నిన్ను బాసి యెట్ల యుందురో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

బలహంస రాగం - ఆది తాళం


పల్లవి

నిన్ను బాసి యెట్ల యుందురో ? - నిర్మలాత్ములౌ జనులు


అనుపల్లవి

అనఘ ! సుపుణ్య అమర వరేణ్య !

సనక శరణ్య ! సత్కారుణ్య !


చరణము

కనులకు చలువ, చెవుల కమృతము,

విను రసనకు రుచి, మనసుకు సుఖము,

తనువుకు యానందమును గల్గజేయు

త్యాగరాజ హృద్ధామ ! పూర్ణకామ !