ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అఃఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు 
రాగం: నీలాంబరి
తాళం: ఆది

పల్లవి:
ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు
పన్నుగఁ గనుగొనని కన్నులేలే కన్నెమిన్నలేలే ॥ఎ॥

చరణము(లు)
మోహముతో నీలవారి వాహకాంతిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహమేలే ఈ గేహమేలే ॥ఎ॥

సరసిజ మల్లె తులసీ విరజాజి పారిజాత
విరులచేఁ బూజించని కరములేలే ఈ కాపురములేలే ॥ఎ॥

మాలిమితో త్యాగరాజునేలిన రామమూర్తిని
లాలించి పొగడని నాలికేలే సూత్రమాలికేలే ॥ఎ॥