ఏ తావున నేర్చితివో రామ; ఎందుకింత గాసి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అఃఏ తావున నేర్చితివో రామ; ఎందుకింత గాసి 
రాగం: యదుకులకాంభోజి
తాళం: దేశాది

పల్లవి:
ఏ తావున నేర్చితివో రామ; ఎందుకింత గాసి ॥ఎ॥

అను పల్లవి:
సీతా లక్ష్మణ భరత రిపుఘ్న
వాతాత్మజులతో నాడు నాటక ॥మే॥

చరణము(లు)
ఆలు వజ్రాలు సొమ్ము లడిగిరో
అనుజులు తల్లి దండ్రు లన్న మడిగిరో?
శీలులైన వరభక్తులు బిలచిరో?
చిరకాలము త్యాగరానుత ॥ఏ॥