Jump to content

ఎవరురా నినువినా గతిమాకు

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః



ఎవరురా నినువినా గతిమాకు 
రాగం: మోహన
తాళం: చాపు

పల్లవి:
ఎవరురా నినువినా గతిమాకు ॥ఎ॥

అను పల్లవి:
సవరక్షక నిత్యోత్సవ సీతాపతి ॥ఎ॥

చరణము(లు)
రాదా నాదుపై నీ దయ విన
రాదా మురవైరి గాదా దయఁ బల్క
రాదా ఇది మరియాదా నాతో
వాదమా నే భేదమా మాకు ॥ఎ॥

రాక నన్నేచ న్యాయమా ప
రాక నేనంటే హేయమా రామా
రాకాశశిముఖ నీ కాసించితి
సాకుమా పుణ్యశ్లోకమా మాకు ॥ఎ॥

శ్రీశారిగణారాతివి నా
దాశా తెలియకబోతివి ఆప
గేశార్చిత పాలితేశా నవ
కాశమా స్వప్రకాశమా మాకు ॥ఎ॥

రాజా బిగు నీ కేలరా త్యాగ
రాజార్చిత తాళఁ జాలరా
ఈజాలము సేయ రాజా బ్రోవ సం
కోచమా సురభూజమా మాకు ॥ఎ॥