ఎంతరాని తన కెంత పోని నీ చింత విడువఁజాల శ్రీరామ

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః



ఎంతరాని తన కెంత పోని నీ చింత విడువఁజాల శ్రీరామ 
రాగం: హరికాంభోజి
తాళం: దేశాది

పల్లవి:
ఎంతరాని తన కెంత పోని నీ
చింత విడువఁజాల శ్రీరామ ॥ఎం॥

అను పల్లవి:
అంతకారి నీ చెంతఁ జేరి హను
మంతుఁడై కొలువలేదా ॥ఎం॥

చరణము(లు)
శేషుఁడు శివునికి భూషుఁడు లక్ష్మణ
వేషియై కొలువలేదా ॥ఎం॥

శిష్టుఁడు మౌనివరిష్టుఁడు గొప్ప వ
శిష్టుడు హితుఁడు గాలేదా ॥ఎం॥

నరవర నీకై సురగణమును వా
నరులై కొలువగలేదా ॥ఎం॥

ఆగమోక్తమగు నీ గుణముల శ్రీ
త్యాగరాజు బాడఁగ లేదా ॥ఎం॥