Jump to content

నిధి చాల సుఖమా

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః


నిధి చాల సుఖమా (రాగం: కళ్యాణి) (తాళం : చాపు)
పల్లవి

నిధి చాల సుఖమా రాముని స

న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా

॥నిధి॥


అనుపల్లవి

దధి నవనీత క్షీరములు రుచో

దాశరథీ ద్యానభజన సుధారసము రుచో


॥నిధి॥


చరణం

శమ దమ మను గంగాస్నానము సుఖమో క

ర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమో

మమత బంధనయుత నరస్తుతి సుఖమా

సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమో

॥నిధి॥


nidhicAla sukhamA (Raagam: kalyaaNi) (Taalam: caapu)
pallavi

nidhicAla sukhamA rAmuni sannidhi sEva sukhamA nijamuga balku manasA (nidhicAla)


anupallavi

dadhi navanIta kSIramulu ruciyO dAsharathi dhyAna bhajana sudhArasamu ruciyO (nidhicAla)


caraNam

dama shamamanu gangA snAnamu sukhamA kardama durviSaya kUpa snAnamu sukhamA mamata bandhana yuta narastuti sukhamA surapati tyAgarAja nutuni kIrtana sukhamA (nidhicAla)


దీనిని తంజావూరు రాజుగారు త్యాగరాజునకు ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు పంపించి రాజసభలకు ఆహ్వానించినప్పుడు త్యాగరాజుగారు ఆలపించిన కీర్తన.