నామ కుసుమములచే బూజించెడి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

శ్రీరాగం - దేశాది తాళం


పల్లవి

నామ కుసుమములచే బూజించెడి

నరజన్మమే జన్మము; మనసా !


అనుపల్లవి

శ్రీమన్మానస కనక పీఠమున

చెలగ జేసికొని వరశివరామ


చరణము

నాద స్వరమను వర - నవరత్నపు -

వేదికపై, సకల లీలా వి -

నోదుని, పరమాత్ముని, శ్రీరాముని,

పాదములను త్యాగరాజహృద్భూషణుని