గిరిరాజ సుతా తనయ

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
త్యాగరాజు కృతులు

అంఅః

బంగాళ రాగము - దేశాది తాళము


పల్లవి 

గిరిరాజ సుతా తనయ ! సదయ


అనుపల్లవి 

సురనాథ ముఖార్చిత పాదయుగ !

పరిపాలయ మా, మిభరాజముఖ !


చరణము 

గణనాథ ! పరాత్పర ! శంకరా -

గమ వారినిధి రజనీకర !

ఫణిరాజకంకణ ! విఘ్ననివా -

రణ ! శాంభవ ! శ్రీత్యాగరాజనుత !