పరాకు జేసిన నీకేమి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

జుజాహుళి రాగము - ఆది తాళం


పల్లవి

పరాకు జేసిన నీకేమి

ఫలము గలిగెరా ? పరాత్పరా !


అనుపల్లవి

సురావనీ సురాప్త ! మా -

వరా ! జరా పఘన ! నాయెడన


చరణము

ముదాన నీదు పదార వింద -

ములను బట్టి మ్రొక్కగ లేదా ?

నిదాన రూప ! దరిదాపు లే -

దు, దార ! శ్రీత్యాగరాజనుత !