తులసీ బిల్వ మల్లికాది

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

కేదారగౌళ రాగం - ఆది తాళం


పల్లవి

తులసీ బిల్వ మల్లికాది - జలజ సుమ పూజల గైకొనవె

అనుపల్లవి

జలజాసన సనకాది కరార్చిత !

జలదాభ ! సునాభ ! విభాకర హృ -

జ్జలేశ హరిణాంక ! సుగంధ !


చరణము

ఉరమున ముఖమున - శిరమున నేత్రమున

కరమున భుజమున - చరణయుగంబున

కరుణతో నెనరుతో - పరమానందముతో

నిరతమును శ్రీ త్యాగరాజ - నిరుపాధికుడాఇ యర్చించు