పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము/పరిచయము - తొలిప్రయోగాలు

వికీసోర్స్ నుండి



1. పరిచయము - తొలి ప్రయోగాలు

భారత స్వాతంత్ర్యోద్యమం నందు గాంధీజీ ప్రవేశంతో ఉద్యమ స్వరూపమే మూరి పోయింది. కుటిలరాజకీయాలతో కాకుండా నైతిక పరమైన నిబద్ధతతో జీవితాన్ని గడిపి జనబాహుళ్యంలో ప్రేమను పొందవచ్చని గాంధీజీ నిరూపించారు. అనైతికత విశృంఖల నృత్యం చేస్తున్న కాలంలో ఉన్నతమైన మానవసంబంధాల స్థాపన కోసం నిలచిన మహోన్నత మూర్తి ఆయన. కొన్ని తరాలు గడిచాక ఈ భూప్రపంచం మీద ఇంతటి ఉన్నతమైన వ్యక్తి ఒకరు జీవించారా అని జనం ఆశ్చర్యం చెందుతారు. గాంధీజీ 1869 అక్టోబరు, 2న కథియవాడ్ సంస్థానములోని పోరుబందరునందు జన్మించారు. 1891లో ఇంగ్లాండు నందు బారిష్టర్ అయ్యారు. 1893లో దక్షిణ ఆఫ్రికాకువెళ్ళి రెండు దశాబ్దములు పైగా నివసించారు. అక్కడ శ్వేతజాతి ప్రభుత్వం వలస వచ్చిన ప్రజలపై సాగిస్పూన్న జాత్యహంకార, జాతివిచక్షణ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. అహింసాయుత 'సత్యాగ్రహం సాగించి, అనేక సార్లు జైళ్ళకువెళ్ళి అవమానములకు గురియైనారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అణచివేత విధానాలకు ప్రపంచమంతా నిరసనలు తెలియచేసేటట్టు చేయగలిగారు. చివరకు 1914 జూన్ 27న 'ఇండియన్ రిలీఫ్ బిల్"ను ప్రభుత్వం ఆమోదించి. ఆఫ్రికాలోని భారతీయులకు ఊరట కలిగించినది. గాంధీజీ కనిపెట్టిన "కొత్త పద్ధతి సత్యాగ్రహం మంచిఫలితాలనిచ్చింది. సత్యం-అహింస దీని ముఖ్య ప్రక్రియలు. దీనిని "ఆత్మశక్తి లేక ప్రేమశక్తి అని ఆయన నిర్వచించారు. సత్యాగ్రహి ఏది తప్ప అని భావిస్తాడో, దానికి లొంగటానికి నిరాకరిస్తాడు. ఎంత రెచ్చగొట్టినా శాంతి యుతంగానే చెడును ప్రతిఘటిస్తాడు, కాని చెడు చేసేవాడిని ద్వేషించడు. ప్రత్యర్థికి కష్టం కలిగించటం ద్వారా కాక, తను కష్టపడుతూ సత్యాన్ని చాటుతాడు. దాని ద్వారా చెడు చేసేవాని హృదయం పరివర్తన చెందుతుందని ఆయన ఆశించారు. విజయం సాధించాలంటే సత్యాగ్రహి భయాన్ని ద్వేషాన్ని, అసత్యాన్ని పూర్తిగా త్యజించాలి. 'సహాయనిరాకరణ బలహీనుల ఆయుధయైతే, సత్యాగ్రహం బలవంతుని ఆయుధం అని గాంధీజీ అన్నారు.

గాందిీ దక్షిణ ఆఫ్రికా నుండి 1915-16లలో భారత దేశమునకు తిరిగి వచ్చారు. తన రాజకీయ గురువుగా భావించిన గోపాలకృష్ణ గోఖలే సలహాననుసరించి దేశమంతా సందర్శించారు. వివిధ వర్గాలవారి సమస్యలను అవగాహన కావించుకొన్నారు. సత్యాగ్రహం దక్షిణ ఆఫ్రికాలో విజయవంతమైనప్పడు భారతదేశంలో ఎందుకు ప్రయత్నించకూడదు అని ప్రశ్నించుకొన్నారు. "బ్రిటీషు ప్రభుత్వం శక్తివంతమైన ప్రభుత్వ మనడంలో నాకు ఎటువంటి సందేహములేదు. అదే విధంగా సత్యాగ్రహం సర్వసంజీవని అనటంలో కూడా నాకు ఎటువంటి సందేహము లేదు" అని అన్నారు. బీహారులోని చంపారన్ నీలిమందు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

తోటల వ్యవసాయదారుల సమస్యలను పరిష్కరించటంలో ఆయన చూపిన చొరవ, తెగువ, గుజరాత్లోని కైరాజిల్లాలో వ్యవసాయదారుల సమస్యలను పరిష్కరించుటకు చేపట్టిన సత్యాగ్రహం, అహ్మదాబాదు మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారమునకు ఆయన చేపట్టిన సమ్మె తదుపరి నిరాహార దీక్ష అద్భుతమైన విజయాన్ని సాధించాయి.

గాంధీజీ భారతదేశంలో చేపట్టిన ఈ మొదటి ప్రయోగాలు పామర జనానికి, గ్రామీణ ప్రాంతములలోని కర్షకులకు, పట్టణములందలి కార్మికులకు ఆయనను సన్నిహితం చేశాయి. గాంధీజీ నిరాడంబరమైన అలవాటు, ఇంగ్లీషు కన్నా భారతీయభాషలను ఎక్కువగా ఉపయోగించడం, మతగ్రంధాలను ఉట్టంకిస్తూ ఉపన్యసించడం, సునిశితమైన పదజాలాన్ని వాడటం, కార్మిక, కర్షకసమస్యలకు స్పందిస్తూ ఆయన సాగించిన సఫలీకృతమైన ఉద్యమాలు ప్రజలపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగించాయి. ఆవిధంగా గ్రామీణ సామాన్య ప్రజానీకంతో పూర్తిగా తాదాత్మ్యంపొందిన నాయకులు బహుశ గాంధీజీ ఒక్కరే అని చెప్పవచ్చును. గాంధీజీ తన వ్యక్తిగత జీవితాన్ని గ్రామీణులకు సుపరిచితమయిన పద్దతులలో తీర్చిదిద్దు కున్నారు. వారికి సులభంగా అర్థమయ్యేభాష మాట్లాడారు. అతి స్వల్ప కాలంలో ఆయన భారత దేశమునందలి గ్రామసీమలలో నివసించే పేదవారికి, అట్టడుగునపడి ఉన్న పామర జనానికి నారాయణుడైనారు. ఆయన దేశవిముక్తి కలిగించుటకు అవతరించిన మహాత్ముడని ఋషితుల్యుడని, సామాన్యమానవులకు సేవచేయుటయే జీవిత పరమార్థంగా కలిగినవాడని, ప్రజలు భావించారు. అట్టి వ్యక్తి ఆదేశించిన పిలుపునకు హృదయపూర్వకంగా స్పందించటం తమ ధర్మమని వారు విశ్వసించారు. దానికి బ్రిటీషు ప్రభుత్వం పట్ల వివిధ వర్గాలలో ఏర్పడిన అసంతృప్తి తోడైనది. ప్రజలలో అసంతృప్తి లేనప్పడు నాయకుడెంతటివాడైన వారిని ఉద్యమాలలో పాల్గొనేటట్లుచేయలేడు. ప్రజల అసంతృప్తి, వారిని నడిపించగల నాయకుడు ఈ రెండూ కలిసి ఉద్యమానికి మార్గాన్ని సుగమం చేశాయి. ఆ విధముగా ఆయన భారతీయులకు వాస్తవమైన ప్రతినిధి అయినారు.

అదే సందర్భములో ప్రపంచ యుద్దానంతరం బ్రిటీష్ ప్రభుత్వం రౌలట్ బిల్లలను ప్రవేశపెట్టి భారత పౌరుల హక్కులను శాంతి సమయంలో కూడా హరించతలపెట్టింది. ఈ బిల్లలు చట్టములుగా ජාපඬිවරයිජ් సత్యాగ్రహోద్యమం ప్రారంభిస్తానని గాంధీజీ ప్రకటిం చారు. అయినప్పటికీ ప్రభుత్వం రౌలట్ చట్టాలను ఆమోదించింది. గాంధీజీ సత్యాగ్రహోద్యమా నికి పిలుపునిచ్చారు. దీనిప్రకారం దేశప్రజలంతా 1919 ఏప్రియల్ 6వ తేదీన సార్వత్రిక హరాజ్ జరపాలి, అత్యవసరమైన పనులు తప్ప మిగిలినవన్నీ స్తంభింపచేయాలి. గాంధీజీ పిలుపుననుసరించి ఆంధ్రరాష్ట్రంలో సమావేశాలు జరిపారు. ప్రశాంతంగా హరాళ్ నిర్వహించారు. కాని పంజాబులో కాంగ్రెసు మహాసభ జరగవలసి ఉండగా ముందుగానే డాక్టర్ కిచూ, డాక్టర్ సత్యపాల్లను ప్రభుత్వం నిర్బంధించింది. గాంధీజీ పంజాబులో పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

ప్రవేశించరాదని ఆంక్షలు విధించింది. ఏప్రియల్ 13వ తేదీన ప్రభుత్వ చర్యకు నిరసన తెలిపేందుకు జలియనువాలాబాగ్లో బహిరంగ సమావేశం జరిగింది. జనరల్ డయర్ సైనికులతో వచ్చి మందుగుండు సామగ్రి అంతా అయ్యేంతవరకూ కాల్పులు జరిపాడు. వేయిమంది పైగా ప్రజలు మరణించారు. అనేకులు గాయపడినారు. క్రమంగా ఈ ఉదంతం దేశమంతా వ్యాపించింది. ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. దేశములోని పత్రికలన్నీ ఈ దురాగతాల్ని నిశితంగా విమర్శించాయి. అదివరకటి మితవాద జాతీయనాయకులు అనేక మంది కూడా యిప్పడు గాంధీజీ బలగంలో చేరిపోయారు. పంజాబు విషాదగాధ గాంధీజీని భారత రాజకీయాలలో అగ్రగామిని చేసింది.

హిందూ ముస్లిం ఐక్యతకు, పంజాబు దురంతాలకు నిరసన తెలియచేయటానికి గాంధీజీ చూపిన అహింసాయుత, సహాయనిరాకరణ ఉద్యమ మొక్కటే మార్గమని దేశప్రజలు భావించారు. 1920 సెప్టెంబరు, 4న కలకత్తాయందు, డిశంబరు, 26న నాగపూర్ నందు సమావేశమయిన కాంగ్రెసు మహాసభ గాంధీజీ పిలుపుననుసరించి శాంతియుతంగా, స్వరాజ్యం సాధించాలని తీర్మానించింది. నాగపూర్ సమావేశం కాంగ్రెసు సంస్థకు ఒక నూతన నియమావళిని ఇచ్చి దాని స్వరూపాన్నే మార్చివేసింది. త్యాగాలకు సిద్ధంకావాలని ఎన్నికలను, ప్రభుత్వ న్యాయస్థానాలను, విద్యాసంస్థలను, ఉద్యోగాలను, విదేశీ వస్రాలను, మధ్యం , దుకాణాలను బహిష్కరించాలని, నిర్మాణాత్మకమగు ఖాదీ ఉత్పత్తి, అస్పృశ్యతా నివారణ, జాతీయ పాఠశాలలు, పంచాయితీ కోర్టులు ఏర్పాటు చేసుకోవాలని కోరటం జరిగింది. దేశప్రజలు తనతో సహకరిస్తే సంవత్సరంలో స్వరాజ్యం సాధిస్తానని గాంధీజీ ఇచ్చిన హామీ ప్రజలలో విద్యుత్ ప్రవాహం వలె పనిచేసింది. దేశమంతటా ఇంతకు ముందెన్నడూ ಪ ఉత్సాహం వెల్లివిరిసింది. ఉన్నత వర్గాలవారు, దిగువవర్గాలవారు, పురుషులు, స్త్రీలు, హిందువులు, ముస్లింలు, సనాతనులు, అధునాతనులు అందరూ సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అనేకమంది మహిళలు ఘోషావదలిపెట్టి స్వాతంత్ర్యసమరంలో చేరారు. తమ ఆభరణములను తిలక్ స్వరాజ్యనిధికి సంతోషముగా సమర్పించారు.

1921 మార్చి 31, ఏప్రియల్ 1న అఖిలభారత కాంగ్రెసు సంఫుసమావేశము విజయవాడలో జరిగింది. గాంధీజీ, మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్, పటేల్తో సహా అనేకమంది జాతీయ నాయకులు విచ్చేశారు. వారిని దర్శించి ఉత్తేజం పొందటానికి రెండు లక్షలకుపైగా ప్రజానీకం వెలువగా విజయవాడకు వివిధ వాహనములపైననూ, పాదయాత్రలు చేసుకొంటూనూ వచ్చారు. రెండు రోజులు నాయకులను చూచి, సందేశాలు విని, వారి స్వస్థానములకు వెళ్ళి, తాము విన్నదీ, కన్నదీ ప్రజలలో యథాశక్తి ప్రచారం చేశారు. ఆ సమావేశాలలో పశ్చిమగోదావరి జిల్లా గాంధీజీ సృతిపథంలో నిలిచిపోయే రెండు సంఘటనలు జరిగాయి. అవి, మొదటిరోజు సాయంత్రం అసంఖ్యాకమగు ప్రజలు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీ మైదానంలో సమావేశమైనారు. గాంధీజీ ప్రజలమధ్య నుండి అతికష్టముపై సభామండపముపైకి వచ్చారు. (Yට්ටඨිසීදී) దర్శంచినంతనే ఆయనను సమీపమునుండి సందర్శించవలెననే కుతూహలంతో ఒకరినొకరు త్రోసుకుంటూ సభామండపము చుటూకట్టిన కర్రలను విరుగగొట్టి వేదిక పైకి దూసుకొచ్చారు. వేదిక కర్రలతో నిర్మించుట వలన కంపించ సాగింది. గాంధీజీని అంగరక్షకులు వేదిక పైనుండి జాగర్తగా తీసుకొనిపోయారు. ఆ సమయమున పశ్చిమ గోదావరిజిల్లా, చాటపర్రు వాస్తవ్యరాలు మాగంటి బాపినీడు గారి భార్య ಅನ್ನಿಪು'ರಾದೆವಿ గాంధీజీకి రక్షణగానిలిచి, జనబాహుళ్యం నుండి ఆయనను కాపాడింది.

మరుసటి రోజున 'ఆంధ్రరత్న దుగ్గిరాలగోపాలకృష్ణయ్య నాయకత్వంలో సభాస్థలి ವಿರಕ್ಹಲ್ಲು సమర్థవంతముగా నిర్వహించబడ్డాయి. గాంధీజీ, తదితర నాయకులు సహాయనిరాకరణ ఉద్యమ లక్ష్యాలను, ప్రజలు నిర్వహించవలసిన కార్యక్రమాలను వివరించారు. ఆసభయందు ఖద్దరు ధరించిన ఒకే ఒక మూగంటి అన్నపూర్గాదేవి. సభయందు తిరుగుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రజలను శాంతముగా నుండమని విజ్ఞప్తిచేసూంది. గాంధీజీ "తిలక్ స్వరాజ్యనిధి'కి చందాలను అభ్యర్థించగానే ఆమె తన మంగళ సూత్రములు మినహా తనవంటి పైనున్న రూ. 3000/- విలువ కలిగిన 200 కాసుల బంగారు అభరణాలను గాంధీజీకి ఆనందంగా సమర్పించి, సభలోని వారందరినీ ఆశ్చర్యంలో మంచివేసింది. గాంధీజీ 'అమ్మా! నీవు నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకొన్నావా?" అని అనగా 'నా తల్లిదండ్రులునా ఇష్టాన్ని ఎన్నడూ కాదనరు. నా ఆభరణములపై నాకు పూర్తి స్వేచ్చఉంది. ఈ మహత్తర కార్యానికి సహాయపడినందుకు వారు ఆనందిస్తారు కూడా" అని అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడింది. జనసమూహములోనికి వెళ్ళి ధనము, నగలు సేకరించి నిధికి చేర్చింది. గాంధీజీ పై సంఘటనలను అనేక సందర్భాలలో స్వయంగా తెలియచేయటం జరిగింది. ఈ సమావేశాల అనంతరం గాంధీజీ ఆంధ్రలో పర్యటించారు. అందులో భాగముగా סחo&c8 ಮುದ್ದಿ మొదటిసారిగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరును సందర్శించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇఛ్ఛారు.

జ్ఞపికలు:

1. M.K.Gandhi - "An Autobiography or A Story Of My ExperimentsWith Truth. The Navajivan Trust, 1927, Ahmedabad. P266. 2. Bipan Chandra-Freedom Struggle, National Book Trust, New Delhi, 1972 Pf 19. 3. దేశభక్త కొండా వెంకటప్పయ్య-మహాత్ముని ఆంధ్రదేశ సంచారముఆంధ్రగ్రంధమాల, చెన్నపురి పే. 5 4. Young India, October, 1927.