నీ చిత్తము నిశ్చలము
స్వరూపం
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ధన్యాసి రాగము - చాపు తాళం
- పల్లవి
నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నె నమ్మినాను
- అనుపల్లవి
నా చిత్తము వంచన చంచలమని - నను విడనాడకుమి; శ్రీరామ !
- చరణము
గురువు చిల్లగింజ గురువే భ్రమరము
గురు డే భాస్కరు డు - గురు డే భద్రు డు -
గురుడే యుత్తమగతి - గురువునీ వనుకొంటి
ధరను దాసుని బ్రోవ, - త్యాగరాజనుత !