Jump to content

ఎందుకు చపలము వినవే నా మనవిని ముందటి వలె భక్తులు పోషించుట

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః



ఎందుకు చపలము వినవే నా మనవిని ముందటి వలె భక్తులు పోషించుట 
రాగం: తోడి
తాళం: త్రిపుట

పల్లవి:
ఎందు దాగినాఁడో ఈడకు రా
నెన్నడు దయవచ్చునో ఓ మనసా ॥ఎం॥

అను పల్లవి:
ఎందుకు చపలము వినవే నా మనవిని
ముందటి వలె భక్తులు పోషించుట ॥కెం॥

చరణము(లు)
అలనాడు కనక కశిపు నిండారు
చలముఁజేసి సుతుని సకల బా
ధలఁ బెట్టగా మదిని దాళక ని
శ్చలుఁడైన ప్రహ్లదుకొఱకు కంబములో
పల నుండఁగలేదా ఆ రీతిని నే ॥డెం॥

మును వారివాహ వాహన తనయుఁడు మద
మున రవిజుని చాలఁ గొట్టుటఁ జూచి
మనసు తాళఁజాలలేక ప్రేమ
మున పాలనముసేయ తాళతరువు మరు
గున నిల్వఁగలేదా రీతిని నే ॥డెం॥

తొలి జన్మముల నాఁడు జేసిన దుష్కర్మ
ముల నణఁగను సేయ ఆరు శ
త్రులఁగట్టి పొడిసేయ అదియుఁగాక
ఇలలో చంచలము రహిత నిజభక్త జ
నులను త్యాగరాజుని రక్షింప నే ॥డెం॥