చని తోడి తేవే ఓ మనస

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

హరికాంభోజి రాగం - ఆది తాళం


పల్లవి

చని తోడి తేవే, ఓ మనస !

అనుపల్లవి

కనికరముతోగని కరమిడ చిర

కాలము సుఖ మనుభవింప వేగమే


చరణము

పతితుల బ్రోచు పట్టాధికారిని

పరమార్థ మత విశిష్టానువారిని

ద్యుతి నిర్జితశత శంబరారిని

ధురీణ త్యాగరాజ హృచ్చారిని