చెంతనె సదా యుంచుకోవయ్య

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

కుంతలవరాళి రాగం - దేశాది తాళం


పల్లవి 

చెంతనె సదా యుంచుకోవయ్య

అనుపల్లవి 

మంతుకెక్కు శ్రీ - మంతుడౌ హను -

మంతురీతిగ, శ్రీకాంత !


చరణము 

తలచిన పనులను నేదెలిసి

తలతో నడచి సంతసిల్లుదుర;

పలుమారు బల్క బనిలేదు; రామ !

భరతునివలె, త్యాగరాజనుత !