Jump to content

చూడరె చెలులారా యమునా దేవి

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

పల్లవి

చూడరే చెలులార యమునా దేవి

సొగసెల్ల సంతోషమున


చరణములు

ఎర్రని పంకేరుహములే అందు

యింపైన భృంగ నాదములే (చూడరే)


ఇసుక తిన్నెలెంత తెలుపే మేను

ఇంద్ర-నీలమువంటి నలుపే (చూడరే)


మెటికలు వజ్రంపు శిలలే అందు

కుటిలమైన చిన్ని యలలే (చూడరే)


హంసల రవళిచే చాల దేవి-

యదిగో చెలంగెనీ వేళ (చూడరే)


పొలతులార పొదరిండ్ళే తేనె-

లొలుకు ఖర్జూరపు పండ్ళే (చూడరే)


ఫలముచే ద్రాక్ష లతలే అందు

పచ్చని చిలుకల జతలే (చూడరే)


వింత వింత విరులు వాన మది-

కెంతెంతో మరులయ్యనే (చూడరే)


కోకిలములు మ్రోసెనే మరుడు

కుసుమ శరంబులేసెనే (చూడరే)


చల్లని మలయ మారుతమే కృష్ణ

స్వామిని కూడునది సతమే (చూడరే)


రాజ వదనలార కనరే

త్యాగరాజ సఖుని పాట వినరే (చూడరే)