Jump to content

దుడుకు గల న న్నేదొర

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

గౌళ రాగం - ఆది తాళం


పల్లవి

దుడుకు గల న న్నేదొర - కొడుకు బ్రోచురా ? యెంతో

అనుపల్లవి

కడు దుర్విషయాకృష్ణు డై - గడియ గడియకు నిండారు


చరణము 1

శ్రీవనితాహృత్కుముదాబ్జావాజ్మానసగోచర

చరణము 2

సకలభూతములయందు నీవై యుండగ మదిలేకబోయిన

చరణము 3

చిరుత ప్రాయమునా డె భజనామృత - రసవిహీన కుతర్కు డైన

చరణము 4

పర ధనముల కొరకు నొరుల మదిని - కర గ - బలికి కడుపునింప దిరిగినట్టి

చరణము 5

తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు - సదా దినములు గడిపెడు

చరణము 6

తెలియని నటవిట శూద్రులు వనితలు స్వవశమౌటకుప - దేశించి సంతసిల్లి స్వరలయంబు లెఱు గకను శిలాత్ములై సుభక్తులకు సమానమను

చరణము 7

దృష్టికి సారంబగు లలనా సదనార్భ సేనామిత ధనాదులను, దేవదేవ ! నెరనమ్మితినిగాకను పదాబ్జ భజనంబు మరచిన

చరణము 8

చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ జేయకనే దుర్మదాంధ జనుల గోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాసలను రోయలేక సతత మపరాధియై చపల చిత్తు డైన

చరణము 9

మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మందలేక, మదమత్సర కామలోభ మోహములకు దాసు డై మోసబోతి గాక, మొదటి కులజు డగుచు భువిని శూద్రుల పనులు సల్పుచును యుంటిని గాక, నరాధములను గోరిసారహీనమతములను సాధింప తారుమారు

చరణము 10

సతులకి కొన్నాళ్ళాస్తికై సుతులకై కొన్నాళ్ళు ధన - తతులకై దిరిగితినయ్య, త్యాగరాజాప్త ! యిటువంటి