పక్కల నిలఁబడి గొలిచెడి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

ఖరహరప్రియ - త్రిపుట


పల్లవి

పక్కల నిలఁబడి గొలిచెడి ముచ్చట బాగ దెల్ప రాద ? | | పక్కల | |


అనుపల్లవి

చుక్కల రాయని గేరు మోముఁగల

సుదతి సీతమ్మ సామిత్రి రాముని కిరు | | పక్కల | |


చరణం

తనువుచే వందన మొనరించుచున్నారా ?

చనవున నామకీర్తన సేయుచున్నారా ?

మనసునదలచి మైమరిచియున్నారా ?

నెనరుంచి త్యాగరాజునితో, హరిహరి ! వీరిరు | | పక్కల | |