నారద గురుసామి
Appearance
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
దర్బారు రాగం - ఆది తాళం
- పల్లవి
నారద గురుసామి ! యికనైన న -
న్నాదరింపవేమి ? ఈ కఱవేమి ?
- అనుపల్లవి
సారెకు సంగీత యోగ నైగమ
పారంగతుడైన పరమ పావన !
- చరణము
ఇతిహాస పురాణాగమ చరితము - లెవరి వల్ల గలిగె ?
పతిని దానమివ్వ బుద్ధి సత్య - భామ కెటుల గలిగె ?
ద్యుతిజిత శరదాభ్ర ! నిను వినా, ముని
యతుల కెవరు గలిగె ?
క్షితిని, త్యాగరాజ వినుత ! న -
మ్మితి చింత దీర్చి ప్రహ్లాదుని బ్రోచిన