ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః


ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ 
రాగం: తోడి
తాళం: త్రిపుట

పల్లవి:
ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ కెం...

అను పల్లవి:
సందడి యని మఱచితివో ఇందులే వో నీ కెం...

చరణము(లు)
సారెకు దుర్విషయసార మనుభవించు
వారి చెలిమి సేయనేరక మేను
శ్రీరామ సగమాయెఁ జూచి చూచి
నీరజదళనయన నిర్మలాపఘన ఎం...

తీరని భవనీరధి యాఱడి సైరింప
నేరక భయమందఁగఁ బంకజపత్ర
నీరువిత మల్లాడఁగ ఇట్టి నను జూచి
నీరదాభశరీర నిరుపమ శూర ఎం...

జాగేల ఇది సమయమేగాదు చేసితే
ఏ గతి బలుకవయ్య శ్రీరామ నీ
వేగాని దరిలే దయ్య దీనశరణ్య
త్యాగరాజ వినుత తారక చరిత ఎం...