ్రపత్రిక-ఏప్రియల్ 26, 1929, శుక్రవారం, పే-11, కా-1. ఆంధ్రపత్రిక-ఏప్రియల్ 27, 1929, శనివారము, పే-II, కా-3, ఆంధ్రపత్రిక ఏప్రియల్ 26,1929, శుక్రవారం, పే-11, కా-1. ఆంధ్రపత్రిక-ఏప్రియల్ 27, 1929, శనివారం, పే-10, కా-1. | ධීෂ්ණුෂ් కొండా వెంకటప్పయ్య- మహాత్ముని ఆంధ్రదేశసంచారము, ఆంధ్రగ్రంధమాల, 1985 పే-18 ఆంధ్రపత్రిక-ప్రత్యేక అనుబంధము-ఏప్రియల్ 27, 1929, శనివారము, పే-10, కా-2&3 ఆంధ్రపత్రిక-ప్రత్యేక అనుబంధము ఏప్రియల్ 27, 1929. పే-10, కా-2&3 ఆంధ్రపత్రిక=ఏప్రియల్ 29, 1929, సోమవారం, పే-6, కా-1. పై మూలం పే-15, కా-1. ඩී. ධීක්‍ෂා”ළුට పే-6, కా-2. దేశభక్త కొండావెంకటప్పయ్య మహాత్ముని ఆంధ్రదేశసంచారము - పే-82 కృష్ణాపత్రిక– మే-18 మే 1929, శనివారము పే-8&4 Young India, May-9, 1929. Thursday, P-7,88