ఎవరున్నారు బ్రోవ ఇంత తామసమేలనయ్య

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అఃఎవరున్నారు బ్రోవ ఇంత తామసమేలనయ్య 
రాగం: మాళవశ్రీ
తళం: దేశాది

పల్లవి:
ఎవరున్నారు బ్రోవ
ఇంత తామసమేలనయ్య ॥ఎ॥

అను పల్లవి:
వివరంబుగ దెల్పవయ్య
వెశ్వేశ శ్రీ పంచనదీశ ॥ఎ॥

చరణము(లు)
మనసారగ ధ్యానింపను
మనసు నిలుపు మర్మంబు దెలిపి
తనవాడనే దలచి ధైర్య
మొసగు త్యాగరాజ వినుత ॥ఎ॥