ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః


 ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో
రాగం: భైరవి
తాళం: ఆది

పల్లవి:
ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో ॥ఏ॥

అను పల్లవి:
శ్రీనాథ బ్రహ్మకైన నీదు సేవ దొరకునా తనకు గలిగెను ॥ఏ॥

చరణము(లు)
నేను గోరిన కోర్కులెల్లను నేఁడు తనకు నెరవేరెను
భానువంశతిలక నా పాలి భాగ్యమా సజ్జన యోగ్యమా ॥ఏ॥

నీదు దాపు నీదు ప్రాపు దొరికెను నిజముగా నే నీసొమ్మైతిని
ఆది దేవ ప్రాణనాథ నా దంకమున పూజింప తన ॥కే॥

సుందరేశ సుగుణబృంద దశరథనంద నారవిందనయన పావన
అందగాఁడ త్యాగరాజనుత సుఖమనుభవింప దొరకెరా భళీ తన ॥కే॥