Jump to content

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము/హరిజనయాత్ర 1933

వికీసోర్స్ నుండి

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

4. deldēt 1933

1932 ఆగష్టు 17న బ్రిటిష్ ప్రధాని కమ్యూనల్ అవార్డ్ను ప్రకటిస్తూ హరిజనులు అల్పసంఖ్యాక వర్గం కనుక వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరచుతున్నట్లు ప్రకటించాడు. ఆవిధంగా చేయటం దేశప్రజలలో విభజన, విభేదాలు సృష్టించటానికే అనే భావనతో సెప్టెంబరు 20 న గాంధీజీ అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. గాంధీజీని నిరాహార దీక్ష విరమింప చేయటానికి, హరిజనులను ఉమ్మడి నియోజకవర్గాల కనుగుణంగా మలచటానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. మరి ఒక వైపు ప్రభుత్వాధికారులు కమ్యూనల్ అవార్డ్కు అనుకూలంగా హరిజన ప్రతినిధులను కూడగట్టి సమావేశాలను నిర్వహించారు. గాంధీజీ దీక్షకు అనుగుణంగా ఆంధ్రాలో సానుభూతి నిరాహార దీక్షలు ప్రారంభమైనవి. అంటరానితనం పాటించబోమని పెక్కుమంది ప్రమాణాలు చేశారు. అందుకు అనుగుణంగా హరిజనుల్ని గ్రామానికి చెందిన బావులలో నీళ్ళతోడుకోనిచ్చారు.

తాడేపల్లిగూడెంలో దామోజీవరపు నరసింహరావు పంతులు, డా|తేతలి సత్యనారాయణ రావు హరిజన వాడలలో నూతులు తవ్వించి వారికి సహాయంచేశారు. హరిజనులకు దేవాలయములందు ప్రవేశం కల్పించటానికి చెరుకువాడ వెంకటనరసింహం, మాగంటి బాపినీడు, కన్నేపల్లి సత్యనారాయణ, మంగిపూడి పురుషోత్తమశర్మ జిల్లాలో ఎంతో కృషిగావించారు. దేశనాయకులు అంబేద్కర్ను సంప్రదించి, గాంధీజీతో రాయబారములు నిర్వహించి సెప్టెంబరు 24న ఒక ఒడంబడికకు రాగలిగారు. rveටඨිකී సెప్టెంబరు 26న నిరాహారదీక్షను ముగించారు. గాంధీజీ విజ్ఞప్తిని అనుసరించి, కాంగ్రెసు అధ్యక్షుడు మే 95 శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆరువారాలు నిలిపి ವೆನ್ತಿಲ್ಲ ప్రకటించాడు. తరువాత 1934, మే 20న శాసనోల్లంఘన ఉద్యమం పూర్తిగా ఉపసంహరించుకొనబడింది.

గాంధీజీ హరిజనోద్ధరణనిమిత్తము 1933 నవంబరు 8 నుండి 1934 జూలై చివరి వారం వరకూ అఖిలభారత హరిజన యాత్ర వివిధ రాష్ట్రములలో సాగించవలెనని సంకల్పించారు. అందు భాగముగా ఆంధ్రదేశ పర్యటన 1933 డిశంబరు 16 నుండి 29 వరకూ సాగినది. హరిజన యాత్ర ప్రారంభించటానికి ముందు గాంధీజీ ఈవిధంగా ప్రకటించారు. "నేను పుట్టుకవలన సవర్ణ హిందువుడనయినా నా బుద్ధిపూరకంగా హరిజనులలో కలిసిపోయినాను. హరిజనుని అస్పృశ్యునిగా భావిస్తూన్నంత వరకు నేనుకూడ అస్సృశ్యుడనే హరిజనునకు ప్రవేశంలేని దేవాలయంలో నాకు తావులేదు. హరిజనులకు నేను చేసే సేవ ఈశ్వర సేవయే అనుకొంటున్నాను. నేనీపనిని రాజకీయ SLLSS LSLSLSSSLS -పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ఉద్దేశంతోగాని, రాజకీయప్రయోజనాల కోసంగాని చేయటం లేదు. ఇది అత్యుత్తమమయిన మానవసేవ అని నాతలంపు. ఇది హిందూమతానికి సంబంధించిన ఆంతరంగిక సంస్కరణ. హిందువుల మయిన మనము ఇంతకాలం ఎవరిని సంఘ బాహ్యలను S ఎవరిపట్ల చెప్పరాని అపచారాలను చేసినామో వారికి క్షమాపణ పూరకంగా హరిజనసేవ అనే ఈప్రాయశ్చిత్త కర్మ ఉద్దేశించబడినది". ఈ ప్రకటన గాంధీజీ హరిజన యాత్ర ప్రధాన ఉద్దేశాన్ని ಆಲಿಯಿವೆನಿಝ್ರಾಂದಿ.

మహాత్ముని ఆంధ్రదేశ సంచారమును గూర్చి ఆంధ్రరాష్ట్ర హరిజనసేవక సంఘప్రధాన కార్యదర్శి మాగంటి బాపినీడు, ఆయా జిల్లాల హరిజనసేవక సంఘ కార్యదర్శులు చక్కని ఏర్పాట్ల గావించారు. ఈ సందర్భములో ప్రజలు నిర్వర్తించవలసిన విధులను గూర్చి బాపినీడు ఈ విధంగా వ్రాశారు. "మహాత్ముని హరిజనసేవా నిధికి సన్మానసంఘం ఏర్పరచి వివిధ సంఘాల పక్షాన విరాళాలు ಏಮೈಟಲ್ಲ విశ్వప్రయత్నాలు చేయవలెను. කිඟුළුළු” ఇకముందు హరిజనసేవా కార్యక్రమాన్ని సాగించటానికి ఈ నిధియే మూలాధారము. గాంధీజీ సభకు రావటానికి ముందే సేకరించిన మొత్తం లెక్కపెట్టి ఎవరెంత ఇచ్చినది వివరంగా వ్రాసి ఉంచవలెను. ఒక నిర్ణీతస్థలం నుండి వేరొక స్థలానికి పోయేటప్పడు మార్గము మధ్యలో మహాత్ముని కారుకు అడ్డంవచ్చి కార్యక్రములకు ఆలస్యమూ, ఆటంకమూ కలిగించవద్దు. అయా గ్రామప్రజలకు నచ్చజెప్పి తగు ఏర్పాట్ల చేయవలెను. మార్గమధ్యంలోగాని, సభలలోగాని మహాత్మునిపై పూలదండలు పూలగుత్తులు విసరరాదు. మహాత్ముని కారుకెవరూ అడ్డం పడుకొనరాదు. మార్గమధ్యాన గాంధీజీ ప్రయాణంచేసే గ్రామాలలోను, ఆయన ఆగేచోట్లలోను సుశిక్షితులైన స్వచ్ఛంద సైనికులు ఉండి తగిన ఏర్పాట్ల చేయవలెను. రైల్వేస్టేషను వద్ద నుండి సభలోకి వచ్చేటప్పడు మార్గంలో వాలంటీర్లు రోడ్డు కిరువైపుల నిలబడి మోటారు ఆలస్యం లేకుండా ವಳ್ಳ೬ುಲ್ಲು చూడవలెను. హరిజన సమస్యకై చారిత్రాత్మక ప్రాయోపవేశంచేసి, ఇరవై ఒక్క దినం ఉపవాసం చేసి మృత్యు ముఖమునుండి వెలువడిన గాంధీజీ దర్శనార్ధం అనేక మంది నిరీక్షిస్తూ disoė Jočóo. అందువలన నిశ్శబ్దసభలు ఏర్పాటు చేస్తేగాని అనుకున్న ప్రయోజనం కలుగదు. సభ ఎంత చప్పడు లేకుండా జరిగితే మహాత్మునికి అంత సంతోషము. మహాత్ముని సందేశం ప్రజలందరికి చక్కగా వినిపించడానికి దూరశ్రవణయంత్రాలకు కేంద్ర హరిజన సేవక సంఘంవారునూ, రాష్ట్ర సంఘం వారునూ ప్రయత్నం చేస్తూన్నారు. మహాత్ముడు పోయే వీధులను విదేశీ కాగితాలతో కాక పచ్చని ఆకుతోరణాలు మొదలయిన వానితో చక్కగా అలంకరించవలెను. ఈ విధంగా ఆంధ్రదేశంలో మహాత్ముని హరిజన పర్యటన జయప్రదం చేయటానికి మీ అందరి సహకారం అభిలషిస్తున్నాను." * పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీజీ పశ్చిమగోదావరిజిల్లా పర్యటన డిశంబరు 27, 1933 బుధవారం నాటి నుండి నిశ్చయింపబడినది. జిల్లా హరిజనసేవకసంఘ అధ్యక్షునిగా కలిదిండి గంగరాజు, కార్యదర్శిగా చంగల్వల చిట్టిపంతులు నియమించబడ్డారు. ప్రతీ పట్టణానికి ఆహ్వానసంఘము ఏర్పడి కావలసిన కార్యక్రమాలు చురుకుగా నిర్వహించటం ప్రారంభించారు. (Yeටඨිසී రాక సందర్భమున మోహన్దాస్ ఖద్దరు పరిశ్రమాలయము, ఏలూరు వారు ఒక రూపాయి కొనుగోలుపై అణా (ఆరు పైసలు) తగ్గింపు ఇస్తున్నట్లు, డిశంబరు 18 నుండి 81 వరకూ

మాగంటి బాపినీడు ఆంధ్రరాష్ట్ర హరిజనసేవక సంఘప్రధానకార్యదర్శి

ఈ సౌకర్యం లభించునని దండు నారాయణరాజు ప్రకటించారు. * దాట్ల చిననీలాద్రిరాజు, పెనుమంట్ర, ఆచంట పెదగోపాలము, పాలకొల్లు మొదలగువారు హరిజనోద్ధరణ కార్యక్రమముతో పాటు హరిజన బాలబాలికలకు గాంధీజీ సమక్షమున ఖద్దరు దుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించినారు. మిగిలిన ဗြိသံဝဲ&သ8သ©ဃ కూడ ఇట్టి కార్యక్రమములు చేపట్ట వలెనని విజ్ఞప్తి చేశారు.

గాంధీజీ హరిజనయాత్ర సందర్భములో డిశంబరు 16వ తేదీ నుండి, జనవరి 4 1934 వరకూ 20 రోజులు గడిపినారు. అందు 20, 21, 22 తేదీలు మదరాసు కార్యక్రమములలో పాల్గొన్నారు.డిశంబరు 18,19,25,26తేదీలు జనవరి 1,2 తేదీలు గాంధీజీ విశ్రాంతి దినములు. మొత్తము గాంధీజీ ఆంధ్రదేశములో సంచరించిన దినములు 11 రోజులు మాత్రమే. ఈ కాలంలో గాంధీజీ 10 జిల్లాలు సంచారము చేశారు. 1,024 మైళ్ళ రైలుపైన, 667 మైళ్ళ మోటారు వాహనములపైన, 15 మైళ్ళస్టీములాంచిపైన, 2 మైళ్ళ కాలినడకను మొత్తం 1708 మైళ్ళ సంచారము చేశారు. 76 గ్రామములు, పట్టణములను సందర్శించెను 60 సభలలో ఉపన్యాసములు ఇచ్చెను. 6,20,000 మందివారి ఉపన్యాసములు వినుటకు అవకాశము కలిగింది. దాదాపు 12,00,000 మందికి వారిని దర్శించు భాగ్యము దక్కింది." is a -పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీజీతో పాటు హరిజన యాత్రలో పాల్గొనిన అనుచరవర్గము.

1. ప్రొఫెసర్ మల్మానీ : గాంధీజీ హరిజన యాత్రలో కార్యక్రమములు నిర్ణయించే బాధ్యత వహించిన కార్యదర్శి,

2. మీరాబెన్ : ఆంగ్లదేశపు ఓడల అధికారి స్టేడ్ కుమార్తె. భారతదేశమునకు వచ్చి గాంధీజీ శిష్యురాలైనది. గాంధీజీని కనురెప్పవలె కాపాడేది. ఆయన కమోడ్ సైతము శుభ్రపరిచేది. మహాత్ముని భోజనము, వసతి, నిద్ర అన్నీ ఆమె ఏర్పాటు చేస్తూండేది. రైళ్ళలో క్రింద పడుకొనేది. గాంధీజీ వసతులలో అవసరమయిన మరుగుదొడ్లు సైతం పరిశుభ్రం చేసేది.

3. చంద్రశంకర శుక్లా : మహదేవదేశాయి జైలు నందున్నందున అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించారు. గుజరాత్ "హరిజన్ సంపాదకుడు. గాంధీజీ ఉపన్యాసాలు పదిలపరిచేవాడు.

4. శ్రీమతి ఉమాబజాజ్ : జమన్లాల్ బజాజ్ రెండవ కుమార్తె. గాంధీజీకి సేవలు చేయుటలో మీరాబెన్ కు సహాయపడేది.

5. శ్రీమతికృష్ణాబెన్ : కర్ణాటకయువతి. ఉత్తరాలు చదువుటయందు, వంటలయందు మీరాబెన్కు సహాయపడేది.

6. విశ్వనాధపాండ్య : దామోదర దాసు : వీరిద్దరూ సభలలో వసూలైన విరాళాలు వివరాలు పదిలపరిచే కోశాధికారులు.

7. రామనారాయణ్ చౌదరి : ఉత్తర ప్రత్యుత్తరాలలో గాంధీజీకి సహాయపడేవారు. 8. శర్మ : గాంధీజీ పరివారపు సామగ్రిపదిలపరిచే బాధ్యత వీరిది

పశ్చిమగోదావరిజిల్లాలో గాంధీజీ

గాంధీజీ ఆయన బృందము తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమం నుండి డిశంబరు 26, 1933 సాయంకాలం గం|6-30ని|లకు ప్రభాకరం అను స్టీంలాంచిలో పశ్చిమగోదావరి జిల్లాలోని తాళ్ళపూడి రేవుకు బయలుదేరారు. జిల్లా కాంగ్రెసు నాయకులు దండు నారాయణరాజు, జిల్లా హరిజనసంఘ అధ్యక్షులు కలిదిండి గంగరాజు సీతానగరం వెళ్ళి గాంధీజీని ఆహ్వానించి తోడ్కొని వచ్చారు. స్టీంలాంచి గోదావరిలో ఇసుకతిప్పకు తగులుట వలన నది దాటుటకు సుమారు 45 ని! ఆలస్యమైనది. లాంచిలోని సామగ్రి చిన్నపడవలోనికిమార్చి కొందరు సహచరులను కూడ వేరుగా తీసుకొని వచ్చిరి చివరకు. తాళ్ళపూడి రేవునకు రాత్రి 8-00 గం|లకు చేరారు . ( Jeටඨිකී పర్యటన ఏర్పాట్లకు ఏలూరు నుండి S”ဆိ်သဎွÓင္ငံ సత్యనారాయణ, నిడదవోలు నుండి శనివారపు సుబ్బారావు, మోటారులను, బస్సులను తీసుకొనివెళ్ళారు. గాంధీజీ, ෙ66 • పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

ఆయన కార్యదర్శి మల్కానీ, జిల్లా హరిజన సంఘ కార్యదర్శి చెంగల్వల చిట్టిపంతులు, ఆంధ్రరాష్ట్ర హరిజన సేవాసంఘ ప్రధాన కార్యదర్శి మాగంటి బాపినీడు ఒక మోటారు కారునందు కూర్చున్నారు. వీరికి ముందు కారులో దండు నారాయణరాజు, శనివారపు సుబ్బారావు కూర్చుండి గాంధీజీ కారుకు మార్గము చూపుచుండిరి. కారులు బయలుదేరుటకు ముందుగా తాళ్ళపూడి గ్రామస్తుల తరపున డా|గోటేటి శ్రీరామచంద్ర మూర్తి, పరస వేణగోపాలరావు, కొందరు వైశ్యులు రూ.100/-లున్నూ ఖద్దరు ಏಿಮಿಲುನಿರ್ గాంధీజీకి సమర్పించుకున్నారు. తాళ్ళపూడిలోనున్న అమెరికను మిషనరీలు ఇరువురు గాంధీజీతో రెండు నిమిషములు మాట్లాడారు. గాంధీజీ వారితో కరచాలనము చేశారు. మార్గము నందు ప్రక్కిలంక గ్రామ వాసుల తరపున కలూరి నరసింహం రూ. 50/- లు గాంధీజీకి అందజేశారు. మలకపల్లి గ్రామమున కుంటుముక్కల సత్యన్నారాయణ, కేశిరాజు వెంకట నరసింహరావు మరియూ గ్రామస్తులు గాంధీజీని ఆపి నమస్కరించి రూ. 116/- సమర్పించారు. ధర్మవరం గ్రామసులు రూ.20/– సమర్పించారు.

f 翰 岛 կիիիիիիիիիիիիիիիի փ 苗 * կիկի 前 嵩 կի ప్తి 萤 エ 嵩 岛 敷 R կ 鼓 瞿 赣 蔷 կ կկ կ ֆֆ ଜ୍ଞା

置 LLSLS L S S SL GS S S S S YSS SSSSS LSLSLSLSLS

చాగల్లనందు ప్రశాంతమైన ఏర్పాటుచేయనందున మహాత్మాజీ మోటారు కారును ఆపలేదు. నిడదవోలు నందు డా||జాన్, డా||జీడిగుంట కామరాజు, ఉద్దగిరి వీర్రాజు, బొమ్మకంటి వెంకటనరసింహంగారు సభను నిర్వహించారు. సుమారు 10 వేల మంది పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ప్రజలు హాజరైనారు. సభలో రూ.200/-లున్నూ మరియు రూ. 50/- విలువ గల ఖద్దరు ಏನ್ರಲು గాంధీజీకి సమర్పించారు. గాంధీజీ ఐదు నిమిషములు ఉపన్యసించి Oগঞ্জ 9గం|లకు తణుకు బయలుదేరారు."

తణుకు

గాంధీజీ 26 వ తేదీ రాత్రి 8గం|లకు తణుకు విచ్చేయనున్నారని ప్రకటింపబడుటచే సుమారు రెండు వేల మంది స్త్రీ, పురుషులు ఎర్రమిల్లి రామనాధముగారి మేడ వద్ద మహాత్మునిరాకకై నిరీక్షించుచుండిరి. కాని మార్గము నందు ఆలస్యమగుటచే మహాత్మునికారు రాత్రి 10 గం|లకు వచ్చింది. మహాత్మునకు కావలసిన ఏర్పాట్ల చూచుటకు శ్రీమతి మీరాబెన్, ప్రా, మల్కానీ, శ్రీమతి ఉమాబజాజ్, శ్రీమతి కృష్ణాబెన్ మన్నగు పరివారము 20నిముందుగా వచ్చారు. గాంధీజీ రామనాధంగారి మేడపైకి వెళ్ళారు. అనుచరులు ఆయన పడక చుట్టను కూడ పైకి తీసుకొనివెళ్ళారు. గాంధీజీ నిదురించుటకేగిననూ జనసమూహము వెడలక పోవుటచే మహాత్ముడు మేడ ముందరి హాలులోనికి వచ్చి ప్రజలకు దర్శనమిచ్చారు. ముక్కుపై వ్రేలువేసికొని అల్లరి చేయవద్దనియు, అలసియుంటిననియు,

կի

ప్రశాంతముగా వెడలి పోవలసినదనియూ హిందీలో చెప్పారు. తరువాత ప్రజలందరూ ప్రశాంతముగ వెడలిపోయిరి. - మరునాడు 27వ తేదీ ఉదయం గాంధీజీ ప్రార్ధనలో అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు, హరిజన కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు వైకుంఠ ఏకాదశి కావటంచే తెల్లవారు జామున పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

లెక్కచేయక పరిసర గ్రామముల నుండి బహిరంగసభ జరుగనున్న ಬೌಲ್ಡಿ హైస్కూలు క్రీడా మైదానమునకు ఉ. 5 గం|లకే 10 వేల మంది ဒြီ၊ పురుషులు వచ్చిచేరారు. వాలంటీరులు సభయందు అల్లరులు జరుగకుండా శ్రద్ధ వహించారు.

సరిగా గం| 7.15 ని|లకు గాంధీజీ సభాస్థలానికి వచ్చి ప్రత్యేకంగా నిర్మించబడిన వేదికపై ఆసీనులైనారు. యూనియన్ బోరు, తణుకు తాలూకా బోర్డు, పంచాయితీ బోర్డు, హరిజన సేవా సంఘాలవారు ఆయనకు స్వాగతపత్రాలు సమర్పించారు. తరువాత శ్రీమతి మూగంటి ဓံဃ၁၀ိခီsလ္လဝa၁ ဋိပက္ကိလ္ဃ గుడ్డపై చేతితో కుట్టి తయారు చేసిన "స్వాగతం"ను గాంధీజీ చేతులలో ఉంచారు. తరువాత ఆహ్వాన సంఘంవారు సుమారు రూ.400/-లు, ముళ్ళపూడి వెంకటరాయుడు రూ.100/- లు హరిజన నిధికి సమర్పించారు. గాంధీజీ స్వాగతపత్రాలను, ధనము, నగలు సమర్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈలోగా ఎవరో వ్రాసి పంపిన ప్రశ్నలకు సమాధానముగా తాను ఇదివరకు వ్రాసిన వ్రాతలన్నింటినీ, "హరిజన' పత్రికలో చదువుకొనవలెనని చెప్పిరి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానములను తానిదివరకే వ్రాసియుంటిననియు, వాటిని చదివిన తరువాత ఇంకనూ సందేహములేమైనయున్నఎడల సమాధాన మొసగగలననియు వచించి తనవద్దనున్న వస్తువులను వేలము వేయుటకై ఉపన్యాసమును తగ్గించవలసి వచ్చినదని చెప్పి వేలము ప్రారంభించారు. యూనియన్ బోరువారి స్వాగతపత్రమును రామస్వామి నాలుగు రూపాయలకు, తాలూకబోరు వారి స్వాగత పత్రమును గాదె శ్రీరాములు నాలుగు రూపాయలకు, తరువాత గ్రంథమాల ప్రచురించిన "హరిజన సమస్య అను గ్రంధమును వేలం వేయగా పైవారే రెండు రూపాయలకు కొన్నారు. ఈ సమయమున వాలంటీర్లు వసూలు చేసిన రూ.100/ గాంధీజీకి సమర్పించారు. ఇందుకూరి లక్ష్మిపతిరాజుగారి తల్లి మరికొందరు స్త్రీలు కొన్ని బంగారు అభరణములను గాంధీజీకి అర్పించారు. ఈ సభలో గాంధీజీ హిందీలో మాట్లాడగా జిల్లా కాంగ్రెస్ నాయకుడు దండు నారాయణరాజు తెలుగులో అనువదించి చెప్పారు. జయజయ ధ్వనులతో సభముగిసెను.

పాలకొలు

గాంధీజీ తణుకు నుండి పాలకొల్లు బయలుదేరారు. పాలకొల్లు పౌరులు గాంధీజీని సన్మానించుటకు నూతనముగా స్థాపింపబోవు శ్రీ జనకాశ్రమమున బహిరంగ సభ ఏర్పాటుచేసిరి. సభకు సుమారు పదివేలమంది స్త్రీ, పురుషులు హాజరైన్నారు. మహాత్ముని సందర్శనము సభలోని వారెల్లరకు కలుగులాగున యెత్తైన వేదిక ఖద్దరు ఛాందీతోను, పుష్పమాలలతోను కడురమణీయముగ అలంకరించబడింది.

గాంధీజీ తన పరివారముతో é18.30RIleš, ವೆದಿ* వద్దకు వచ్చిన వెంటనే పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

పౌరుల తరపున డా|చొప్పెళ్ల సత్యన్నారాయణ మూర్తి ఆహ్వానించి వేదికపైకి తీసుకొని వెళ్ళారు. పాలకొల్ల పౌరుల పక్షాన డా|చొప్పెళ్ల సత్యన్నారాయణమూర్తి, నర్సాపురం లైgంలూSD ಬೌಲ್ಡಿ పక్షాన, బోరు అధ్యక్షులు గ్రంధి వెంకట రెడ్డి నాయుడు, నర్సాపురం తాలూకా స్త్రీల పక్షాన దిగుమర్తి రామలక్ష్మమ్మ తాలూకా హరిజనుల పక్షాన దాసరి వెంకటరావు సన్మానపత్రములను, పర్సులలో ఉంచిన హరిజననిధిని గాంధీజీకి సమర్పించారు. నర్సాపురం కళావంతుల సంఘము వారు సన్మాన పత్రమును. ఒక రజిత పాత్రను మహాత్మునకు సమర్పించారు. పాలకొల్ల యువజన అస్పృశ్యతా నివారణ సంఘమువారి తరపున డా| ఆచంట పెదగోపాలము సుమారు 200 మంది హరిజన బాలబాలికలకు ఖద్దరు దుసులను మహాత్ముని చేతులతో స్పశింపజేసి పంచిపెట్టారు.

ఉదార స్వభావుడు, ప్రముఖ వ్యాపారి అగు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, వారి సతీమణి గాంధీజీని దర్శించి హెచ్చు మొత్తములను పాదపూజగా నిచ్చివారి ఆశీర్వాదములను పొందారు. సలాది మామిళ్ళయ్య కూడ కొంత ద్రవ్యమును పాద పూజగ నర్పించారు. ఇంకనూ కొందరు ఖద్దరు మొదలుగా గల వివిధ కానుకలను సమర్పించుకున్నారు.

తదుపరి డా|చొప్పెళ్ళ సత్యనారాయణమూర్తి శ్రీజనకాశ్రమమునకు శంకుస్థాపన చేయవలసినదిగా కోరుచూ సువర్ణతాపీని గాంధీజీ హస్తమున ఉంచగా మహాత్ముడు తాపీతో శంకుస్థాపనా శిలను స్పృశించి శ్రీజనకాశ్రమమునకు శంకుస్థాపన చేసినానని ప్రజలకు వెల్లడించారు. తరువాత బంగారు తాపీని వేలం పెట్టినారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి దానిని రూ.100/-లకు కొన్నారు. కళావంతులు సమర్పించిన రజిత పాత్రను చోళ్ళ నరసింహమూర్తి రూ.80/-లకు, స్వాగతపత్రాలను బొండాడ వెంకటరత్నం గుప్త రూ. 15/-లకు వేలంలో కొన్నారు. ప్రశాంతముగా, ఆహ్లాదముగా జరిగిన పాలకొల్లు సభలో హరిజననిధి సుమారు రూ.1600/- చేకూరింది. ఇచ్చట గాంధీజీ తన ఉపన్యాసములో "ఈ శ్రీజనకాశ్రమము హరిజనులకు నిజమైన ఆశ్రయంగా ఉండవలెనని, హిందూ మతానికి కళంకదాయకంగా ఉన్న అస్పృశ్యత అనే అమానుష ఆచారాన్ని నిర్మూలించవలెనని" ప్రజలకు ఉద్బోధించారు. తదుపరి గాంధీజీ తన పరివారముతో భీమవరం వెళ్ళుచుండగా మార్గము నందు లంకలకోడేరు గ్రామస్తులు రూ.300/-లు, బల్లిపాడు గ్రామస్తులు రూ.50/- హరిజననిధికి సమర్పించారు.

బీమవరం

ఉదయం గం:19, 15ని|లకు గాంధీజీ భీమవరం వచ్చారు. గాంధీజీ రాకను పురస్కరించుకొని ఆహ్వాన సంఘము ఏర్పాటు చేయబడింది. దానికి తటవర్తి వీరరాఘవులు అధ్యక్షులుగాను, భూపతిరాజు రామమూర్తిరాజు కార్యదర్శిగాను, పాలకోడేటి పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

సత్యనారాయణశర్మ సహాయకార్యదర్శిగాను వ్యవహరించారు. భీమవరంలోని గాంధీ చౌక్ పేరున ప్రత్యేక స్థలాన్ని బహిరంగ సభకు నిర్ణయించారు. గాంధీజీ దర్శనము సర్వజనులకు కనబడురీతిగ ఎత్తైన వేదికపై ఉచితాసనమును ఏర్పరచారు. ఆ కుర్చీ నాలుగు వైపులకు తిరుగాడుటకు వీలుకలదిగా అమర్చబడింది. సుమారు 15 వేల మంది స్త్రీ పురుషులు సభకు హాజరైరి. యూనియన్ బోర్డు వారు, భీమవరం పంచాయితీ బోర్డు వారు గాంధీజీకి సన్మానపత్రములు సమర్పించారు. భీమవరం తాలూకా బోర్డు వారు సన్మానపత్రంతో సహా రూ.116/–లు సమర్పించారు. క్షత్రియస్త్రీలు తమఘాషా వదలి సభకు వచ్చి కానుకలు సమర్పించారు. ఈ సభలో స్త్రీల సంరంభము అధికంగా కనిపించింది. వడగళ్ళ వర్షమువలె వారు తమ ఆభరణములను, ప్రాంకులను, నవరసులను ఖద్దరు నిధికి సమర్పించారు. 10 భీమవరంనందు రూ.2000/- ధనరూపమున లభించింది. సభప్రశాంతముగా జరిగింది. ప్రజలు గాంధీజీ కారు రాకపోకలకు သဲဇ္ဇီ အရှေ့8ဉ္ဇ)ဝဓံ కలిగించలేదు. గాంధీజీ 15ని మాత్రమే సభయందు ఉన్నారు. దాట్ల చిననీలాద్రిరాజు 100 మంది హరిజన

పాలకొల్లులో జనకాశ్రమమునకు శంఖు స్థాపన చేయుట 1933

బాలబాలికలకు ఖద్దరు వస్త్రములను గాంధీజీచే సృశింపచేసి పంచిపెట్టారు. తనకు నీరసముగా ఉన్నది కావున సెలవు ఇవ్వవలసినదిగా భీమవరం ప్రజలను కోరి గాంధీజీ ఉ| 9.30 ని|లకు తాడేపల్లిగూడెంకు బయలుదేరినారు.11

తాడేపలిగూడెం

మహాత్ముడు 27వ తేదీ మధ్యహ్నం గం| 11 లకు తాడేపల్లిగూడెం చేరారు. అచ్చట పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

పెద్ద బహిరంగసభ ఏర్పాటు చేయబడింది. గాంధీ జీ అసీనులయ్యేటందుకు ఎతెన వేదిక ఏర్పాటుచేయబడింది. గాంధీజీ వేదిక దగ్గరకు వచ్చేసరికి గాంధీజీకి జై' అనే నినాదాలు మిన్నుముట్టాయి. హరిజనాభ్యదయానికి గాంధీజీ చే నూన్న కృషికి సొమ్ము ఈయడానికి తీర్మానించ కూడదని ప్రభుత్వము ఉత్తరు వులు చేసినట్లు తమ సన్మాన పత్రంలో తాలూకా బోర్డు వారు పేర్కొన్నారు. ఆ సన్మానపత్రాన్ని ప్రశిడెంటు సోమరాజు చిన్న వెండి వ బ్ళెంలో ఉంచి గాంధీజీకి సమర్పించారు. ఆ బైర్రాజు రామరాజు వెండి పళ్ళాన్ని వేలం వేయగా మహాత్మునికి తన ఇంట ఆతిథ్యమిచ్చిన | ఆయనే రూ.10/-కు కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు డా| తేతలి సత్యనారాయణ తాడేపల్లిగూడెం హరిజన నిధి వసూళ్ళ రూ.100/- కలిదిండి గంగరాజు తాడేపల్లిగూడెం తాలూకా హరిజన సంఘం వసూళ్ళ రూ.220/- పుట్టా సుబ్బారావు తాడేపల్లి గూడెం తాలూకా పంచాయితీల సంఘం వసూళ్ళ రూ. 65/- దామోజీపురపు లక్ష్మీ నరసమ్మ, హద్దనూరి సీతారామమ్మ స్త్రీ సమితి తరపున చేసిన వసూళ్ళు రూ.116/–, మొత్తం రూ. 510/- గాంధీజీకి సమర్పించారు. సభలో స్త్రీలు మహాత్మునిచేతికి సుమారు రూ.200/- విలువైన తమ ఆభరణ ములను సమర్పించారు.

సభ అనంతరం మహాత్ముడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు బైర్రాజు రామరాజు గారి ఆహ్వానం మేరకు విశ్రాంతికై వారి ఇంటికి వెళ్ళారు. రామరాజు గారు గాంధీజీకి, ఆయన అనుచరగణమునకు, మిగిలిన జిల్లానాయకులకు అద్భుతమైన ఆతిధ్యాన్నిచ్చారు. రామరాజు గారు గాంధీజీకి సన్మాన పత్రాన్ని స్వయంగా అందచేశారు. రామరాజు గారి పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

అతిధి సత్కారాలను గాంధీజీ ప్రశంసించారు. రామరాజు గారి ఇంటివద్దనే స్త్రీలు సుమారు రూ. 1000/- విలువైన బంగారు ఆభరణములను, ధనాన్ని మహాత్మనికి సమర్చించారు. 12 రెండు గంటలు విశ్రమించి మధ్యహ్నం గంn 2.30 నిuలకు గాంధీజీ రామరాజుగారి ఇంటి నుండి ఏలూరు వెళ్ళేందుకు తాడేపల్లిగూడెం రైల్వేస్టేషనుకు బయలుదేరారు వెళ్ళారు.

గాంధీజీ రైల్వే స్టేషనుకు వెడలు మార్గములో "సతీహిత సమితి సభ్యురాండ్రు సుమారు 200 మంది, దామోజీపురపు వెంకట నరసింహరావు ఇంటి వద్ద మహాత్ముని కారును ఆపించి కర్పూరహారతి ఇచ్చి, సన్మాన పత్రము నొసంగి, రూ. 116/- సమర్పించారు. ఈ సమితి కార్యదర్శి యగు దామోజీ వరపు లక్ష్మీనరసమ్మ బంగారు గాజును సమర్పించారు. ఈ సభ్యురాండ్రు తమకు మహాత్ముడు ప్రత్యేక దర్శనమిచ్చినందులకు మిక్కిలి ఆనందించారు.

ఏలూరు, -

గాంధీజీ తాడేపల్లిగూడెం నుండి రైలులో పోవుచుండగా పూళ్ళ దెందులూరు, కైకరం, భీమడోలు రైల్వేస్టేషన్లలో పరిసరగ్రామస్తులు ఆయనను సందర్శించి హరిజననిధికై విరాళములు సేకరించి ఇచ్చారు. గాంధీజీ ఏలూరు రైల్వేస్టేషనులో దిగగానే పౌరులు ఆయనకు పూలదండలు వేసి సత్కరించారు. డాక్టర్ తాడేపల్లి అనంతశాస్త్రి గారి సతీమణి సత్యవతీ జయదేవి రూ. 116/- విలువ కలిగిన తన బంగారు గొలుసును, ఒక బంగారు కుంకుమ భరిణిను గాంధీజీకి సమర్పించారు. స్టేషను వద్ద నుండి ఆహ్వాన సంఘం వారు చేసిన ఏర్పాట్ల ప్రకారం గాంధీజీ ఆయన బృందము మున్సిపల్ కార్యాలయానికి చేరారు. అచ్చట మున్సిపల్ అధ్యక్షుడు మోతే నరసింహరావు సన్మాన పత్రంతో పాటు రూ.116/- హరిజననిధికి గాంధీజీకి సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా బోరు ప్రశిడెంటు రావుసాహేబ్ బడేటి వెంకటరామయ్య నాయుడు తమ సన్మానపత్రంతో పాటు రూ.116/- వెండి పళ్ళెంతో సహా హరిజననిధికి సమర్పించారు.\

ఏలూరు వాటర్ వర్బుకు దగ్గరగా ఉన్న మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. ఏలూరు రైల్వేస్టేషను నుండి మైదానం వరకు ఏలూరులోని పడమర వీధి వ్యాయామ సంఘంవారు, స్థానిక స్కౌట్లు, కాంగ్రెసు స్వచ్ఛంద సైనికులు, రోడ్డుకు ఇరువైపుల నిలబడి గాంధీజీ నిరాటంకముగా సభాస్థలికి చేరేటట్లు ఏర్పాటుచేశారు. సభాస్థలంలో rveටඨිකී ఆసీనులయ్యేందుకు, ಎತ್ತನೆ వేదికను ఏర్పరిచారు. ప్రజలకు ఆయన వాక్కులు వినబడేందుకు దూరశ్రవణ యంత్రాలను ఏర్పరిచారు. గాంధీజీ ఆంధ్ర పర్యటనలో దూరశ్రవణయంత్రాలను ఉపయోగించటం అదే ప్రధమం. మహాత్ముడు CPජකීකාරයී 30 వేలమంది ప్రజాసమూహంతో సభాస్థలి నిండిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

బహిరంగ సభలో ఏలూరు తాలూకా బోర్డు వారు సన్మానపత్రంతో పాటు రూ.116/ - లు హరిజన నిధిని అందించారు. ఇంకా అనేక సంస్థలు గాంధీజీకి సన్మానపత్రాలు సమర్పించారు. గాంధీజీ ఆహ్వాన సంఘంవారు మోటమర్రి మల్లికారునుడు స్వయంగా సమర్పించిన రూ. 58/-లు తో కలిపి రూ. 116/–లు సమర్పించారు. పోలిశెట్టి రంగ నాయకులు రూ. 116/–లు, ఏలూరు తాలూకా బోరు ప్రశిడెంటు స్వయంగా రూ.116/–, పెదపాడు వాస్తవ్యులిరువురు చెరియొక రూ.116/–లు హరిజననిధికి అందచేశారు. శ్రీరామ భుజంగరావు, యం.రంగారావు గాంధీజీ బొమ్మలను వేసి సమర్పించారు. అనేక మంది స్త్రీలు తమ ఆభరణములను గాంధీజీకి స్వయంగా సమర్పించారు.

తదుపరి గాంధీజీ నిశ్శబ్దంగా ఉండమని కోరి 20 నిమిషములు ఉపన్యసించినారు. దూరశ్రవణయంత్రాలు ఉన్నందువలన ఆయన ఉపన్యాసం అందరికీ స్పష్టంగా వినిపించింది. హిందీ పరీక్షల్లో ప్రముఖముగా ఉత్తీర్ణులు అయిన వారికి ఆసభలో పతకాలను గాంధీజీ బహూకరించగలరని అంతకు పూర్వము ప్రకటింపబడింది. కాని గాంధీజీ ఆ పతకాలను తాను బస చేసిన గాంధీ జాతీయ విద్యాలయములో ఇవ్వగలనని ప్రకటించారు. తరువాత లాలాలజపతిరాయ్ చిత్ర పటమును ఆవిష్కరిస్తూ లాలాజీ అసమానదేశ సేవను గురించి అత్యంత ప్రశంసాపూర్వకముగా ఉపన్యసించారు. ఆ ఉపన్యాసంలో “&58 8°eა& సమయములో లాలాజీ యొక్క అమూల్య గుణగణములను గురించి నేను సంపూర్ణముగ తెలియచేయగలనని మీరు తలంచవలదు. వారి ఆమరణాంతము, వారి ఆంతరంగికులలో ఒకనిగా ఉండు భాగ్యము నాకు లభించినది. నేడు మీరును నేనును లాలాజీ వివిధ గుణములలో వారు అస్పృశ్యతా దురాచారము పై సల్చిన ఫరోరయుద్ధము ముఖ్యముగ గమనించవలెను. అంటరాని వారని పిలువబడుచున్న హరిజనుల ఎడల హిందూ సంఘము తన విధ్యుక్త ధర్మమును గుర్తించుటకు పూర్వమే లాలాజీ స్వకీయ అనర్గళగళవాహినితో అస్పృశ్యత ప్రబల దురాచారమని, అది హిందూ సంఘమునకు కళంకమని తీవ్రముగా ఖండించినారు. ఆయన అస్పృశ్యతపై చేసిన దండయాత్రయే, వారిని హిందూ సంఘమునందంతటా పూజారులను చేయుచున్నది. కాని భారతదేశమునకు సర్వతోముఖముగవారు చేసిన అపార కృషి ఎవరు మరవగలరు? వారి అఖండ సాహసము, నిర్భయత్వములనెవరు కాదనగలరు? పంజాబీయులేకాక అఖిల భారతదేశమంతయూ ఏక కంఠముతో వారిని 'పంజాబుకేసరి' అని అర్థరహితముగ పిలుచుట లేదు." 13 అని పేర్కొన్నారు.

గాంధీజీ ఆంధ్రదేశము నందు సంచారముగావించిన కాలములో ఆయన హృదయము పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీజీ ఆంధ్రదేశము నందు సంచారముగావించిన కాలములో ఆయన హృదయము రోజురోజుకూ ఆహ్లాదముతో నిండిపోయింది. ఏలూరునందు చేసిన ఉపన్యాసంలో ఆయన తన భావాలను వెల్లడించారు. ఏలూరునివాసియగు ముల్పూరు చుక్కమ్మ వేలూరు చెరసాల నుండి హరిజననిధికి బంగారు ఉంగరమును పంపిన విషయమును తెలియచేసూ ఇట్లన్నారు. "స్వార్థరహితమయిన ఇటువంటి భక్తి, సేవలను గాంచినప్పడు ఎవరి హృదయమున సంతోషము పొంగి పొరలదు? అంటరాని తనము త్వరలో నిర్మూలన కానున్నదనుటలో సందేహం లేదు. నేను ఎచ్చటకు వెళ్ళిననూ అచ్చట సవర్టులలో హృదయ పరివర్తన కనబడుతుంది. వారందరిలోనూ ఈ మహాసంస్కరణకు సుముఖత్వము కానవస్తూంది. ఎచ్చట చూచిననూ ప్రజలు రాగిపైసలు మొదలుగా బంగారు ఆభరణములు సైతము మనస్పూర్తిగా హరిజన నిధికి ఇస్తున్నారు. స్త్రీలు కూడ పురుషులకేమాత్రము వెనుకంజవేయుటలేదు. ఈ ఉద్యమ విషయమై ఆలోచించినకొలది మానవకోటి కంతటికిని సంబంధించిన ఉద్యమమనే అభిపాయము దృఢమగుతుంది. హిందువులమగు మనమే అస్పృశ్య పెనుభూతమును అంతము చేయాలి. హిందూ సంఘమునకు కళంకమును, విషతుల్యమగు దీనిని నిర్మూలించుటలో సఫలులమైన ఎడల వివిధ మతములకు సంబంధించిన భిన్నజాతులవారమైన భారతీయులందరమూగూడ నిజమైన సంతోషమును, సహకారమును, తృప్తిని, సంఫీుభావమును పొందగలమని నేను పరిపూర్ణముగ విశ్వసిసూన్నాను. ఎన్నికష్టములు ఎదురైనను మనముచేయుచున్న ఈ కృషి ఫలింప చేయవలెనని సర్వశక్తి మానుడగు భగవంతుని ప్రార్జించుచున్నాను. అనేక శతాబ్దముల నుండి మనమే, మనలో ఒక భాగమును అణగదొక్కియుంటిమని మరియొక పర్యాయము జ్ఞప్తికి తెచ్చుకొందము. అట్లుచేయుటవలన మనమే అధఃపతితులమైనాము. పరిశీలించిన కొలది ఈ అస్పృశ్యతను హిందూ సంఘమునుండి తొలగించనిచో హిందూ సంఘము సర్వనాశనమగుననే అభిప్రాయము బలమగుచున్నది. పవిత్రమగు వేదములు, ఉపనిషత్తులు, మహాభారతము మొదలగు పురాణముల ఉత్పష్టవాణి నుండి ఉద్భవించినదీ హిందూ మతము. అట్టి సర్వోత్తమమగు మతమేల నాశనము కానున్నది? వేదములు, ఉపనిషత్తులు, బోధించిన పరమాత్మయే సత్యము, మిగిలిన దంతయు మిథ్య అనే గొప్ప సిద్దాంతాన్ని మనం అంగీకరించకపోవుటవలననే పరమాత్మ సర్వసమానుడు, న్యాయమూర్తి అని అంగీకరిస్తూనే, మనలో ఉచ్చనీచ భావములకు తావిచ్చుచున్నాము. పై విషయములు గమనించిన కొలది ఒక్క హిందూ మతమునందేకాక ప్రపంచము నందు ఏ ఇతర మతమునందు కూడ అస్పృశ్యతకు తావుండదని తెలుస్తుంది. నేడు మతములన్నియూ కఠిన పరీక్షకు లోనగుచున్నాయి. ప్రతిమతమును తీవ్రముగ తర్మించబడుతుంది. అట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము పరీక్షలో హిందూ మత మింకను అస్పృశ్యతను తొలగింపని ఎడల ప్రజాభిప్రాయము దానిని నిరాకరించుననుటకు ఎట్టి సందియములేదు.” 1* బహిరంగ సభలో 57 బంగారు ఉంగరములు, 26 గాజులు, ఒక బంగారు గొలుసు, బంగారు నాగరం, వజ్రము పొదిగిన చామంతి పువ్వు, కొన్ని సవరసులు, కొన్ని ఫ్రాంకులు, ఇతర ధనముతో పాటు "హరిజననిధి'కి చేకూరింది. గాంధీజీ హరిజనుల కోసం ఎర్రవాడ జైలునందు నిరాహారదీక్ష చేసినంత కాలం ఆయన ఉద్యమం పట్ల సానుభూతితో ఉపవసించిన చెన్నాబత్తుల వీరాచారి గాంధీజీకి ఒక వెండి పళ్ళెము, ఒక వెండి గిన్నె ఒక వెండి గోవును సమర్పించారు. గాంధీజీ సాయంకాలము 6 గం|లకు ముందే సమావేశాన్ని ముగించి గాంధీ జాతీయ విద్యాలయమునకు వెళ్ళి ఆహారము తీసుకొన్నారు. భోజనానంతరము హరిజనవాడలు చూచుటకు మోటారులో వెన్నవల్లివారిపేటకు వెళ్ళారు. హరిజనవాడలు సందర్శించుట వెన్నవల్లివారిపేటలోని హరిజనులు గాంధీజీని మంగళ వాయిద్యాలతో హరిజన స్వచ్ఛంద సేవకులతో ఎదురేగి ఆహ్వానించి సభావేదికకు తీసుకొని వెళ్ళారు. మహాత్ముడు వేదికపైన కూర్చుండగనే జె. శకుంతల చేసింది. తదుపరి గాంధీజీ కొంతసేపు హరిజన కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెల్లంకి కృష్ణమూర్తి, రాయిడు గంగయ్య మొదలయిన గ్రామపెద్దలు గాంధీజీకి పరిచయము చేయబడిరి. అప్పడు ఒక విద్యార్థి 'ఈ హరిజన నిధి నుండి కొంత ನಿ'ಮಿಯ್ಯನಿು హరిజన ವಿದ್ಯಾಭ್ದಲು, ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించుటకు, విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించుటకు వినియోగించవలసినది" అని కోరగా గాంధీజీ విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించినంత మాత్రాన దేశానికి, సంఘానికి మేలు కలుగదని, స్వదేశీ పరిశ్రమలను అభివృద్ధి పరిచే విద్యయందే నేటి యువకులు ఉత్తీర్ణులు కావలసి ఉందనీ, అందుకు ప్రయత్నించవలసిందనీ వారికి ఈ నిధి ద్వారా సహాయము జరుగుతుందనీ చెప్పారు. హరిజనులు పరిశుభ్రంగా ఉండవలెనని, తాగుడు మొదలయిన దురలవాట్లను వదులుకొనవలెనని ప్రబోధించారు. రీ తరువాత హరిజన నాయకుడగు రాయిడు గంగయ్య నాయకత్వంలో హరిజనులు గాంధీజీని సన్మానించిరి. 200 మంది హరిజన యువకులు. తెల్లని దుస్తులతో సబ్చే పోతయ్య శిక్షణలో గాంధీజీకి 'గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. గాంధీజీ వారి ఇండ్లను. పరిశుభ్రతను చూచి చాలమెచ్చుకున్నారు. వారు తమ స్వశక్తితో, స్వయంకృషి, స్వయం సహాయముతో ఏర్పాటుచేసుకొనిన ਤੂੰ360 నందలి గ్రంధాలయము, వ్యాయామశాల, పాఠశాల, ఔషధాలయము, హరిజన వాటాదారుల పెట్టుబడిచే కొనసాగించబడుతున్న పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

కో-ఆపరేటివ్ బ్యాంకు, భజన సంఘము, శుద్ధి సంఘములను గాంధీజీకి చూపించారు. గాంధీజీ వారి కృషిని ప్రశంసిస్తూ, "మీరు ఇతర హరిజనులకు మార్గదర్శకులైయున్నారు" అని ప్రశంసించారు.

తరువాత గాంధీజీ జాతీయ పాఠశాలకు వెళ్ళి ప్రార్ధన జరిపారు. ప్రార్థన ముగిసిన వెంటనే శ్రీమతి జవ్వాజి రాజరత్నం, దాసరి కృష్ణవేణమ్మ స్త్రీల వద్ద నుండి తెచ్చిన కానుకలను గాంధీజీకి సమర్పించారు. అంతలో 90 ఏండ్లవయసు గల ဖဲ့)မွီ పండితుడు గాంధీజీని కలుసుకొన్నాడు. ఆయన నడవలేని స్థితిలో ఉన్నందున ఆయనను గాంధీజీ గదిలోనికి ూసుకొని రావలసి వచ్చింది. ఆయన గాంధీజీని దర్శించి వేద వాక్యములచే మహాత్ముని హృదయపూర్వకముగా దీవించి "నీవు ప్రారంభించిన అస్పృశ్యతా నివారణోద్యమం దైవ ప్రేరణ"అని శాఘించాడు. తరువాత ఒక వృద్ధ స్త్రీ కూడా గాంధీజీని దర్శించింది. ఆమె తనకుటుంబములో ఐదవ తరంవారిని చూడగలిగింది. ఆవయసులో కూడా ఆమె నూలు స్వయంగా వడికి తన మనుమలకు, ముని మనుమలకు మునిమను మల బిడ్డలకు కూడ ఖద్దరు బట్టలు సరఫరా చేస్తూన్నది. ఆమె కూడ గాంధీజీ అంటరానితనం తుడిచి పెట్టడానికి చేస్తూన్న కృషిని ఆశీర్వదించివెళ్ళింది. గాంధీజీ ఈ ఇద్దరి వృద్ధమూర్తుల ఆశీర్వాదాలను అందుకో గలిగినందుకు చాలా ఆనందించారు. ప్రజా హృదయం మొత్తం మీద నిష్కళంకంగా ఉన్నదని నిర్ణయించడానికి ఈ రెండు ఉదంతాలు చక్కని నిదర్శనాలు. రాత్రి 9గంటలకు గాంధీజీ నిద్రించారు.

శాసనోల్లంఘన జరుగుతున్న రోజులలో 'గాంధీ జాతీయ విద్యాలయం' కాంగ్రెసు శిబిరంగా ఉన్నందువలన ప్రభుత్వం ಮಾಯಿ ದಾನಿನಿ స్వాధీనం చేసుకొన్నారు. అప్పటినుండీ అది వెలవెలపోతుండేది. ఈ సందర్భంగా అందు గాంధీజీ మరల బసచేసిన తరువాత నూతన కళతో వెలుగొందింది. గాంధీజీ విద్యాలయంలో రాత్రి విశ్రాంతి తీసుకొంటుండగా స్వచ్ఛంద సైనికులు ఆ రాత్రంతా మేలుకొని జాగరూకత వహించారు.

గాంధీజీ 28వ తేదీ తెల్లవారు. జామున 4 గం|లకు చేసిన ప్రార్ధనలో అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. reo68 భగవద్గీతలోని 18వ అధ్యాయం పారాయణం చేశారు. తరువాత గాంధీజీ ఆహ్వాన సంఘకార్యదర్శిని శ్రీమతి మదుల దమయంతీదేవికి యన్.సి.హెచ్. రంగనాయకీ దేవికి, యం. స్వరాజ్యలక్ష్మికి, న్యాయవాదియగు బులుసు నరసింహం పంతులుకు, ఎ. చక్రధరరావుకు దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి హిందీ పరీక్షలలో ಮಿ೩ುಲುಗ್ ఉత్తీర్ణులైనందుకు వెండి పతకాలను బహుకరించారు.

తరువాత తులాబందుల సుబ్బారావు,తన భార్యాపత్రునితోను వచ్చి రూ.116/–లున్నూ దామరాజు ಲÊಮಿ రూ.1 16/-లున్నూ గాంధీజీకి హరిజననిధి సమర్పించారు. తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీజీ జాతీయ పాఠశాలనుంచి రైల్వేస్టేషనుకు వెళ్ళారు. ప్లాట్ ఫారమ్ పై వేలాది మంది ప్రజలు ఆయనకు వీడ్కోలు చెప్పారు. స్కౌట్లు రైలు కదిలేముందు సందేశం కోరగా “ముందు మీ ఆత్మలను, హృదయాలను సరిదిద్దుకోండి. అది అంతతేలికైన పనిgందు? 16 అని గాంధీజీ అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో సభలు ప్రశాంతముగా జరిగినందుకు, హరిజననిధికి విరివిగా w వరి జిలాలో మహాత్యుని సOచారము పశ్చిమ గోదా †7I †7 I | O | I | る下エ三 ーF 구一 r- OO Ne r- () O N QO () &S民法6|| 8%%%%%%%o% 1, 19I 9 | Z ICCgლ92C26ლO9ჯGპ 9%%%% ଠୁଠୁତ୍ତ୍ଵ୯୫ උතුරිෆලූ QacCỘoçyų 爬泳冠岛� 爬泳g@况 9泪长衫泪器况 Qශ්‍රයෝෆයුට්‍රෆික්‍ෂී 8 | 9I@@沿命eeG 888 დდ&aශූ88c%8(~~) or-一日Q品G岛密 CCgლ$დCCreCogeco oyo | coççecção. Q· 0I609 | Z | VI || II67, 6 I ZI | 80ț7 0I609 | G | I || 809 Z • • • H • • • M • • • • •8 O) (O OO OS (O - CN C CN C) O.) H Y-H h (Q) ymennxx O H ༤༥ N y y CO N - QO O). O CN CN O). O I CN O CN 5 యా 5 - 5 - 6 CD CYO CD) orth O CD Od --H CYD IN- N- CO CO | O 3e 3ら ocġoç ç&ç@ SQ-ල ඉදිංහූල්‍ය co&2& ‘coccoạeo(; oggooaç „gošo? ¿Co(; „golios; † 861-8861 పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

విరాళములు వచ్చినందుకు గాంధీజీ మిగుల ఆనందించారు. ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవక సంఘ కార్యదర్శి మాగంటి బాపినీడు గాంధీజీ ఆంధ్రదేశంలో హరిజనయాత్రను ముగించిన తరువాత జిల్లాల వారీగా ధన, వస్తు రూపములలో వచ్చిన "హరిజన నిధిని ప్రకటించారు. తెలియచేసిన వివరముల ప్రకారం హరిజన నిధికి నెలూరు జిల్లా రొట్టము రూపములో ప్రధమ స్థానమును పొందగా, పశ్చిమగోదావరి జిల్లా ద్వితీయ స్థానముపొందింది. బంగారు ఆభరణములు ఇచ్చుటలో పశ్చిమగోదావరి කිසිඳාදී ప్రధమస్థానమునలంకరించగా, ଠି ୧୬:୧୪, ద్వితీయ స్థానముపొందింది. 17

గాంధీజీ దక్షిణ భారత హిందీ ప్రచారసభకు అధ్యక్షత వహించుటకై మదరాసు వెళుతూ 1946, జనవరి 26వ తేదీన రాత్రి 8గం|లకు గాంధీజీ బయలుదేరిన ప్రత్యేక రైలు ఏలూరు స్టేషనునందు ఆగతుందనే వార్త ప్రజలకు తెలిసింది. వ్యవధి తక్కువైనప్పటికీ రాత్రి గం| 7.30నిuలు అయ్యేసరికి రైల్వేప్లాట్ఫారంపై గాంధీజీ దర్శనం కోసం 15 వేల మంది ప్రజలు గుమిగూడారు. వారిలో వేయిమంది స్త్రీలు కూడ ఉన్నారు. చలిగాలి, మంచుకురుసూన్నప్పటికి ప్రజలు రాత్రి 10-30 ని|లకు (Yeටඨිසී వచ్చేంత వరకూ ఓర్పుతో నిరీక్షించారు. విపరీతమైన జన సందోహం రావటంతో రైల్వేప్లాట్ ఫారం నిండిపోయింది. ప్లాట్ ఫారం వెలుపలవేలకొద్దీ జనం నిలబడవలసి వచ్చింది. 12 మంది ఒకొక్కరు రూ. 116/- చొప్పన గాంధీజీకి విరాళం సమర్పించారు. చిల్లరగా రూ.300/- వసూలైనాయి. చాల మంది స్త్రీలు బంగారు గాజులు, ఉంగరాలు, పట్టెడలు, ముక్కెరలను సమర్పించారు. ఒక మహిళ ఎనిమిది నవరసుల తూకంగల బంగారు గొలుసును సమర్పించింది. మొత్తం రూ.2,500/- నగదు, రూ.2,500/- విలువైన నగలు వసూలైనాయి. ప్రజలందరూ ఏవిధమయిన నినాదాలు చేయకుండా ప్రశాంతముగా కూర్చున్నారు. జిల్లా కాంగ్రెసు అధ్యక్ష కార్యదర్శులు మాగంటి బాపినీడు, సత్తిరాజు రామమూర్తి, డా|మూల్పూరి రంగయ్య, చుక్కమ్మ గార్లతో పాటు కాంగ్రెసు కార్యకర్తలు అనేకమంది గాంధీజీకి స్వాగతం చెప్పారు.

గాంధీజీ ప్లాట్ఫారానికి ఆవలనిలబడియున్న ప్రజలకు ముందుగా దర్శనమిచ్చి తరువాత తాను కూర్చున్న పెట్టె ద్వారానికి ముందు ఏర్పాటు చేసిన బల్ల పైకెక్కి తక్కిన వారందరికీ కనిపించారు. ప్లాట్ ఫారమునకు ఒక మూల గాంధీజీ దర్శనం కోసం ఆతృతపడుచుండిన జనము నుంచి కొంత సందడి వినపడగానే గాంధీజీ తన చేయి ఎత్తి నిశ్శబ్దముగా ఉండమని సైగ చేశారు. అంత సభలో ప్రశాంతత ఏర్పడింది. గాంధీజీ 15 నిమిషములు విరాళములను స్వీకరించారు. ఒక స్త్రీ తాను ఒడికిన నూలుతో గాంధీజీకి ఖాదీధోవతిని బహూకరించింది. గాంధీజీ మౌనవ్రతంలో ఉండుటచే ఆయన ఆంధ్రులకు ಇನ್ಫಿನಿ పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

సందేశాన్ని ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య చదివినిపించారు.

దేశ విభజనకు కాంగ్రెసు, ముస్లింలీగ్లు అంగీకరించిన తరువాత పంజాబు మతవర్గాల మధ్య యుద్దానికి కేంద్రంగా మారింది. ఇది 1947 ఆగష్టు 15న దేశవిభజన జరిగి దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత కూడ కొనసాగింది. దీని ఫలితముగా 1947 సెప్టెంబరు ఆఖరుకు 6,00,000 ప్రజలు మరణించారు. 140 లక్షల ప్రజలు తరతరాలుగా తామనివసిస్పూన్న ప్రదేశములను వదలి కాందిశీకులుగా భారతదేశానికి కొందరు, పాకిస్తాన్కు కొందరూ పారిపోయారు. 19 శాంతియుత సత్యాగ్రహ సమరం ద్వారా దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించాలని గాంధీజీ తలచారు. ఆయన చేసిన ఉద్యమాలన్నీ అలాగే సాగినవి. కాని చివరికి స్వాతంత్ర్యముతోపాటు దేశవిభజన జరుగుటవలన చరిత్రలో కనీవినీ ఎరుగని మానవమారణహోమం జరిగింది. అహింసా సిద్దాంతాన్ని దేశప్రజలందరికీ తాను సక్రమముగా బోధించలేకపోయినానని, అందుచే పరిణామములు ఇలా జరుగుచున్నాయని మహాత్ముడు తనను తాను నిందించుకొంటూ కుమిలిపోయినారు. ఎన్నో ఆలోచనలతో నిమగ్నమయి ఉన్న סחo& జీపై కొందరు యువకులు బిర్లామందిరమువద్ద ప్రార్థన చేసుకొంటుండగా 1948 జనవరి 20న బాంబుపేల్చారు. కాని గాంధీజీకి అదృష్టవశాత్తు అపాయంఏమీ జరుగులేదు. దారితప్పిన యువత చేసిన చర్యగా గాంధీజీ దానిని అభివర్ణించారు. గాంధీజీ హిందువుల ప్రయోజనములకు భంగకరముగా తయారైనాడని కొందరు మతోన్మాదులు భావించారు. ప్రభుత్వం ప్రత్యేకరక్షణ కల్పిస్తానంటే గాంధీజీ అంగీకరించలేదు.

1948 జనవరి 30వ తేదీ సాయంత్రము ఢిల్లీలోని బిర్గా గృహం నుండి గం| 5.05ని ఇరువైపులా తన మనుమరాళ్ళ అబా గాంధీ, మనూ గాంధీల భుజములపై చేతులువేసుకొని ప్రార్థనాసభకు వెళుతుండగా వేదిక సమీపములో నాథూరాం వినాయక్ గాడ్సే అనే హిందూమతతత్వవాది వంగి మహాత్మునికి పాదాభివందనం చేసినట్లే చేసి నాలుగుసార్లు రివాల్వర్తో కాల్పులు జరిపాడు. "హేరామ్, హేరామ్' అంటూ మహాత్ముడు ನೆಲ€°ರಿಗಿನಾಯಿ. వైరిని కూడా ప్రేమించే ప్రేమమూర్తి మతమూరుల చేతిలో బలియైపోయానారు. గాంధీజీ హత్యకు భారత దేశమేకాదు, యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచ రాజ్యాధినేత లందరూ భారత ప్రజానీకానికి ఓదార్పు సందేశాలు పంపారు. గాంధీజీ మరణం భారతీయు లందరినీ పెనుదుఃఖంలో మంచివేసింది. జాతిపితను కాపాడుకోలేని ప్రభుత్వం సిగ్గుతో తలవంచింది. అశేషజనావళి అశ్రుతప్త హృదయాలతో వెంటరాగా తెల్లవారి అంతిమయాత్ర 2) పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

4. გყ93ზ85&29 : 一台一 1. 2. 3. 4. 8. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. దేశభక్త కొండా వెంకటప్పయ్య-మహాత్ముని ఆంధ్రదేశ సంచారము, పే-25. Harijan, October-1933. కొడాలి ఆంజనేయులు - ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ - తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1978. పే-602 & 603 ఆంధ్రపత్రిక - డిశంబరు 30, 1933, శనివారము, పే-15 కా=& దేశభక్త కొండావెంకటప్పయ్య-మహాత్ముని ఆంధ్రదేశ సంచారము 3-30 దేశభక్త కొండావెంకటప్పయ్య-మహాత్ముని ఆంధ్ర దేశసంచారము, S-59 & 60. - ఆంధ్రపత్రిక, డిశంబరు 29, 1938 శుక్రవారము. పే-3 కా-3. పై మూలం పే-3, కా=1&& పైమూలం పే.3, కా, 4 దేశభక్త కొండావెంకటప్పయ్య-మహాత్ముని ఆంధ్రదేశ సంచారము. పే -40. ఆంధ్రపత్రిక డిశంబరు 30,1933, శనివారం, పే-15, కా-3, ఆంధ్రపత్రిక-డిశంబరు 29, 1933, శుక్రవారము, పే-3, కా-2&3 దేశభక్త కాండా వెంకటప్పయ్య ! మహాత్ముని ఆంధ్రదేశ సంచారము 3-82 & 83. 36a-vero 3-83,84 & 85. మూలం పే-42,43, కొడాలి ఆంజనేయులు : ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ పే-700, దేశభక్త కొండా వెంకటప్పయ్య మహాత్ముని ఆంధ్ర దేశసంచారము పే-81. కొడాలి ఆంజనేయులు : ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ - పే -920 & 921. మామిడిపూడి వేంకటరంగయ్య- భారత స్వాతంత్ర్యద్యమ చరిత్ర 3వ భాగము సికిందరాబాదు, 1976 పే-317 බර් o &୬ -سCa