గురులేక ఎటువంటి

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

గౌరీ మనోహరి రాగం

పల్లవి

గురు లేకయెటువంటి గుణికి తెలియగ పోదు

అనుపల్లవి

కరుకైన హృద్రోగ గహనమును కొట్టను సద్-(గురు)

చరణం

తనువు సుత ధన దార దాయాది బాంధవులు

జనియించి చెదరు జాలిని కరుణతో

మనుసునంటక సేయు మందనుచు తత్వ

బోధన జేసి కాపాడు త్యాగరాజాప్తుడగు (గురు)