ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః


ఏల నీ దయరాదు పరాకు జేసే వేళా సమయముగాదు

రాగం: అఠాణ తాళం: ఆది

పల్లవి:

ఏల నీ దయరాదు పరాకు జేసే వేళా సమయముగాదు ॥ఏ॥


అనుపల్లవి:

బాల! కనకమయచేల! సుజనపరి

పాల! శ్రీరమాలోల! విధృతశర

జాల! శుభద! కరుణాలవాల! ఘన

నీల! నవ్య వనమాలికాభరణ! ॥ఏ॥


చరణము(లు) :

రారా దేవాదిదేవ! రారా మహానుభావ!

రారా రాజీవనేత్రా! రఘువరపుత్రా!

సారతర సుధాపూర హృదయ పరి

వార జలధిగంభీర దనుజ సం

హార దశరథ కుమార బుధజన వి

హార సకలశృతిసార నాదుపై ॥ఏ॥


రాజాధిరాజ! మునిపూజితపాద! రవి

రాజలోచన! శరణ్య అతిలావణ్య!

రాజధరనుత! విరాజ తురగ! సుర

రాజవందిత పదాజ! జనక! దిన

రాజకోటి సమతేజ! దనుజగజ

రాజ నిచయ మృగరాజ! జలజముఖ! ॥ఏ॥


యాగరక్షణ! పరమ భాగవతార్చిత!

యోగీంద్ర సుహృద్భావిత! ఆద్యంతరహిత!

నాగశయన! వరనాగ వరద! పు

న్నాగ సుమధుర! సదాఘమోచన! స

దాగతిజ ధృతపదా! గమాంతరచర!

రాగ రహిత! శ్రీత్యాగరాజ సుత ॥ఏ॥