పట్టి విడువరాదు

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

మంజరి రాగం - ఆది

పల్లవి

పట్టి విడువరాదు నాచెయి

బట్టి విడువరాదు నాచెయి | | పట్టి | |


అనుపల్లవి

పుట్టిననాఁడే నిజభక్తిని మెడఁ

గట్టి గుట్టు చెదరక బ్రోచి చెయి | | పట్టి | |


చరణము

నిత్యానిత్యములను బోధించి,

కృత్యాకృత్యములను దెలిపించి,

ప్రత్యేకుఁడు నీవని కనిపించి,

భ్రుత్యుఁడైన త్యాగరాజు చెయి | | పట్టి | |