ఎవరికై యవతార మెత్తితివో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

దేవమనోహరి రాగం - చాపు తాళం


పల్లవి

ఎవరికై యవతార మెత్తితివో ?

యిపుడైన దెలుపవయ్య; రామయ్య ! నీ

అనుపల్లవి

అవనికి రమ్మని పిలచిన మహరా -

జెవడో వానికి మ్రొక్కెద; రామ !


చరణము

వేదవర్ణ నీయమౌ నామముతో,

విధి రుద్రులకు మేల్మియగు రూపముతో,

మోద సదనమగు పటు చరితముతో,

మునిరాజ వేషియై, త్యాగరాజనుత !