Jump to content

తొలి నే జేసిన పూజా ఫలము

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

శుద్ధబంగాళ రాగం - ఆది తాళం


పల్లవి

తొలి నే జేసిన పూజా ఫలము

దెలిసెను; నా పాలి దైవమా !

అనుపల్లవి

పలు విధముల నే దలచి కరగగ

బలుకక నీవటు నేనిటు కాగ


చరణము

సరివారలలో చౌక జేసి; ఉ -

దర పోషకులను పొరుగున జేసి;

హరిదాస రహితపురమున వేసి;

దరి జూప కుండగ, త్యాగరాజార్చిత