నన్ను బ్రోవ నీ కింత తామసమా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

ఆభోగి రాగము - దేశది తాళము


పల్లవి

నన్ను బ్రోవ నీ కింత తామసమా ?

నాపై నేరమేమి బల్కుమా ?

అనుపల్లవి

చిన్ననాడె నీ చెలిమి గలుగ నోరి -

చింతింప లేదా ? శ్రీరామ !


చరణము

నిజదాస వరులగు తమ్ములతో

నీవు బాగ బుట్టగ లేదా ?

గజరాజరక్షక ! తనయులను -

కనిపెంచ లేదా ? త్యాగరాజనుత !