నగుమోము గలవాని నా మనోహరుని

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

నగు మోము గలవాని నా మనోహరుని (రాగం: మధ్యమావతి) (తాళం : ఆది)
పల్లవి

నగుమోము గలవాని నా మనోహరుని

జగమేలె శూరుని జానకి వరుని !!నగుమోము!!

దేవాది దేవుని దివ్యసుందరుని

శ్రీవాసుదేవుని సీతారాఘవుని !!నగుమోము!!

సుజ్ఞాననిధిని సోమసూర్యలోచనుని

అజ్ఞానతమమును అణచు భాస్కరుని !!నగుమోము!!

నిర్మలాకారుని నిఖిలాఘహరుని

ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని !!నగుమోము!!

బోధతో పలుమారు పూజించి నే నా

రాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతిని !!నగుమోము!!